సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ లీడర్ మధు యాష్కీ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడం రాజ్యంగ హక్కులను కాలరాయడమని పేర్కొన్నారు.
రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును గృహనిర్భంధంలో తీసుకోవాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ప్రతి పక్ష పార్టీల భావ ప్రకటన స్వేచ్చా, నిరసన తెలిపే హక్కులను కాలరాస్తుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ పోరాట యోధులు, కవులు, కళాకారులు, మేధావులు, తప్పక స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న నిరసనలను.. పోలీసుల ఇనుప కంచెలు ఆపలేవన్నారు. ఉక్కు పాదాల కింద భావవ్యక్తీకరణ ఆపే ప్రయత్నం చేస్తే.. కాంగ్రెస్ శ్రేణులు వాటిని తిప్పికొడతారన్నారు.
చరిత్రలో వరివేయొద్దని పిలుపునిచ్చిన చేతగానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని విమర్శించారు. రైతులకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి వరి వేస్తే.. ఉరేనని చెప్పటం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని.. రైతుల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసేందుకు యావత్ కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉంటుందన్నారు. రైతులేవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వరి ధాన్యం కొనేవరకు పోరాటాలు చేస్తామని మధుయాష్కీ గౌడ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment