మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు.
మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్‌పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment