100billion market
-
రిలయన్స్ ఇషా అంబానీ మరో భారీ డీల్: కేకేఆర్ పెట్టుబడులు
KKR invests Reliance Retail రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పూర్తి-యాజమాన్య అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను సాధించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అమెరికాకు,చెందిన KKR, రిలయన్స్‌రీటైల్ వాటాను1.42 శాతానికి పెంచుకోనుంది. ఇందుకుగాను రిలయన్స్ రీటైల్లో రూ. 2,070 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో రిలయన్స్ రీటైల్ ప్రీ-మనీ ఈక్విటీ విలువ రూ. 8.36 లక్షల కోట్లకు చేరిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. దీంతో ఈక్విటీ విలువ పరంగా దేశంలోని మొదటి నాలుగు కంపెనీలలో ఒకటిగా నిలిచింది. గత నెలలో ముఖేష్ అంబానీ రిటైల్ సామ్రాజ్యంలో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడితరువాత ఈ ఒప్పందం జరిగడం విశేషం. న్యూయార్క్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ప్రైవేట్ ఈక్విటీ సంస్థ KKR రిలయన్స్ రిటైల్‌లో 2020లో ఆర్ఆర్విఎల్లో 1.28 శాతం వాటాల కొనుగోలు ద్వారా రూ. 5,550 కోట్ల పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కొనుగోలుతో మొత్తం ఈక్విటీ వాటా పూర్తిగా పలచన ప్రాతిపదికన 1.42శాతానికి పెరిగింది. 2020లో వివిధ గ్లోబల్ ఇన్వెస్టర్ల నుండి మొత్తం రూ. 47,265 కోట్ల నిధుల సమీకరించింది. దీంతో పాటు KKR రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెలికాం యూనిట్ అయిన జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్‌లో కూడా పెట్టుబడిదారుగా ఉంది. (జీ20 సమ్మిట్: దాదాపు రూ. 400కోట్లు నష్టం, వ్యాపారుల ఆందోళన) 1976లో స్థాపించబడిన, KKR జూన్ 30, 2023 నాటికి సుమారు 519 బిలియన్ల డాలర్లు ఆస్తులను కలిగి ఉంది. కేకేర్ ఫాలోఅన్ పెట్టుబడులపై రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా ముఖేష్ అంబానీ, ఇటు రిలయన్స్‌తో భాగస్వామ్యంపై KKR సహ-CEO జో బే ఈ డీల్‌పై సంతోషం ప్రకటించారు. భారతదేశంలో నిజమైన కార్పొరేట్ లీడర్, ఇన్నోవేటర్. ఈ బృందంతో భాగస్వామ్యాన్ని కొనసాగించే అవకాశం లభించడం సంతోషమని కెకెఆర్లోని ఆసియా పసిఫిక్ ప్రైవేట్ ఈక్విటీ హెడ్ గౌరవ్ ట్రెహాన్ పేర్కొన్నారు. (విమానంలో వెర్రి వేషాలు, నిద్ర నటించిన మహిళ ఏం చేసిందంటే?) -
అదానీ గ్రూప్ సరికొత్త రికార్డ్
ముంబై: బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)ను సాధించింది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్ విలువ రీత్యా గ్రూప్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా దేశీయంగా ఇంత విలువను అందుకున్న మూడో గ్రూప్‌గా ఆవిర్భవించింది. ఇప్పటివరకూ టాటా గ్రూప్, ముకేశ్ అంబానీ దిగ్గజం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే 100 బిలియన్ డాలర్ల విలువను అధిగమించాయి. ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ విలువ 242 బిలియన్ డాలర్లుకాగా.. ఆర్ఐఎల్ విలువ 171 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అదానీ గ్రూప్ తాజా రికార్డు సాధనకు ఆరు లిస్టెడ్ కంపెనీలు సహకరించాయి. జోరు తీరిలా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన ఆరు అదానీ గ్రూప్ కంపెనీలలో నాలుగు మంగళవారం(6న) ట్రేడింగ్‌లో సరికొత్త గరిష్టాలను తాకాయి. ఫలితంగా అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 7.84 లక్షల కోట్లు పెరిగి 106.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్ 7.4 శాతం దూసుకెళ్లి రూ. 1,223 సమీపంలో ముగిసింది. తొలుత రూ. 1,241 వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది. ఇక అదానీ టోటల్ గ్యాస్ ఇంట్రాడేలో రూ. 1,250కు చేరింది. చివరికి 4 శాతం లాభపడి రూ. 1209 వద్ద స్థిరపడింది. అదానీ ట్రాన్స్మిషన్ ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 1,145కు చేరినప్పటికీ.. రూ. 1,110 వద్ద నిలిచింది. అదానీ పోర్ట్స్ 14.5 శాతం పురోగమించి రూ. 850 వద్ద ముగిసింది. రూ. 853 సమీపంలో రికార్డ్ ‘హై’ని చేరింది. అదానీ పవర్ 5 శాతం ఎగసి రూ. 98.4 వద్ద నిలవగా.. అదానీ గ్రీన్ ఎనర్జీ 3.3 శాతం లాభంతో రూ. 1,203 వద్ద స్థిరపడింది. అదానీ గ్రీన్, అదానీ పవర్ మినహా మిగిలిన నాలుగు కౌంటర్లూ ఇంట్రాడేలో చరిత్రాత్మక గరిష్టాలను తాకాయి. ప్రస్తుతం అదానీ పవర్ మార్కెట్ విలువ రూ. 37,9852 కోట్లుకాగా.. మిగిలిన ఐదు కంపెనీలూ రూ. లక్ష కోట్ల మార్క్‌ను అధిగమించడం విశేషం! డైవర్సిఫైడ్ దిగ్గజం... పోర్టులు, ఇంధనం తదితర విభిన్న రంగాలలో కార్యకలాపాలు విస్తరించిన అదానీ గ్రూప్ 1980 ప్రాంతంలో కమోడిటీస్ ట్రేడర్‌గా సేవలు అందించేది. ఆపై రెండు దశాబ్దాల కాలంలో ప్రమోటర్ గౌతమ్ అదానీ గ్రూప్ కార్యకలాపాలను గనులు, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, రక్షణ రంగాల్లోకి విస్తరించారు. గత రెండేళ్లలో గ్రూప్ ఏడు ఎయిర్‌పోర్టుల నిర్వహణను చేపట్టింది. పునరుత్పాదక ఇంధన విభాగంలో వేగంగా విస్తరిస్తోంది. అదానీ గ్రీన్ ద్వారా 2025కల్లా 25 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని చూస్తోంది. అదానీ పోర్ట్స్ దేశీ పోర్టుల పరిశ్రమలో 30% వరకూ నిర్వహిస్తోంది. కృష్టపట్నం పోర్టుకి జతగా ఇటీవల గంగవరం పోర్టును సైతం సొంతం చేసుకుంది. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు’ : మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు. -
100 బిలియన్ డాలర్ల క్లబ్లో టీసీఎస్