దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. భారత్ కార్పొరేట్ రంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఘనతను సాధించేందుకు ఉరకలేస్తోంది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో శుక్రవారం స్టాక్ సూచీలు నష్టపోయినా, టీసీఎస్ షేరు మాత్రం రికార్డ్ స్థాయిని తాకింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వంద బిలయన్ డాలర్లకు అత్యంత దరిదాపుల్లోకి వచ్చింది.