Fiber grid
-
Fiber Case: బహిరంగ ప్రకటనలు చేయొద్దు: బాబుకు సుప్రీం హెచ్చరిక!
సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. చంద్రబాబు గనుక అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అధికారంలో ఉండగా.. ఫైబర్‌నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది. -
చంద్రబాబుకు బిగ్ షాక్..ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్ మెంట్
-
చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ గ్రిడ్ అక్రమాలు
-
Fact Check: గాంధీ జయంతి రోజూ నిజాలకు పాతరేనా!?
సాక్షి, అమరావతి: తన మనిషి సీఎం కుర్చీలో లేడన్న అక్కసుతో నిత్యం అబద్ధాలనే అచ్చేస్తూ ప్రజలెనుకున్న ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తున్న ఈనాడు పత్రిక గాంధీ జయంతి రోజున కూడా నిస్సిగ్గుగా నిజాలకు పాతరేసింది. ఫైబర్‌నెట్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని కాపాడేందుకు రామోజీరావు ‘‘వైర్లు పీకేశారు.. గుండెలు బాదుకుంటున్నారు’’ అంటూ విషం కక్కారు. ఉపయోగంలేని చోట్ల ఉన్న ఫైబర్ కేబుల్‌ను తొలగించి వాటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే అదో పెద్ద నేరం అంటూ గగ్గోలు పెడుతున్నారు. 2019 నవంబర్‌లో జరిగిన మెయిల్స్‌ను చూపిస్తూ వైర్లు పీకేశారంటూ అసత్యాలతో కూడిన కథనాన్ని ప్రచురించారు. ఇదంతా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీగా నియమించిన ఐఏఎస్ అధికారి ఎ. సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో టెరాసాఫ్ట్‌కు అనుబంధంగా పనిచేసిన నెటాప్స్ సంస్థలే ఈ తొలగింపు ప్రక్రియలో పాల్గొన్న విషయాన్ని వ్యూహాత్మకంగా ఎక్కడా పేర్కొనలేదు. చోరీ జరగక్కుండా ఉండేందుకు తొలగిస్తే.. ఫైబర్‌గ్రిడ్ ఫేజ్–1 ప్రాజెక్టు కింద అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ కేబుల్ కాంట్రాక్టును టెరాసాఫ్ట్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల్లో 24,000 కి.మీ మేర 24ఎఫ్ ఫైబర్ కేబుల్, దానికి కావాల్సిన స్తంభాలు ఇతర పరికరాలతో సమకూర్చారు. అందులోని 524 కి.మీ పరిధిలో సబ్‌స్రై్కబర్స్ లేకపోవడంవల్ల అక్కడ కేబుల్‌ను చోరీచేసే అవకాశం ఉండటంతో వీటిని ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని ఏపీఎస్ఎఫ్ఎల్ నిర్ణయించింది. 12 జిల్లాల్లో ఉపయోగంలేని చోట్ల మొత్తం 524 కి.మీ పరిధిలోని కేబుల్‌ను ఇతరచోట్ల బిగించుకునేందుకు వీలుగా తొలగించాలని ఏపీఎఎస్ఎఫ్ఎల్ ఉద్యోగి రాజేశ్‌రాయ్ తన ఈ–మెయిల్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. అప్పటి ప్రభుత్వంలో ఫైబర్‌నెట్ కేబుల్ బిగించడంలో పాలుపంచుకున్న నెటాప్స్ సంస్థకే ఈ తొలగింపు కాంట్రాకును ఇచ్చారు. దీంతో ఆ సంస్థ మీటరుకు రూ.12 ఇవ్వాలని కోరగా ఏపీఎస్ఎఫ్ఎల్ రూ.8 మాత్రమే చెల్లించింది. మొత్తం 1,25,677 మీటర్ల 24ఎఫ్ ఫైబర్ కేబుల్‌ను తొలగించినందుకు రూ.11,86,391 చెల్లించారు. ఈ తొలగించిన కేబుల్‌ను వైర్లు కట్ అయ్యి ప్రసారాలు ఆగిపోయిన చోట్ల తిరిగి బిగించడానికి వినియోగిస్తున్నారు. వక్రీకరించి విషప్రచారం.. ఇలా వృధాగా ఉన్న విలువైన వైరును తిరిగి ఉపయోగిస్తుంటే దాన్ని అభినందించాల్సిందిపోయి చంద్రబాబు తప్పేం చేయలేదు.. వీళ్లే కేబుల్స్ తొలగించి గుండెలు బాదేసుకుంటున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈనాడు వక్రీకరించి విషప్రచారం చేయడాన్ని అధికారులు ఖండిస్తున్నారు. అసలు ఫైబర్‌నెట్ కుంభకోణానికి ఈ వైర్ల తొలగింపునకు ఎలాంటి సంబంధం లేకపోయినా బోడిగుండుకు మోకాలుకు ముడిపెడుతూ చంద్రబాబుని ఈ కుంభకోణం నుంచి తప్పించడానికి రామోజీ పడుతున్న పాట్లు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
చంద్రబాబు హయాంలో ఫైబర్ గ్రిడ్ టెండర్స్ లో భారీగా అవకతవకలు జరిగాయి
-
ఫైబర్ గ్రిడ్ కేసులో కొత్తకోణం
-
ఫైబర్‌గ్రిడ్.. మదర్ ఆఫ్ స్కామ్స్!
సాక్షి, అమరావతి: ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిని కుంభకోణం అనడం కంటే.. మదర్ ఆఫ్ స్కామ్స్ అన టం కరెక్టు అని పేస్ పవ ర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమి టెడ్ ఎండీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్రంగా విమర్శించారు. టెండర్ వేసిన సమయంలో తాను వైఎస్సార్సీపీ సభ్యుడిని కూడా కాదని, ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టు కోసం పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున టెండర్ వేశానన్నారు. కానీ, ఎటువంటి అర్హతలేని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్ కన్సార్టియంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్‌గ్రిడ్ మొదటి దశ పనుల కోసం చేపట్టిన రూ.329 కోట్ల టెండరు ఎంపికలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. ఆ తర్వాత సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2లకు సంబంధించి మొత్తం రూ.3,113 కోట్లకు టెండర్లు పిలిచారని.. ఈ వ్యవహారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడిందని ఆయన వివరించారు. వీటన్నింటిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫైబర్ గ్రిడ్ టెండర్‌కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. టెండరు వెనుక పెద్ద కుట్ర ‘అర్హతలేని టెరాసాఫ్ట్‌కు ఫైబర్ గ్రిడ్ టెండరు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే నడిచింది. టెరాసాఫ్ట్ కన్సార్టియం నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రైస్‌బిడ్లు వేశారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా పక్కన పెట్టారు. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేటే లిమిటెడ్ తరఫున నేను టెండర్ వేశాను. కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ గ్రిడ్ స్కాంకు పాల్పడింది. టెండరు ఖరారుకు 2 నెలల ముందు బ్లాక్‌లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌కు దొడ్డిదారిన క్లియరెన్స్ ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పారదర్శకంగా టెండర్లు ఈ–ప్రొక్యూర్మెంట్ వేదికగా ఫైబర్‌గ్రిడ్ టెండర్లు పిలిచారు. బిడ్డర్ తప్పనిసరిగా కంపెనీగా ఉండాలి అనే నిబంధన ఉంది. ఆ కంపెనీకి ఆ రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. ఏ కంపెనీ కూడా బ్లాక్‌లిస్ట్ అయి ఉండకూడదు. నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయి. వీటిలో మూడు కంపెనీలకు అర్హత లేదు. కానీ, ఆ మూడు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డాయి, టెండర్ నిబంధనలను ఉల్లంఘించినా వాటిని అనర్హులుగా గుర్తించలేదు. టెరాసాఫ్ట్ సంస్థ బ్లాక్‌లిస్టులో ఉంటే పట్టించుకోలేదు. దొడ్డిదారిన బ్లాక్‌లిస్ట్‌ను ఎత్తివేయించుకున్నారు. అదే వైఎస్ జగన్ సీఎం అయ్యాక టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చారు. జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం ప్రవేశపెట్టారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఎప్పుడూ కనిపించనేలేదు. పాత్రధారులు, సూత్రధారులను శిక్షించాలి నిజానికి.. ఫైబర్ గ్రిడ్ తొలిదశ ప్రాజెక్టు రూ.329 కోట్లు అని చెప్పారు. ఇదికాక.. సెటాప్ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్ నెట్ ఫేజ్–2కు సంబంధించి మూడు టెండర్లను పిలిచి వారికి అనుకూలమైన కంపెనీలకే కట్టబెట్టారు. ప్రాజెక్టు మొదటి దశ టెండర్లలోనే ఇంత స్కామ్ జరిగినప్పుడు, మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్ కుంభకోణంలోని వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనకున్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలను కఠినంగా శిక్షించాలి. ఆ రోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లు మాకు దక్కకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి’. -
ఇక ఫైబర్ గ్రిడ్ నుంచే ఓట్ల తొలగింపు వ్యూహం..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓట్ల అక్రమ తొలగింపునకు టీడీపీ ప్రభుత్వం మరింతగా బరితెగిస్తోంది. ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితులకు చెందిన హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా భారీగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ పోలీసుల దాడుల్లో ఈ బాగోతం ఆధారాలతోసహా బట్టబయలైనప్పటికీ ముఖ్యనేత మరో వ్యూహం అమలుచేయనున్నారు. ఈసారి ఏపీ కేంద్రంగానే వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. తన బినామీల గుప్పిట్లో ఉన్న ఫైబర్‌గ్రిడ్ కేంద్రంగా ఓట్ల తొలగింపుకు సిద్ధపడుతున్నారు. టెలికాం చట్టానికి విరుద్ధంగా ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లు భవిష్యత్ రాజకీయ అవసరాలు, ఎన్నికల అక్రమాలకు పాల్పడే ఉద్దేశంతోనే ముఖ్యనేత రాష్ట్ర ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్‌ను వ్యూహాత్మకంగా తన బినామీల గుప్పిట్లో పెట్టారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి హరిప్రసాద్‌కు చెందిన సంస్థలకు ఫైబర్‌గ్రిడ్ కాంట్రాక్టులను కట్టబెట్టారు. పేరుకు కొందరు ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ వ్యవహారాలన్నీ సీఎం సన్నిహితులకు చెందిన టెరాసాఫ్ట్ తదితర సంస్థలే నిర్వహిస్తున్నాయి. కాగా రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కింద ఇంటర్నెట్, టీవీ, ఫోన్ కనెక్షన్లు ఇవ్వడంలో కేంద్ర టెలికాం నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. నిబంధనల ప్రకారం ప్రతి ఇంటర్నెట్ కనెక్షన్‌కు ఓ ప్రత్యేక ఇంటర్నెట్ ప్రొటోకాల్(ఐపీ) నంబర్ కేటాయించాలి. ఇంటర్నెట్ కనెక్షన్లను దుర్వినియోగం చేస్తే ఐపీ నంబర్ ఆధారంగానే దోషులను గుర్తించి సైబర్ చట్టాల కింద కేసులు నమోదు చేస్తారు. అందుకే దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇచ్చే ఇంటర్నెట్ కనెక్షన్లకు ఈ విధంగానే ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయిస్తారు. కానీ రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు మాత్రం ఈ నిబంధనలేదు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 12 లక్షల వరకు ఫైబర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చారు. కానీ వాటికి ప్రత్యేక ఐపీ నంబర్లు కేటాయించలేదు. ఈ ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లలో ఎవరైనా టెలికాం, సైబర్ చట్టాలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే అందుకు బాధ్యులు ఎవరో గుర్తించడం చాలా కష్టం. టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలు హైదరాబాద్ నుంచి ఓట్ల తొలగింపు వ్యూహం బెడిసికొట్టడంతో రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాల నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు, ఇతర ఎన్నికల అక్రమాలు కొనసాగించమని ముఖ్యనేత ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఫైబర్‌గ్రిడ్ లిమిటెడ్‌లోని ముఖ్యనేత సన్నిహితులు రంగంలోకి దిగారు. టీడీపీ ఎన్నారై విభాగం నేతృత్వంలో అక్రమాలకు దిగనున్నారు. ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఇటీవల విజయవాడలో ఓ సంస్థను ప్రారంభించారు. టీడీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కోసమే ఆ సంస్థ పనిచేస్తుంది. ప్రస్తుతం ఆ సంస్థ ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లను ఉపయోగిస్తూ ఎన్నికల అక్రమాలకు తెరతీసింది. ప్రభుత్వం ప్రజాసాధికార సర్వే ద్వారా సేకరించిన ప్రజల సమాచారం మొత్తం ఆ సంస్థకు చేరవేశారు. ఓటర్ల వివరాలతో తుది జాబితా ప్రకటించేలోగానే వీలైనంతమంది వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం భారీగా దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేగాక ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ ఇతర ముఖ్యనేతలు, పార్టీ వ్యవహారాలపై పెద్ద ఎత్తున సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేయాలన్నది టీడీపీ వ్యూహం. 2014 ఎన్నికల్లో కూడా ఆ ఎన్నారై మరికొందరితో కలసి ఇదే విధంగా వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి నేతృత్వం వహించారు. మన రాష్ట్రం నుంచే ఈ అక్రమాలకు పాల్పడితే కేసులు లేకుండా చూసుకోవచ్చని భావిస్తున్నారు. -
ఏపీలో బెదిరిస్తున్న ఫైబర్ గ్రిడ్ కత్తి
-
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
-
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజలు కిందట రెవెన్యూ, పోలీసు అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో జేసీ కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై చిందులు తొక్కారు. ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారికి వ్యతిరేకంగా అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలక్ట్రిక్ పోల్స్‌కు ఉన్న కేబుల్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. మాట వినకపోతే ఎమ్మెస్వోలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు తెలిపారు. కాగా, జేసీ వ్యాఖ్యలపై ఎమ్మెస్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా తాము వ్యాపారం చేస్తున్నామని ఎమ్మెస్వోలు పేర్కొన్నారు. తమపై ఒత్తిడి చేసి వ్యాపారాలు చేయిస్తారా అని మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టుకు వెళతామని ఎమ్మెస్వోలు స్పష్టం చేశారు. -
రెండో దశలోనూ దోపిడీ
సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కాజేసేందుకు ఫైబర్‌నెట్ గ్రిడ్ ప్రాజెక్టు కల్పతరువులా మారిపోయింది. తొలిదశ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును రూ.300 కోట్లతో ప్రారంభించి సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్ధకు కట్టబెట్టడం తెలిసిందే. తొలిదశ ఫైబర్‌నెట్ గ్రిడ్ ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా రూ.4,000 కోట్లకు పెంచేసి అందులో సగం నిధులను ‘ముఖ్య’ నేత తన బినామీ ద్వారా కాజేసినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా రెండో దశలో ఫైబర్ ఆప్టికల్ లైన్ దూరం పెరిగిందంటూ ప్రాజెక్టు వ్యయాన్ని రెట్టింపు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా పందేరం.. రెండోదశ ఫైబర్ నెట్‌కు కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ రెండో దశ పేరుతో నిధులను కేటాయించింది. రెండో దశ ఫైబర్ నెట్ ప్రాజెక్టును కూడా ప్రభుత్వ పెద్దలు వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాప్ట్‌వేర్‌తోపాటు రాజధానిలో భారీగా ప్రాజెక్టులు చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థకు టెండర్ నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌ను కూడా తమ దారికి తెచ్చుకుని టెండర్ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎల్–2, ఎల్–4గా నిలిచిన ఎల్ అండ్ టీ, టెరా సాప్ట్‌వేర్‌తో బేరసారాలు సాగించి రెండోదశ ఫైబర్ నెట్ గ్రిడ్ ప్రాజెక్టును టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, ఎల్ అండ్ టీ, టెరా సాప్ట్వేర్ సంస్థలకు జిల్లాలవారీగా పంచేశారు. టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్‌కు ఐదు జిల్లాలను, ఎల్ అండ్ టీకి నాలుగు జిల్లాలను, టెరా సాప్ట్‌వేర్‌కు నాలుగు జిల్లాలను పంచేస్తూ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. గ్రామ పంచాయతీలన్నింటికీ ఫైబర్‌నెట్ గ్రిడ్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ రెందో దశ కింద రూ. 851.23 కోట్లు కేటాయించింది. తొలుత నిర్వహించిన టెండర్లలో ‘ముఖ్య’ నేత సన్నిహితుడికి చెందిన సంస్థ అర్హత సాధించలేదు. మరో రెండుసార్లు టెండర్ల నిబంధనలనలకు సవరణలను ప్రతిపాదించినా అర్హత సాధించకపోవడంతో వాటిని రద్దుచేసి సింగిల్ ప్యాకేజీ, మూడు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. రెండోసారి టెండర్లో టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఎల్–1గా నిలిచింది. ఎల్–2గా ఎల్ అండ్ టీ, ఎల్–4గా టెరా సాఫ్ట్వేర్ నిలిచాయి. అయితే ఎల్–1గా నిలిచిన టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం కన్నా 9.1 శాతం ఎక్సెస్‌కు టెండర్ కోట్ చేసింది. ఆ తరువాత అంతకన్నా ఎక్కువగా ఎల్ అండ్ టీ, టెరాసాఫ్ట్ వేర్ సంస్థలు టెండర్ కోట్ చేశాయి. నిబంధనల మేరకు అంచనా వ్యయం కన్నా ఐదు శాతం ఎక్సెస్ కోట్ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 2004 నవంబర్ 20వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఈ నేపథ్యంలో టెండర్ నిబంధనలకు మించి ఎక్కువగా కోట్ చేసినందున ఆర్థిక శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ఉల్లంఘనకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. జీవో 133కి విరుద్ధంగా ఐదు శాతం కన్నా ఎక్సెస్‌కు కోట్ చేసినందున ఆ టెండర్‌ను రద్దు చేసి కొత్తగా ఆహ్వానించాలని ఇంధన, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి కూడా స్పష్టం చేశారు. కంచే చేను మేసింది.. ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ సంస్థపై ‘ముఖ్య’ నేత ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర స్థాయి అమలు కమిటీ ఎల్–1గా నిలిచిన టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కోట్ చేసిన ధరకు ఎల్–2గా నిలిచిన ఎల్ అండ్ టీని, ఎల్–4గా నిలిచిన టెరా సాఫ్ట్ వేర్‌ను ముందుకు రావాలని కోరింది. ఇందుకు ఆ రెండు సంస్థలు అంగీకరించడంతో రూ.787.86 కోట్ల విలువైన పనులను టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ కోట్ చేసిన రూ.859.87 కోట్లకు 9.1 శాతం ఎక్సెస్‌కు టెండర్‌ను ఖరారు చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును మూడు విభాగాలుగా విభజించింది. ఐదు జిల్లాల్లో పనులను టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్‌కు, నాలుగు జిల్లాల్లో ఎల్ అండ్ టీకి, మరో నాలుగు జిల్లాల్లో టెరా సాప్ట్‌వేర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. వ్యయం రెట్టింపు.... భారత్ నెట్ రెండోదశ వ్యయాన్ని రూ.851.23 కోట్ల నుంచి రూ.1,410.01 కోట్లకు పెంచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు చెబుతున్న కారణాలను గమనిస్తే ఎవరైనా విస్తుపోక తప్పదు. భారత్ నెట్ రెండోదశ ప్రాజెక్టు వ్యయం రూ.851.23 కోట్లుగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలన్నింటికీ 51,449 కిలోమీటర్ల మేర ఫైబర్ ఆప్టికల్ లైన్ వేయాల్సి ఉందని, అయితే ఇప్పుడు దూరం 55,000 కి.మీ.కి పెరగడంతో ప్రాజెక్టు వ్యయం రూ.1,410.01 కోట్లకు చేరిందని ప్రభుత్వం పేర్కొంది. కేవలం 3,551 కిలోమీటర్లు మాత్రమే దూరం పెరిగితే ప్రాజెక్టు వ్యయం దాదాపు రెట్టింపు కావడాన్ని చూస్తుంటే ఇందులో దోపిడీకి స్కెచ్ వేసినట్లు స్పష్టంగా తెలుస్తోందని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. సెట్‌టాప్ బాక్సుల పేరుతో అప్పు చేసి... ఫైబర్‌నెట్ గ్రిడ్ తొలిదశ ప్రాజెక్టును టెరా సాప్ట్‌వేర్‌కు ఏకపక్షంగా కట్టపెట్టారు. తొలుత ఫైబర్‌నెట్ గ్రిడ్ పేరుతో ఫైబర్ ఆప్టిక్ లైన్లను కరెంట్ స్తంభాల ద్వారా వేసేందుకు రూ. 300 కోట్లతో ప్రాజెక్టును టెరా సాఫ్ట్వేర్ సంస్థకు అప్పగించారు. అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని కోటి ఇళ్లకు సెట్‌టాప్ బాక్సులు పంపిణీ చేయాలంటూ అది కూడా టెరా సాప్ట్‌వేర్‌కే అప్పగించేశారు. రాష్ట్రంలోని 95 శాతం ఇళ్లలో టీవీలకు ఇప్పటికే సెట్‌టాప్ బాక్సులున్నా ఫైబర్ గ్రిడ్ పేరుతో ప్రాజెక్టును చేపట్టడమే కాకుండా ప్రతి ఇంటికీ కొత్తగా సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సెట్‌టాప్ బాక్సు ధరను ఏకంగా రూ.4 వేలుగా నిర్ణయించింది. బయట మార్కెట్లో సెట్‌టాప్ బాక్సు ఒక్కోటి రూ.1,200 – రూ.1,500కే దొరుకుతున్నాయి. బాగా నాణ్యమైనదనుకున్నా వీటి ఖరీదు రూ.2 వేలకు మించి ఉండదు. వీటిని రూ.4 వేల చొప్పున విక్రయించడం ద్వారా సగం డబ్బులు దోచేస్తున్నట్లు తేలిపోతోంది. ఇలా కోటి సెట్‌టాప్ బాక్సులను విక్రయించడం ద్వారా రూ.2,000 కోట్లు దోచేసినట్లు అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. పది లక్షల సెట్‌టాప్ బాక్సులను కొనుగోలు చేసేందుకు ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు గతంలో రెండు విడతలుగా రూ.711 కోట్ల మేర అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. దీనికితోడు సెప్టెంబర్‌లో ఏకంగా కోటి సెట్‌టాప్‌బాక్సుల కొనుగోలు కోసం రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ జీవో 27 జారీ చేసింది. కేంద్రం భరించేది రూ.900 కోట్లే రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో సాధ్యమైనంత త్వరగా ఇంటర్నెట్ సదుపాయం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునీఠ ఆదేశించారు. ఫైబర్‌నెట్ గ్రిడ్ రెండో దశపై శుక్రవారం ఆయన అధికారులతో సమీక్షించారు. భారత్ నెట్ రెండో దశ కింద 11,400కిపైగా పంచాయతీల్లో పూర్తిస్థాయి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు రూ.1,480 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు ఇస్తుండగా మిగతాది రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని రాష్ట్ర ఫైబర్ గ్రిడ్ లిమిటెడ్ ఎండీ దినేశ్‌కుమార్ ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోగా పంచాయితీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. -
‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు’ : మధుయాష్కీగౌడ్
సాక్షి, నిజామాబాద్ అర్బన్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుందని, కేసీఆర్ తన కుటుంబ సభ్యుల పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌లో మూడు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించారని, అందులో కేటీఆర్ కుటుంబీకులే ఉన్నారన్నారు. తన ఫ్యా మిలీకే కాంట్రాక్టు అప్పగించి కోట్లల్లో అవినీతికి పాల్పడ్డారన్నారు. జాగృతి పేరిట, బతుకమ్మ పేరిట ఇతర రాష్ట్రా ల్లో సైతం డబ్బులు వసూలు చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లె వద్ద జైరాంరెడ్డికి వంద ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌గా మార్చి ఆ యనకు అప్పగించారని, ఇందుకుగాను ఎక్స్పో కంపెనీ క వితకు భారీగా ముడుపులు అందించారన్నారు. కేసీఆర్ తన ఫౌమ్‌హౌస్‌లో వందలాది బోర్లు వేయగా చుట్టు పక్కల రైతు లు నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. మహాకూటమి నిశ్శబ్ధ విప్లవంగా వస్తుందని, క చ్చితంగా అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కే పట్టంకట్టనున్నారని పేర్కొన్నారు. -
జనం నెత్తిన సెట్‘టాప్’ భారం
సాక్షి, అమరావతి: ఇంటింటికీ సెట్‌టాప్ బాక్సుల పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంటిపైనా టీడీపీ సర్కారు మరోసారి అప్పుల భారం మోపింది. పది లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే రెండు విడతలుగా రూ.711 కోట్ల అప్పునకు గ్యారెంటీ ఇచ్చింది. తాజాగా 68 లక్షల సెట్‌టాప్ బాక్సుల కొనుగోలు కోసం ఏకంగా రూ.3,283 కోట్ల అప్పు చేసేందుకు గ్యారెంటీ ఇస్తూ ఈనెల 10వ తేదీన జీవో 27 జారీ చేసింది. సీఎం సన్నిహితుడికి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం ఇళ్లలో టీవీలకు ఇప్పటికే సెట్‌టాప్ బాక్సులున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో ప్రతి ఇంటికి కొత్తగా సెట్‌టాప్ బాక్సులను సరఫరా చేయాలని నిర్ణయించింది. మార్కెట్లో నాణ్యమైన సెట్‌టాప్ బాక్సు ధర రూ.1,200 నుంచి రూ.1,500 మాత్రమే సర్కారు మాత్రం వీటి ధరను ఒక్కొక్కటి ఏకంగా రూ. 4 వేలుగా నిర్దేశించింది. ఇంకా దీనికి వడ్డీ భారం అదనం. ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబుకు సన్నిహితుడైన వేమూరి రవికుమార్‌కు చెందిన టెరా సాఫ్ట్వేర్ సంస్థకు కట్టబెట్టడం గమనార్హం. వద్దంటూ కేబుల్ ఆపరేటర్లపై జనం ఒత్తిడి ఫైబర్ గ్రిడ్ పేరుతో విద్యుత్ స్తంభాల వెంట ఆప్టికల్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ సెట్‌టాప్ బాక్సుల ద్వారా ప్రసారాలు అందించాలని నిర్ణయించారు. సెట్‌టాప్ బాక్సులను అమర్చుకోవడం ద్వారా కేవలం రూ.149కే టీవీ ప్రసారాలతోపాటు వైఫై, ఫోన్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అయితే ఇప్పటికే వీటిని తీసుకున్న వారు ప్రసారాలు రాకపోవడం, అన్ని చానల్స్ రాకపోవడం, ఆన్ చేసిన ఐదు నిముషాలకుగానీ టీవీ రాకపోవడం తదితర కారణాలతో సెట్‌టాప్ బాక్సులను తొలగించాలని కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారు. సెట్‌టాప్ బాక్సులు తీసుకున్న చాలా మంది చేతి చమురు వదిలించుకున్నారు. జనం నెత్తిన రూ.4,800 భారం: సెట్‌టాప్ బాక్సులను సర్కారు ఉచితంగా ఏమీ ఇవ్వడం లేదు. కనెక్షన్ కింద నెలకు 149 రూపాయలతో పాటు సెట్‌టాప్ బాక్సుకు నెలకు రూ.100 చొప్పున నాలుగేళ్లు చెల్లించాలి. సెట్‌టాప్ బాక్సు 4,000 రూపాయలైతే అసలు, వడ్డీతో కలిపి నాలుగేళ్లలో మొత్తం 4,800 చెల్లించాల్సి వస్తోంది. నాణ్యత లేని సెట్‌టాప్ బాక్సులను చైనా నుంచి కొనుగోలు చేస్తుండటంతో వీటిని తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని, మరోవైపు తమపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని కేబుల్ ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఎక్సైజ్ సుంకం ఎగవేత...: ఎక్సైజ్ సుంకం చెల్లించకుండా చైనా నుంచి దిగుమతి చేసుకున్న సెట్‌టాప్ బాక్సులను చైన్నె పోర్టులో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు గతంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ బాక్సుల్లో నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రం లేవని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో దేశ భద్రతాపరంగా ఈ బాక్స్‌లు ప్రమాదకరమనే అభిప్రాయం అధికార వర్గాల్లో బలంగా వ్యక్తమైంది. పెద్దలకు కమీషన్లు.. ప్రజలకు అప్పులు! సెట్‌టాప్ బాక్సులు ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాలనే అంశాన్ని ప్రజలకే వదిలేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి మరీ ప్రతి ఇంటికీ అంటగట్టాల్సిన అవసరం ఏమిటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇళ్లకు మంచినీరు, డ్రైనేజ్ వ్యవస్థ, రహదారుల నిర్మాణం లాంటి మౌలిక అవసరాల కోసం సర్కారు అప్పులు చేస్తే ఏమైనా అర్థం ఉంటుందని, అప్పులు చేసి మరీ సెట్‌టాప్ బాక్సులను పంపిణీ చేయాలని నిర్ణయించడం వెనుక భారీ మతలబున్నట్లు బోధపడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సెట్‌టాప్ బాక్సుల ఏర్పాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.3,994 కోట్ల అప్పు చేసింది. వీటికి ప్రభుత్వమే గ్యారెంటీ ఇవ్వడంతో వడ్డీతో సహా కట్టాల్సి ఉంటుందని, ఇది ప్రజలపై భారం మోపడమేనని స్పష్టం చేశారు. పాలకులు అప్పులు చేసి కమీషన్లు తీసుకుని వెళ్లిపోతే ప్రజలకు అప్పులు మాత్రం మిగులుతాయని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో అత్యాధునిక పాలన!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వేగంగా, పారదర్శకంగా పాలన సాగించేందుకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ డిజిటల్ (ఈడీ) పరిపాలనను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అన్ని ప్రభుత్వ వ్యవహారాలను ఆన్లైన్లో అనుసంధానించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రజల ఫిర్యాదులను స్వీకరించే ప్రజావాణి నుంచి ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతి వరకు అన్నింటినీ హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పరిశీలించి అవసరమైన సూచనలు చేసేలా కొత్త వ్యవస్థ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సూచనలకు అనుగుణంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ పనులు చేస్తోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రాగానే గ్రామస్థాయి నుంచి ప్రత్యక్షంగా అన్ని పర్యవేక్షించే వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయి స్థితిగతులను హైదరాబాద్ నుంచి ప్రత్యక్షంగా పరిశీలించేలా సచివాలయంలో, ప్రగతిభవన్‌లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో కొత్త వ్యవస్థను అమల్లోకి తెస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి, సీఎస్ కార్యాలయాల్లో ప్రత్యక్షంగా చూసేలా డిజిటల్ స్క్రీన్లు ఉంటాయి. హైదరాబాద్‌లోని కార్యాలయాల నుంచే అవసరమైన సూచనలు చేయొచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌కు మించి.. వేగంగా నిర్ణయాలను అమలు చేసేందుకు వీలుగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను అధికారిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దారు కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఇప్పటికే ఉంది. ఎలక్ట్రానిక్ డిజిటల్ వ్యవస్థ దీని కంటే ఇంకా మెరుగ్గా ఉండనుంది. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థ ఉన్న ప్రదేశం నుంచే మాట్లాడుకునే అవకాశముంది. అయితే ఈడీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు. దీని సాయంతో అధికారులు ఎక్కడున్నా శాటిలైట్ వీడియో నెట్‌వర్క్‌ను వినియోగించొచ్చు. ప్రతి అధికారికి ప్రభుత్వం మొబైల్ నంబర్‌ను కేటాయిస్తుంది. అధికారులు స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం కల్పిస్తారు. దీనిపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాల అభివృద్ధిపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు నిర్వహించే సమీక్షలను ఉన్నతస్థాయి అధికారులు నేరుగా పరిశీలించి వెంటనే నిర్ణయాలు తీసుకునేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
‘రూటర్లూ’ మనోడికే!
సాక్షి, అమరావతిబ్యూరో: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ప్రభుత్వ పెద్దలు నిమగ్నమయ్యారు. తాజాగా ఫైబర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియలో అక్రమాల పరంపరకు తెరతీశారు. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ రెండో దశ కాంట్రాక్టును రూ.2,200కోట్లతో తమ అస్మదీయ, బినామీ సంస్థలకు కట్టబెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అదే ఊపులో రూటర్ల ఏర్పాటు పేరుతో మరో భారీ (రూ.700 కోట్లు) కాంట్రాక్టును వారికి కట్టబెట్టేందుకు ఎత్తుగడ వేశారు. ‘రూటర్ల’తో కాంట్రాక్టుకు రూట్‌క్లియర్...!? రాష్ట్రంలో రెండో దశలో 60వేల కి.మీ. మేర ఫైబర్‌గ్రిడ్ కేబుల్స్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఇప్పటికే టెండర్ల ప్రక్రియను దాదాపు ఓ కొలిక్కితెచ్చింది. రూ.2,200 కోట్లతో ఈ కాంట్రాక్టును ప్రభుత్వ పెద్దల బినామీ, అస్మదీయులకు చెందిన మూడు సంస్థలకు కట్టబెట్టాలని భావిస్తుండటం వివాదాస్పదమ వుతోంది. ఈ నేపథ్యంలోనే ఫైబర్ గ్రిడ్ పనుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూటర్లు ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దలు ప్రతిపాదించారు. రాష్ట్రంలో మొదటి విడత, రెండో విడతలో ఫైబర్ గ్రిడ్ కేబుళ్లు వేసిన జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో రూటర్లు ఏర్పాటు చేస్తారు. దాదాపు 60వేల కి.మీ.కుపైగా వేసిన ఫైబర్ గ్రిడ్ కేబుళ్లను రాష్ట్రంలో 1,300 టెలిఫోన్ ఎక్సే్చంజిలతో ఈ రూటర్లు అనుసంధాని స్తాయి. అందుకోసం 1,300 రూటర్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. దాదాపు రూ.700కోట్లకుపైగా అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. బినామీ సంస్థకేనా...!? ఫైబర్ గ్రిడ్ రెండో దశ పనులకు అనుబంధంగానే రూటర్ల ఏర్పాటు కాంట్రాక్టును చేర్చాలని భావిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ పెద్దల అస్మదీయ సంస్థకే కట్టబెట్టాలన్నది లక్ష్యం. ప్రభుత్వ ముఖ్యనేత బినామీగా గుర్తింపుపొందిన వివాదాస్పద వ్యక్తి ఇప్పటికే ఏపీఎస్ఎఫ్ఎల్ లో సర్వం తానై చక్రం తిప్పుతున్నారు. ఆయనకు చెందిన సంస్థ ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనులు చేస్తుండటంతోపాటు రెండో దశ పనుల్లోనూ సింహభాగానికి గురిపెట్టింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆ సంస్థకే రూటర్ల ఏర్పాటు కాంట్రాక్టును ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అందుకు ఏపీఎస్ఎఫ్ఎల్ నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంస్థకు రూటర్ల ఏర్పాటు, నిర్వహణ అనుభవం లేదని, సాంకేతిక సామర్థ్యం లేదని అభ్యంతరం వ్యకం చేశారు. అసలు రూటర్ల ఏర్పాటు కోసం విడిగా టెండర్లు పిలవాలని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ కాంట్రాక్టులో నిబంధనలను అతిక్రమిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పకపోవచ్చని కూడా సందేహం వ్యక్తం చేశారు. దాంతో ముఖ్యనేత బినామీ వ్యక్తి మరో ఎత్తుగడ వేశారు. ఉత్తరభారతదేశానికి చెందిన ఓ సంస్థను తెరపైకి తెచ్చారు. రూటర్ల ఏర్పాటు, నిర్వహణలో అనుభవం ఉన్న ఆ సంస్థతో తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కథ నడుపుతున్నారు. కాబట్టి కాంట్రాక్టును తమ సంస్థకు ఇవ్వడానికి అవరోధాలు లేవన్న వాదనను వినిపిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీఎస్ఎఫ్ఎల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు అనుకూలంగానే త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని అధికారవర్గాలు భావిస్తున్నాయి. -
ఫైబర్‌గ్రిడ్ ముసుగులో భారీ అవినీతికి తెర తీశారు
-
ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులో భారీ దోపిడీకి పన్నాగం
-
పంచుకుందాం.. ఫైబర్ గ్రిడ్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతి విశృంఖలంగా విజృంభిస్తోంది. ఏ ప్రాజెక్టు చేపట్టినా కోట్లాది రూపాయలు కొల్లగొట్టేలా వ్యూహాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టులో భారీ దోపిడీకి తెరతీశారు. కేంద్ర నిధులతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో వందల కోట్లు కొట్టేయడానికి పావులు కదిపారు. టెండర్ నిబంధనలు నుంచి కాంట్రాక్టు ఖరారు వరకు తమ అస్మదీయ, బినామీ సంస్థలకు అనుకూలంగా ముఖ్య నేత కథ నడిపారు. మూడు సంస్థలకు రూ. 2,200 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టి.. తద్వారా వందల కోట్లలో కమీషన్లు వెనకేసుకునేందుకు ప్రణాళిక రచించారు. ఇలాంటి కాంట్రాక్టు విషయంలో మహారాష్ట్ర కంటే 50 శాతం అధికంగా టెండర్లు ఖరారు చేయాలని నిర్ణయించారు. దీంతో రూ.765.31 కోట్లు పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్లనున్నాయి. సొమ్ము కేంద్రానిది.. అవినీతి ముఖ్యనేతది దేశంలో గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌నెట్ కార్యక్రమాన్ని రూపొందించింది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ఫోన్, కేబుల్ టీవీ సేవలను కలిపి అందించాలన్నది ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశంలో ప్రజలు చెల్లిస్తున్న సెల్‌ఫోన్ బిల్లులో 5 శాతం సెన్సును భారత్‌నెట్ పథకానికి మళ్లిస్తున్నారు. అలా వసూలు చేస్తున్న సెస్సు మొత్తం రూ. 48 వేల కోట్లతో భారత్‌నెట్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఏ రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న సెస్సును ఆ రాష్ట్రాలకే కేటాయించనున్నారు. ఫైబర్‌గ్రిడ్ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఏర్పాటు చేసింది. ఫైబర్‌గ్రిడ్ మొదటి దశలో ప్రయోగాత్మకంగా జిల్లా, మండల కేంద్రాలను అనుసంధానిస్తూ ఫైబర్ గ్రిడ్ కేబుళ్లు వేసేందుకు టెండర్లు పిలిచారు. రెండో దశ కింద రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని రాష్టప్రభుత్వం నిర్ణయించింది. 2 వేల కి.మీ. మేర భూగర్భ కేబుళ్లు, 58 వేల కి.మీ. మేర విద్యుత్తు స్తంభాల మీదుగా ఏరియల్ కేబుళ్లు వేయాలన్నది ప్రణాళిక. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొత్తం 12,281 గ్రామ పంచాయతీల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు వేయాలని నిర్ణయించారు. ఈ పనుల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టింది. మూడు సంస్థలకు అనుకూలంగా... అన్నింటికీ అంతర్జాతీయ ప్రమాణాలు అని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టుకు మాత్రం దేశీయ మంత్రాన్ని జపించారు. విదేశీ సంస్థలు రాకుండా అడ్డుకట్ట వేశారు. ఇప్పటికే ఫైబర్ గ్రిడ్ మొదటి దశ పనులు చేస్తున్న తమ అస్మదీయ సంస్థలకే రెండో దశ టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారు. ఏదైనా సంస్థ తనకుతాను గానీ గరిష్టంగా మూడు సంస్థలు కన్సార్టియంగా గానీ ఏర్పడి టెండరు దాఖలు చేయొచ్చంటూ నిబంధనల్లో పేర్కొన్నారు. ఒక్క సంస్థే అయితే కనీసం ఐదేళ్లలో, కన్సార్టియం అయితే రెండేళ్లలో దేశంలో ఫైబర్ కేబుళ్లు వేసిన అనుభవం ఉండాలన్నారు. టెండరు దాఖలు చేసేనాటికి కనీసం 8 వేల కి.మీ. మేర కేబుళ్లు వేసిన అనుభవం కావాలని పేర్కొన్నారు. టెలికాం, ఐసీడీ ఉత్పత్తులు, సేవలకు సంబంధించి కనీసం రూ.1,500 కోట్ల టర్నోవర్ ఉండాలి.. అనే నిబంధనల ద్వారా అంతర్జాతీయ సంస్థలను. అస్మదీయ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించారు. మూడు సంస్థలకు పనుల సర్దుబాటు ముఖ్యనేత ఆశీస్సులతో ఆయన సన్నిహితులు, బినామీలకు చెందిన మూడు సంస్థలే ఫైబర్ గ్రిడ్ రెండో దశ పనులకు టెండర్లు దాఖలు చేశాయి. వాటిలో ఒకటి ముఖ్యనేతకు సన్నిహితమైన బడా కార్పొరేట్ సంస్థ. ఆ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,200 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–1గా నిలిచింది. ఇక రెండో సంస్థ ప్రభుత్వ ముఖ్యనేతకు.. దేశంలోనే బడా కార్పొరేట్ సంస్థకు అనుసంధానకర్తగా వ్యవహరించే కార్పొరేట్ ప్రముఖుడిది. ఈ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,400 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–2గా నిలిచింది. మూడో సంస్థ ముఖ్యనేత బినామీగా హైదరాబాద్‌లో ఉండే వారిది. ఆ సంస్థ మూడు ప్యాకేజీలకు కలిపి రూ. 2,500 కోట్లకు బిడ్ దాఖలు చేసి ఎల్–3గా నిలిచింది. దీంతో కాంట్రాక్టును రూ. 2,200 కోట్లుగా నిర్ణయించి.. అస్మదీయ సంస్థలు మూడింటికి ఒక్కో ప్యాకేజీ పనులు ఇవ్వాలని ఒప్పందానికి వచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పిన ఓ ఉన్నతాధికారిని తప్పించి ఆయన స్థానంలో తమకు అనుకూలంగా ఉండే మరో ఉన్నతాధికారిని నియమించారు. అస్మదీయ సంస్థలకు ఆ కాంట్రాక్టును ఖరారు చేస్తూ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. -
జనం ‘గొంతుక’పై ఫైబర్ కత్తి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేసి మొత్తం చానళ్ల ప్రసారాలను తన అదుపులో ఉంచుకోవడం కోసం ఉద్దేశించిన ‘ఫైబర్ గ్రిడ్ పథకం’పై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా దానిని ముందుకు తీసుకువెళ్లడానికే రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ అనుకూల కేబుల్ ఆపరేటర్లకు ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను కట్టబెట్టడం ఇప్పటికే పూర్తయిపోయింది. ఎంపిక ప్రక్రియకు ఎలాంటి నిబంధనలనూ పాటించకుండా తమవాళ్లందరికీ ఏజెన్సీలిచ్చేవారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు, ఇతరులకు చెందిన కేబుల్ సంస్థల వైర్లన్నిటినీ తొలగించేందుకు మళ్లీ కసరత్తు మొదలయ్యింది. వైర్లను తొలగించేందుకు రాష్ట్రప్రభుత్వం గతంలో విద్యుత్ సంస్థలను ప్రయోగించింది. అయితే కేసులు నమోదవడం, కోర్టులు అక్షింతలు వేయడంతో ఆ ప్రయత్నం వికటించింది. ఇపుడు స్థానిక సంస్థల అధికారులను ఈ పనికి నియోగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేబుల్ ఆపరేటర్లలో మళ్లీ ఆందోళన మొదలయ్యింది. రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం అంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ (ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్) ఆకర్షణీయ ప్రకటనలను గుప్పిస్తున్నా ప్రభుత్వ అసలు ఎజెండా మాత్రం ప్రతిపక్ష పార్టీలు, ఇతరులకు చెందిన కేబుల్ ఆపరేటర్లు లేకుండా చేయడమేనన్నది బహిరంగ రహస్యం. కేబుల్ ఆపరేటర్ మనవాడైతే మనకు నచ్చని చానళ్ల ప్రసారాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలిపివేయవచ్చు. అదీ ఈ ‘పథకం’ ముఖ్య ఉద్దేశం. వైర్లను తొలగించే బాధ్యత స్థానిక అధికారులకు.. ఆపరేటర్లను అడ్డుతొలగించుకుని, వ్యతిరేక మీడియా గొంతు నొక్కడం కోసం ‘ఫైబర్ గ్రిడ్ పథకం’ రూపొందించిన ప్రభుత్వం దానిని ముందుకు తీసుకువెళ్లడానికి అనేక దారులను అన్వేషిస్తోంది. ఇందుకోసం రెండు రోజుల క్రితం ప్రభుత్వ అనుకూల కేబుల్ ఆపరేటర్లతో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్ వద్ద ఓ సమావేశం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన, ఇతర కేబుల్ ఆపరేటర్ల వైర్లను తొలగించడంతో పాటు కొత్త కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటేనే ఫైబర్ గ్రిడ్ పథకాన్ని తాము ముందుకు తీసుకెళ్ల గలుగుతామని ప్రభుత్వ అనుకూల కేబుల్ ఆపరేటర్లు స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే వైర్లను తొలగించే బాధ్యతను విద్యుత్ సంస్థలకు అప్పగిస్తూ గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ కోర్టులు అక్షింతలు వేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చించినట్లు తెలిసింది. ఈసారి స్థానిక సంస్థల్లో ఉన్న అధికారులకు ఆ బాధ్యత అప్పగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అంటే పంచాయతీ కార్యదర్శి మొదలు కమిషనర్ వరకూ ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటారన్నమాట. అయితే ఫైబర్ గ్రిడ్ పథకాన్ని రాష్ట్రపతి అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఈ వైర్ల తొలగింపు కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతంలో పోలీసులనూ ప్రయోగించారు.. కేబుల్ వైర్లను తొలగించే పనిని విద్యుత్ సంస్థలకు అప్పగించడమే కాక అందుకోసం అవసరమైతే పోలీసుల సహకారం కూడా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి సూచనలు జారీచేశాయి. ఈ మేరకు 2016 డిసెంబర్ 24న ఎస్పీడీసీఎల్ అధికారులు మెమో (2175/16)ను జారీచేశారు. పోలీసుల సహాయం తీసుకుని మరీ తొలగించాలని స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2016 నవంబర్ 16న జరిగిన సమావేశంలో ఆదేశాలు జారీచేశారని కూడా ఈ మెమోలో స్పష్టం చేశారు. అయితే కేబుల్ ఆపరేటర్లు కోర్టులను ఆశ్రయించడంతో వారి ఆటలు సాగలేదు. వినియోగదారులపై అదనపు భారం కేవలం రూ.149కే ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సదుపాయం అని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం వాస్తవానికి వినియోగదారులపై అదనపు భారం మోపనుంది. ఫైబర్ గ్రిడ్ పథకం కింద ఈ సదుపాయాలు అందాలంటే సెట్‌టాప్ బాక్స్ కోసం రూ.4 వేలు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఇప్పటికే టీవీలకు అమర్చుకున్న సెట్‌టాప్ బాక్స్‌లపై కొత్త సర్వీసు అందించే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో రూ.2 వేలు వెచ్చించి కొనుగోలు చేసిన సెట్‌టాప్ బాక్సులు నిరుపయోగంగా మారనున్నాయని వినియోగదారులలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనితో పాటుగా రూ.149ల నెలవారీ బిల్లుకు అదనంగా పన్నులను కలిపి మొత్తం రూ.230 మేరకు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. నిబంధనలు లేవు.. నచ్చినోళ్లే ఆపరేటర్లు.. ఫైబర్ గ్రిడ్ పథకం అమలుచేయడానికి బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆపరేటర్లను ఎంపిక చేయాల్సిన రాష్ట్రప్రభుత్వం దానిని పక్కన పెట్టి నచ్చినవాళ్లకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమలు ప్రక్రియ మొత్తాన్ని అధికారపార్టీకి అనుకూలురైన కేబుల్ ఆపరేటర్ల చేతిలో పెట్టారు. ఎటువంటి బిడ్డింగ్, టెండర్ నిర్వహించకుండానే ఆయా సర్కిళ్లను అప్పగించి అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకున్నారు. ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని కర్నూలు కేంద్రంలో డిప్యూటీ సీఎం బంధువులకు అప్పగించగా...నంద్యాలలో భూమా కుటుంబానికి చెందిన కేబుల్ సంస్థకు దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే తరహాలో అధికారపార్టీకి చెందిన కేబుల్ ఆపరేటర్లకే అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్‌లకు అప్పగించారు. వీరిద్దరూ అధికారపార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే. కాకినాడ, రాజమండ్రిలో కొండలరావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారు. కొండల్రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్‌గా కొనసాగుతున్నారు. వైఎస్సార్ కడపలో జ్యోతి కేబుల్‌కు కూడా అప్పగించారు. ఇది అధికారపార్టీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందినది. అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు రాప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో పరిటాల శ్రీరామ్‌కు చెందిన సిటీ కేబుల్‌కు ఫైబర్‌గ్రిడ్ ఏజెన్సీ అప్పగించారు. -
ఫైబర్ గ్రిడ్‌పై నోకియా ఆసక్తి
అమెరికాలో పలు కంపెనీలతో మంత్రి కేటీఆర్ విస్తృత చర్చలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తామని, దీంతో దేశంలోని టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ రంగాల్లో విప్లవాత్మక మార్పులొస్తాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. అమెరికా పర్యట నలో భాగంగా బుధవారం శాన్ఫ్రాన్సిస్కో నగరంలో టెలికం దిగ్గజాలైన నోకియా, ఎరిక్సన్ కంపెనీలతో ఆయన సమావేశమై చర్చించారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగస్వా ములు కావాలని ఆ కంపెనీలను ఆహ్వానించగా, నోకియా ఆసక్తి కనబరిచింది. త్వరలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్ఎఫ్సీ) కోసం నిర్వహించే టెండర్లలో పాల్గొంటామని నోకియా ప్రతినిధి బృందం తెలిపింది. తెలంగాణలో నోకియా మొబైల్ ఫోన్ పరికరాల తయారీ ప్లాంటు లేదా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయా లని కోరారు. అక్కడి ఎరిక్సన్ కంపెనీని సందర్శించి అక్కడి ఎక్స్పీరియన్స్ సెంట ర్ను పరిశీలించారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ముఖాముఖి అయ్యారు. మ్యూల్‌సాఫ్ట్ కూడా ఆసక్తి.. రాష్ట్రంలో తమ కంపెనీ విస్తరణ అవకాశాల ను పరిశీలిస్తామని, హైదరాబాద్‌ను కూడా తమ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల్లో చేర్చు తామని మ్యూల్ సాఫ్ట్ కంపెనీ హామీ ఇచ్చింది. హైదరాబాద్‌లో మ్యూల్‌సాఫ్ట్ విస్త రణకు ఉన్న అవకాశాలను కేటీఆర్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. కాగా, అధిక సంఖ్యలో స్టార్టప్స్ ఉన్న టీ–హబ్‌తో కలసి పనిచేసేందుకు స్ట్రైప్ సంస్థ ముందుకొచ్చిం ది. సిలికాన్ వ్యాలీలో టీ–హబ్ ఏర్పాటు చేసిన టీ–బ్రిడ్జితో కలసి పనిచేస్తామని స్ట్రైప్ ప్రతినిధులు తెలిపారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంద ని, ఆర్థిక సేవలందించే స్ట్రైప్ సంస్థకు రాష్ట్రం అనుకూల ప్రాంతమని మంత్రి వివరించారు. అమెరికాలో కంపెనీలు ఏర్పాటు చేయాలను కునే వారికోసం అట్లాస్ ద్వారా సహకారమం దిస్తామని స్ట్రైప్ ప్రతినిధులు తెలిపారు. అంతకు ముందు శాన్ఫ్రాన్సిస్కోలోని సేల్స్ ఫోర్స్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. -
నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైంది
సైన్స్ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం బాబు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్ప టికే మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మొదట్రెండు పారిశ్రామిక విప్లవాలు నెమ్మదిగా నడిస్తే మూడోది వేగంగా, నాలుగోది కచ్చిత త్వంతో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళ వారం జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో చంద్రబాబు మాట్లాడారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్స హించడంలో ఏపీ ముందుందన్నారు. టెక్నాలజీతోనే భవిష్యత్ అన్నారు. ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేకిన్ ఏపీ చేప ట్టామన్నారు. ‘ఫైబర్ గ్రిడ్’ ద్వారా ప్రస్తుత మున్న విద్యుత్ స్తంభాలనే ఫైబర్ కేబుల్స్ కోసం వినియో గించుకుంటూ రూ.4,367 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో అమెరికా,చైనా తర్వాత భారతే ఉంటుంద న్నారు. మున్ముందు వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవస్థ రానుందన్నారు. మహనీయుడు మోదీ... చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని పదే పదే కీర్తించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక సం స్కరణల తర్వాత అద్భుత ప్రయోగాలు చేస్తున్న మహనీయుడు మోదీ అంటూ ఆకా శానికెత్తేశారు. ధైర్యవంతుడు, ధీశాలి సమా జానికి పట్టిన అవినీతి రుగ్మతను పారదోలేం దుకు నడుం కట్టిన పెద్ద రాజకీయ సంస్కర్తగా మోదీని అభివర్ణించారు. -
మోరిలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
-
మోరిలో ఫైబర్ గ్రిడ్ ప్రారంభం
నగదు రహిత లావాదేవీల పరిశీలన శంకుస్థాపనలు..రుణాల పంపిణీ ఆ గ్రామంలోనే బాబు ఆరు గంటల పర్యటన అమలాపురం : ఫైబర్ గ్రిడ్ పైలెట్ ప్రాజెక్టు...నగదురహిత గ్రామం... స్మార్ట్ విలేజ్.. బహిరంగ మల విసర్జనరహిత గ్రామంగా గుర్తింపు సంతరించుకున్న మోరిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సందర్శించారు. చంద్రబాబు జిల్లా పర్యటన ఈసారి సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపాడు గ్రామాలకు మాత్రమే పరిమితమైనా ఈ రెండు గ్రామాల్లో ఏకంగా ఆరు గంటలపాటు చంద్రబాబు గడపడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతోపాటు లబ్ధిదారులకు రుణాలను అందజేశారు. గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం... చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా మొదలైంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఉదయం 10 గంటలకు రావాల్సి ఉండగా విజయవాడ నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11.05 గంటలకు మోరి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కాన్ఫెరె¯Œ్స సెంటర్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.50 వరకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన సీఈవోలతో ఫైబర్ గ్రిడ్‌పై చర్చలు జరిపారు. బర్కలీ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఎ¯ŒSఆర్ఐ సాల్మా¯ŒS డార్వి¯ŒS ఆధ్వర్యంలో 42 కంపెనీలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైబర్ గ్రిడ్, ఎల్ఈడీ, వాటర్ మేనేజ్మెంట్, డిజిటల్ క్లాస్‌లు తదితర విషయాలపై సుమారు 1.45 గంటలపాటు చర్చలు జరిపారు. ఆయా కంపెనీల సీఈవోలతో ఫైబర్ గ్రిడ్, ఎల్ఈడీ, వాటర్ మేనేజ్మెంట్, డిజిటల్ క్లాస్‌లు తదితర విషయాలపైనా చర్చించారు. వారు చేపట్టే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. బాబు అక్కడ నుంచి స్థానిక ఉన్నత పాఠశాలకు చేరుకుని డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన, డిజిటల్ పాఠాలను వీక్షించారు. తరువాత గ్రామంలో పర్యటించి నగదు రహిత లావాదేవీలు నిర్వహించే దుకాణాలను పరిశీలించారు. స్థానిక రంగన్నా మెడికల్ స్టోర్స్‌లో నగదు రహిత లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. 1.30 గంటలకు సభా వేదికకు చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని çవేదిక వద్దనే పలు శంకుస్థాపనలు చేశారు. అంతర్వేదిలో రూ.22 కోట్లతో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్, శంకరగుప్తం డ్రై¯ŒSపై రూ.13 కోట్లతో నిర్మించే నాలుగు వంతెనలు, రూ.15 కోట్లతో నిర్మించే బ్రాంచ్ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కాపు కార్పొరేష¯ŒS ద్వారా 615 లబ్థిదారులకు రూ.9.35 కోట్ల రుణాలను అందజేశారు. సభలో చంద్రబాబు ఏకంగా 1.15 నిమిషాలపాటు ప్రసంగించారు. మోరి గ్రామం సాధిస్తున్న ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. గ్రామంలో 1400 ఇళ్లకు ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలందుతాయన్నారు. గ్రామంలో ఎల్ఈడీ బల్బులను ఆయన ప్రారంభించారు. అమరావతిలోని తన కార్యాలయం నుంచి ఏఏ వీధుల్లో లైట్లు వెలుగుతున్నాయి, వెలగడం లేదని తెలుసుకునే వ్యవస్థ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోరి సాధించిన విజయాలు స్ఫూర్తినిస్తాయని, ఇదొక నూతన విప్లవమన్నారు. రాష్ట్రమంతా ఈ విధానంలోకి తీసుకువస్తామని బాబు ప్రకటించారు. మోరి గ్రామంలో సేవలందిస్తున్న వివిధ కంపెనీల సీఈవోలను, విద్యార్థులను ఆయన ప్రసంశించారు. అక్కడ నుంచి తిరిగి కాన్ఫెరె¯Œ్స హాల్ సమీపంలో వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన నమూనాలను బాబు పరిశీలించి వచ్చి ప్రతినిధులతో మరోసారి చర్చలు జరిపారు. సాయంత్రం 5.10 గంటలకు హెలీకాఫ్టర్లో విజయవాడ బయలుదేరి వెళ్లారు. అగ్రి టూరిజానికి పెద్దపీట... కోనసీమలో అగ్రి టూరిజానికి పెద్ద పీట వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాంత అందాలకు, వ్యవసాయ విధానం, సంప్రదాయ జీవనం పర్యటకులను ఆకర్షిస్తోందన్నారు. ఇందుకు అగ్రి టూరిజం మంచి ఆదాయవనరుగా గుర్తింపు సంతరించుకుంటుందన్నారు. బాబుకు ఘన స్వాగతం... మోరి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నర్శింహం, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్సీలు రెడ్డి సుబ్రహ్మణ్యం, బొడ్డు భాస్కరరామారావు, ఆదిరెడ్డి అప్పారావు, కె.రవివర్మ, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, డీసీసీబీ చైర్మ¯ŒS వరపుల రాజా, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్జిబాబు, పిల్లి అనంతలక్ష్మి, తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్సీలు కె.సత్యనారాయణరాజు (చైతన్యరాజు), రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్‌లు స్వాగతం పలికార