ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వర్క్‌షాప్‌లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫైబర్ ప్రాజెక్టులో ప్రతి పౌరుడికి అవకాశం ఇవ్వాలనేది వర్క్‌షాప్ లక్ష్యమన్నారు. విద్య, వైద్య, ప్రభుత్వం సేవల వంటి రంగాల్లో ఈ ప్రాజక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈప్రాజెక్టు ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమన్నారు. ఈ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందని, అందుకు అందరూ సహకరించాలన్నారు.