
సాక్షి, విజయవాడ: కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజలు కిందట రెవెన్యూ, పోలీసు అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో జేసీ కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై చిందులు తొక్కారు. ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారికి వ్యతిరేకంగా అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఎలక్ట్రిక్ పోల్స్‌కు ఉన్న కేబుల్ కనెక్షన్‌లు తొలగించాలని ఆదేశించారు. మాట వినకపోతే ఎమ్మెస్వోలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు తెలిపారు. కాగా, జేసీ వ్యాఖ్యలపై ఎమ్మెస్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా తాము వ్యాపారం చేస్తున్నామని ఎమ్మెస్వోలు పేర్కొన్నారు. తమపై ఒత్తిడి చేసి వ్యాపారాలు చేయిస్తారా అని మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టుకు వెళతామని ఎమ్మెస్వోలు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment