MSOs
-
ఎంఎస్‌వోలకు షాక్: వినియోగదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: చార్జీల మోతతో ఇబ్బందులు పడుతున్న కేబుల్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో కేబుల్ బిల్లులు తగ్గనున్నాయి. ఈ మేరకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కస్టమర్ల ప్రయోజనాలు కాపాడే దిశగా ట్రాయ్ కేబుల్, బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు కొత్త సవరణలు చేసింది. దీనికి సంబంధించి ఎంఎస్‌వోలకు ట్రాయ్ కొత్త గైడ్‌లైన్స్‌ను కూడా విడుదల చేసింది. తద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్లకు భారీ షాకిచ్చింది. బ్రాడ్కాస్టర్లు విధించే చానల్ గరిష్ఠ ధరను రూ.19 నుంచి రూ. 12కు తగ్గించింది. అలాగే నెట్వర్క్ కెపాసిటీ ఫీజు(ఎన్సీఎఫ్)ను రూ.130 గా నిర్ణయించియింది. ఈ నిబంధనలు మార్చి1 నుంచి అమల్లోకి వస్తాయి. అంతేకాదు ఈ కొత్త నిబంధనలను ఈ నెలాఖరు (జనవరి) నాటికి వెబ్సైట్లో ఉంచాలని కూడా ఎంఎస్‌వోలను ఆదేశించింది. తాజా సవరణలో భాగంగా అన్ని ఫ్రీ చానెళ్లకు వసూలు చేసే ఫీజును ట్రాయ్ రూ. 140కి పరిమితం చేసింది. ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ టీవీలుంటే వాటికి ఎన్సీఎఫ్లో 40 శాతం చొప్పున అదనంగా వసూలు చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని 200 చానెళ్లకు రూ. 130గా సవరించింది. అంతేకాదు.. 200కు మించి ఎన్ని ఫ్రీ ఛానల్స్‌కి అయినా.. రూ.160కి మించి చెల్లించనక్కర్లేదని స్పష్టం చేసింది. సమాచార మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా ప్రసారం చేయాలని నిర్ధారించిన ఛానెళ్లను ఎన్సీఎఫ్లో చానెళ్ల కింద లెక్కించకూడదని తెలిపింది. డీడీ ఛానల్స్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చింది. 26 డిడి చానల్స్ టారీఫ్‌లో కాకుండా అదనమని ట్రాయ్ పేర్కొంది. ఆరునెలలకు అంతకుమించిన దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్స్‌కు డీపీఓలు డిస్కౌంట్లు ఆఫర్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. డీపీఓలు వసూలు చేసే ఫీజుపై నెలకు రూ. 4 లక్షల పరిమితి విధించింది. దీంతో పాటు ఆల్‌కార్ట్ చానెల్లు, ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్, చానెల్ బొకెట్ తదితరాలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు తెస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. పూర్తి వివరాలు: https://main.trai.gov.in/notifications/press-release/trai-releases-amendments-tariff-order-interconnection-regulations-లో లభ్యం. -
విజయ కృష్ణన్‌పై కేబుల్ ఆపరేటర్ల ఆగ్రహం
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీమాంధ్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల వెల్ఫేర్ ఆసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆసోషియేషన్ అధ్యక్షుడు పక్కి దివాకర్, గౌరవ సలహాదారు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పోతన రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. స్థానిక కేబుల్ ఆపరేటర్లను థర్డ్ క్లాస్ రాస్కెల్స్ అంటూ పరుష పదజాలంతో జేసీ దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారి అయిన విజయ కృష్ణన్‌కు ట్రాయ్ నియమించిన నోడల్ అధికారి అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెస్వోలు, కేబుల్ వినియోగదారులను రక్షించాల్సిన అధికారిణి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అని అన్నారు. తక్షణమే జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె పాల్గొనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని బాయ్‌కట్ చేయమని ఎమ్మెస్వోలకు సూచిస్తామన్నారు. -
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
-
ఎమ్మెస్వోలపై జేసీ అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు రోజలు కిందట రెవెన్యూ, పోలీసు అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో జేసీ కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలపై చిందులు తొక్కారు. ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వారికి వ్యతిరేకంగా అధికారులకు పలు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎలక్ట్రిక్ పోల్స్‌కు ఉన్న కేబుల్ కనెక్షన్లు తొలగించాలని ఆదేశించారు. మాట వినకపోతే ఎమ్మెస్వోలపై క్రిమినల్ కేసులు పెట్టాలని అధికారులకు తెలిపారు. కాగా, జేసీ వ్యాఖ్యలపై ఎమ్మెస్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా తాము వ్యాపారం చేస్తున్నామని ఎమ్మెస్వోలు పేర్కొన్నారు. తమపై ఒత్తిడి చేసి వ్యాపారాలు చేయిస్తారా అని మండిపడ్డారు. న్యాయం కోసం కోర్టుకు వెళతామని ఎమ్మెస్వోలు స్పష్టం చేశారు. -
ఇందిరాపార్క్ వద్ద ఎమ్‌ఎస్‌వోల మహా ధర్నా
-
మరోసారి డెడ్‌లైన్
ఈ నెల 31 నుంచి అనలాగ్ ప్రసారాలు బంద్ డిజిటలైజేషన్ చేయాలంటూ ఆదేశాలు 30శాతం మించని సెట్‌టాప్ బాక్సులు ఈసారి ఉపేక్షించబోమన్న ప్రభుత్వం సాక్షి, హన్మకొండ: కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. కేబుల్ ప్రసారాలను అనలాగ్ పద్ధతి నుంచి డిజిటల్లోకి మర్చాలంటూ ప్రభుత్వం ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు తగ్గట్లు ప్రజల్లో అవగాహన కల్పించడం, మాస్టర్ సిస్టమ్ ఆపరేటర్లను (ఎంఎస్ఓ) సిద్ధం చేయకపోవడంతో ఈ ప్రక్రియ వేగం పుంజుకోవడం లేదు. తాజాగా ఈ నెల 31లోగా కేబుల్ టీవీ ప్రసారాలన్నీ డిజిటలైజ్ చేస్తూ సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోవాలంటూ జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. ముఫై శాతమే కేబుల్ టీవీ డిజిటలైజేషన్ పరిధిలోకి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, పరకాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి పట్టణాలు వస్తున్నాయి. వీటి పరిధిలో 1.62 లక్షల కేబుల్ టీవీ కనక్షన్లు ఉన్నాయి. గత ఆర్నెళ్ల కాలంగా సెట్ టాప్ బాక్సులను అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. గడువు పొడిగించినా సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 30 శాతం కనెక్షన్లలకు సెట్ టాప్ బాక్సులు అమర్చి డిజిటలైజ్ చేశారు. రాబోయే ఏడు రోజుల వ్యవధిలో దాదాపు లక్ష కేబుల్ కనెక్షన్లకు సెట్‌టాప్ బాక్సులు అమర్చడం ఇబ్బందికరమైన వ్యవహరంగా మారనుంది. మూగనోమే.. కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌కు ఈ నెల 31 ఆఖరి గడువును కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా యంత్రాంగం చెబుతుంది. దీని వల్ల ప్రస్తుతం ఉన్న అనలాగ్ కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిగా ఆగిపోతాయి. 31వ తేదీ అర్థరాత్రి నుంచి కేబుల్ ప్రసారాలు నిలిచిపోతే, వినియోగదారులకు ఇక్కట్లు తప్పేలా లేవు. కేబుల ప్రసారాలు ఆగిపోయిన పక్షంలో సెట్ టాప్ బాక్సులకు గిరాకీ పెరిగిపోతుంది. అయితే డిమాండ్‌కు తగ్గ రీతిలో ఎంఎస్ఓల దగ్గర సెట్‌టాప్ బాక్సులు లేవు. ఏడునెలలుగా.. కేబుల్ టీవీ ప్రసారాలను క్రమబద్ధీకరించే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం అమలవుతున్న అనలాగ్ కేబుల్ టీవీ వ్యవస్థను డిజిటలైజ్ చేయాలని కేంద్ర ప్రసార, సమాచార శాఖ నిర్ణయించింది. ఈ మేరకు గత ఐదేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో కేబుల్ టీవీ ప్రసారాలను డిజిటలైజ్ చేయాలంటూ అన్ని టీవీ ఛానల్స్ యాజమన్యాలకు కేంద్రం చివరి హెచ్చరికను 2015 డిసెంబరు 22న జారీ చేసింది. 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్ చేయాలని హెచ్చరించింది. దీంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న కేబుల్ టీవీ అనలాగ్ ప్రసారాల్ని ఒకేసారి డిజిటిలైజ్ చేయాల్సి వచ్చింది. దీంతో సెట్‌టాప్ బాక్సులకు అనూహ్యంగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్‌కు తగ్గ బాక్సులు లేని ఫలితంగా నిర్దేశించిన గడువులోగా కేబుల్ వ్యవస్థను డిజిటలైజ్ చేయడం సాధ్యం కాలేదు. దీంతో కేంద్రం మరో ఆర్నెళ్ల గడువు పొడిగించింది. ప్రస్తుతం ఈ గడువు ముగిసింది. పట్టణం కేబుల్ టీవీ కనెక్షన్లు జనగామ 9,364 నర్సంపేట 5,100 భూపాలపల్లి 8,959 మహబూబాబాద్ 7,516 పరకాల 3,093 గ్రేటర్ వరంగల్ 1,27,968 –––––––––––––––––––––– -
ఎంఎస్‌వో హత్యకు నిరసనే కేబుల్ ప్రసారాల నిలిపివేత
సాక్షి, సిటీబ్యూరో: జీగ్రూప్‌కు చెందిన సిటీడిజిటల్, సిటీవిజన్ అనైతిక వ్యాపార ధోరణి, హత్యరాజకీయాలను నిరసిస్తూ ఫెడరేషన్ఆఫ్ తెలంగాణ ఎంఎస్ఓలు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కేబుల్ ప్రసారాలు నిలి పివేసి నిరసన తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల కనెక్షన్లుకు ప్రసారాలు నిలిచిపోగా, ఒక్క గ్రేటర్ హై దారాబాద్లోనే సుమారు 20 లక్షల కనెక్షన్లకు ప్రసారాలు నిలిచిపోయాయి. జీ గ్రూప్ యాజమాన్యం కనీసం బ్రాడ్‌కాస్ట ర్ల అనుమతి కూడా తీసుకోకుండా సొంతంగా డీటీహెచ్ ప్లాట్‌ఫాం(సిటీడిజిటల్, సిటీవిజన్)ను తయారు చేసుకుని కేబుల్ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా జరుతున్న అన్యాయాన్ని నిలదీసిన పాల్వంచ ఎంఎస్ఓ మల్లెల నాగేశ్వర్రావును హత్య చేయించిందని, దీనికి నిరసనగా సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు కేబుల్ ప్రసారాలు నిలిపివేసి నట్లు ఫెడరేషన్ఆఫ్ తెలంగాణ ఎంఎస్ఓల అధ్యక్షుడు నర్సింగ్‌రావు, నాయకులు సుభాష్‌రెడ్డి, ఏచూరి భాస్కర్, పి.సు రేష్లు ప్రకటించారు. ఈ నెల 23న పాల్వంచలో సంతాప సభతో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
అర్థంతరంగా ముగిసిన ఎంఎస్‌వోల సమావేశం
హైదరాబాద్: ఎంఎస్‌వోల అత్యవసర సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య అర్థంతరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఎంఎస్‌వోల మధ్య వాగ్వాదం చేటు చేసుకుంది. ఛానళ్లలో పనిచేసే ఉద్యోగులంతా తెలంగాణ వాళ్లేనని, ఛానళ్లు ఆపేయడం ద్వారా తమ పొట్టలు కొట్టడం దారుణమంటు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల తీరుతో ఎంఎస్‌వోలు సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. ఇటీవల రెండు చానెళ్ల ప్రసారాలపై ఎంఎస్‌వోలు నిషేధం విధించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.