ఎంఎస్వోల అత్యవసర సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య అర్థంతరంగా ముగిసింది.
హైదరాబాద్: ఎంఎస్వోల అత్యవసర సమావేశం గందరగోళ పరిస్థితుల మధ్య అర్థంతరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఎంఎస్వోల మధ్య వాగ్వాదం చేటు చేసుకుంది.
ఛానళ్లలో పనిచేసే ఉద్యోగులంతా తెలంగాణ వాళ్లేనని, ఛానళ్లు ఆపేయడం ద్వారా తమ పొట్టలు కొట్టడం దారుణమంటు జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల తీరుతో ఎంఎస్వోలు సమావేశం నుంచి అర్థంతరంగా వెళ్లిపోయారు. ఇటీవల రెండు చానెళ్ల ప్రసారాలపై ఎంఎస్వోలు నిషేధం విధించిన నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.