సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లపై కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సీమాంధ్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల వెల్ఫేర్ ఆసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఆసోషియేషన్ అధ్యక్షుడు పక్కి దివాకర్, గౌరవ సలహాదారు జనార్ధన్, ప్రధాన కార్యదర్శి పోతన రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. స్థానిక కేబుల్ ఆపరేటర్లను థర్డ్ క్లాస్ రాస్కెల్స్ అంటూ పరుష పదజాలంతో జేసీ దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఐఏఎస్ అధికారి అయిన విజయ కృష్ణన్‌కు ట్రాయ్ నియమించిన నోడల్ అధికారి అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. ఎమ్మెస్వోలు, కేబుల్ వినియోగదారులను రక్షించాల్సిన అధికారిణి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి నాలుగు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అని అన్నారు. తక్షణమే జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమె పాల్గొనే ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని బాయ్‌కట్ చేయమని ఎమ్మెస్వోలకు సూచిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment