సైన్స్ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం బాబు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్ప టికే మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మొదట్రెండు పారిశ్రామిక విప్లవాలు నెమ్మదిగా నడిస్తే మూడోది వేగంగా, నాలుగోది కచ్చిత త్వంతో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళ వారం జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో చంద్రబాబు మాట్లాడారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్స హించడంలో ఏపీ ముందుందన్నారు. టెక్నాలజీతోనే భవిష్యత్ అన్నారు. ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేకిన్ ఏపీ చేప ట్టామన్నారు. ‘ఫైబర్ గ్రిడ్’ ద్వారా ప్రస్తుత మున్న విద్యుత్ స్తంభాలనే ఫైబర్ కేబుల్స్ కోసం వినియో గించుకుంటూ రూ.4,367 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో అమెరికా,చైనా తర్వాత భారతే ఉంటుంద న్నారు. మున్ముందు వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవస్థ రానుందన్నారు.
మహనీయుడు మోదీ...
చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని పదే పదే కీర్తించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక సం స్కరణల తర్వాత అద్భుత ప్రయోగాలు చేస్తున్న మహనీయుడు మోదీ అంటూ ఆకా శానికెత్తేశారు. ధైర్యవంతుడు, ధీశాలి సమా జానికి పట్టిన అవినీతి రుగ్మతను పారదోలేం దుకు నడుం కట్టిన పెద్ద రాజకీయ సంస్కర్తగా మోదీని అభివర్ణించారు.
నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైంది
Published Wed, Jan 4 2017 3:37 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement