సాక్షి, ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఫైబర్‌నెట్ కేసులో సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయొద్దని ఆదేశించిన న్యాయస్థానం.. చంద్రబాబు గనుక అలాంటి ప్రకటనలు చేసి ఉంటే ఆ రికార్డులు తమకు సమర్పించాలని కోరింది.
ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను మంగళవారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో 17ఏ క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెలువడిన అనంతరమే ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని స్పష్టం చేస్తూ విచారణను వచ్చే నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే అధికారంలో ఉండగా.. ఫైబర్‌నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment