Biometric system
-
సామాన్యుడు విసిరిన సవాళ్లు!
సాక్షి, సిటీబ్యూరో: సామాన్యులు సైతం ఒక్కోసారి పెద్దపెద్ద వ్యవస్థల్ని కదిలిస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా ‘హైటెక్ నేరాలకు’ పాల్పడుతూ సవాళ్లు విసురుతున్నారు. వీరిస్తున్న షాక్‌లతో యంత్రాంగాల దిమ్మ తిరిగిపోయి నష్ట నివారణ చర్యలు అన్వేషిస్తున్నాయి. 2010లో వెలుగులోకి వచ్చిన పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్ హ్యాకింగ్ నుంచి తాజాగా బయటపడిన ‘క్లోన్డ్ వేలిముద్రల’ వ్యవహారం వరకు ఈ కోవకు చెందినవే. ఆయా నిందితులు ఈ నేరాలకు పాల్పడింది కేవలం తమ అవసరాల కోసమే కావడం గమనార్హం. స్లాట్స్ కోసం ఆర్పీఓ వెబ్సైట్... ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటకు చెందిన గోరంట్ల లతాధర్‌రావు పీజీడీసీఏ పూర్తి చేసి అక్కడే లలిత ఫ్యాన్సీ అండ్ కూల్ డ్రింక్స్ దుకాణం నిర్వహించేవాడు. ఇతడికి 2010లో ఆకాష్ ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ సుభానీతో పరిచయమైంది. లతాధర్‌కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటంతో తన వద్దకు వచ్చే పాస్‌పోర్ట్ అప్లికేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కోసం సుభానీ ఇతని సాయం తీసుకునే వాడు. తత్కాల్ స్కీమ్ కింద పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వారు దళారులను ఆశ్రయించడం ప్రారంభించి ఆన్లైన్ స్లాట్ ఇప్పిస్తే భారీ మొత్తాలను చెల్లించడానికి ముందు రావడం మొదలుపెట్టారు. దీంతో పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి స్లాట్స్ బ్లాక్ చేయాలన్న ఆలోచన లతాధర్, సుభానీలకు వచ్చింది. తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించి లతాధర్ ఈ పని చేశాడు. రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్‌సైట్‌లోనికి ఎంటర్ అయ్యే లతాధర్ దాని నుంచి నేరుగా సర్వర్‌కు కనెక్ట్ అయ్యే వాడు. ప్రతి రోజూ స్లాట్స్ విడుదల చేసే సమయంలో ఇతరులు వాటిలోకి లాగాన్ కాకుండా చేసే వాడు. తమను ఆశ్రయించిన వారి అప్లికేషన్స్ అప్లోడ్ చేసిన తరవాతే స్లాట్స్‌ను ఫ్రీ చేసే వాడు. ఈ వ్యవహారం అదే ఏడాది జూన్‌లో వెలుగులోకి రావడంతో టాస్‌్కఫోర్స్ పోలీసులు లతాధర్ సహా ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఆన్లైన్ స్లాట్స్ కేటాయింపునకు ఉపయోగపడే పాస్‌పోర్ట్ వెబ్‌సైట్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఇతరులకు స్లాట్స్ దొరక్కుండా బ్లాక్ చేస్తున్నట్లు లతాధర్ ఒప్పుకున్నాడు. టార్గెట్, నగదు కోసం నకిలీ వేలిముద్రలు... కేవలం టార్గెట్‌కు తగ్గట్టు సిమ్‌కార్డులు విక్రయించడానికి పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన ధనలక్ష్మీ కమ్యూనికేషన్స్ నిర్వాహకుడు పాత సంతోష్‌కుమార్ ఏకంగా నకిలీ వేలిముద్రల్నే సృష్టించేశాడు. ఈ తరహా ఉదంతం వెలుగులోకి రావడం అదే ప్రథమం. రిజిస్ట్రేషన్ న్స్ శాఖ వెబ్‌సైట్‌లోని డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకుని రెచ్చిపోయాడు. వాటిలో ఉండే వ్యక్తి పేరు, ఆధార్ నెంబర్, వేలిముద్రల్ని తనకు అనుకూలంగా వాడుకున్నాడు. రబ్బర్‌స్టాంపులు తయారు చేసే యంత్రంతో వేలిముద్రల్నే సృష్టించేశాడు. రబ్బర్‌తో వీటిని రూపొందిస్తే ఈ–కేవైసీ యంత్రం రీడ్ చేయట్లేదనే ఉద్దేశంతో పాలిమర్ అనే కెమికల్‌ను వాడి వేలిముద్రలు తయారు చేశాడు. ఈ వివరాలతో ఈ–కేవైసీ యంత్రాన్నీ ఏమార్చి వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. ఇతడిని ఎస్సార్‌నగర్ పోలీసులు పట్టుకున్న తర్వాత వచ్చి విచారించిన ఆధార్ సహా ఇతర విభాగాలకు చెందిన అధికారులు నివ్వెరపోయారు. తాజాగా తెలంగాణ, ఏపీలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ముఠాగా మారి, ఇదే పంథాలో వేలిముద్రలు క్లోనింగ్ చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్) దురిజిస్ట్రేషన్ నియోగం చేసి వివిధ బ్యాంకులకు రూ.10 లక్షల మేర టోకరా వేశారు. ‘ముప్పు’ను ఊహించకపోవడమే... ఇలాంటి పెను ఉదంతాలు చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం ‘భవిష్యత్తును’ సరిగ్గా అంచనా వేయలేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఏదైనా ఓ విధానం, వెబ్సైట్ తదితరాలు రూపొందించేప్పుడు అనేక కోణాలను పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే పెద్ద వ్యవస్థలకు చెందిన వారు సైతం కేవలం అప్పటి అవసరాలను, ఎదురవుతున్న సమస్యల్నే దృష్టిలో పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఎదురయ్యే వాటిని పట్టించుకోవట్లేదని వివరిస్తున్నారు. ఈ కారణంగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత మాత్రమే నష్టనివారణ, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం సమీప భవిష్యత్తులో ఎన్ని రకాలైన సవాళ్లు ఎదురయ్యే ప్రమాదం ఉంది, టెక్నాలజీ ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు తదితరాలను అంచనా వేసి చర్యలు తీసుకుంటారని, ఆ దృక్పథం ఇక్కడ లోపించిందని, దీంతోనే ఏదైనా జరిగిన తర్వాతే అవసరమైన చర్యలు తెరపైకి వస్తున్నాయని స్పష్టం చేస్తున్నారు. -
హోంగార్డులు.. ఎన్ని పాట్లు!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో పని చేస్తున్న హోంగార్డులకు సెప్టెంబర్ నెల గౌరవ వేతనం ఆదివారానికీ అందలేదు. ప్రతి నెలా ఒకటి–రెండు తారీఖుల్లో వచ్చే జీతం కొన్ని నెలలుగా ఆలస్యం అవుతోంది. ఈసారి 8వ తేదీ వచ్చినా ఇప్పటికీ అందకపోవడంతో ఈ చిరుద్యోగులు బ్యాంక్ ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా తమ సిబిల్ స్కోరు దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారు. రాజధానిలో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న పోలీసుల సంఖ్యకు సమానంగా హోంగార్డులు ఉన్నారు. పోలీసుస్టేషన్ల వారీగా హోంగార్డ్స్ జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు ప్రతి నెలా హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతాయి. ఈ బిల్లుల తయారీ మొత్తం ఇప్పటికీ మాన్యువల్‌గానే జరుగుతోంది. ఆ మధ్యన కొన్నాళ్ళు బయోమెట్రిక్ వ్యవస్థ ప్రవేశపెట్టినా.. అనివార్య కారణాలతో తొలగించారు. హోంగార్డులు పని చేసే ఠాణాలు, కార్యాలయాల్లో ఉండే అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలతోనే ప్రస్తుతం వీరి హాజరు గణిస్తున్నారు. ప్రతి నెలా 20వ తేదీ నుంచి మరుసటి నెల్లో 19వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటున్న అధికారులు దీనికి సంబంధించి హాజరుపట్టీ తయారు చేస్తుంటారు. పోలీసు స్టేషన్లు, ప్రత్యేక విభాగాలు, ఇతర కార్యాలయాల నుంచి నుంచి హెడ్–క్వార్టర్స్ లేదా అడ్మిన్ అధికారులకు వెళ్లే ఈ హాజరు ఫైల్ అక్కడ అప్రూవ్ అయ్యాక మాత్రమే హోంగార్డ్స్ కమాండెంట్ కార్యాలయానికి చేరుతుంది. అక్కడ నుంచి సంబంధిత కమిషనర్ ఆఫీస్‌కు వచ్చిన తర్వాతే జీతాలు లెక్కించి బ్యాంకు ద్వారా హోంగార్డుల ఖాతాలో పడాల్సి ఉంది. గతంలో ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు నెలగా పరిగణించే వాళ్ళు. మాన్యువల్‌గా జరుగుతున్న పనుల కారణంగా కొన్నేళ్ళ క్రితం వరకు జీతాల చెల్లింపు ఆలస్యమై ప్రతినెలా 15వ తేదీ తరవాతే హోంగార్డులకు అందేవి. అయితే దీనిపై దృష్టి పెట్టిన ఉన్నతాధికారులు నెల లెక్కింపును 20 నుంచి 19వ తేదీ వరకు మార్చారు. అయినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా కాస్త ఆలస్యంగానే జీతాలు వస్తున్నాయని హోంగార్డ్స్ వాపోతున్నారు. ఈ విభాగంలో గడిచిన కొన్నేళ్ళలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. వీటికి చెక్ చెప్పడంతో పాటు హోంగార్డులకూ ప్రతి నెలా ఒకటి–రెండు తేదీల్లో జీతాలు ఇచ్చేందుకు అవసరమైన ఆధునిక టెక్నాలజీ వినియోగంపై అధికారులు దృష్టి పెట్టట్లేదు. గతంలో వెలుగులోకి వచ్చిన కుంభకోణాలన్నీ హోంగార్డుల ‘హాజరు’ ఆధారంగా జరిగినవే. హోంగార్డుల హాజరును నమోదు చేయడానికి పోలీసుస్టేషన్ల వారీగా మరోసారి బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసి, లోపాలకు అధిగమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కుంభకోణాలకు ఆస్కారం లేకుండా పోవడంతో పాటు జీతాల బిల్లుల తయారీ పేపర్‌తో పని లేకుండా వేగంగా జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ సర్వర్ కమాండెంట్ కార్యాలయంలో ఉంచితే... హాజ రు అక్కడే నమోదు అవుతుంది. ఫలితంగా కచ్చితత్వం ఉండటంతో పాటు జీతా ల బిల్లులు సైతం ఆలస్యం కావు. కేవలం పర్మిషన్లు, ఆన్డ్యూటీల్లో ఉన్న హోంగార్డుల వివరాలను మాత్రం ఈ కార్యాలయానికి మాన్యువల్‌గా, నేరుగా పంపితే సరిపోతుంది. ఉన్నతాధికారులు ఈ కోణంపై దృష్టి పెడుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఆలస్యానికి కారణాలు ఏవైనా ఇబ్బందులు పడుతున్నది మాత్రం పోలీసుశాఖలో ‘బడుగు జీవులు’ అయిన హోంగార్డులే. తమకు గృహరుణాలు, ఇతర లోన్లు ఉన్నాయని, వీటి ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలోనే కట్ అ వుతాయని చెప్తున్నారు. జీతాల ఆలస్యం కారణంగా ఇది సాధ్యంకాక తమ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని తమ బాధలు తీర్చాలని హోంగార్డులు వేడుకోంటున్నారు. -
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ విధానంలో ఉద్యోగులందరి హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని కేంద్రం శుక్రవారం అన్ని శాఖలను కోరింది. తమ పరిధిలోని ఉద్యోగులు బయోమెట్రిక్‌లో హాజరు నమోదు చేయనప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు అలసత్వంతో వ్యవహరిస్తున్నాయని తేలడంతో సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థలు తమ ఉద్యోగుల హాజరును తప్పనిసరిగా నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని అందులో కోరింది. ఉద్యోగుల సమయపాలనపైనా శ్రద్ధ పెట్టాలని సూచించింది. ఉద్యోగులు తరచూ ఆలస్యంగా విధులకు హాజరు కావడం, ముందుగానే వెళ్లిపోవడం వంటి వాటిని ప్రోత్సహించరాదని, నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతిగృహాల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇదివరకు ప్రయోగాత్మక పద్ధతిలో బయోమెట్రిక్ హాజరు ప్రక్రియను అమ లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షే మ శాఖల పరిధిలో 1,345 సంక్షేమ వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.25 లక్షలమంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం విద్యార్థుల హాజరును మాన్యువల్ పద్ధతిలో రికార్డు చేస్తున్నా రు. అయితే విద్యార్థుల సంఖ్యను అధికంగా చూపు తూ బిల్లులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకువస్తోంది. వారంలోగా క్షేత్రస్థాయి అవసరాలపై అంచనా హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలు కోసం బయోమెట్రిక్ మెషీన్లు అవసరం. వీటిని ఆధార్ నంబర్ ఆధారంగా వేలిముద్రలు తీసుకునేలా తయారు చేశారు. ప్రతి హాస్టల్లో మెషీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మెషీన్లను పరిశీలించి పనితీరును అంచనా వేయాలని, అవసరమైనచోట కొత్తవి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సర్వీసులు(టీఎస్టీఎస్) విభాగానికి ఇవ్వాలని నిర్ణయించి లేఖ రాసినట్లు తెలిసింది. -
ఏపీ: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తితో 2020 మే నుంచి బయోమెట్రిక్ హాజరు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గడంతో మళ్లీ బయోమెట్రిక్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా లింబాద్రి చదవండి: ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలి.. సీఎం కేసీఆర్ -
ఆధార్‌కు లాక్ వేద్దాం!
సాక్షి,గుంటూరు : ప్రతి పనికి ఆధార్ తప్పనిసరి.. ప్రభుత్వ పథకాలైనా.. ప్రైవేటు పనులైనా ఆ కార్డు లేకుంటే పని జరగదు. ఈ క్రమంలో అదే స్థాయిలో సమాచార చోరీ, వ్యక్తిగత వివరాల భద్రతకు అవరోధంగా మారింది. సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్న తరుణంలో డిజిటల్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చోరీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోప్యతకు రక్షణ కల్పిస్తూ చోరీకి చెక్ పెట్టేందుకు కేంద్రం ‘ఎం–ఆధార్ యాప్’ తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘ఎం ఆధార్’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌తో ఆధార్ కార్డులోని డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. ఎవరైనా సరే తమ ఆధార్ బయోమెట్రిక్ లాక్(వేలిముద్రను) వినియోగించి అవసరమైనప్పుడు కార్డులోని డేటా సేవలను పొందే వీలు కల్పించింది. వినియోగదారుడు ప్రమేయం లేకుండా ఆధార్ వినియోగాన్ని నిలిపివేయడమే దీని ప్రధాన ఉద్దేశం. సెల్‌ఫోన్ ఎప్పుడు వినియోగదారుడి వెంటనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు. అన్నింటా ఆధారే.. రేషన్ దుకాణం మొదలు బ్యాంకు ఖాతా, ఫోన్ సిమ్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, నగదు బదిలీ, దుకాణం లైసెన్స్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ వివరాలు తప్పనిసరి. ఆయా సందర్భాల్లో సమర్పించే నకళ్ల ద్వారా ఆధార్ సమాచారం గోప్యత ప్రశ్నార్థకం అవుతోందనే అనుమానాలు ఉన్నాయి. అయితే సమాచార చోరీకి అడ్డుకట్ట వేసేందుకు ‘ఎం ఆధార్ యాప్’ ఉపయోగపడనుంది. స్మార్ట్ ఫోనణ్లో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని బయోమెట్రిక్ రూటర్ ద్వారా మనమే వివరాలను ఆన్లైన్లో అందించి ఎలాంటి సేవలైనా పొందవచ్చు. ఏదైనా ఆన్లైన్లో ధరఖాస్తు చేసుకునే సమయంలో ఫోన్ యాప్‌లో ఎం ఆధార్‌ను ఎటాచ్ చేసుకుంటే జిరాక్స్ కాపీలతో పని ఉండదు. ఈ యాప్ ద్వారా ఏదైనా దరఖాస్తును నేరుగా చేసుకునే అవకాశం ఉంటుంది. నూతన విధానం అందుబాటులోకి రావడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే వారికి మరింత సులువైంది. డౌన్లోడ్ విధానం ఇలా... ఆధార్ అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో ఎం ఆధార్ యూప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్య నమోదు చేసి యాక్టివేట్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలను నమోదు చేస్తే జనరల్ క్యూ ఆర్ కోడ్ వస్తుంది. దీని ద్వారా బమోమెట్రిక్ నమోదువుతుంది. యాప్‌లో బయోమెట్రిక్ లాక్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత అవసరమైనప్పుడు లాక్ ఓపెన్ చేసి ఆధార్ వివరాలతో ఆన్లైన్లో ఎలాంటి జిరాక్స్ పత్రాలు ఇవ్వకుండానే లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. మిగిలిన సమయాల్లో బయోమెట్రిక్‌ను లాక్ చేయవచ్చు. దీని ద్వారా సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఆధార్ వివరాలను కాపాడుకోవచ్చు. బయోమెట్రిక్ లాక్ చేయడం వల్ల ఆధార్ యాక్సెస్ ఉన్న పలు బహుళజాతి కంపెనీలు, సైబర్ నేరగాళ్లకు ఆధార్ డేటా కనిపించదు. -
‘అవంతి’ని అప్రోచ్ అయ్యారు!
సాక్షి, హైదరాబాద్: కళాశాలల్లో హాజరు లెక్కింపునకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అమలులోకి తీసుకువచ్చిన బయోమెట్రిక్ వ్యవస్థనే ఏమారుస్తూ వేలిముద్రల్ని క్లోనింగ్ చేసిన గ్యాంగ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వీరు సంప్రదించిన కాలేజీల్లో వివేకానంద గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో పాటు తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)కు చెందిన అవంతి ఇంజనీరింగ్ కాలేజీ, ఆయన సోదరుడు ముత్తంశెట్టి కృష్ణారావుకు చెందిన నోవా ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. వీటితో పాటు కోదాడలోని గేట్, కిట్స్ సంస్థలతోనూ వీరు సంప్రదింపులు జరిపారని గుర్తించారు. అయితే వివేకానంద కాలేజీలా మిగిలిన వాటికి నకిలీ వేలిముద్రలు తయారు చేసి ఇచ్చారా? అనే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. వేలిముద్రల క్లోనింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అవంతి కాలేజీతో పాటు మిగిలిన వాటికి నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు. జేఎన్టీయూ నిబంధనల కఠినతరంతో... ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన బొమ్మ రామకృష్ణ పీహెచ్డీ చేస్తూ అక్కడి స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసేవాడు. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన పి.శ్రీరామ్ ప్రసాద్ 2014–17 మధ్య బాటసింగారంలోని నోవా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేశాడు. అప్పట్లో రామకృష్ణ సైతం కొన్నాళ్ల పాటు ఇదే కాలేజీలో పని చేయడంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ తదితర కాలేజీల్లో ప్రతి 15 మంది విద్యార్థులకో అధ్యాపకుడు ఉండాలి. అయితే అనేక కాలేజీలు దీన్ని పాటించలేకపోతున్నాయి. బోగస్ అ«ధ్యాపకులు, విద్యార్థుల ఘటనల నేపథ్యంలో జేఎన్టీయూ బయోమెట్రిక్ హాజరు విధానం అవలంభిస్తోంది. క్లోనింగ్ చేశారిలా... రామకృష్ణ సూచనతో శ్రీరామ్ ఓ ప్లాస్టిక్ కోటింగున్న కాగితంపై గ్లూ గన్‌తో ప్రొఫెసర్ల వేలిముద్ర సేకరిస్తా డు. దీని ఆధారంగా రామకృష్ణ ఒక్కో బోగస్ అధ్యాపకుడికి సంబంధించి నాలుగు సెట్ల క్లోన్డ్ వేలిముద్రల్ని తయారు చేసేవాడు. ఆయా కళాశాలల యాజమాన్యా లు ప్రతి రోజూ ఈ వేలిముద్రల అచ్చుల్ని బయోమెట్రిక్ మిషన్‌లో వేలు పెట్టాల్సిన చోట పెట్టేవి. ఇలా ఆ వ్యక్తి హాజరైనట్లు సర్వర్‌లో నమోదయ్యేలా చేసేవారు. కాలేజీలతో ఒప్పందాలు చేసుకుని... జేఎన్టీయూ అఫిలియేటెడ్ కాలేజీల్లో ఉన్న బయోమెట్రిక్ మిషన్ జేఎన్టీయూలో ఉన్న సర్వర్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. దీంతో కాలేజీ యాజమాన్యాలు సిబ్బంది, విద్యార్థుల హాజరును ‘మేనేజ్’ చేయలేకపోయాయి. దీన్ని గుర్తించిన రామకృష్ణ వేలిముద్రలు క్లోనింగ్ చేసే విధానం తెలుసుకుని శ్రీరామ్ప్రసాద్తో జట్టుకట్టాడు. హైదరాబాద్‌లోని కాలేజీలతో ఒప్పందాలు చేసుకునే శ్రీరామ్ అవసరమైన ఫింగర్‌ప్రింట్స్ ఆర్డర్‌ను రామకృష్ణకు పంపించడం చేసేవాడు. ఎంటెక్ పూర్తి చేసి వేర్వేరు చోట్ల ఉద్యోగాలు చేస్తున్న వారిని యాజమాన్యాలు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఎన్రోల్ చేసేవారు. వీరు కాలేజీకి వచ్చినప్పుడు శ్రీరామ్ వారి వేలిముద్రలు బయోమెట్రిక్ మిషన్‌లో లోడ్ చేసేవాడు. రీయింబర్స్మెంట్ ‘సృష్టించారా’? ఈ గ్యాంగ్‌ను ఇటీవల హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో రామకృష్ణ, శ్రీరామ్‌తో పాటు బాటసింగారంలో ఉన్న వివేకానంద కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ పోరెడ్డి సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేశారు. సైదాబాద్ ఠాణాలో నమోదైన ఈ కేసును దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేశారు. సుదర్శన్ తమ సంస్థలో పని చేస్తున్నట్లు 29 మంది వేలిముద్రల్ని వీరితో తయారు చేయించాడు. ఈ గ్యాంగ్ విచారణలోనే అవంతి, నోవా, గేట్, కిట్స్ కాలేజీలను అప్రోచ్ అయినట్లు తేలింది. కేవలం సంప్రదించారా.. లేక వారికీ ఏవైనా అక్రమాలకు సహకరించారా.. అన్నదానిపై దృష్టి పెట్టారు. ఆయా కాలేజీలకు నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. ఈ గ్యాంగ్ ‘నకిలీ విద్యార్థుల్నీ’తయారు చేసిందనే అనుమానాలున్నాయి. ఇతర వర్సిటీలకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో చదువు తున్న విద్యార్థులతోనూ కళాశాల యాజమాన్యాలు ఒప్పందాలు చేసుకున్నాయని, వీరి వేలిముద్రల ఆధారంగా ఫీజు రీ–యింబర్స్‌మెంట్ పొందారనే ఆరోపణలపైనా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. -
మొరాయిస్తున్న బయోమెట్రిక్
నల్లబెల్లి (వరంగల్): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పెంచడంతోపాటు విద్యార్థులకు నేరుగా పథకాలు అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశారు. కానీ, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, అధికారులు అప్డేట్ కాకపోవడం, నెట్వర్క్ సమస్య తలెత్తడంతో బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలైతే తప్పనిసరిగా ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో కొంతైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలు, హెల్త్ కిట్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇవ్వన్ని విద్యార్థులకు చేరుతున్నాయా లేక దుర్వినియోగం అవుతున్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యంత్రాల నిర్వహణపై రిసోర్స్ పర్సన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున పాఠశాలలకు అందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్వర్క్ సరిగా ఉండకపోవడం, యంత్రాలు వినియోగించడంలో అవగాహన లోపం వంటి కారణాలతోపాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తొలగిస్తూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయకపోవడం తదితర సమస్యలతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని తెలుస్తోంది. ఒకే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు వేలిముద్ర వేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వేయలేని పరిస్థితి ఉందని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇటీవల మండలానికి ఒకరు చొప్పున 15 మంది టెక్నీషియన్లను నియమించారు. కానీ, వారు విధుల్లో చేరకపోవడంతో బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతు చేసేవారు కరువయ్యారు. సమస్యను అధిగమించేందుకు చర్యలు.. బయోమెట్రిక్ యంత్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సరైన వివరాలు నమోదు చేయాలి. యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిపుణుల సాయం అందేలా చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు సాధించవచ్చు. జవాబుదారీతనం పెరుగుతుంది.. బయోమెట్రిక్ యంత్రాలు ఉపయోగించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మా పాఠశాలకు అధికారులు మూడు యంత్రలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐడీలు ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తాం. – రామస్వామి, హెచ్ఎం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నల్లబెల్లి సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు చర్యలు జిల్లాలోని 699 ప్రభుత్వ పాఠశాలలకు 756 బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు పనిచేసే సమయంపై పారదర్శకతతో పాటు మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలకు వీటిని పంపిణీ చేశాం. బయోమెట్రిక్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిచేసేందుకు ప్రభుత్వం విజన్‌టెక్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. నెట్వర్క్ లేని పాఠశాలలను గుర్తించి సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – కె.నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్ రూరల్ -
వేలికి ‘నకిలి’ ముద్ర!
శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి వేలిముద్రలు.. ప్రపంచంలో ఏ ఇద్దరివీ సరిపోలవు.. కానీ ఓ టెలికం సంస్థ డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్రం మీ వేలిముద్రలు ఉంటాయి. మీ ఆధార్ నంబరు, పేరు, చిరునామా అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడూ ఈ–కేవైసీ యంత్రంలో మీ వేలిముద్ర పడుతూ మీ పేరిట సిమ్‌కార్డులు జారీ అయిపోతుంటాయి. చదువును మధ్యలోనే ఆపేసిన సంతోష్‌కుమార్ అనే యువకుడు.. ఇంటర్నెట్ సాయంతో నకిలీ వేలిముద్రల తయారీని నేర్చుకుని, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని ఓ లోపాన్ని ఆసరాగా తీసుకుని వేలాది మందికి చెందిన నకిలీ వేలిముద్రలను తయారుచేశాడు. ఆ వేలిముద్రలను ఆధార్ డేటాబేస్ నుంచి కేవైసీ అప్రూవల్ పొందడానికి వినియోగించి.. వేల సంఖ్యలో కొత్త సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. దీనిపై ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ)’ సహా కేంద్ర నిఘా అధికారులు ఉలిక్కిపడ్డారు. దీనివెనుక ఉగ్రవాదులు, మావోయిస్టుల కోణం ఉందేమోనని సందేహించారు. కానీ లోతుగా పరిశీలించాక.. కేవలం సిమ్‌కార్డుల ‘టార్గెట్’పూర్తి చేసుకోవడానికి సంతోష్ ఈ పనిచేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయారు. సంతోష్ అనుసరించిన విధానం ఏ ఉగ్రవాదుల చేతుల్లోనో, మావోయిస్టుల చేతుల్లోనో పడితే.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని ఆందో ళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై హైదరాబాద్ లోని ‘ఆధార్’కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు గత బుధవారం కేసు నమోదు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు సంతోష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా గోప్యత పాటించారు. తన వివరాలు గోప్యంగా ఉంచాల్సిందిగా కోరిన ఢిల్లీలో పనిచేసే యూఐడీఏఐ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’కి పూర్తి వివరాలు వెల్లడించారు. సిమ్‌కార్డుల టార్గెట్ పూర్తి కోసం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన పాత సంతోష్‌కుమార్ బీఎస్సీ చదువు మధ్యలోనే మానేశాడు. ధర్మారం బస్టాండ్ సమీపంలో ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ పేరుతో దుకాణం ఏర్పాటు చేసి వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రూ.51 టాక్‌టైమ్‌తో ఉచితంగా ఇచ్చే ఈ సిమ్‌కార్డులను నెలకు కనీసం 600 విక్రయిస్తే.. ఒక్కో కనెక్షన్‌కు రూ.15 చొప్పున కమీషన్ ఇస్తామన్నది కంపెనీ పెట్టిన టార్గెట్. ఈ టార్గెట్ పూర్తికాకపోతే కమీషన్ చాలా తక్కువగా వస్తుంది. దాంతో సంతోష్ కొన్నాళ్ల పాటు కాలేజీలు, పాఠశాలల వద్ద స్టాల్ ఏర్పాటు చేసి.. తానే రూ.5 ఎదురిస్తూ సిమ్‌కార్డులు విక్రయించాడు. మొత్తంగా టార్గెట్ పూర్తి చేసి కమీషన్ పొందేవాడు. ఉచితంగా రూ.50కిపైగా టాక్‌టైమ్ వస్తుండటంతో విద్యార్థులు తరచూ సిమ్‌కార్డులు తీసుకుంటుండేవారు. కానీ ఒక్కొక్కరి పేరిట గరిష్టంగా తొమ్మిది సిమ్‌కార్డులు మాత్రమే తీసుకునేలా.. కచ్చితంగా ఆధార్, ఈ–కేవైసీ యంత్రంలో వేలిముద్ర నమోదు తర్వాతే సిమ్ యాక్టివేషన్ జరిగేలా కొంతకాలం కింద నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల సిమ్ విక్రయాల టార్గెట్ పూర్తిగాక కమీషన్ రావడం ఆగిపోయింది. దీంతో సంతోష్ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. వివరాలన్నీ ఒకే చోట దొరకడంతో.. ఎవరో ఒకరి పేరు మీద సిమ్‌కార్డులు యాక్టివేట్ చేయడం ద్వారా టార్గెట్ పూర్తి చేసుకోవాలని సంతోష్ భావించాడు. సాధారణంగా ఓ సిమ్‌కార్డు యాక్టివేట్ కావాలంటే.. వినియోగదారు పూర్తి పేరు, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయడంతోపాటు ఈ–కేవైసీ తనిఖీ పరికరంలో ఆ వ్యక్తి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ఎక్కడ దొరుకుతాయనే దానిపై అధ్యయనం చేసిన సంతోష్.. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల సమయంలో ఈ మూడు వివరాలను డాక్యుమెంట్లో పొందుపరుస్తారని గుర్తించాడు. అంతేకాదు రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ లో డాక్యుమెంట్ నంబర్, పలు వివరాలు నమోదు చేస్తే.. రిజిస్ట్రేషన్ల డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలుసుకున్నాడు. సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేటాయించే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల సిరీస్‌ను పరిశీలించాడు. వాటి తరహాలో కొన్ని నంబర్లను వెబ్సైట్లో నమోదు చేస్తూ వెళ్లగా.. ఓ డాక్యుమెంట్ డౌన్లోడ్ అయింది. దాంతో ఆ సిరీస్‌లో తర్వాతి నంబర్లను నమోదు చేస్తూ.. వరుసగా డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేశాడు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది స్థిరాస్తుల యజమానుల ఆధార్, పేరు, చిరునామా, వేలిముద్రలు వంటి పూర్తి వివరాలను సమకూర్చుకున్నాడు. ఇంటర్నెట్లో ‘వేలిముద్రల’తయారీ నేర్చుకుని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల చివరి పేజీలో ఆ స్థిరాస్తిని విక్రయించిన, కొనుగోలు చేసిన వారి వేలిముద్రలు ఉంటాయి. ఇలా పేపర్ మీద ఉన్న వేలిముద్రలను.. తిరిగి ఎక్కడైనా వేయగలిగేలా ఎలా తయారు చేయాలన్న దానిపై ఇంటర్నెట్లో వెతికాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. రబ్బర్ స్టాంపుల తయారీ యంత్రాన్ని వినియోగించి వేలిముద్రలు తయారు చేసే విధానం నేర్చుకున్నాడు. కాగితంపై ముద్రించి ఉన్న లోగోలు, డిజైన్లను స్టాంపుగా మార్చడానికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది. లోగోనుగానీ, డిజైన్నుగానీ కాంతి కిరణాలతో స్కాన్ చేసే ఆ యంత్రం.. అదే లోగో/డిజైన్‌ను రబ్బరుపై ఏర్పరుస్తుంది. అలాంటి ఓ యంత్రాన్ని కొనుక్కొచ్చి తన ధనలక్ష్మి కమ్యూనికేషన్స్ దుకాణంలో ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యంత్రంలో లోగోను, డిజైన్‌ను పెట్టాల్సిన చోట.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోని వేలిముద్రల కాగితాన్ని పెట్టాడు. దాంతో ఆ యంత్రం వేలిముద్రను స్కాన్ చేసి.. రబ్బరుపై అదే ఆకృతిని ఏర్పాటు చేసింది. అయితే సంతోష్ ఈ–కేవైసీ యంత్రంలో ముద్ర వేయడానికి వీలుగా రబ్బరుకు బదులుగా.. ప్రత్యేకమైన మెత్తటి ప్లాస్టిక్ పాలిమర్‌ను వినియోగించాడు. ఈ–కేవైసీ యంత్రంపై ఈ పాలిమర్ ముద్రను పెట్టినప్పుడు.. నేరుగా వేలిముద్ర వేసిన తరహాలో పనిచేసింది. ఇలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సహాయంతో పెద్ద సంఖ్యలో నకిలీ వేలిముద్రలను తయారు చేసిన సంతోష్.. ఈ–కేవైసీ యంత్రంలో సదరు ఆధార్ వివరాలు, ఇతర వివరాలు నమోదు చేసి, వేలిముద్రను పెట్టి.. సిమ్‌కార్డులను యాక్టివేషన్ చేశాడు. తర్వాత ఆ సిమ్‌కార్డులను ధ్వంసం చేసేసినా.. కొత్త కనెక్షన్ల టార్గెట్ మాత్రం పూర్తయి, సిమ్ విక్రయాల కమీషన్ అందింది. ఉలిక్కిపడిన యూఐడీఏఐ సంతోష్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి ఒక్కోసారి ఒక్కో ప్రాంతానికి చెందిన డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసి, నకిలీ వేలిముద్రలు తయారు చేసి.. సిమ్‌కార్డులను యాక్టివేట్ చేశాడు. ఇలా దాదాపు నెల రోజుల్లో ఆరు వేల సిమ్‌కార్డులు యాక్టివేట్ చేశాడు. అయితే ఒకే ఈ–కేవైసీ యంత్రం నుంచి భారీగా సిమ్‌కార్డుల కోసం ఆధార్ అప్రూవల్స్ పొందిన విషయాన్ని గుర్తించిన యూఐడీఏఐ విజిలెన్స్ విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు, మావోయిస్టులతోపాటు అసాంఘిక శక్తులకు అక్కడి నుంచి సిమ్‌కార్డులు చేరుతున్నాయని సందేహించి.. కేంద్ర నిఘా వర్గాల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన నిఘా అధికారులు, 18 ప్రభుత్వ విభాగాల అధికారులు.. సంతోష్‌కుమార్‌ను విచారించారు. సిమ్‌కార్డుల యాక్టివేషన్ టార్గెట్ పూర్తి చేసుకోవడం కోసం సంతోష్ చేసిన పని.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నుంచి వేలిముద్రల సేకరణ, రబ్బరు స్టాంపుల యంత్రంతో నకిలీ వేలిముద్రల తయారీ, ఇందుకోసం ఇంటర్నెట్ను వినియోగించుకున్న తీరు వంటివి తెలుసుకుని అవాక్కయ్యారు. జాతీయ స్థాయిలో ‘అలర్ట్’! వేలిముద్రల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానాన్ని భద్రమైన మార్గంగా పరిగణిస్తూ మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దానిని వినియోగిస్తున్నాయి. మన దేశంలోనైతే ‘ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)’కు కూడా వేలిముద్రనే ప్రధాన ఆధారంగా ఉంది. ఈ నేపథ్యంలో సంతోష్ చెప్పిన వివరాలను విన్న అధికారులు అప్రమత్తమయ్యారు. నకిలీ వేలిముద్రల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశముందని.. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు తస్కరించడం వంటి ఆర్థిక నేరాల నుంచి ఓ వ్యక్తి ప్రమేయం లేకుండా అతడిని నేరాల్లో ఇరికించడం వంటి క్రిమినల్ నేరాలకూ దారితీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో ప్రతి మూడు నెలలకోసారి ‘మల్టీ ఏజెన్సీస్ కమిటీ’పేరుతో పిలిచే మ్యాక్ సమావేశం జరుగుతుంది. అందులో నిఘా నుంచి పరిపాలన వరకు అన్ని విభాగాల అధికారులు పాల్గొని వివిధ అంశాల్ని చర్చిస్తుంటారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సంతోష్ వ్యవహారం నేపథ్యంలో.. వారం రోజుల్లో మ్యాక్ సమావేశం ఏర్పాటు చేయాలని యూఐడీఏఐ నిర్ణయించింది. అందులో ఈ కేసును చర్చించి.. దేశవ్యాప్తంగా ఇలాంటి లోపాలు గుర్తించాలని, ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల శాఖలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని యూఐడీఏఐ కోరనుంది. ఆయా లోపాలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది. -
విద్యార్థుల హాజరుకు ఇక బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్ : బయోమెట్రిక్ పద్ధతిలో విద్యా ర్థుల హాజరు నమోదుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సంస్థ రూపొందించిన ‘అబాస్’ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను ఇందుకు ఉపయోగించ నున్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా బయో మెట్రిక్ పద్ధతిలో విద్యార్థుల హాజరును నమోదు చేసేందుకు పాఠశాలల్లో ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని పదివేల పాఠ శాలల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తోంది. 4 సెకండ్ల వ్యవధిలో ఓ విద్యార్థి హాజరును ఈ సాఫ్ట్వేర్ నమోదు చేయనుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాధికారి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ కంప్యూటర్లు/లాప్టాప్ తెరల మీద విద్యార్థుల హాజరుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తెలుసుకోవడానికి దీని ద్వారా వీలు కలగ నుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతంపై విశ్లేషణలు జరపడంతో పాటు మధ్యాహ్న భోజనం పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడనుంది. -
ముద్ర పడదు.. రేషన్ రాదు!
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలో రేషన్ సరుకులకు ‘వేలిముద్రల’ తలనొప్పి వచ్చి పడింది. అక్రమాల నియంత్రణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఈ–పాస్ బయోమెట్రిక్ విధానం సమస్యల్లో పడింది. పలు చోట్ల సిగ్నళ్లు పనిచేయకపోవడం, సిగ్నల్ ఉన్నా ఈ–పాస్ సర్వర్లు మొరాయిస్తుండటంతో రేషన్ సరుకుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఇక వృద్ధులు, మరికొందరి వేలిముద్రలను బయోమెట్రిక్ పరికరాలు సక్రమంగా గుర్తించకపోతుండటంతో డీలర్లు వారికి సరుకులు ఇవ్వడం లేదు. రెవెన్యూ అధికారులు రాసి ఇస్తే సరుకులు ఇస్తామంటున్నారు. దాంతో సరుకులు రాక, అధికారుల చుట్టూ తిరగలేక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఊళ్లను, కుటుంబాలను వదిలి పని కోసం వలస వెళ్లిన వారికి ఈ–పాస్‌తో సమస్యలు ఎదురవుతున్నాయి. స్వయంగా వచ్చి వేలిముద్ర వేయాల్సి రావడంతో ఆ కుటుంబాలు సరుకులు తీసుకోలేకపోతున్నాయి. ఈ–పాస్ విధానం అమలు, లబ్ధిదారుల సమస్యలపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. బియ్యం తీసుకోలేక.. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా తొమ్మిది పాత జిల్లాల్లో 78,85,980 రేషన్‌కార్డులు ఉన్నాయి. వాటికి పంపిణీ కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించిన బియ్యం కోటా విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలకూ చేరింది. కానీ చాలా మంది లబ్ధిదారులు బియ్యం తీసుకోలేకపోతున్నారు. రేషన్ అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ–పాస్’సమస్యలే దీనికి కారణం. ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే ఈ–పాస్ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా.. క్షేత్రస్థాయిలో సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ–పాస్ యంత్రాలకు సిగ్నళ్లు అందకపోవడం, సర్వర్లు మొరాయిస్తుండడానికి తోడు వృద్ధుల వేలిముద్రలు సరిగా పడకపోవడంతో సరుకుల పంపిణీ ఇబ్బందికరంగా మారుతోంది. అందులోనూ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకే సరుకులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని లబ్ధిదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇక వేలిముద్రలు పడని వారికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) నుంచి లేఖ తీసుకుని బియ్యం ఇస్తున్నారు. దీంతో వేలిముద్రలు పడని వృద్ధులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అక్రమాలు తగ్గినా.. పెరిగిన ఇబ్బందులు.. రేషన్ అక్రమాల నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానంతో చాలా చోట్ల రేషన్ షాపులలో బియ్యం మిగులుతున్నాయి. అందుబాటులో లేక బియ్యం తీసుకోని లబ్ధిదారులు, బోగస్ కార్డులు, రేషన్ బియ్యం వినియోగించనివారుంటే.. ఆ మేర బియ్యం మిగిలిపోతోంది. ఇలా మిగిలిన మేర మరుసటి నెల కోటాకు తగ్గించి సరఫరా చేస్తారు. తద్వారా రేషన్ సరఫరాలో అక్రమాలు తగ్గాయి. కానీ ఈ–పాస్ సమస్యల కారణంగా కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో కార్డుకు 20 నిమిషాలు! రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని ఓ రేషన్ షాపు వద్ద ‘సాక్షి’పరిశీలన జరిపింది. అక్కడ రేషన్ బియ్యం తీసుకునేందుకు యాభై మంది వరకు క్యూలో ఉన్నారు. అయితే ఒక్కొక్కరు రేషన్ తీసుకోవడానికి ఇరవై నిమిషాల వరకు పట్టడం గమనార్హం. ఈ–పాస్ యంత్రాల ద్వారా వేలి ముద్రలు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. సిగ్నల్ రాకపోవడం, సర్వర్ డౌన్ చూపిస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో లబ్ధిదారులు రేషన్ బియ్యం కోసం గంటల తరబడి నిలబడడం, రోజుల తరబడి వేచి ఉండడం తప్పడం లేదు. ఇక పాత ఖమ్మం జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సిగ్నల్ సమస్యను అధిగమించేందుకు.. ఎక్కడ ఏ కంపెనీ సిగ్నల్ అధికంగా ఉంటే ఆ సిమ్‌లను అందించారు. అయితే సిగ్నల్ సరిగానే ఉన్నా.. ఈ–పాస్ సర్వర్ మొరాయిస్తుండడంతో ఫలితం ఉండడం లేదు. పాత మెదక్ జిల్లాలోనైతే సిగ్నల్ లేకపోవడం, వేలిముద్రలను గుర్తించకపోవడం వంటి సమస్యలతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘వలసల’ వెతలు వలసలకు మారుపేరైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో చాలా మంది పేదలు.. బయోమెట్రిక్ విధానం కారణంగా ఈ నెల రేషన్ సరుకులు తీసుకోలేకపోయారు. ఇక్కడి నుంచి పనికోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే కూలీలు.. బంధువులకు, తెలిసినవారికి తమ రేషన్‌కార్డులను ఇచ్చి, సరుకులు తీసుకుని పెట్టాలని చెబుతారు. రెండు, మూడు నెలలకోసారి స్వగ్రామాలకు వచ్చి బియ్యం తీసుకెళ్తారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల తదితర ప్రాంతాలన్నిటా ఇదే పరిస్థితి ఉంది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు చెందిన చాలా మంది గిరిజనులు ముంబైకి వలస వెళ్లారు. ఇక్కడి నుంచి నేరుగా ముంబైకి బస్సు సౌకర్యం ఉండటంతో.. స్థానికంగా ఉండే బంధువులు రేషన్ బియ్యం తీసుకుని, ఆ బస్సుల్లో ముంబైకి పంపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నెలనెలా ఇంత దూరం రాలేక చాలా మంది సబ్సిడీ బియ్యాన్ని తీసుకోలేకపోతున్నారు. కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని వలస కూలీలదీ ఇదే పరిస్థితి. ఇంకా చాలా దుకాణాలకు చేరని ఈ–పాస్ బయోమెట్రిక్‌తో రేషన్ సరుకులు అందించేందుకు తీసుకొచ్చిన ఈ–పాస్ యంత్రాలు ఇంకా చాలా దుకాణాలకు చేరలేదు. డీలర్లకు వాటిని ఎలా వినియోగించాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నెల మొదటి వారం గడిచిపోయినా ఇంకా చాలా దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు అమర్చే పని కొనసాగుతోంది. ఇక డీలర్లకు యంత్రాల నిర్వహణపై పూర్తి అవగాహన లేకపోవడం, చాలా దుకాణాల వద్ద సిగ్నళ్లు సరిగా లేకపోవడం ఇబ్బందిగా మారింది. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకే సరుకులు పంపిణీ చేయాలని సర్కారు చెబుతున్నా.. ఈ నెలలో 25వ తేదీ వరకూ కొనసాగేలా కనిపిస్తోంది. సర్వర్ పనిచేయక సమస్యలు గతంలో రోజుకు కనీసం వంద కార్డులపై బియ్యం పంపిణీ చేశాం. ఇప్పుడు ఈ–పాస్ విధానం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సర్వర్ సరిగా పనిచేయక పోవడంతో ఒక్కో కార్డుకు బియ్యం పంపిణీ చేయడానికి 20 నిమిషాలు పడుతోంది.. – మల్లెపూల శారద, రేషన్ డీలర్, ఆసిఫాబాద్ రెండు రోజులుగా తిరుగుతున్నా.. నల్లగొండ జిల్లా చండూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చొప్పరివారిగూడెం గ్రామం ఉంది. ఈ గ్రామస్తులు రేషన్ బియ్యం పొందాలంటే చండూరు పట్టణంలోని ఒకటో నంబర్ రేషన్ షాపు వద్దకు రావాలి. ఆ గ్రామానికి చెందిన చొప్పరి పెద్దులు రెండు రోజులుగా రేషన్ షాపు వద్దకు వచ్చి, తిరిగి ఖాళీగానే ఇంటికి వెళ్లిపోతున్నాడు. ఎందుకంటే వేలిముద్రలు పడక ఆయనకు బియ్యం ఇవ్వడం లేదు. -చొప్పరి పెద్దులు, చొప్పరివారిగూడెం, చండూరు, నల్లగొండ రేషన్‌పై గతంలో ఇచ్చిన సరుకులు బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, గోధుమలు, కిరోసిన్, చింతపండు ప్రస్తుతం సరఫరా అవుతున్నవి బియ్యం, కిరోసిన్ (అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు మాత్రం కిలో పంచదార సరఫరా జరుగుతోంది) -
అందరూ నిశానీదారులే!
అక్షర తూణీరం మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. ప్రస్తుతం దేశం వేలిముద్రల మీద నడు స్తోంది. ఒక ప్పుడు నిరక్షరా శ్యుణ్ని వేలి ముద్రగాడు, నిశాని పద్దు అని పిలిచేవారు. ఇప్పుడు వేలిముద్ర లేకుండా తెల్లారదు, పొద్దుగూకదు. ఎన్ని కోట్ల మంది జనం ఉన్నా, ఏ ఇద్దరి ఫింగర్ ప్రింట్సూ ఒక్కలాగా ఉండవని అందరికీ తెలుసు. ఈ సత్యాన్ని మనిషి ఎన్నడో కనిపెట్టాడు. చేవ్రాలుని ఎవరైనా ఫోర్జరీ చెయ్యచ్చుగాని వేలిముద్రని చేయడం బ్రహ్మతరం కూడా కాదు. అందుకని ముఖ్యమైన పత్రాల మీద సంతకందార్లయినా, వేలిముద్రలు వేసి తీరాల్సిందే. క్రయవిక్రయ దస్తావేజుల మీద, పాస్‌పోర్ట్ వ్యవహారంలో వేళ్లకు సిరా రాసుకోక తప్పదు. పూర్వం ప్రొ నోటు మీద మగవారైతే ఎడమ చేతి బొటనవేలుని, ఆడవారైతే కుడిచేతి బొట నవేలుని తిప్పి తీరాల్సిందే. ఇప్పుడు అదే ఆచారం అందర్నీ శాసిస్తోంది. వేలి ముద్రకున్న నిజాయితీ సంతకానికి లేకుండా పోయింది. పనిచేసేచోట్లలో బయోమెట్రిక్ విధానం వచ్చి చాలా కాలమైంది. సొంత వేలైతే తప్ప వేళలు అతిక్రమించే పప్పు లుడకవ్. అసలెందుకు, సమస్త క్రిమినల్ వ్యవహారాల్ని పట్టిచ్చేది ఫింగర్ ప్రింట్సే. అదొక పెద్ద శాస్త్రం. ఆధార్ కార్డ్‌కి మూలాధారం వేలిముద్రే. సెల్‌ఫోన్‌ని, ఐపాడ్‌ని, టాబ్లెట్‌ని వేలిముద్రతోనే లాక్ మరియు అన్‌లాక్ చేసుకుంటారు. లాక ర్స్‌కి కూడా ఇలాంటి ‘నిశాని తాళం’ సదుపాయం ఉంది. అసలీ బయోమె ట్రిక్ విధానంతో దొంగ ఓట్లని నిరోధిం చవచ్చు. వేళ్లన్నీ గొప్పవేగానీ బొటనవేలు మరింత గొప్పది. పురుషసూక్తంలో బొట నవేలు ఒక కొలమానంగా ప్రస్తావనకు వస్తుంది. ‘అంగుష్టమాత్రం’ అనే వాడుక అక్కడనించే వచ్చింది. రాజగురువు ద్రోణాచార్యుడు ఏకలవ్యుణ్ని కుడిచేతి బొటనవేలుని గురుదక్షిణగా కోరి స్వీక రించాడు. శిష్యుణ్ని ఆ విధంగా అశక్తుణ్ని చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఇది వేరే కథ. ఇప్పుడీ నగదు రహిత లావాదేవీలు వచ్చాక, చేవ్రాలు మరీ అపురూపమై పోయింది. ఇక్కడో విషయం చెప్పాలి. పెద్ద వాళ్లంతా పదే పదే న.ర. లావా దేవీలంటున్నారు. న.ర. ఆర్థిక లావా దేవీలు అనకపోతే కొంచెం అపార్థం ధ్వనిస్తోంది. ఆ విషయం అలా ఉంచితే, ప్రస్తుతం బ్యాంకి చెక్కుల మీద కూడా వేలిముద్ర ప్రవేశపెడితే బెటరనిపి స్తోంది. కార్డ్ స్వైపింగ్ వచ్చాక చీటికీ మాటికీ సంతకాలు పెట్టే పని తగ్గింది. దాంతో సంతకం టాలీ కాలేదని చెక్కులు తిరిగి రావడం, దాంతో అపార్థాలు ఎక్కు వైనాయి. అదే నిశాని అయితే పేచీపూచీ ఉండదు. మనిషిని సృష్టించినవాడు దేవుడే అయితే, ఆయన నిజంగా గొప్పవాడు. మనిషిలో ఏ చిన్న పార్ట్‌నీ డూప్లికేట్ చేసే అవకాశం లేకుండా డిజైన్ చేశాడు. వేళ్ల కొసల్లో శంఖుచక్రాలు అమర్చాడు. దాన్నొక శాస్త్రంగా చేసుకుని బతకడానికి కొందరికి అవకాశం కల్పించాడు. వేలి కొసలే కలవనప్పుడు రెండు మెదళ్లు ఎలా కలుస్తాయ్? అందుకే ట్రంప్ బ్రెయి న్లా మరో బ్రెయిన్ ఉండదు. ఇది వేలి ముద్రంత నిజం. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలైంది
సైన్స్ కాంగ్రెస్‌లో ఏపీ సీఎం బాబు తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో నాలుగో పారిశ్రామిక విప్లవం ఇప్ప టికే మొదలైందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మొదట్రెండు పారిశ్రామిక విప్లవాలు నెమ్మదిగా నడిస్తే మూడోది వేగంగా, నాలుగోది కచ్చిత త్వంతో నడుస్తోందని అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మంగళ వారం జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో చంద్రబాబు మాట్లాడారు. శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్స హించడంలో ఏపీ ముందుందన్నారు. టెక్నాలజీతోనే భవిష్యత్ అన్నారు. ప్రధాని ప్రారంభించిన మేకిన్ ఇండియాను స్ఫూర్తిగా తీసుకుని మేకిన్ ఏపీ చేప ట్టామన్నారు. ‘ఫైబర్ గ్రిడ్’ ద్వారా ప్రస్తుత మున్న విద్యుత్ స్తంభాలనే ఫైబర్ కేబుల్స్ కోసం వినియో గించుకుంటూ రూ.4,367 కోట్లు ఆదా చేసినట్టు తెలిపారు. భవిష్యత్‌లో అమెరికా,చైనా తర్వాత భారతే ఉంటుంద న్నారు. మున్ముందు వేలిముద్ర ద్వారా నగదు రహిత చెల్లింపులకు బయోమెట్రిక్ వ్యవస్థ రానుందన్నారు. మహనీయుడు మోదీ... చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని పదే పదే కీర్తించారు. స్వాతంత్య్రానంతరం ఆర్థిక సం స్కరణల తర్వాత అద్భుత ప్రయోగాలు చేస్తున్న మహనీయుడు మోదీ అంటూ ఆకా శానికెత్తేశారు. ధైర్యవంతుడు, ధీశాలి సమా జానికి పట్టిన అవినీతి రుగ్మతను పారదోలేం దుకు నడుం కట్టిన పెద్ద రాజకీయ సంస్కర్తగా మోదీని అభివర్ణించారు. -
పాఠశాలలను బలోపేతం చేయాలి
నాగర్‌కర్నూల్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాగర్‌కర్నూల్, తెలకపల్లి ఎంఈఓలు జయశ్రీ, రాజశేఖర్‌రావు ఉపాధ్యాయులను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిసోర్స్ కేంద్రంలో జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసి అన్ని వసతులను వినియోగించుకుని పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి.గోవర్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, కృష్ణయ్య, కురుమూర్తి, వెంకటస్వామి, లక్ష్మణ్‌నాయక్, సీతారాం, రాజు, చంద్రయ్య, చెన్నయ్య పాల్గొన్నారు. -
బయోమెట్రిక్ ఒట్టిమాటే!
* రెండున్నరేళ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం * జిల్లాలో ఏ ఒక్క పాఠశాలలోనూ అమలుకు నోచుకోని వైనం * ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అమలులో ఉన్న విధానం గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదు పకడ్బందీగా నిర్వహించేందుకు బయోమెట్రిక్ హాజరు నమోదు పేరుతో ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలుచేయడం లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండున్నరేళ్ల వ్యవధిలో దీనిపై పదే, పదే ప్రకటనలు చేస్తూ వచ్చిన పాలకులు కనీసం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంలోనూ విఫలమయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,586 ఉన్నాయి. వాటిలో 3,33,990 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రై వేటు పాఠశాలలకు దీటుగా మెరుగైన ఫలితాలను సాధించే లక్ష్యంతో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో బయో మెట్రిక్ హాజరు నమోదు వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బయోమెట్రిక్ హాజరు నమోదును తొలుత ఉపాధ్యాయులకు వర్తింప జేసి తదుపరి దశల్లో విద్యార్థులకు ప్రవేశపెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇదంతా బాగానే ఉన్నా గత రెండేళ్లుగా బయో మెట్రిక్ హాజరు నమోదుకు సంబంధించి జిల్లాలోని ఏ ఒక్క పాఠశాలలోనూ కనీసం ప్రయోగాత్మకంగానైనా ప్రవేశపెట్టలేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇందుకు సంబంధించిన పరికరాలను సమకూర్చడంలోనూ విద్యాశాఖ దృష్టి సారించకపోవడం గమనార్హం. పాఠశాల విద్యారంగాన్ని ఆధునికీకరణ బాట పట్టించి పాఠశాలలకు సాంకేతిక సొబగులు అద్దుతామని పదే, పదే చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. డిజిటల్ తరగతులు, స్మార్ట్ క్లాసులు అంటూ పదేపదే వల్లిస్తున్న ప్రభుత్వ పెద్ధలు వాటి కంటే ముందు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు నమోదుపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రైౖ వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు.. జిల్లాలోని కొన్ని ప్రై వేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు ఇప్పటికే అమలవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు వేళకు పాఠశాలకు వస్తున్నదీ లేనిదీ పర్యవేక్షించేందుకు బయో మెట్రిక్ వ్యవస్ధ ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ దీనిని ప్రవేశపెట్టడం ద్వారా ఉపాధ్యాయుల్లో బాధ్యత, పాఠశాలకు సక్రమంగా వెళ్లాలనే స్పృహను విద్యార్థుల్లో రేకెత్తించవచ్చు. -
‘బయో’పెట్టినా మాయే..
* వైద్యశాలల్లో నామమాత్రంగా భయోమెట్రిక్ హాజరు * కచ్చితమైన సమయానికి వచ్చి వేలిముద్ర * తర్వాత ఉడాయింపు.. తిరిగి వచ్చి మళ్లీ ముద్ర వైద్యరంగంలో మెరుగైన సేవలందించడం కోసం ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వెరసి సకాలంలో వైద్యసేవలు అందక రోగులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం తప్పుదోవ పట్టిస్తూ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నరసరావుపేట టౌన్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహించే వైద్యాధికార సిబ్బంది విధి నిర్వహణ సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదన్న కారణంతో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వైద్యులు, సిబ్బంది ప్రతి రోజు విధులకు హాజరయ్యే సమయం, విధులు ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో బయోమెట్రిక్ మిషన్‌లో వేలి ముద్రల ద్వారా నమోదును పొందుపరచాల్సి ఉంటుంది. దీన్ని బట్టే వేతనాలు అందుతుంటాయి. కానీ స్థానిక వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ నమోదు వేసి బయటికి వెళ్లి తిరిగి సాయంత్రం విధులు ముగిసే సమయంలో వచ్చి బయోమెట్రిక్ నమోదు చేసుకుంటున్నారని తెలుస్తోంది. అధికారులు,సిబ్బంది విధినిర్వహణ సమయంలో బయట వెళ్లి ప్రైవేటుగా తమ కార్యకలాపాలను కొనసాగిçస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు రాత్రి సమయాల్లో వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు రోగుల నుంచి వస్తున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చ పేదలు ప్రభుత్వాసుపత్రిలో రాత్రి పూట సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. రాత్రు పూట ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడితే అనేక అక్రమాలు బయట పడతాయాని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. రాత్రి సమయంలో వైద్యం అందని ద్రాక్షే.. డివిజన్ కేంద్రమైన నరసరావుపేట పట్టణానికి సమీపంలో హైవే మార్గాలు ఉండటంతో రోడ్డు ప్రమాదాలతో పాటు రైల్వే ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దీంతోపాటు డివిజన్లో పలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉండటం మూలంగా నిత్యం అనేక అల్లర్లు చోటు చేసుకుంటుంటాయి. ఆయా సంఘటనలలో గాయపడి అర్థరాత్రిళ్లు చికి త్స కోసం ఏరియా వైద్యశాలను ఆశ్రయిస్తే అక్కడ వైద్యులు ఉండరు. ఉన్న సిబ్బంది నామమాత్రపు సేవలు అందించడంతో మెరుగైన వైద్యసేవలు అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లా సంతమాగులూరు వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వ్యక్తిని 108లో ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేక పోవడంతో బాధితుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బంది గుంటూరు వైద్యశాలకు క్షతగాత్రుణ్ణి తరలించారు. ఇటువంటి సంఘటనలు ఏరియా వైద్యశాలలో అనేకం జరుగుతున్నాయి. విచారించి చర్యలు తీసుకుంటాం.. విధి నిర్వహణ సమయంలో వైద్యశాలలో అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై సమగ్రంగా విచారించిన అనంతరం చర్యలకు సిఫారసు చేస్తాం. టి. మోహన్ శేషుప్రసాద్, సూపరిండెంట్ -
రేషన్ నుంచి వేలివేత!
ఉండి/మొగల్తూరు/నల్లజర్ల బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చి కార్డుల సంఖ్యను కుదించిన సర్కారు తాజాగా కొత్త ఎత్తుగడ వేసింది. పేద, మధ్య తరగతి ప్రజల పొట్టకొట్టేందుకు మరో పన్నా గం పన్నింది. రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉంటే అంతమంది తమ రెండు చేతుల 10 వేలి ముద్రలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నంబర్ నమోదు చేయించుకోవాలనే మెలిక పెట్టింది. దీనికి బెస్ట్ ఆఫ్ టెన్ ఫింగర్స్ డిటెక్షన్ (బీఎఫ్‌డీ) అనే పేరు పెట్టింది. దీంతో లబ్ధిదారుల పది వేళ్లలో ఏ వేలిముద్ర మంచిదో తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. రేషన్ డీలర్ల ద్వారా లబ్ధిదారులందరి వేలిముద్రలను బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయిస్తున్నారు. కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యులంతా డీలర్ వద్దకు వెళ్లి తమ 10 వేలి ముద్రలను ఇవ్వాలనే నిబంధన విధించడంతో వారు చౌక ధరల దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఏరివేత నంబర్–2 నిన్నమొన్నటి వరకూ సర్వేలు, జన్మభూమి కమిటీ సిఫార్సులు, వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోతే రద్దు చేయడం వంటి పద్ధతుల్లో కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగించింది. తాజాగా, రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యుల్ని ఏరివేత/కుదింపు కోసం లబ్ధిదారులందరి నుంచి పది వేలి ముద్రల సేకరణ (బీఎఫ్‌డీ)కు శ్రీకారం చుట్టింది. స్థానికంగా నివాసం ఉండని కుటుంబ సభ్యులను గుర్తించి వారికి రేషన్ బియ్యం నిలుపుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకోసం రేషన్ డీలర్లకు బయోమెట్రిక్ యంత్రాలను అందించి వేలిముద్రల్ని సేకరించే కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే 15 వేల మందికి రేషన్ నిలుపుదల జిల్లాలో 11.70 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. వాటిలో సుమారు 95 వేల కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోవడం లేదు. ఇదిలావుంటే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మందికి వేలిముద్రలు పడటం లేదనే కారణంగా రేషన్ సరుకుల సరఫరా నిలిపివేశారు. వారిలో వృద్ధులు, నిరుపేదలే అధికంగా ఉన్నారు. వారికి రేషన్ పునరుద్ధరించకపోగా.. ప్రస్తుతం ఉన్న కార్డుల్లోనూ లబ్ధిదారుల ఏరివేతకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుబాటులో లేనివారి సంగతేంటో! బీఎఫ్‌డీ పేరిట చేపట్టిన కార్యక్రమానికి అందుబాటులో ఉన్న లబ్ధిదారులు వెళ్లి తమ రెండు చేతుల 10 వేలి ముద్రలు ఇస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేనివారికి ఇది ఆశనిపాతంగా పరిణమించింది. జీవనోపాధి కోసం పొట్ట చేతపట్టుకుని పొరుగూళ్లకు వెళ్లిన వ్యక్తులు ప్రతి రెండు కుటుంబాల్లో ఒక్కరైనా ఉండటం సహజం. ఇప్పటికిప్పుడు వారంతా వచ్చి 10 వేలిముద్రల్ని ఇవ్వడం కష్టసాధ్యం. అలాంటి వారందరికీ రేషన్ సరుకులు ఎగ్గొట్టే అవకాశం ఉందని పౌర సరఫరాల వర్గాలు చెబుతున్నాయి. పనులు మానుకుని డీలర్ల చుట్టూ.. గతంలో వేలిముద్ర లేదా సంతకం చేస్తే రేషన్ సరుకులు అందించేవారు. గత ఏడాది డిసెంబర్ నుంచి బయోమెట్రిక్ విధానం ప్రవేశపెట్టి కార్డులో నమోదైన వారిలో ఎవరో ఒకరి వేలిముద్ర లేదా ఐరిస్ గుర్తింపు ఇస్తే సరుకులు అందిస్తున్నారు. ఉద్యోగ రీత్యా, వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు బయోమెట్రిక్‌లో విధిగా 10 వేలి ముద్రలు నమోదు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ముద్రల సేకరణ విషయమై రేషన్ డీలర్లకు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురువుతున్నారు. ఈపోస్ యంత్రాలు పనిచేయకపోవడంతో పనులు మానుకుని వచ్చిన వారు రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో కార్డుదారులు, డీలర్ల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేపటి వరకే గడువు! వేలిముద్రల సేకరణకు ఈనెల 15వ తేదీ వరకే గడువు విధించారు. 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో సెలవు రోజులు. మరో వారం రోజులు గడువు పొడిగించినా వేలిముద్రల నమోదు కార్యక్రమం 80 శాతమైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు నల్లజర్ల మండలంలో 25,850 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64వేల మంది లబ్ధిదారులుగా నమోదయ్యారు. రెండు నెలలుగా వేలి ముద్రల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 68 శాతం మాత్రమే పూర్తయ్యింది. ఆదేశాలు రాలేదు వేలిముద్రల నమోదు గడువు ఈనెల 15వ తేదీతో ముగుస్తోంది. అందరూ తప్పక వేలిముద్రలు వేయాలి. వేలిముద్రలు పడనివారి జాబితాను ప్రత్యేకంగా తయారు చేయాలని ఆదేశాలందాయి. వేలిముద్రలు వేయనివారు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి విషయంలో ఏం చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదు. – ఎం.మోహనరావు, సీఎస్‌డీటీ, ఉండి వేలిముద్రల నమోదు తప్పనిసరి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రేషన్ కార్డులో పేరు నమోదైన లబ్ధిదారులంతా తమ రెండు చేతుల 10 వేళ్లను రేషన్ డీలర్ వద్ద స్కాన్ చేయించాలి. అందుబాటులో ఉన్న ప్రతివారూ వేలిముద్రలు వేయాల్సిందే. వేలిముద్రలు ఇవ్వని వారికి మరో అవకాశం ఉంటుంది. సులువుగా రేషన్ తీసుకునేందుకే ఈ కార్యక్రమం. – డి.శివశంకరరెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి -
యూనివర్సిటీల్లో బయోమెట్రిక్ విధానం
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నత విద్యామండలి టెక్నికల్ కార్యదర్శి ఆదేశం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఈయేడాది నుంచే రాయలసీమ యూనివర్సిటీ, అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సునీతాధావారా ఆదేశించారు. సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో రాయలసీమ యూనివర్సిటీ వీసీ నరసింహులు, ఇతర అధికారులతో మాట్లాడారు. ఫీజురీయింబర్స్‌మెంట్ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసి ఎలాంటి అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
నేటి ఐసెట్‌కు సర్వం సిద్ధం
► మహబూబ్‌నగర్, వనపర్తిలో కేంద్రాల ఏర్పాటు ► హాజరుకానున్న 2,500మంది అభ్యర్థులు పాలమూరు యూనివర్సిటీ : ఐసెట్ ఎంట్రెన్స్‌కు పీయూ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో గురువారం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎంవీఎస్ , ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు వనపర్తిలో ఉమెన్స్ కళాశాలలో సెంటర్ వేశారు. జిల్లాలో మొత్తం 2,500మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షను రాయబోతున్నారు. పరీక్ష ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు కొనసాగుతుంది. బయోమెట్రిక్ విధానం ఉండటం వల్ల గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు నిమిషం అలస్యం అయిన పరీక్ష కేంద్రంలోపలికి అనుమతి లేదు. ప్రతి అభ్యర్థి ఐడి కోసం ఆధార్ కార్డు కానీ ఇతర పత్రాలు ఏదైన ఒకటి ఉండాలి. సెల్‌ఫోన్, గడియారం, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి వెంట తీసుకురావద్దు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన హాల్‌టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా సెంటర్స్‌లలో పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీయూ కంట్రోలర్ మధుసూధన్‌రెడ్డి చెప్పారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు అధికారులు ఉండి పరీక్షలను పర్యవేక్షించనున్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
-
బయోమెట్రిక్‌తో ఆందోళన
► దుర్గగుడి సిబ్బంది వేతనాల్లో కోత ► నెలంతా వచ్చినా 8 రోజులు గైర్హాజరైనట్లు నమోదు ఇంద్రకీలాద్రి : దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానంతో సిబ్బందికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఏప్రిల్‌లో 8 నుంచి పది రోజులకు పైగా విధులకు హాజరు కానట్లు బయోమెట్రిక్‌లో నమోదు కావడంతో మిషన్ల పనితీరుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ ఒకటి నుంచి దుర్గగుడి సిబ్బందికి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అయితే రోజూ విధులకు హాజరైనా కొంత మందికి 20 రోజులు మాత్రమే పని చేసినట్లు నమోదు కావడంతో ఆలయ అధికారులు, సిబ్బంది గొల్లుమంటున్నారు. ఏఈవో స్థాయి అధికారులతో పాటు సూపరింటెండెంట్లు, దిగవ స్థాయి సిబ్బంది సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా గుడిపై ఏ ఇద్దరు సిబ్బంది కలిసినా బయోమెట్రిక్‌పైనే చర్చ జరుగుతోంది. బయోమెట్రిక్ విధానంవల్ల నష్టపోయే సిబ్బంది పరిస్థితిని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయో మెట్రిక్ హాజరుతో పాటు ప్రత్యేకంగా ఒకరికి హాజరు నమోదుపై పర్యవేక్షణ అప్పగించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చిక్కులు ఎన్నో... బయో మెట్రిక్‌తో చిక్కులు అన్నీ, ఇన్నీ కావని ఆలయ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఈ యంత్రాలు ఏర్పాటు చేసి నెల కాక ముందే హాజరు కోసం తిప్పలు పడుతున్నామని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో మూడు చోట్ల బయో మెట్రిక్ యంత్రా లు ఏర్పాటు చేశారు. ఆలయంలో రెండు షిఫ్టులలో 306 మంది శాశ్వత సిబ్బంది, 60 మంది ఎన్‌ఎంఆర్‌లు, మరో 35 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్టున్నారు. బొటన వేలు, చూపుడువేలి ముద్రతో పాటు ఐరిస్ద్వారా హాజరు తీసుకునేలా బయోమెట్రిక్ పరికరాలలో సాప్ట్‌వేర్‌ను పొందుపరిచారు. ఉదయం 10కి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తారు. మరికొన్ని విభాగాల్లో ఉదయం, మధ్యాహ్నం వచ్చి రాత్రి 9 గంటల వరకు విధులు నిర్వహిస్తుంటారు. అయితే (అదనపు విధులు) ఓటీ చేస్తున్న వారిని ఏ విధంగా నమోదు చేస్తారనే దానిపై సృష్టత లే కపోవడంతో చిన్న స్థాయి సిబ్బంది తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతామంటున్నారు. -
జూనియర్ కళాశాలల్లో ఇక సీసీ కెమెరాలు
ఇంటర్ బోర్డు ఆర్జేడీమల్హల్రావు రామాయంపేట: వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు బయో మెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డురీజినల్ జూయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ) మల్హల్రావు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించని లెక్చరర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు విధిగా ప్రార్థనా సమయానికి కళాశాలకు రావాలని ఆదేశించారు. ఇంటర్ ఫలితాల మెరుగునకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. లెక్చరర్ల కొరతను అధిగమించడానికిగాను పార్ట్‌టైం ఉద్యోగులను నియమిస్తున్నట్టు ఆర్జేడీ తెలిపారు. -
పద్మావతి వర్సిటీలో బయోమెట్రిక్ విధానం
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ విధానాన్ని వీసీ రత్నకుమారి గురువారం ప్రారంభించారు. ర్యాగింగ్ కారణంగా నాగార్జున విశ్వవిద్యాలయంలో రుషితేశ్వరి ఆత్మహత్యతో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహిళా వర్సిటీ అధికారులు ఈ విధానాన్ని ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయడమేగాక విద్యార్థులకు ఎలక్ట్రానిక్ ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు వసతి గృహంలోకి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు వేలిముద్రల ద్వారా హాజరు నమోదు చేసుకోవాలన్నారు. సర్వర్ రిమోట్ ద్వారా దీన్ని అనుసంధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, వార్డెన్ పి.వాణి పాల్గొన్నారు. -
జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇంటర్‌బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు తెలిసింది. తొలిదశలో ఇంటర్ విద్యార్థులకు జూనియర్ కళాశాల్లో ఈ విధానాన్ని అమలు చేసి.. త ర్వాత అవసరం అనుకుంటే స్కూల్ టీచర్లు, జూనియర్ లెక్చరర్లకూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని బోర్డు సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.