
పాఠశాలలను బలోపేతం చేయాలి
నాగర్‌కర్నూల్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాగర్‌కర్నూల్, తెలకపల్లి ఎంఈఓలు జయశ్రీ, రాజశేఖర్‌రావు ఉపాధ్యాయులను కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రిసోర్స్ కేంద్రంలో జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసి అన్ని వసతులను వినియోగించుకుని పాఠశాలలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. సీపీఎస్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి.గోవర్దన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి, కృష్ణయ్య, కురుమూర్తి, వెంకటస్వామి, లక్ష్మణ్‌నాయక్, సీతారాం, రాజు, చంద్రయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.