బాలిక వివరాలు నమోదు చేసి పాఠశాలకు వెళ్లే వరకు పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్‌ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపాళ్లు వారి వివరాలు నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్‌కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. బాలికల పేరిట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా వారి ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణనలోకి తీసుకుని పంపిణీ మొదలుపెడతారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆధార్ నంబర్లు చాలా మందికి లేవు.
అదేవిధంగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన విధించారు. ఇలా ప్రభుత్వ నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. జిల్లాలో బంగారు తల్లి పథకం క్షేత్రస్థాయి అమలు తీరును ‘న్యూస్‌లైన్’ బృందం బుధవారం పరిశీలించింది.
ఇప్పటి వరకు పథకంలో 7,867 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 5,493 మందికి మొదటి విడత నగదు అందించారు. 5 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు బంగారు తల్లి బాండ్లు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1597 మంది తల్లులకు ఆధార్ లేదు. దీంతో వారికి మొదటి విడత నగదు మంజూరు కాలేదు.
బంగారు తల్లి పథకంలో గత సంవత్సరం మే 1 అనంతరం జన్మించిన ఆడపిల్లలకు రూ. 2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు రూ.1000 చెల్లిస్తారు.
బాలికలకు రెండో సంవత్సరం వచ్చే సరికి మరో రూ. 1000లను చెల్లిస్తారు. మూడో సంవత్సరం అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమ చేస్తారు. ఇలా 4,5 సంవత్సరాలకు ఒక్కో ఏటా రూ. 1500లు చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ. 2,500 జమచేస్తారు. 9,10 తరగతుల చదివే సమయంలో ఏడాదికి రూ. 3 వేలు చొప్పున చెల్లిస్తారు. బాలిక పదహారో ఏట ఇంటర్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ. 3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ. 4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తై తర్వాత మహిళ పేరిట రూ. 1 లక్ష జమ చేస్తారు.
‘బంగారు తల్లీ’ ?
Published Thu, Feb 6 2014 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
Advertisement
Advertisement