కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.
అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్‌మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
వీరంతా ఆధార్ స్థానంలో పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్‌మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment