electronic payment
-
కరెన్సీ నోట్లకు కాలం చెల్లు!
ప్రపంచంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పుల వల్ల రానున్న పదేళ్లలో కరెన్సీ నోట్లకు పూర్తిగా కాలం చెల్లిపోతుందని, వాటి స్థానంలో స్మార్ట్ఫోన్, ట్యాబ్, క్రెడిట్ కార్డు లావాదేవీలు కొనసాగుతాయని ఓ అధ్యయనంలో వెల్లడైనట్లు 'ఇంటెర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ బిజినెస్' తెలిపింది. ఎలక్ట్రానిక్ లావాదేవీల నిర్వహణలో ప్రపంచంలోనే ముందున్న ఆస్ట్రేలియా ప్రతినెలా ఏటీఎంల నుంచి దాదాపు 66 లక్షల కోట్ల రూపాయల కరెన్సీని తగ్గిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో 82 శాతం లావాదీవీలు కరెన్సీనోట్లు లేకుండానే కొనసాగుతున్నాయి. డెన్మార్క్ కూడా ఆస్ట్రేలియా బాటలో ముందడుగు వేస్తోంది. ఇక తాము కరెన్సీ నోట్లను ఏ మాత్రం ముద్రించాల్సిన అవసరం లేదని, కరెన్సీ రహిత సమాజాన్ని త్వరలోనే సృష్టించబోతున్నామని డెన్మార్క్ ఇటీవలే ప్రకటించింది. తమ దేశంలో వృద్ధులు తప్ప మిగతా వారంతా ఎలక్ట్రానిక్ లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారని ఆస్ట్రేలియా మింట్ పేమెంట్స్ ఇంచార్జి జార్న్ బెహరెంట్ తెలిపారు. ఈ వృద్ధ తరానికి ఇంకా కరేన్సీ నోట్లపై మమకారం చావడం లేదని, ఈ తరం అంతరించాక తమ దేశంలో కరెన్సీ నోట్లను కావాలనేవారే ఉండరని ఆయన చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడంలో గతంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇప్పుడు పటిష్ఠమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన చెప్పారు. పైగా ఆపిల్ వాచ్ లాంటి పరికరాల ద్వారా కూడా సులభంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు అందుబాటులోకి వచ్చిందని ఆయన చెప్పారు. తమ దేశంలోని 2.30 కోట్ల మందికి ఐదుకోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులున్నాయని ఆయన తెలిపారు. నెలవారీ ఖర్చులకు బడ్జెట్ను రూపొందించుకోవడానికి యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో అమెరికా ప్రజలు కూడా ఎక్కువగా కరెన్సీ రహిత చెల్లింపులనే ఆశ్రయిస్తున్నారని అధ్యయనం తెలియజేసింది. అగ్రదేశాల బాటలోనే వర్ధమాన దేశాలు కూడా ఎలక్ట్రానిక్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కరెన్సీ ముద్రణకు ఖర్చు పెరగడ,ం నకిలీ కరెన్సీ బెడత తీవ్రమవడంతో పలు దేశాలు కరెన్సీ రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ విధాన నిర్ణయాలకు కసరత్తు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పది, పన్నెండేళ్ల తర్వాత ప్రజలు కరెన్సీ నోట్లను మ్యూజియంలలోనే చూడాల్సి ఉంటుందేమో! -
ఆన్లైన్ ద్వారా ఇక చెల్లింపులు
మూడు జిల్లాల ట్రెజరీ అధికారులకు శిక్షణ పూర్తి అవగాహనతో పనిచేయాలని ట్రెజరీస్ డెరైక్టర్ కనకవల్లి సూచన విశాఖపట్నం : రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే అన్నిరకాల చెల్లింపులలో జాప్యాన్ని నివారిం చేందుకు త్వరలో ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు రాష్ట్ర ట్రెజరీస్ డెరైక్టర్ కె.కనకవల్లి తెలిపారు. ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం, విజయనరం, విశాఖపట్నం జిల్లాలకు చెంది న ట్రెజరీ అధికారులు, సిబ్బందికి ఆదివారం బుల్లయ్య కళాశాలలో ఏర్పాటైన శిక్షణ శిబి రంలో మాట్లాడారు. రాష్ట్రం లో 5 లక్షల మం ది వరకు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 3.5 లక్షల మంది పెన్షనర్లకు ఇకపై ప్రతినెలా చెల్లింపులు ఆన్లైన్ ద్వారానే జరుగుతాయన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, థర్డ్ పార్టీ చెల్లింపులు కూడా ఆన్లైన్ ద్వారా నేరుగా వారివారి బ్యాంకు అకౌంట్లకు జమ అవుతాయన్నారు. ఆన్లై న్ విధానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ట్రెజ రీస్ అదనపు సంచాలకు డు హనుమంతరావు, సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎ.శివప్రసాద్, అసిస్టెంట్ డెరైక్టర్లు ఎస్.వి.ఎన్.కల్యాణి, జి.అచ్చుతరామయ్య, విశాఖ జిల్లా ఖజానా ఉప సంచాలకులు ఎం.గీతాదేవి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఎ.శ్రీనివాస్, కె.కేదార్, ఎస్బీఐ సీనియర్ మేనేజర్ వెంకట రావు, మూడు జిల్లాల డీడీలతో పాటు అధికారులు పాల్గొన్నారు. -
వేతన వెతలు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్కారు ఉద్యోగులకు ‘వేతన’ వెతలు తలెత్తాయి. ప్రభుత్వం తలపెట్టిన ఈ - చెల్లింపుల(ఎలక్ట్రానిక్ పేమెంట్) ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీనుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఖజానా విభాగం నుంచి చేయాల్సిన ప్రతి చెల్లింపులు ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. వేతనాలు, పెన్షన్లతో పాటు ఇతర పనులకు సంబంధించి చెల్లింపులన్నీ ఇకపై వ్యక్తిగత ఖాతాలోనే జమచేయనున్నారన్నమాట. పారదర్శకతలో భాగంగా చేపట్టిన ఈ ప్రక్రియ ఉద్యోగులకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఐదో తేదీ వస్తున్నా ఇప్పటివరకు జిల్లాలో పనిచేస్తున్న మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. తప్పుల తడకగా వివరాల నమోదు జిల్లా ఖజానా శాఖ పరిధిలో 350మంది డీడీఓ (డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్)లు ఉన్నారు. వీరి పరిధిలో దాదాపు 6 వేల ఉద్యోగులున్నట్లు ఖజానాశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా ఉప ఖజానా శాఖ అధికారుల పరిధిలో టీచర్లు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి వేతనాలు అందజేస్తున్నారు. తాజాగా మార్చి నుంచి జిల్లాలో ఈ - పేమెంట్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా ఆయా డీడీఓలు ఉద్యోగుల బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ కోడ్ తదితర వివరాలను లాగిన్ ఐడీ నుంచి నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో చాలాచోట్ల ఉద్యోగుల వివరాల నమోదు తప్పుల తడకలా సాగింది. దీంతో ఖజానాధికారి వివరాలకు, ఉద్యోగి వివరాలకు పొంతన కుదరకపోవడంతో చెల్లింపుల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఉద్యోగుల బ్యాంకుకు సంబంధించి ఐఎఫ్ఎస్సీ కోడ్ నమోదులో భారీగా తప్పులు దొర్లాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెలలో పెన్షన్ల చెల్లింపుల్లో సైతం జాప్యం జరిగింది. ప్రభుత్వం పెన్షనర్ల చెల్లింపులను ఈ నెల నుంచి ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్రధాన కార్యాలయాల నుంచి విడుదల చేసేలా చర్యలు చేపట్టింది. అయితే ఆన్లైన్ విధానంలో తలెత్తిన సమస్య కారణంగా వీరి చెల్లింపుల్లో అంతరాయం కలిగింది. సమస్యను పరిష్కరించిన వెంటనే చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐటీ తంటా.. తాజాగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఫిబ్రవరి నెలాఖరుతో ఆదాయపన్ను వివరాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే మార్చి నెలనుంచి వేతనాలు విడుదల చేస్తారు. అయితే జిల్లా ఖజానా శాఖ పరిధిలో ఉన్న 350 డీడీఓల్లో కేవలం వంద మంది మాత్రమే వేతనబిల్లులు సమర్పించినట్లు ఖజానా శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో వీటిని పరిశీలించిన ఖజానా శాఖ సరైన వివరాలు సమర్పించిన వారికి వేతనాలు విడుదల చేశామని, కచ్చితమైన వివరాలతో బిల్లులు సమర్పించిన వారికి వెనువెంటనే క్లియర్ చేస్తామని డీటీఓ నాగరాజు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
‘బంగారు తల్లీ’ ?
బాలిక వివరాలు నమోదు చేసి పాఠశాలకు వెళ్లే వరకు పర్యవేక్షించాలి. పాఠశాలల్లో హెచ్ఎంలు, కళాశాలల్లో చేరిన తర్వాత ప్రిన్సిపాళ్లు వారి వివరాలు నమోదు చేయాలి. బంగారు తల్లి పథకాన్ని ఆధార్కు అనుసంధానం చేశారు. ఆధార్ ద్వారానే కుటుంబాలను గుర్తిస్తారు. బాలికల పేరిట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానంలో నేరుగా వారి ఖాతాలకే నగదు చెల్లిస్తారు. వీటికి బయోమెట్రిక్ విధానం కూడా పరిగణనలోకి తీసుకుని పంపిణీ మొదలుపెడతారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆధార్ నంబర్లు చాలా మందికి లేవు. అదేవిధంగా కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలకే ఈ పథకం వర్తిస్తుందనే నిబంధన విధించారు. ఇలా ప్రభుత్వ నిబంధనలు, సిబ్బంది నిర్లక్ష్యం ఈ పథకం అమలుకు శాపంగా మారాయి. జిల్లాలో బంగారు తల్లి పథకం క్షేత్రస్థాయి అమలు తీరును ‘న్యూస్లైన్’ బృందం బుధవారం పరిశీలించింది. ఇప్పటి వరకు పథకంలో 7,867 మంది తల్లులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 5,493 మందికి మొదటి విడత నగదు అందించారు. 5 వేల మందికి మాత్రమే ఇప్పటి వరకు బంగారు తల్లి బాండ్లు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 1597 మంది తల్లులకు ఆధార్ లేదు. దీంతో వారికి మొదటి విడత నగదు మంజూరు కాలేదు. బంగారు తల్లి పథకంలో గత సంవత్సరం మే 1 అనంతరం జన్మించిన ఆడపిల్లలకు రూ. 2,500లను ఖాతాలో జమ చేస్తారు. బాలిక మొదటి పుట్టిన రోజు రూ.1000 చెల్లిస్తారు. బాలికలకు రెండో సంవత్సరం వచ్చే సరికి మరో రూ. 1000లను చెల్లిస్తారు. మూడో సంవత్సరం అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తే రూ.1500 జమ చేస్తారు. ఇలా 4,5 సంవత్సరాలకు ఒక్కో ఏటా రూ. 1500లు చొప్పున చెల్లిస్తారు. బాలిక మొదటి తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ఏడాదికి రూ.2 వేల చొప్పున చెల్లిస్తారు. బాలిక 6,7,8, తరగతులు చదివే వరకూ ఏడాదికి రూ. 2,500 జమచేస్తారు. 9,10 తరగతుల చదివే సమయంలో ఏడాదికి రూ. 3 వేలు చొప్పున చెల్లిస్తారు. బాలిక పదహారో ఏట ఇంటర్ రెండు సంవత్సరాలకు ఏడాదికి రూ. 3500ల చొప్పున జమ చేస్తారు. డిగ్రీలో చేరిన అనంతరం వరుసగా మూడు సంవత్సరాలు రూ. 4 వేలు జమ చేస్తారు. డిగ్రీ పూర్తై తర్వాత మహిళ పేరిట రూ. 1 లక్ష జమ చేస్తారు.