కేసముద్రం, న్యూస్‌లైన్ : ఉపాధి కూలీలు, పింఛన్‌దారుల పాలిట బయోమెట్రిక్ విధానం శాపంగా మారింది. వేలిముద్రలు సరిగా పడకపోవడంతో అధికారుల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ‘నీ వేలిముద్రలు సరిగాలేవు... మళ్లీ బయోమెట్రిక్ కేంద్రంలో ఫొటోదిగి, వేలిముద్రలను నమోదుచేసుకుని రండి... ఆ తర్వాత యంత్రం ఓకే చేస్తే డబ్బులు ఇస్తాం. లేకపోతే మేం ఏంచేయలేం.’ అని సమాధానం చెప్పడం పోస్టుమాస్టర్లకు పరిపాటిగా మా రింది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫొటోలు ఎక్కడ దిగాలో... వేలిముద్రలు ఎట్లా సరిచేసుకోవాలో తెలియక డ బ్బుల కోసం ఉపాధి కూలీలు, పింఛన్ కోసం వృద్ధులు నానాపాట్లు పడుతున్నారు. ఒకవేళ తెలిసినా... వేలిముద్రలు, ఫొటోలు తీసుకునే ఫీల్డ్‌ఆఫీసర్ ఆచూకీ దొరక్క వారు మండల కా ర్యాలయం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయూల్సి వస్తోంది. మండల పరిధిలోని గ్రా మాల్లో పర్యటించడమే ఫీల్డ్ ఆఫీసర్ విధి. ఈ క్రమంలో సదరు అధికారి ఏ గ్రామంలో ఉంటే లబ్ధిదారులు అక్కడికి తిరగాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. ఈ సమస్య ప్రతీ నెల తలెత్తుతుండడంతో పింఛన్లపైనే ఆధారపడుతున్న వారు రోడ్డునపడాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో 50 వేల మంది...
కేసముద్రం మండలంలో 8,168 మంది పింఛన్‌దారులు, 18 వేల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందులో బయోమెట్రిక్ యంత్రం వేలిముద్రలు తీసుకోకపోవడంతో తిరస్కరణ కు గురైన వారు 800 మంది నుంచి 1,000 మంది వరకు ఉన్నట్లు అధికారులే చెబుతున్నా రు. ఇందులో ఎక్కువ మంది రెండు, మూడు దఫాలుగా ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి ఫొటోలు, వేలిముద్రలు నమోదుచేసుకున్న వారే. అరుు నా... వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా 51 మండలాల్లో సుమారు 50 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా.
అందరికీ తిప్పలే...
జిల్లావ్యాప్తంగా పింఛన్‌దారులు 3,97,459 మంది ఉండగా... వారి అకౌంట్లలో ప్రతి నెలకు రూ.12,03,27,400 జమ అవుతున్నారుు. అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు 5,61, 843 మంది ఉన్నారు. ఉపాధి కూలీలకు ఇదివరకు అకౌంట్‌బుక్ ద్వారా... వృద్ధ, వితంతు తది తర పింఛన్‌దారులకు స్మార్ట్‌కార్డు ద్వారా పం చాయతీ కార్యదర్శుల సమక్షంలో డబ్బులు అందేవి. ఈ విధానంలో అవకతవకలు వెలుగుచూడడంతో... మళ్లీ అలాంటి పొరపాటు జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం 2013 సెప్టెం బర్‌లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ... బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా వేలిముద్రలు తీసుకోకపోవడం అటు లబ్ధిదారులు.. ఇటు పోస్టుమాస్టర్లు, ఫీల్డ్ ఆఫీసర్లను అయోమయూనికి గురిచేస్తోంది.
ప్రతి గ్రామం తిరుగుతున్నాం...
బయోమెట్రిక్ విధానంలో మొదటగా ఆధార్ కార్డులున్న పింఛన్‌దారులు, కూలీలకు సంబంధించి ఫొటోలు, వేలిముద్రలను పీఓటీ యంత్రంలో ఎన్‌రోల్‌మెంట్ చేశాం. ఆధార్ కార్డులు లేనివారికి వేలిముద్రల ఆధారంగా పోస్టుమాస్టర్లు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ విధానం తొలగించడంతో మేమే వేలిముద్రలు, ఫొటోలను తీసుకుంటూ వారికి సంబంధించిన డాటాను పీఓటీ మిషన్‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నాం. ఒక్కోసారి వేళ ్లకు తేమ ఉండడం.. వేలి చర్మం పొట్టు లేవడం వంటి కారణాలతో ఆ యంత్రం ఫెయిల్డ్ ఆప్షన్ చూపుతోంది. దీనివల్ల వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మేమే ప్రతి గ్రామం తిరుగుతూ.... ఎవరికి డబ్బులు రావడం లేదో వారి వేలిముద్రలు, ఫొటోలను సేకరిస్తున్నాం.
- దిలీప్, టీసీఎస్ మండల ఫీల్డ్ ఆఫీసర్
రెండుసార్ల గిట్లనే తిరిగిన..
పోస్టాఫీసులో పింఛన్‌కని పోతే నా చేతియేళ్లు మంచిగపడట్లేదని పోస్టయిన చెప్పిండు. గిదేందనడిగితే వేలిముద్రలు మంచిగపడట్లే.. మళ్లపోయి ఫొటోదిగి, వేలి ముద్రలు ఏపించుకునిరా... అప్పడే డబ్బులిత్తనన్నడు. ఇప్పటికి ఇట్టా జరగబట్టి రెండోసారి. ఇప్పుడు కూడా పింఛన్‌రాలే. వచ్చే నెలదాక ఆగాలంటాండ్రు. - ఎస్కే.జానీమియా, కేసముద్రం విలేజ్
తలనొప్పిగా మారింది...
పింఛన్ కోసం వచ్చినోళ్లను మీరు ఫొటోలు దిగిరండని చె ప్తే... ఇన్ని రోజులు ఎట్టా ఇచ్చినవ్.. ఇప్పుడు ఎందుకు ఇవ్వవ్ అని గొడవ చేస్తాండ్రు, ఆధార్‌కార్డులు ఉన్నవారికే ఇప్పుడు ఇస్తానం. లేనివాళ్లను ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు పంపిస్తానం. అరుునా.. కొంతమంది వేలిముద్రలు ఫెయిల్డ్ అని వస్తానయ్. ఇది మాకు తలనొప్పిగా మారింది.
- మొయినొద్దీన్, బ్రాంచ్ పోస్టుమాస్టర్, కేసముద్రం విలేజి
బయోమెట్రిక్ బాధలు
Published Tue, Feb 25 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
Advertisement
Advertisement