ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప‍్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్‌డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది.
సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది.
రోజుకు 70 మిలియన్ల మంది
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్‌డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది.
చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే!
Comments
Please login to add a commentAdd a comment