ఇంటర్ బోర్డు ఆర్జేడీమల్హల్‌రావు
రామాయంపేట: వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాలతోపాటు బయో మెట్రిక్ సిస్టం ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్మీడియెట్ బోర్డురీజినల్ జూయింట్ డెరైక్టర్ (ఆర్జేడీ) మల్హల్‌రావు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రానున్న రోజుల్లో ప్రభుత్వ కళాశాలలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. సక్రమంగా విధులు నిర్వర్తించని లెక్చరర్లు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు విధిగా ప్రార్థనా సమయానికి కళాశాలకు రావాలని ఆదేశించారు.
ఇంటర్ ఫలితాల మెరుగునకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. లెక్చరర్ల కొరతను అధిగమించడానికిగాను పార్ట్‌టైం ఉద్యోగులను నియమిస్తున్నట్టు ఆర్జేడీ తెలిపారు.
జూనియర్ కళాశాలల్లో ఇక సీసీ కెమెరాలు
Published Wed, Jan 20 2016 12:50 AM | Last Updated on Tue, Aug 14 2018 3:37 PM
Advertisement
Advertisement