ఆసిఫాబాద్, న్యూస్‌లైన్ : పింఛన్ డబ్బులు పొందడానికి వృద్ధులు, వికలాంగులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. గతంలో గ్రామ పంచాయతీల్లో పింఛన్ పంపిణీ చేయగా.. ఈ నెల నుంచి పోస్టాఫీసు ద్వారా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో పింఛన్‌దారుల వేలిముద్రలు, ఆధార్ నంబరు, ఇతర వివరాలు బయోమెట్రిక్ యంత్రంలో నమోదు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మండలంలో 4,600 మంది పింఛన్‌దారులు ఉండగా.. వీరిలో 300మంది వికలాంగులు ఉన్నారు. అందరికీ కలిపి నెలనెలా రూ.10 లక్షలు పింఛన్‌గా అందజేస్తున్నారు.
ఆసిఫాబాద్‌లో 1,700 మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. ఆసిఫాబాద్ పోస్టాఫీసులో ఈ నెల మూడున ప్రారంభమైన బయోమెట్రిక్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేస్తున్నారు. ఇలా చేస్తే నెల రోజులైనా పని పూర్తయ్యేలా లేదు. దీంతో నాలుగు రోజులుగా వృద్ధులు, మానసిక వికలాంగులు అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో నిరీక్షిస్తున్నారు. మానసిక వికలాంగుల వేలిముద్రలు బయోమెట్రిక్ యంత్రంలో నమో దు కాకపోవడంతో వారికి డబ్బులు ఇవ్వడం లేదు. కేవలం పింఛన్‌పైనే ఆధారపడే తమకు కొత్త కొత్త పద్ధతులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలి పారు. రూ.200 పింఛన్ కోసం నాలుగు రోజలుగా తిరుగుతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయ మై ఎంపీడీవో కృష్ణమూర్తిని సంప్రదించ గా బయోమెట్రిక్ విధానంలో పింఛన్‌దారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యమవుతోందని, వచ్చే నెల సకాలంలో పింఛన్ పంపిణీ అవుతుందని పేర్కొన్నారు.
నాలుగు రోజులుగా తిరుగుతున్న
నా కుమారుడు సంతోష్ మా నసిక వికలాంగుడు. పింఛన్ కోసం నాలుగు రోజులుగా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతు న్న. వేలిముద్రలు నమోదవుతలేవని పింఛన్ ఇవ్వడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి అలసిపోతున్నం.
- దండనాయకులు కిషన్‌రావు, ఆసిఫాబాద్
పేరు వస్తలేదు
బయోమెట్రిక్ యంత్రంలో నా పేరు వస్తలేదు. మూడు రోజలుగా పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్న. రూ.500 పిం ఛన్ కోసం మూడు రోజలు గా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. - దుర్గం పెంటు,
వికలాంగుడు,
గ్రామం : జన్కాపూర్, మం : ఆసిఫాబాద్
ఫింగర్ ప్రింట్ వస్తలేదు
నా కుమారుడు లతీఫ్ మానసిక వికలాంగుడు. మూడు రోజలుగా పింఛన్ కోసం పోస్టాఫీస్ చుట్టూ తిరుగుతున్నం. బయోమెట్రిక్ యంత్రంలో ఫింగర్ ప్రింట్ వస్తలేదు. అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.
- లతీఫ్, సుల్తానా
పింఛన్‌కు బయోమెట్రిక్ కష్టాలు
Published Sat, Dec 7 2013 4:16 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement