సాక్షి నెట్‌వర్క్: తమకు పింఛన్ వస్తుందో.. రాదోననే బెంగతో ఇద్దరు గుండెపోటుతో మృత్యువాత పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం ఇందన్‌పల్లికి చెందిన ఆలుగొట్టు నర్సయ్య(50), నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన చింత రామచంద్రయ్య(66) గుండెపోటుతో మృతి చెందారు.