► మహబూబ్‌నగర్, వనపర్తిలో కేంద్రాల ఏర్పాటు
► హాజరుకానున్న 2,500మంది అభ్యర్థులు
పాలమూరు యూనివర్సిటీ : ఐసెట్ ఎంట్రెన్స్‌కు పీయూ అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో నాలుగు కేంద్రాల్లో గురువారం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఎంవీఎస్ , ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాల, బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దానితో పాటు వనపర్తిలో ఉమెన్స్ కళాశాలలో సెంటర్ వేశారు. జిల్లాలో మొత్తం 2,500మంది అభ్యర్థులు ఐసెట్ పరీక్షను రాయబోతున్నారు. పరీక్ష ఉదయం 10గంటల నుంచి 12.30గంటల వరకు కొనసాగుతుంది. బయోమెట్రిక్ విధానం ఉండటం వల్ల గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు నిమిషం అలస్యం అయిన పరీక్ష కేంద్రంలోపలికి అనుమతి లేదు. ప్రతి అభ్యర్థి ఐడి కోసం ఆధార్ కార్డు కానీ ఇతర పత్రాలు ఏదైన ఒకటి ఉండాలి. సెల్‌ఫోన్, గడియారం, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి వెంట తీసుకురావద్దు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన హాల్‌టికెట్ ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయా సెంటర్స్‌లలో పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పీయూ కంట్రోలర్ మధుసూధన్‌రెడ్డి చెప్పారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు అధికారులు ఉండి పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
నేటి ఐసెట్‌కు సర్వం సిద్ధం
Published Thu, May 19 2016 2:57 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement