‘ఈ-పాస్’తో బినామీలకు చెక్..!
Published Fri, Dec 27 2013 3:16 AM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ఇకపై పారదర్శకం గా జరగనున్నాయి.బినామీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-పాస్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిం ది. ఈ మేరకు పట్టణంలోని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.అచ్యుతానంద గుప్త గురువారం లాంఛనంగా ఈ విధానాన్ని ప్రారంభించా రు. దీని ద్వారా అనర్హులు, కళాశాలలకు రాని వారిని గు ర్తించడం సులువవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలం లో అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇంటర్మీడియెట్, పైస్థాయి విద్యలు అం దిస్తున్న విద్యా సంస్థలు ఈ మిషన్లను కచ్చితంగా కొనాలని సూచించారు. త్వరితగతిన విద్యార్థుల వివరాలను నమోదు చేసి, ఈ బార్‌కోడ్ స్లిప్‌లను జతచేసి.. సాంఘి క సంక్షేమ శాఖ కార్యాలయానికి హార్డ్ కాపీలను అందజేయాలని కోరారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. లక్ష్మీపతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల డేటా, ఈ-పాస్ బయోమెట్రిక్‌తో అనుసంధానం చేసి, బార్‌కోడ్ స్లిప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు, కరస్పాం డెంట్ ఎస్‌పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
పనితీరు ఇలా..
జిల్లాలో మొత్తం 310 కళాశాలలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ.100 కోట్ల వరకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఈ విధానంలో విద్యార్థులు తాము చదువుకుంటున్న కళాశాలలో ఆన్‌లైన్ ద్వారా స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వారిని అర్హులుగా భావించి ఆన్‌లైన్‌లోనే ఫార్వర్డ్ చేస్తారు. దానికి ఓ నంబర్‌ను కేటాయిస్తారు.
ఈ నంబర్‌ను ఈ-పాస్ బయోమెట్రిక్ మెషీన్‌లో ఎంటర్ చేసిన వెంటనే విద్యార్థుల వివరాలు వస్తాయి.
మెషీన్‌పై విద్యార్థి ఫింగర్‌ను స్కాన్ చెయ్యాలి.
ఆ మెషిన్‌పై డిజిటల్‌పాడ్‌స్క్రీన్‌పైన సంబందిత ప్రిన్సిపాల్, విద్యార్ది సంతకం చేయాలి.
వెంటనే ఆధార్‌తో లింక్‌అయి..బార్‌కోడ్ షీట్‌తో విద్యార్థుల వివరాలు వస్తాయి..అన్నీ సక్రమంగా ఉంటే..సక్సెస్ రిపోర్ట్ వస్తుంది.
ఒక వేళ తప్పుడు సమాచారం ఇస్తే..ఫెయిల్యూర్ రిపోర్ట్ వస్తుంది.
Advertisement
Advertisement