epass
-
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
తెలంగాణ ఈ-పాస్ పోర్టల్‌కు సాంకేతిక ఇబ్బందులు
-
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఈ-పాస్ తిప్పలు
-
Lockdown: నో పాస్.. నో ఎంట్రీ
కోదాడ రూరల్/అలంపూర్: రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సడలింపు సమయంలోనైనా తెలంగాణలోకి ప్రవేశించాలంటే ఈ–పాస్ తప్పనిసరి. దీంతో పాస్ లేని వాహనాలన్నింటినీ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాస్‌లు లేకుండా వచ్చిన వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోకి అనుమతించలేదు. కోదాడ డీఎస్పీతో పాటు ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, ఇద్దరు ఎంవీఐలతో పాటు 60 మంది పోలీసు సిబ్బంది చెక్‌పోస్టులో విధులు నిర్వహిం చారు. రాష్ట్రంలో ఉదయం 6–10 గంటల వరకు లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో రాష్ట్రంలోకి ప్రవేశిం చేందుకు ఏపీ నుంచి వందల సంఖ్యలో వాహనాలు తెల్లవారుజామున 4 గంటలకే రామాపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న వాడపల్లి, మట్టపల్లి, పులిచింతల, సాగర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో శనివారం రాత్రి నుంచి వాహన రాకపోకలను నిషేధించారు. కోదాడ వైపు ఉన్న రామాపురం చెక్‌పోస్టు నుంచి మాత్రమే అనుమతి ఉండటంతో అక్కడకు వాహనాలు భారీగా చేరుకున్నాయి. పోలీసులు ముందుగా ఈ–పాస్‌లు ఉన్న వాహనాలను అనుమతించారు. అనుమతి లేని వాటిని వెనక్కి పంపే క్రమంలో ఏపీ వైపు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి మధ్యాహ్నం 12 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. లాక్డౌన్ మినహాయింపు సమయం ఉంది కదా తమను ఎందుకు అనుమతించరు.. అంటూ కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. పాస్‌లు లేని వాహనాలను అనుమతించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. దీంతో వాహనదారులు చేసేదేమీ లేక వెనుదిరిగిపోయారు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం ఎలాంటి తనిఖీలు చేయకుండానే అనుమతించారు. అప్పటికప్పుడు ఆయా జిల్లాల నుంచి ఈ–పాస్ అనుమతి తీసుకున్న వారిని కూడా అనుమతించారు. ఇదిలా ఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కూడా అనుమతి లేని వాహనాలను పోలీసులు ఆపడంతో ఆదివారం ఉదయం ట్రాఫిక్‌జామ్ అయింది. ఈ–పాస్ ఉన్న వాహనాలను అనుమతించి, మిగతా వాటిని దారి మళ్లించారు. -
ఈపాస్ ఉన్నవారికి మాత్రమే ఏపీలోకి ఎంట్రీ
సాక్షి, అమరావతి : ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. ఈపాస్ ఉన్నవారిని మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నారు. అంబులెన్స్‌లు, వైద్య చికిత్సలకు అనుమతినిస్తున్నారు. అత్యవసర ఎంట్రీకి పోలీస్ సిటిజన్ సర్వీసెస్ యాప్‌కి అప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఈపాస్‌ల కోసం ఏకంగా ట్రంప్, అమితాబ్‌లను వాడేశారు..
షిమ్లా : కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్డౌన్ వైపు మొగ్గుచూపాయి. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలతో అష్టదిగ్బంధనం చేశాయి. తమ రాష్ట్రంలోకి ప్రవేశించటానికి ఈపాస్‌లు తప్పనిసరి చేశాయి కొన్ని రాష్ట్రాలు. ఈపాస్‌లు ఉన్న వారినే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఈపాస్లతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. ప్రముఖ వ్యక్తుల పేర్లతో ఈపాస్లకోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ల పేర్లపై ఈపాస్‌లను రిజిస్టర్ చేశారు దుండగులు. రెండు ఈపాస్‌లు హెచ్‌పీ-2563825, హెచ్‌పీ2563287.. ఒకే ఆధార్, ఫోన్ నెంబర్‌పై రిజిస్టర్ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి : కేటుగాళ్ల మాయ.. 19 లక్షలు స్వాహా -
రజనీకాంత్ క్షమాపణ.. నిజమేనా?
సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లకుండా, ఇతర జిల్లాల ప్రజలు చెన్నై సిటీలో అడుగు పెట్టకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాసులు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. (చదవండి : తదుపరి చిత్రానికి రజనీ రెడీ) ఈ నేపథ్యంలో ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ లగ్జరీ కారు నడుపుతూ, చెన్నై సమీపంలోని . కీళంబాక్కంలోని లోని తన ఫామ్ హౌస్ రెండో కూతురు, అల్లుడితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలం గడుపుతున్నారని కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఫామ్ హౌస్ లో రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కీళంబక్కం వరకు కారులో వెళ్లిన రజనీకాంత్‌కు ఈ పాస్ ఉందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. (చదవండి : చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన) అయితే రజనీకాంత్ నిబంధనల ప్రకారం ఈ పాస్ తీసుకోనే కారులో ప్రయాణం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా మళ్లీ ఇప్పుడు రజనీ చేసినట్లు చెబుతున్న మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాస్ లేకుండా ప్రయాణం చేసినందకు రజనీకాంత్ క్షమాపణలు చెప్పారని ఆ ట్వీట్ సారాంశం. ‘ఈ పాస్ లేకుండా ప్రయాణించాను. మీ బిడ్డగా పరిగణించి నన్ను క్షమించండి’అని రజనీ ట్వీట్ చేశారు. అయితే అది రజనీకాంత్ ట్వీటర్ ఖాతా కాదని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. రజనీ అధికారిక ట్వీటర్ ‘@rajinikanth’పేరుతో ఉండగా, నకిలీ ఖాతా‘@RajiniOff’పేరుతో ఉంది. రజనీ ట్వీటర్ ఖాతాను 2013 ఫిబ్రవరిలో తెరచినట్లు ఉండగా, రజనీ క్షమాపణ చెబుతూ చేసిన ట్వీటర్ ఖాతా గత నెలలో తెరచినట్లు ఉంది. దీంతో ఇది నకిలీ ట్వీట్ అని అర్థమవుతంది. ఈ ఫేక్ ట్వీట్‌పై రజనీకాంత్ స్పందించాల్సి ఉంది. -
లాక్డౌన్: ఏపీ ప్రభుత్వం ఈ-పాస్‌ల జారీ
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల తయారీ, రవాణా సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ (ఎమర్జెన్సీ) పాస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. నిత్యావసర వస్తువుల కంపెనీలు, సరఫరాదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ-పాస్‌లు పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్‌కు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వం పాసులు జారీ చేయనుంది. నిత్యావసర వస్తువుల తయారీ, రవాణాకు చెందిన కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉధ్యోగులకు లేదా కనీసం ఐదుగురికి నిబంధనలకు లోబడి పాస్‌లు ఇవ్వనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పాస్‌లు జారీ చేస్తారు. (చదవండి: లాక్డౌన్: మోదీ ఎలా యాక్టివ్‌గా ఉంటున్నారు ?) కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ నిబంధనలు (ఉదయం 6 నుంచి ఉదయం 11 వరకు) అనుసరించి నిత్యావసరాలు కొనేందుకు వెళ్లిన ప్రజలకు, సరుకు రవాణా వాహనాలు నడిపేవారికి, పంటను తరలించే రైతులకు ఈ-పాస్‌లు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ రూపంలో ఉండే ఈ-పాస్‌లను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టుల వద్ద ఉండే పోలీసుల వద్ద తగిన మెకానిజం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పాస్‌లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది. నిత్యావసర సరుకుల తయారీ పరిశ్రమలు, వాటి సరఫరా దారులకు ఈ పాస్ విధానం మరింత సౌలభ్యం కల్పించనుంది. (చదవండి: ఇల్లు సైతం ‘లాక్’ డౌన్) క్రింది లింక్‌ల ద్వారా ఆన్లైన్లో ఈ-పాస్ అప్లై: https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration (లేదా) https://www.spandana.ap.gov.in/ -
మొరాయిస్తున్నాయి..!
‘‘ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. అందులో భాగంగానే రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ, అందులో నెలకొంటున్న సాంకేతిక సమస్యలను సత్వరం పరిష్కరించకపోవడంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.’’ జడ్చర్ల : ప్రభుత్వం రేషన్ పంపిణీకి సంబందించి ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తేగా సాంకేతిక సమస్యలతోఅటు డీలర్లు ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డివైస్‌లకు సంబందించి గ్రామీణప్రాంతాలలో పూర్తి స్థాయిలో నెట్ రాకపోవడంతో పంపిణీలో ఆలస్యం చోటు చేసుకుం టుంది. దీనికి తోడు ఇటీవల డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌ను ఆకస్మికంగా మార్పు చేయడంతో ఈనెల 1వ తేదీ నుంచి బియ్యం పంపిణీ నిలిచిపోయింది. ఏమైంది అన్న విషయం అర్థం గాక మొదటి రోజు అటు అధికారులు ఇటు డీలర్లు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. తీరా వయాసిస్ కంపెనీ తమ సాఫ్ట్వేర్ మార్పు చేసి ఆధార్ అనుసంధానంగా సర్వర్‌తో లింక్ చేసే కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తుందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్తోనే.. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు విధివిధానాలను రూపొందించారు. 15వ తేదీ తర్వాత బియ్యం పంపిణీ ఉండదు. ఆ సమయంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆకస్మికంగా 1వ తేదీనుంచి అంటే బియ్యం పంపిణీ ప్రారంభంరోజు నుంచే సాఫ్ట్‌వేర్‌ను మార్పు చేయడంతో సమస్య నెలకొందని అటు అధికారులు ఇటు రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ సమస్యలు ఈ–పాస్ విధానంలో తరచు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు వాపోతున్నారు. నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పోవడంతో సమస్య నెలకొంటుందని అంటున్నారు. తమకు ఎయిర్టెట్, ఐడియా సిమ్‌లు జారీ చేశారని అయితే కొన్ని ప్రాంతాల్లో ఆయా సిమ్‌లు పనిచేయడం లేదన్నారు. ఒక వేళ పనిచేసినా నెట్ సిగ్నల్ సరిగ్గా లేక నెట్ నెమ్మదిగా ఉంటుందని.. దీంతో పొద్దస్తమానం సమయం వెచ్చించే పరిస్థితి ఉంద న్నారు. 4జీ నెట్ అందించే జియో సిమ్‌లను సరఫరా చేస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు. నెట్ స్పీడ్‌గా వస్తే పని కూడా సులువు అవుతుందని, బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నా మని కొందరు డీలర్లు ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక మిషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే సదరు మిషన్‌ను తీసుకుని సంబందిత తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని టెక్నిషియన్ కోసం ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు ఇటీవల డివైస్(మిషన్)లలో కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఓ టెక్నీషియన్‌ను తమ కార్యాలయంలో అందుబాటులో ఉంచి సమస్యను సరిచేయిస్తున్నాం. దాదాపుగా సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నాం. – లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల -
‘రేషన్’ పాట్లు..
ఇల్లెందు(అర్బన్) : మండల పరిధిలోని పూబెల్లిలో ఎటువంటి సెల్ సిగ్నల్స్ లేకపోవడంతో చౌకదుకాణానికి పంపిణీ చేసిన ఈపాస్ యంత్రాలు పనిచేయడంలేదు. పదిహేను రోజులుగా డీలర్ వివిధ ప్రయత్నాలు చేసినా ఎంతకీ ఫలితం లేకుండా పోయింది. 1వ తేదీ నుంచి 15 లోపు సరుకుల పంపిణీ చేయాల్సిన డీలర్ 15నాటికి ఒక్కరికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. ఈ దుకాణం పరిధిలో సుమారు 378 తెల్ల రేషన్, అంత్యోదయ కార్డు వినియోగదారులు ఉన్నారు. విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. సిగ్నల్స్ పని చేయకపోతే తాము సరుకులు పంపిణీ చేసేదేలాని అధికారులను ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఇటీవల రెండు రోజుల క్రితం రికార్డుల్లో వినియోగదారుల వివరాలను నమోదుచేసుకొని పరుకుల పంపిణీ ప్రక్రియను షురూ చేశారు. ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియకపోవడంతో సరుకులు తీసుకోలేదు. స్టాక్ దుకాణంలోనే నిల్వ ఉంది. ఎలా పంపిణీ చేయాలో తెలియక డీలర్ సతమతమవుతున్నారు. అధికారులు మాత్రం మూడు రోజుల్లో సరుకుల పంపిణీ పూర్తి చేయాలని డీలర్‌కు ఆదేశాలు జారీ చేశారు. బయో మెట్రిక్ ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ప్రతి నెలా ఇలాగైతే తాము సకాలంలో సరుకులు తీసుకోవడం సాధ్యం కాదని గ్రామస్తులు అంటున్నారు -
రేషన్‌కు నెట్వర్క్ తిప్పలు
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
పౌర సరఫరాల్లో పారదర్శకతకే ‘ఈ–పాస్’
నిర్మల్‌టౌన్: అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ పాస్ యంత్రాల వినియోగంపై నిర్వహించిన శిక్షణ, అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్మల్‌రూరల్, నిర్మల్అర్బన్, సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు ఈ పాస్‌పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యంగా, పారదర్శకంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ డీలర్లకు అర్థమయ్యేలా ఈ పాస్ యంత్రాల పనితీరుపై ఆమె వివరించారు. అనంతరం ఈపాస్ బయోమెట్రిక్ మిషన్లను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈపాస్ యంత్రాలతో 48 లక్షల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 18 నుంచి... ఈ నెలలో కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి బోనగిరి జిల్లాల్లో ఈపాస్ యంత్రాలపై శిక్షణ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం నుంచి నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్ మిషన్ల ద్వారా ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబా, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి వాజీద్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకళ, ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, అసోసియేట్ మేనేజర్ శ్రావణ్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
ప్రభుత్వాన్ని పేదలు తిట్టుకుంటున్నారు
సాక్షి, అమరావతి: ఈపాస్ విధానాన్ని అధికార టీడీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. ఈ విధానం వల్ల రాష్ట్రంలోని వేలాదిమంది పేదలకు సరిగా రేషన్ అందడం లేదన్నారు. దీంతో వారంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై వారు మాట్లాడారు. రేషన్ సరిగా అందనివారు ప్రతి నియోజకవర్గంలోనూ వేల సంఖ్యలో ఉన్నారని, వారికి సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు. రెండు మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే కూడా కార్డులు తొలగిస్తున్నారని, ఇలాగైతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఈపాస్‌తో ప్రభుత్వానికి రావాల్సినంత చెడ్డపేరు వచ్చిందన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందిస్తూ.. వేలిముద్రలు సరిపోలని వారు 37 వేల మంది ఉన్నట్టు తేలిందని, వారికి కూడా రేషన్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దారుణంగా ఉందని పలువురు సభ్యులు మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో మంత్రులు అవాస్తవాలు చెబుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ప్రభుత్వం దేవుళ్ల మధ్య కూడా విబేధాలు సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములు టాంపరింగ్‌కు గురయ్యాయని పలువురు ఆరోపించారు. -
ఈ–పరేషాన్!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రజలు ‘రేషన్’ సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈనెల నుంచి ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీకి ఈ–పాస్ (ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్) విధానాన్ని అమలు చేసింది. ఇందులో భాగంగా ఆయా రేషన్ దుకాణాలకు ఈపాస్ మిషన్లను అందజేసింది. లబ్ధిదారులు ఈపాస్ మిషన్‌పై వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. సర్వర్ సమస్యతో మూడురోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతుండగా.. అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం అవుతోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: పేదల కడుపు నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని ఒక్కొక్కరికీ (కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి) ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో.. అదేస్థాయిలో అక్రమాలకూ తావు ఏర్పడింది. రేషన్ దుకాణాలకు బియ్యం పూర్తిగా చేరకుండానే.. మిల్లర్లు, వ్యాపారుల దరి చేరుతున్నాయి. ఇలా ప్రతినెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అయినా అక్రమాలను మాత్రం అడ్డుకోలేకపోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ.ఆనంద్ నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ–రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నుంచి శ్రీకారం చుట్టి.. రేషన్ దుకాణాల్లో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో ఇతర జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా అన్ని జిల్లాల్లో కసరత్తు ప్రారంభించింది. మొరాయిస్తున్న ఈ–పాస్ యంత్రాలు.. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 48 శాతమే.. ఉమ్మడి జిల్లాల్లోని రేషన్ దుకాణాలలో బయోమెట్రిక్ యంత్రాలు, ఈపాస్ విధానాన్ని ప్రభుత్వం టెండర్ల ద్వారా ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు అన్ని దుకాణాలలో యంత్రాలను ఏర్పాటు చేస్తారు. డిసెంబర్ నుంచి యంత్రాలు వినియోగంలోకి తేవాలనుకున్నా... ఈనెలనుంచే అమలు చేస్తున్నారు. ఈ విధానం ద్వారా ఆహారభద్రత కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు రేషన్ దుకాణానికి వచ్చి వేలిముద్ర వేస్తేనే రేషన్ సరుకులు ఇస్తారు. తద్వారా బోగస్ కార్డులను ఏరివేయవచ్చని, నెలనెలా బియ్యం తీసుకోని కార్డుదారుల బియ్యాన్ని డీలర్లు స్వాహా చేయకుండా అడ్డుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు నిజమైన కార్డుదారులకే సరుకులు అందుతాయని భావించారు. అయితే ఈ విధానంలో సాంకేతిక అంతరాయాలు కలుగుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండలాల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,460 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానం అమలవుతోంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 94,1948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 టన్నుల బియ్యానికి గాను ఇప్పటివరకు 7,989.108 (48 శాతం) టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. సర్వర్ సమస్యతో కొద్దిరోజులుగా ఈ–పాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా.. లబ్ధిదారులు పండగపూట రేషన్ దుకాణాల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. -
ఇంకెన్నాళ్లు..
♦ రేషన్ బియ్యం పంపిణీలో తీవ్ర జాప్యం ♦ ఎట్టకేలకు జిల్లాకు చేరుకున్న వేయింగ్ మిషన్లు ♦ తాజాగా ఈ పాస్ మిషన్లలో సాంకేతిక లోపం ♦ వారం గడిచినా.. ప్రారంభం కాని రేషన్ సరఫరా ♦ పండుగలు సమీపిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన హన్మకొండ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు అల్లాడుతున్నాయి. ప్రతి నెలా ఒకటి నుంచి 14వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇప్పటివరకూ మొదలుకాలేదు. పౌరసరఫరాల వ్యవస్థలో రేషన్‌షాపుల ద్వారా బియ్యం పంపిణీ కోసం చేపట్టిన ఈ పాస్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణం. మరో పది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బియ్యం పంపిణీ కాకపోవడం.. ఎప్పుడిస్తారో స్పష్టత లేకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు షాపుల చుట్టూ తిరుగుతున్న పేదలకు సమాధానం చెప్పలేక డీలర్లు తలపట్టుకుంటున్నారు. మిషన్లు వచ్చినా.. రేషన్‌డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేసిన అధికారులు వేయింగ్ మిషన్లు లేక హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చే వాటి కోసం ఎదురుచూశారు. ఎట్టకేలకు జిల్లాకు వేయింగ్ మిషన్లు చేరుకున్నా యి. అయితే ఈ పాస్ యంత్రాలను వేయింగ్ మిషన్‌కు అనుసంధా నం చేసే విషయంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. శుక్రవారం హన్మకొండ మండలం పరిధిలోని డీలర్లను ఈ పాస్ మిషన్లతో కలెక్టరేట్‌కు రావాలని అధికారులు ఆదేశించారు. అయితే ఎంత సేపు ప్రయత్నించినా.. చాలా మిషన్ల అనుసంధానం ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో డీలర్లు వెనుదిరిగారు. జిల్లాలో 599 షాపుల్లో ఈ ప్ర క్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నెల వరకు అవకాశమివ్వండి.. మిషన్లలో సాంకేతిక సమ్స్యలను దృష్టిలో పెట్టుకుని పండుగలు ఉన్నందున ఆగస్టు నెలలో మాదిరిగా పంపిణీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రేషన్‌డీలర్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం జేసీ దయానంద్‌కు వినతిపత్రం అందజేశారు. జేసీ నిర్ణయం మేరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే... ఈ నెల తప్పనిసరిగా ఈ పాస్ విధానం ద్వారానే బియ్యం పంపిణీ చేయాలని కమిషనర్‌నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అందువల్ల కాస్త ఆలస్యమైనా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేస్తాం. జిల్లాలో వేలేరుతోపాటు మరికొన్ని మండలాల్లో మిషన్ల అనుసంధానం పూర్తయింది. ఒకటి రెండు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా ఒక్కనెల పంపిణీకి అనుమతి ఇవ్వాలని రేషన్‌డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జేసీకూడా ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయమన్నారు.– విజయలక్ష్మి, డీసీఎస్ఓ -
ఇంటర్ విద్యార్థుల ‘ఉపకార’ యాతన
► ఈ–పాస్ వెబ్సైట్లో కనిపించని జూనియర్ కాలేజీల వివరాలు ► ప్రవేశాల ప్రక్రియ ముగిశాకే లింకు ఇస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తుకు చిక్కులు తప్పడం లేదు. ఈ ఏడాది ముందస్తుగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించినప్పటికీ సాంకేతిక సమస్యలు విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2017–18 విద్యాసంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ జూన్ 20న ప్రారంభం కాగా.. ఈ నెల 30తో గడువు ముగియనుంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించలేదు. వెబ్సైట్లో సమాచార లోపంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో దరఖాస్తులకు తుది గడువు సమీపిస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ–పాస్‌తో అనుసంధానం చేయకపోవడంతో.. ఈ–పాస్ వెబ్సైట్లో కాలేజీల సమాచారాన్ని సంబంధిత బోర్డులు/యూనివర్సిటీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల సమాచారాన్ని ఈ–పాస్ వెబ్సైట్లో ఇంటర్మీడియెట్ బోర్డు నమోదు చేయాలి. ఇందుకు బోర్డు వెబ్‌సైట్‌ను ఈ– పాస్‌తో అనుసంధానం చేయాలి. ప్రస్తుతం కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతుండటంతో ఈ– పాస్ వెబ్‌సైట్‌తో ఇంటర్మీడియెట్ వెబ్‌సైట్‌ను అధికారులు అనుసంధానం చేయలేదు. దీంతో ఉపకారవేతనాల దరఖాస్తులో బీఐఈ(బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్) ఆప్షన్ కనిపించడం లేదు. కాలేజీల సమాచారం లేకపోవడంతో ఆయా విద్యార్థులు దరఖాస్తును సమర్పించలేక పోతున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా ర్థులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేశారు. ప్రవే శాల ప్రక్రియ ముగియగానే, వచ్చే వారంలో బోర్డు లింకును అనుసంధానం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఇక ఈ–పాస్బుక్కు
♦ అమలుకు రెవెన్యూ శాఖ కసరత్తు ♦ పాత పుస్తకాల పంపిణీ నిలిపివేత ♦ ఆధునిక పరిజ్ఞానంతో కొత్త పుస్తకాలు ♦ నకిలీలకు చెక్ పెట్టేందుకు ‘డిజిటల్’ ♦ ఆన్లైన్ పనులు చేపడుతున్న అధికారులు నిర్మల్‌రూరల్: నకిలీ పాసు పుస్తకాల ఆట కట్టించేం దుకు.. రైతన్నకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఈ–పాస్‌బుక్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో నకిలీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రెవెన్యూ శాఖలో అవినీతికి ముకుతాడు వేయొచ్చని భావిస్తోంది. అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు మేలు జరిగేలా ఈ–పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని పనులను మీసేవతో లింకప్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు పాస్ పుస్తకాలనూ డిజిటలైజేషన్ చేసే పనికి శ్రీకారం చుట్టింది. పాస్ పుస్తకాలను మాన్యువల్‌గా కాకుండా ఆన్లైన్ ద్వారా జారీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే మాన్యువల్ పాస్ పుస్తకాలు ఇవ్వొద్దని ఆదేశాలూ జారీ చేసింది. పాత పుస్తకాలతో అక్రమాలు ప్రభుత్వం రెవెన్యూ శాఖలో ఈ–పాస్ పుస్తకాల విధానానికి పనులు మొదలుపెట్టింది. భూమి హక్కులు పొందేందుకు రైతులకు గతంలో సర్వే నంబర్, విస్తీర్ణం ఆధారంగా పాస్ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. కాలక్రమంలో ఈ విధానానికి స్వస్తిచెప్పి.. రైతు పట్టా పుస్తకాల పేరిట టైటిల్ డీడ్, పాస్ పుస్తకం అనే రెండు రకాల పుస్తకాలను పంపిణీ చేశారు. వీటిలో భూమి స్వభావం, విస్తీర్ణం తదితర వివరాలు పొందుపర్చారు. అక్రమాలు చోటు చేసుకోకుండా వరుస సంఖ్య కేటాయించారు. అయినప్పటికీ పాస్ పుస్తకాల పంపిణీలో భారీగానే అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. బోగస్ పట్టా పాస్ పుస్తకాల దందా చాలాచోట్ల వెలుగులోకి వచ్చింది. నకిలీ పాస్‌పుస్తకాల ద్వారా చాలామంది అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు గతంలో పలు సంఘటనలూ బయటకు వచ్చాయి. అవినీతిని అరికట్టేందుకు.. రెవెన్యూ శాఖలో ప్రధానంగా పాస్‌పుస్తకాల జారీలో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. బోగస్ పుస్తకాలను తయారు చేసి ఇచ్చిన ఘటనలు అనేక జిల్లాల్లో కనిపించాయి. ఇందులో పలువురు అధికారులూ సస్పెండ్ అయిన సంఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నూతన సంస్కరణలను అమలులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. బోగస్ పట్టాపాస్ పుస్తకాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే భూముల కొనుగోలు, ఇతర కారణాలతో భూహక్కులను పొందుతున్న వారికి పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలనూ జారీచేసింది. కొత్తగా ఈ–పాస్‌పుస్తకాలనే అందించేందుకు సన్నద్ధమవుతోంది. పకడ్బందీగా కొత్త పుస్తకం ఇప్పటివరకు కొనసాగిన మాన్యువల్ విధానానికి పుల్‌స్టాప్ పడనుంది. ఇప్పుడు క్షేత్రస్తాయిలో ఆధునికీకరిస్తున్న డాటా నేరుగా సీసీఎల్ఏ వరకు వెళ్తుంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు నేరుగా ఈ–పాస్‌పుస్తకం అందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా జరిగితే కొంతమంది ఇంటి అడ్రస్‌లు మార్పులు ఉంటే అవి తిరిగి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తహసీల్దార్ల ద్వారానే లబ్ధిదారులకు అందించాలా.. లేక ఆన్లైన్ ద్వారా తీసుకునే అవకాశం కల్పించాలా.. అనే దానిపై చర్చిస్తోంది. ఇక ఈ–పాస్ పుస్తకం పూర్తిగా డిజిటల్‌గా ఉంటుంది. దీనిపైన అధికారుల సంతకాలు, పట్టాదారు వివరాలు డిజిలైజ్డ్ అయి వస్తాయి. వీటిని మార్చడానికి బోగస్ చేయడానికి వీలు లేదు. ఈ పుస్తకం చినగడం, మంటల్లో వేసిన కాలిపోవడం వంటివి జరగకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈపుస్తకాలు యూనిక్ కోడ్ ఆధారంగా జారీ కానున్నాయి. సర్వే నంబర్, 1బి ఖాతా సంఖ్యతో తహసీల్దార్, ఆర్డీవో డిజిటల్ సంతకంతో ఈ–పాస్‌బుక్‌ను ముద్రించనున్నారు. నిలిచిన పాస్‌పుస్తకాల జారీ ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తీసుకువస్తున్న ఈ–పాస్‌పుస్తకాల నేపథ్యంలో జిల్లాలో మాన్యువల్‌గా పాస్‌బుక్‌లను ఇవ్వడం నిలిపివేశారు. అయితే రైతులకు రుణాలు కావాలంటే బ్యాంకుల్లో పాస్‌పుస్తకాలను చూపడం తప్పనిసరి. ప్రస్తుత సీజన్లో రైతులు రుణాల కోసం బ్యాంకుల వెంట తిరగాల్సి వస్తోంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని మండలాల్లో రైతులకు మాన్యువల్‌గా పాస్ పుస్తకాలను అందిస్తున్నారు. ఇకనుంచి మాత్రం పూర్తిస్థాయిలో ఈ–పాస్‌పుస్తకాలనే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ ప్రయత్నంతోనైనా ఏళ్ల తరబడి నడుస్తున్న నకిలీ పట్టా పాస్ పుస్తకాల అక్రమాలకు తెరపడాలని రైతులు ఆశిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి.. ప్రభుత్వం ఈ–పాస్‌పుస్తకాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే పాస్ పుస్తకాల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే ఈ–పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. బోగస్ పుస్తకాలకు కళ్లెం వేసేందుకు డిజిటలైజ్డ్ ఈ–పాస్ పుస్తకాలు ఉపయోగపడతాయి. నిర్మల్ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు : 02(నిర్మల్, భైంసా) రెవెన్యూ మండలాలు : 19 ప్రస్తుతం సాగుభూమి : 3లక్షల 64వేల ఎకరాలు రైతుల సంఖ్య : లక్షా 35వేల 565 మంది (సమగ్ర సర్వే ప్రకారం) -
మొదటి అడుగు మహబూబ్‌నగర్‌లో..
పౌరసరఫరాల శాఖలో ఈ– పాస్ షురూ - ఈ–పాస్‌తో రేషన్ అక్రమాలకు కళ్లెం - మూడు దశల్లో రాష్ట్రం అంతటా అమలు - బిజినెస్ కరస్పాండెంట్లుగా రేషన్ డీలర్లు: కమిషనర్ సి.వి.ఆనంద్ సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నడుం బిగించింది. రేషన్ దుకాణాలను నగదురహిత కార్యకలాపాలకు వేదికగా మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో దశల వారీగా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ–పాస్ ) విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలో మొదటి దశలో పది జిల్లాల్లో 5,242 షాపుల్లో, రెండో దశలో 11 జిల్లాల్లో 4,817 షాపులు, మూడో దశలో తొమ్మిది జిల్లాల్లో 5,507 షాపుల్లో మొత్తంగా మూడు దశల్లో 15,606 రేషన్ దుకాణాల్లో ఈ పాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి అడుగులు పడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలంలో 6 రేషన్ షాపులు, జడ్చర్ల మండలంలో 20 షాపులు, మహబూబ్‌నగర్ మండలంలో 14 షాపులు, మొత్తంగా 40 షాపుల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. పైలెట్ ప్రాజెక్టుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాది మార్చి నుంచి ఈ–పాస్ విధానం అమలవుతోంది. ఇక్కడ ఈ విధానం ప్రవేశ పెట్టిన తర్వాత ఈ ఏడాది మార్చి నెల వరకు రూ.269కోట్ల మేర ఆదా అయ్యింది. దీంతో ఈ–పాస్ విధానంతో రేషన్ అక్రమాలకు పక్కాగా కళ్లెం వేయొచ్చని నిర్ణయానికి వచ్చారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఈ–పాస్ యంత్రాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ–పాస్ యంత్రాల్లో గతంలో కంటే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. పైలెట్ ప్రాజెక్టు కింద ఈ –పాస్ విధానం అమలవుతున్న హైదరాబాద్ రేషన్ షాపుల్లోని ఈ యంత్రాల్లో కేవలం వేలిముద్రల ద్వారానే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. కాగా, నగదు రహిత లావాదేవీలకు వీలుగా యంత్రాల్లో మార్పులు చేశారు. ఈ–పాస్‌కు అదనంగా ఐరిస్ స్కానర్, బరువులు తూచే ఎలక్ట్రానిక్ తూకం, స్వైపింగ్, ఆధార్ ద్వారా చెల్లింపులు (ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టం /ఏఈపీఎస్), ఆడియో వాయిస్ వంటి అంశాలను పొందుపరిచారు. వివిధ రకాల చెల్లింపులు చేపట్టేలా యంత్రాలను రూపొందించారు. నిత్యావసర సరుకులకు చెల్లింపులకింద నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు తీసుకునేందుకు వీలుగా యంత్రాల్లో స్టాఫ్ట్వేర్ను పొందుపరిచారు. చౌకధరల దుకాణాల్లో మైక్రో ఏటీఎంలు.. చౌకధరల దుకాణాల ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగణంగా మైక్రో ఏటీఎంలను అమరుస్తున్నామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ తెలిపారు. సరుకుల పంపిణీతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు చౌకధరల దుకాణదారుడిని బిజినెస్ కరస్పాండెంట్‌గా వ్యవహరించనున్నామన్నారు. కొంత మందిలో వేలిముద్రలు అరిగిపోవడం తదితర కారణాలతో బయోమెట్రిక్ విధానంలో సమస్యలు వస్తున్న కారణంగా, దీనిని అధిగమించడానికి నూతంగా ఐరిస్‌ను, గ్రామీణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టకుని వాయిస్ ఓవర్ విధానం తెచ్చామన్నారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి గ్రామంలోని రేషన్ షాపులో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ యంత్రాన్ని కమిషనర్ ఆనంద్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. -
ఈ-పాస్ మిషన్లతోనే ఎరువుల పంపిణీ
- 1 నుంచి పకడ్బందీగా ప్రక్రియ - కర్నూలు సబ్ డివిజన్ డీలర్ల అవగాహన సదస్సులో ఏడీఏ కర్నూలు(అగ్రికల్చర్): మే నెల 1నుంచి రసాయన ఎరువులను విధిగా ఈ-పాస్ మిషన్ల ద్వారానే పంపిణీ చేయాలని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి సూచించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై కర్నూలు సబ్ డివిజన్లోని రసాయన ఎరువుల డీలర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...డీలర్లకు నాగార్జున, గ్రీన్‌ఫీల్డ్, క్రిప్కో కంపెనీలు ఈ-పాస్ మిషన్లను సరఫరా చేస్తాయన్నారు. ప్రతి డీలరు విధిగా తమ వివరాలను ఈ-పాస్ మిషన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రైతుల ఆధార్ నెంబర్లు, వెబ్‌ల్యాండు వివరాలను కూడా వీటిలో అప్లోడ్ చేస్తామన్నారు. మే నెల 1నుంచి మాన్యువల్‌గా ఒక్క బస్తా కూడా విక్రయించరాదన్నారు. భూసార పరీక్ష పలితాలను బట్టి, సాగు చేసే పంటను బట్టి ఎన్ని బస్తాల ఎరువులు అవసరమో అన్ని మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీ చేయలేమని భావించే డీలర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలగవచ్చన్నారు. జేడీఏ కార్యాలయ ఫర్టిలైజర్ ఏఓ వేదమణి, సీ.బెళగల్ ఏఓ సురేష్‌బాబు ఈ-పాస్ మిషన్ల ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కర్నూలు, కల్లూరు వ్యవసాయాధికారులు అశోక్‌కుమార్‌రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ–పాస్.. రేషన్ ఫెయిల్!
- వేలి ముద్రలు పడలేదని 19.92 లక్షల మందికి అందని సరుకులు - పేదల కడుపు కొడుతున్న సాంకేతికత - బ్యాంకు ఖాతాలో డబ్బులుంటేనే రేషన్.. - సర్కారు నిర్ణయాలతో వృద్ధుల్లో తీవ్ర ఆందోళన సాక్షి, అమరావతి వేలి ముద్రలు సరిగా లేక ఈ–పాస్ మెషిన్ వాటిని స్వీకరించక పోవడం, కొత్త రేషన్‌కార్డుల్లో తప్పుల తడకలు తదితర కారణాల వల్ల ఈ నెలలో 19.92 లక్షల మంది పేదలు రేషన్ సరుకులు పొందలేకపోయారు. బియ్యం, చక్కెర, గోధుమలు, గోధుమ పిండి, కిరోసిన్ తదితర రేషన్ సరుకులపై ఆధారపడి బతుకీడుస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఏ పనీ చేసుకోలేని వారి పరిస్థితి సాంకేతికత పుణ్యమా అని దయనీయంగా మారింది. రాష్ట్రంలో 1.38 కోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటే ఇలాంటి సమస్యలతో ప్రతి నెలా లక్షలాది మంది పేదలు రేషన్‌కు దూరం అవుతున్నారు. వేలి ముద్రలు సరిగా పడని వారికి గ్రామ రెవెన్యూ కార్యదర్శి (వీఆర్వో) సర్టిఫికెట్ ఇస్తే రేషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న మాట లు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. రేషన్‌షాపు వరకు నడవలేని వృద్ధులకు వారి ఇంటికే వెళ్లి రేషన్ ఇవ్వాలన్న ఆదేశాలు కూడా సరిగా అమలు కావడం లేదు. దీనికి తోడు నగదు రహితంగానే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా తీసుకోవడం కూడా పలు ఇబ్బందులకు కారణమ వుతోంది. కృష్ణా జిల్లాలో 85 శాతం పైగా నగదు రహితం గానే సరుకులు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్ బాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో ఇటు లబ్ధిదా రులు, అటు రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడలో ఒక వ్యక్తి రేషన్ కోసం వెళ్తే నగదు రహిత విధానంలో సరుకులు ఇస్తామని చెప్పారు. చేసేదిలేక ఆ వ్యక్తి బ్యాంకుకు ఆటోలో వెళ్లి ఖాతాలో సరుకులకు అయ్యే మొత్తం జమ చేసి వచ్చారు. ఇందుకు తనకు రూ.30 ఖర్చు అయ్యిందని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి నెలా బ్యాంకులో డబ్బు జమ చేసి ఆ తర్వాత సరుకులు తీసుకోవాలంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక గంటల తరబడి రేషన్ షాపులవద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 1.66 లక్షల కొత్తకార్డులు జన్మభూమి కార్యక్రమంలో ఇచ్చామని చెబుతున్నా అందులో సగానికి పైగా కార్డులకు రేషన్ నిలిపివేశారనే ఆరోపణలున్నాయి. ఇలాగైతే ఎలా? తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం గ్రామానికి చెందిన అడపా సత్యవతికి కుష్టువ్యాధి ఉంది. నగదు రహిత రేషన్ తీసుకోవాలంటే ఈ–పాస్ లో వేలి ముద్రలు వేయడం తప్పనిసరి. ఆమె వేలి ముద్రలు సరిగా లేనందున ఈ–పాస్ స్వీకరించలేదు. ఈ విషయమై డీలర్.. తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ల డంతో ఆమెకు మాత్రం రేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి వారే కాకుండా వయసు మీరి వేలి ముద్రలు సరిపోలక లక్షలాది మంది రేషన్ అందుకోలేకపోతున్నారు. పైగా బ్యాంకులో వారి ఖాతాల్లో డబ్బులుండేలా చూసుకుంటేనే ఇకపై రేషన్ అందుతుంది. లేదంటే లేదు. -
కత్తిగట్టారు!
కర్నూలులో దారుణ హత్య - ప్రాణం తీసిన ఈ-పాస్ కుంభకోణం - మృతుడు ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు - విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష - కిరాయి హంతకుల ప్రమేయంపై పోలీసుల అనుమానం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ హత్యతో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. ఈ పాస్ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారనే కక్షతో బాధిత డీలర్లు కిరాయి హంతకులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు శివారులోని జొహరాపురానికి చెందిన వెంకటేష్ గౌడ్ రేషన్‌షాపు డీలర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవికి ఒక కుమారుడు, కూతురు. వీరు నగరంలోని బిర్లాగడ్డలో నివాసం ఉంటున్నారు. రెండో భార్య పేరు కూడా లక్ష్మీదేవినే. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుతూరు సంతానం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వెంకటేష్‌గౌడ్ సమీప బంధువు. నగరంలోని అన్ని పార్టీల నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకటేష్‌గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ప్రాణం మీదకు తెచ్చిన ఈ–పాస్ కుంభకోణం నాలుగైదు నెలల క్రితం జిల్లాలో ఈ–పాస్ కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు బైపాస్ చేసి ప్రజల సరుకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. బైపాస్ చేసిన సమాచారాన్ని వెంకటేష్‌గౌడ్ విజిలెన్స్ అధికారులకు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఇందులో కర్నూలు నగరంలోనే 100 మంది ఉన్నారు. దీంతో వీరందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు సస్పెండైనా డీలర్లు ఆయనపై కక్ష పెంచుకొని హత్య చేయించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకుల పనేనా? మద్దూరు నగర్‌లోని జానీ సైబర్ల్యాండ్లో ఉన్న వెంకటేష్‌గౌడ్‌ను ఆటోలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు సెకన్ల వ్యవధిలో హత్య చేశారు. వేటకోడవళ్లతో తలపై ఒక్క దెబ్బతో ప్రాణం తీశారంటే కచ్చితంగా కిరాయి హంతకుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేష్ తలపై నిలువుగా నరకడంతో వెనుక వైపు నుంచి ముందు భాగం వరకు చీలిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అడ్డు వచ్చిన సైబర్ల్యాండ్ నిర్వాహకుడు రఘు, మరోవ్యక్తి చంద్రేశేఖరరెడ్డిలపైనా దుండగులు దాడి చేశారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చంద్రశేఖరరెడ్డిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది డీలర్లపై హత్య కేసు నమోదు వెంకటేశ్‌గౌడ్ హత్య కేసులో భార్య సుమలత(లక్ష్మీదేవి) ఫిర్యాదు మేరకు నగరంలోని 8 మంది డీలర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. అనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, ఎరుకలి శీను, నూర్‌బాషా, వడ్డేగేరి రమేష్, లక్ష్మన్న, ప్రమీలమ్మ తదితరులు కిరాయి హంతకులతో కలిసి తన భర్తను హత్య చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్
పౌరసరఫరాల శాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫ లితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1,545 రేషన్ దుకాణా ల్లో ఈ–పాస్ విధానంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటి దాకా సుమారు రూ.130 కోట్లు ఆదా అయినట్లు శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణ యించారు. ఈ మేరకు ఈ–పాస్ యంత్రాల సరఫరా టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో వినియోగిం చిన ఈ–పాస్ యంత్రాల్లో కేవలం వేలిముద్ర సౌకర్యం మాత్రమే ఉండగా... తాజాగా బహుళ ప్రయోజనకారిగా ఉండేందుకు ఐరిస్, ఈ–వేయింగ్ సౌకర్యం ఉండేలా తయారు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్ విధానంలో ప్రతి రాష్ట్రా నికి కొన్ని లక్ష్యాలు నిర్దే శించిందని.. నగదు రహిత లావాదేవీల కోసం ఈ చర్యలు తీసు కుందని చెబుతున్నారు. దీంతో ఆ దిశగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. నగదురహిత లావాదేవీల వైపు అన్ని శాఖలూ మళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కూడా రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టారు. మినీ ఏటీఎంలుగా రేషన్ షాపులు! మారుమూల, బ్యాంకులు లేని గ్రామాల్లో సైతం రేషన్ షాపులున్నాయి.దీంతో భవిష్యత్తులో వీటినే మినీ ఏటీఎం లుగా చేయాలన్న ప్రణాళిక ఉందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ముందు ముందు రేషన్ డీలర్లను ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా తయారు చేయడం ద్వారా మీ–సేవ కేంద్రాల్లో లభించే సేవలను అందించేలా ఈ–పాస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. -
ప్రచార ఆర్భాటంగా స్వైపింగ్
► దరఖాస్తు చేసి 15 రోజులైనా అందని మిషన్లు ► ఉన్న మిషన్లకు సర్వర్ బిజీ ► ఇబ్బంది పడుతున్న జనం, వ్యాపారులు పెద్ద నోట్లు రద్దు తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీలు చేయాలంటూ పెద్దయెత్తున ప్రచారం ప్రారంభించాయి. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ ప్రకటనలు కేవలం ప్రచార ఆర్భాటమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు ప్రజలకు, అటు వ్యాపారులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. తిరుపతి గాంధీరోడ్డు : నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు వెంటనే నగదు రహిత లావాదేవీలు ప్రారంభించాలని పాలకులు, అధికారులు ఆదేశించారు. వ్యాపారులు అంగీకరించడమేగాక వారి పరిధిలోని బ్యాంకర్ల వద్ద స్వైపింగ్ (ఈ–పాస్) మిషన్ల కోసం రెండు వారాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. నేటికి ఒక్క మిషన్ కూడా రాలేదు. పెద్దషాపులు, షాపింగ్ మాల్స్‌లో తప్పా మిగతా దుకాణాల్లో ఏర్పాటు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు జరగడం లేదు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి అ«ధికారులు, బ్యాంకర్లు తమ పరిధిలోని వ్యాపారుల వివరాలు సేకరించారు. మండల పరిధిలో ఎందరికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.. అందులో ఎందరు ఏటీఎం కార్డులు వినియోగిస్తున్నారు.. ఆయా మండలాల పరిధిలో ఎన్ని బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి తదితర సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ప్రతి వందమందికీ ఒక ప్రతినిధిని నియమించి, ఈ–పాస్ యంత్రాన్ని అందజేసి, వారి ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగేలా అవసరమైన సర్వే నిర్వహించి ఆ వివరాలను జిల్లా అధికారులకు పంపారు. కానీ క్షేత్ర స్థాయిలో ఆ దిశగా ఇప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం మంత్రి నారాయణ కొద్ది రోజుల క్రితం 30వేల స్వైపింగ్ మిషన్లు వస్తాయని పేర్కొన్నారు. ఇందుకోసం 5వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకు ఎవరికీ రాకపోవడంలో వ్యాపారులు డీలా పడుతున్నారు. నెల రోజుల్లో ఎక్కడ చూసినా ఏటీఎంలలో నోక్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. నగదు చేతికి అందక ప్రజలు విలవిలలాడుతున్నారు. చిన్నపాటి లావాదేవీలు వదిలి, పెద్ద లావాదేవీలకు మాత్రమే స్వైపింగ్ మిషన్లు వీలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ బిజీ.. కొన్ని దుకాణాల్లో ఎప్పటి నుంచో స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి. గతంలో వీటికి పెద్దగా ఆదరణ కనిపించలేదు. నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినప్పటి నుంచి వీటికి ఆదరణ పెరిగింది. అయితే ఉన్న కొద్దిపాటి మిషన్లకే సర్వర్ బిజీ అని వస్తోంది. ఇక పూర్తి స్థాయిలో మిషన్లు ఏర్పాటు చేస్తే పరిస్థితి ఏమిటన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అవగాహన ఏదీ? ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై సరైన అవగాహన లేదు. పిల్లలు దుకాణాలకెళ్లి తినుబండారాలు, పెన్ను, పెన్సిల్ వంటి వాటికీ యంత్రాలు వినియోగించాలంటే ఇబ్బందులు తప్పవు. అల్పాదాయ వర్గాలకు కొంతవరకు నగదు రహితం నుంచి ఉపశమనం కల్పించాలి. – అవినాష్‌రెడ్డి, పూల వ్యాపారి దరఖాస్తు చేసి రెండు వారాలైంది నగదు రహిత లావాదేవీలు ప్రారంభించేందుకు స్వైపింగ్ మిషన్ కోసం రెండు వారాల క్రితం బ్యాంకులో దరఖాస్తు చేశా. ఇప్పటివరకు మంజూరు చేయకపోవడంతో నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేకపోతున్నాం. వేగంగా యంత్రాలు అందిస్తే లావాదేవీలు ప్రారంభించేందుకు వీలవుతుంది. – అబ్దాహీర్, ప్రొవిజన్ స్టోర్ ఇలాగే ఉంటే కష్టం పరిస్థితులు ఇలాగే ఉంటే షాపుల్లోని కుర్రాళ్లకు జీతం ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుంది. స్వైపింగ్ మిషన్లు లేక బేరాలు పోతున్నాయి. పలుమార్లు బ్యాంకుల చుట్టూ తిరిగాం. ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి నోట్లు రద్దు చేయడమే తెలుసుకాని దాని పరిష్కారంలో తీవ్ర లోపాలున్నాయి. –కృష్ణమూర్తి, హార్డ్‌వేర్ వ్యాపారి ప్రచారం చేసుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు, అ«ధికారులు నగదు రహిత లావాదేవీల ప్రచారం పై చూపుతున్న ఆసక్తి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో చూప డం లేదు. బ్యాంకులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా చిల్లర ఇవ్వకుండా రూ.2వేల నోట్లను మాత్రమే ఇస్తున్నాయి. దుకాణాల్లో పెద్దనోట్లకు చిల్లర ఇవ్వలేక అవస్థలు పడుతున్నాం. –సుధీర్‌రెడ్డి, హార్డ్‌వేర్ షాప్ -
ఆర్టీసీ బస్సుల్లో త్వరలో ఈ–పాస్ యంత్రాలు
సాక్షి, అమరావతి : ఆర్టీసీలో నగదు రహిత కార్యకలాపాల్ని ప్రోత్సహించేందుకు గాను ఆర్డినరీ సర్వీసుల నుంచి ఏసీ సర్వీసుల్లో ఈ–పాస్ యంత్రాలు వినియోగించనున్నట్లు యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రెడిట్, డెబిట్, రూపే కార్డులతో టిక్కెట్లకు చెల్లింపులు జరిపేలా స్వైపింగ్ యంత్రాలను వాడనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం 16 వేల యంత్రాలను సమకూరుస్తున్నట్లు ఆర్టీసీ ప్రజా సంబంధాల అధికారి మూర్తి చెప్పారు. -
అప్పులోనూ అడ్డంగా దోపిడీ
– కొందరు రేషన్ డీలర్ల చేతివాటం – ఇవ్వని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు – వాటి మొత్తాన్ని రసీదులో చూపిస్తున్న వైనం – వచ్చే నెల లబ్ధిదారుని ఖాతాల్లో ఈ మొత్తం బదిలీ -------------------------------------------------------------- అనంతపురంలో నివాసముంటున్న కె.రమణ తన కార్డు తీసుకుని రేషన్ షాపునకు వెళ్లాడు. 15 కేజీ బియ్యం(రూ.15), అర కేజీ చక్కెర(రూ.8) ఇచ్చారు. వాటికి రూ.23 అవుతుంది. అయితే డీలర్ మాత్రం వీటితో పాటు కిలో గోధుమ పిండి (రూ.16.50), లీటరు కిరోసిన్ (రూ.19) కూడా ఇచ్చినట్లు ఈ–పాస్‌లో వేలిముద్ర వేయించుకున్నాడు. అన్ని సరుకులకు కలిపి రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. తనకు రెండు సరుకులు ఇచ్చి నాలుగు సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇవ్వడంతో రమణ కంగుతిన్నాడు. వెంటనే డీలర్లని ప్రశ్నిస్తే.. రెండ్రోజుల్లో మిగిలిన సరుకులు ఇస్తామంటూ పంపి వేశాడు. ఇది ఒక్క రమణ సమస్యే కాదు.. తెల్లకార్డు కలిగిన లబ్ధిదారులందరిదీ. డీలర్ల అక్రమాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ------------------------------------------------------------ చౌక దుకాణాల్లో జరిగే అక్రమాలు అరికట్టాలని, డీలర్ల అవినీతికి చెక్ పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డీలర్లు ఏదో ఒక దారి వెతుక్కుంటూనే ఉన్నారు. తమకు అడ్డు లేదని నిరూపిస్తున్నారు. తెల్లకార్డుదారుల సొమ్మును అడ్డంగా దోచుకుంటూ దొరల్లా చెలమణి అవుతున్నారు. అప్పుగా సరుకులు ఇమ్మంటే... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్డుదారులకు డిసెంబర్ నెల సరుకులు అప్పుగా అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీన్ని కొందరు డీలర్లు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. తమ తెలివి తేటలతో చేతివాటం ప్రదర్శిస్తూ, కార్డుదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకులను అప్పుగా ఇస్తూ... అందలోనూ దోపిడీకి తెరతీయడం అందరూ విస్తుపోయేలా చేస్తోంది. ఇదే అంశం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. అదెలాగంటే... ఎన్ని సరుకులు ఇస్తే అన్నింటికే ఈ-పాస్‌లో వేలిముద్ర వేయించుకోవాలి. ఇది నిబంధన. అయితే అందుకు విరుద్ధంగా కొందరు డీలర్లు తమ అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. రెండు సరుకులు ఇచ్చేసి అన్ని సరుకులు ఇచ్చినట్లుగా వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ–పాస్‌లో ఇచ్చినట్లుగా ఉంది కాబట్టి సరుకులు కార్డుదారుని చేరినట్లు ఆన్లైన్లో నమోదవుతుంది. దోపిడీ జరిగే తీరు ఇలా.. గత నెల వరకు ఇచ్చిన సరుకులకే కార్డుదారులు డబ్బులు ఇచ్చేవారు. ప్రస్తుత నెలలో సరుకులను అప్పుగా డీలర్లు ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని వచ్చె నెలలో ఇచ్చే సరుకుల మొత్తాన్ని కలసి కార్డుదారుని ఖాతా నుంచి తమ ఖాతాకు బదిలీ చేసుకుంటారు. రమణ విషయం తీసుకుంటే అతనికి ఇచ్చిన సరుకులు రెండు. అందుకు అయిన మొత్తం రూ.23. అయితే నాలుగు సరుకులు ఇచ్చినట్లుగా రూ.58.50 పైసలకు రసీదు ఇచ్చాడు. అంటే వచ్చే నెలలో ఈ మొత్తం రమణ ఖాతా నుంచి డీలర్ ఖాతాలోకి వెళ్లిపోతుంది. ఇక్కడ ఇవ్వని సరుకులు గోధుమ పిండి(రూ.16.50), కిరోసిన్(రూ.19). మొత్తం రూ.25.50 పైసలు డీలర్ సునాయసంగా నొక్కేస్తున్నాడనేది స్పష్టమవుతోంది. అనంతపురం ఆర్డీఓ మలోల ఏమంటున్నారంటే... కార్డుదారునికి ఇచ్చిన సరుకులకు మాత్రమే డీలర్ రసీదు ఇవ్వాలి. ఇవ్వని సరుకులు కూడా ఇచ్చినట్లుగా నమోదు చేయడం నేరం. అలా ఎవరైనా డీలరు అధికంగా వసూలు చేస్తున్నా, ఇవ్వని సరుకులు ఇచ్చినట్లు రసీదు ఇస్తుంటే వెంటనే మా దృష్టికి లేదా తహశీల్దారు దృష్టికైనా తీసుకువస్తే సదరు డీలర్‌పై చర్యలు తీసుకుంటాం. -
జిల్లాకు పదివేల ఈ పాస్ యంత్రాలు
- నగదు రహిత లావాదేవీల కోసం ప్రతిపాదన - రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానున్న నగదు సమస్య - డీసీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్) : రానున్న రోజుల్లో నగదు కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందని, సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకు అధికారులు నగదు రహిత లావాదేవీలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. పది రోజుల్లో జిల్లాకు కనీసం పది వేల ఈపాస్ యంత్రాలను తెప్పించి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్హాల్లో బ్యాంకర్లతో డీసీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగదు కొరతను అధిగమించడంలో బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతోపాటు ప్రతి ఒక్కరికీ ఏటీఎం, రూపే కార్డులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు అవసరమైన స్వైపింగ్ మిషన్లు, మినీ ఏటీఎంలను తెప్పించాలన్నారు. కిరాణం షాపులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 445 బ్రాంచుల్లో ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమస్తామని, ఈయన బ్యాంకు ఖాతాల ప్రారంభంలోనూ, ఇతరత్రా కార్యక్రమాల్లో బ్యాంకర్లకు సహకరిస్తాన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభిస్తే స్వైపింగ్ మిషన్లను పంపిణీ చేయాలన్నారు. తమ దగ్గర లైసెన్సులు పొందిన వ్యాపారులందరూ స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను వీటివైపు మళ్లించాలని సూచించారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు సారూ.. బ్యాంకుల్లో డబ్బులు లేవని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు కలెక్టర్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు సహా దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు నగదు కొరతపై కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు రూ.160 కోట్లు వచ్చినా, అన్ని రెండు వేల నోట్లే వచ్చాయని, అందువల్ల చిల్లర సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాకు అవసరమైన నగదును తెప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో జేసీ హరికిరణ్, ఎల్డీఎం నరసింహరావు, ఆంధ్రాబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
149 మంది డీలర్ల సస్పెన్షన్
కర్నూలు(అగ్రికల్చర్) : ఈపాస్ మిషన్లను బైపాస్ చేసి సరుకులను కొల్లగొట్టిన 149 మంది డీలర్లను ఆర్డీఓలు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరిపై క్రిమినల్కేసులు నమోదు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో తహసీల్దార్లకు, అర్బన్ ప్రాంతాల్లో ఏఎస్‌ఓలకు ఆర్డీఓలు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి నగరంలోని వందమంది డీలర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని నాలుగు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇచ్చారు. కర్నూలు నగరంలో మొత్తంగా 162 మంది డీలర్లు ఉన్నారు. ఒకేసారి ఈపాస్ కుంభకోణంలో 100 మంది డీలర్లకు సంబంధం ఉండడం, వారిని సస్పెండ్ చేయంతో డిసెంబర్ నెల ప్రజాపంపిణీ ప్రశ్నార్థకం కానునుంది. డిసెంబర్లో ప్రజా పంపిణీని కర్నూలు నగరంలో ఎలా చేపట్టాలనే దానిపై పౌర సరఫరా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉన్న డీలర్లకు ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించడం, ఇలా సాధ్యం కాకపోతే పట్టణ మహిళా సమాఖ్యల ద్వారా పంపిణీ చేయడం తదితర మార్గాలను అన్వేషిస్తున్నట్లు డీఎస్ఓ తిప్పేనాయక్ వివరించారు. -
డెబిట్‌కార్డులతోనే లావాదేవీలు
ప్రతి షాపులోనూ ఈపాస్ మిషన్ ఉండాల్సిందే – వ్యాపారులు కరెంట్ ఖాతాలు ప్రారంభించి ఈపాస్ యంత్రాలు పొందాలి – నేటి నుంచి ఉద్యమంగా డెబిట్‌కార్డుల పంపిణీ – విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయకుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి దుకాణంలో ఈపాస్ మిషన్, ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డు ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ప్రకటించారు. రానున్న 10–15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి అన్ని రకాల లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించడానికి కార్యచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ఉత్పన్నమైన పరిమాణాలను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. జిల్లాలో ఎరువులు, కిరాణం షాపులు, చౌక ధరల దుకాణాలు తదితరాలన్నీ 23వేలకు పైగా ఉన్నాయని, వీటన్నింటిలోనూ బ్యాంకుల ద్వారా ఈపాస్ మిషన్లను ఏర్పాటు చేసి డెబిట్ కార్డుల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు çప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి పది వేల ఈపాస్ మిషన్లు సరఫరా చేసేందుకు బ్యాంకులు ముందుకు వచ్చాయని, ఎస్బీఐ 2వేలు, ఎస్బీహెచ్, సిండికేట్ బ్యాంకు ఒక్కొక్కటీ వెయ్యి ప్రకారం ఈపాస్ మిషన్లు సరఫరా చేస్తామని ప్రకటించాయన్నారు. అన్ని రకాల వ్యాపారులు బ్యాంకుల్లో కరెంట్ ఖాతాలను ప్రారంభించి రూ.50 వేలు డిపాజిట్ చేస్తే బ్యాంకులు కొత్త నోట్లు రూ.50 వేలు ఇస్తాయని, దీని ద్వారా లావాదేవీలు నిర్వహించాలన్నారు. డెబిట్ కార్డులు వాడకం వల్ల వ్యాపార లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయని, జీరో వ్యాపారానికి అవకాశం ఉండదన్నారు. ప్రతి మండలంలో ఎంపీఈఓలు, ఎన్ఆర్ఈజీఎస్, డీఆర్డీఏలకు చెందిన 20 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని, వీరి ద్వారా ఆదివారం నుంచి ప్రజలందరికీ డెబిట్‌కార్డులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇతరుల డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఖాతాల్లో వేసుకొని ఇబ్బంది పడవద్దని ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 2000 నుంచి 2500 మందిని బిజినెస్ కారస్పండెంట్లను నియమించి వారి ద్వారా బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తామన్నారు. ఒకటో తేదీ నుంచి మొదలయ్యే ప్రజాపంపిణీ సైతం నగదు రహితంగా ఈపాస్‌ల ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
కల్యాణలక్ష్మి దరఖాస్తులకు లైన్ క్లియర్
♦ అందుబాటులోకి ‘ఈపాస్’ సేవలు... ♦ ఉపకార వేతన దరఖాస్తుకు 30 వరకు గడువు సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల దరఖాస్తులకు మార్గం సుగమమైంది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గత నెల పన్నెండో తేదీ నుంచి ఈపాస్‌లో సేవలు నిలిచిపోవడంతో విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ స్తంభించిన విషయం తెలిసిందే. కొత్తగా జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కావడం, వాటి పరిధిలోని గ్రామాలు, విద్యాసంస్థల వివరాలను వెబ్సైట్లో విభజించేందుకు ప్రభుత్వం సేవల్ని నిలిపివేసింది. తాజాగా ‘ఈపాస్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు నెల రోజులపాటు కసరత్తు చేపట్టిన సాంకేతిక బృందం తాజాగా ప్రక్రియను పూర్తి చేసింది. 2016–17 విద్యాసంవత్సరంలో పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్(సీనియర్) విద్యార్థులు ఈపాస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 2014–15, 2015–16 విద్యాసంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ఈపాస్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో కొందరి పెళ్లిళ్లు జరిగాయి. నిబంధనలకు లోబడి ఉన్నవారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే వీలుంది. దరఖాస్తు ప్రక్రియలో పెళ్లికూతురు తల్లి బ్యాంకు ఖాతా నంబర్‌ను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం కింద పంపిణీ చేసే నగదును నేరుగా ఆ ఖాతాలో జమ చేయనున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతా నంబర్‌ను ప్రభుత్వం అనివార్యం చేసింది. -
గుట్టు రట్టు
- 'రేషన్ బియ్యం’ పంపిణీలో అక్రమాలు – క్లోజింగ్ బ్యాలెన్స్‌లో మాయాజాలం – కంప్యూటర్ ఆపరేటర్ల చేతివాటం – ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి సరుకులు స్వాహా – ఈ స్కామ్ ముద్దుపేరు 'స్కీమ్' – ముగ్గురు డీలర్లు, ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, డీఎస్ఓ కార్యాలయం మాజీ ఆపరేటర్ అరెస్ట్ కర్నూలు: చౌక ధరల దుకాణాల్లో అక్రమాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఈ–పాస్ యంత్రాలను బైపాస్ చేసి సరుకులను స్వాహా చేసి సొమ్ము చేసుకున్న ముఠా గుట్టు రట్టయ్యింది. డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కుమ్మక్కై ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందించాల్సిన సబ్సిడీ సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. శ్రీశైలంలో తీగ లాగితే కర్నూలులో డొంక కదిలింది. శ్రీశైలానికి చెందిన చౌక డిపో డీలర్ చెరుకూరి మల్లికార్జున డీఎస్ఓ కార్యాలయ ఆపరేటర్ లావణ్య మొదటగా ఈ స్కామ్‌కు తెర తీశారు. ఈ–పాస్ యంత్రాల ద్వారా సరుకు బోగస్ లావాదేవీల గురించి డీఎస్ఓ తిప్పేనాయక్ ప్రాథమిక విచారణ జరిపి ఈనెల 3వ తేదీన శ్రీశైలం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీసీఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా నేతృత్వంలో దర్యాప్తు చేసి అందుకు బాధ్యులైన శ్రీశైలానికి చెందిన ముగ్గురు డీలర్లు సి.హెచ్.మల్లికార్జున, మిద్దె నాగమల్లయ్య, ఎర్ర చిన్నమల్లికార్జున, నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్ఐసీ, హైదరబాదు) సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ మువ్వ స్వప్న, డీఎస్ఓ కార్యాలయం మాజీ కంప్యూటర్ ఆపరేటర్(కర్నూలు అశోక్‌నగర్) ఎస్.లావణ్య తదితరులను అరెస్టు చేసి ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరుపరిచారు. సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరాతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను ఎస్పీ వెల్లడించారు. అక్రమాలు ఇలా.. హైదరాబాదులోని ఎన్ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్న స్వప్న డీఎస్ఓ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లావణ్య డీలర్లతో కుమ్మక్కై ఈ స్కామ్ వ్యవహారం నడిపించారు. శ్రీశైలానికి చెందిన చెరుకూరి మల్లికార్జున ఇందుకు ప్రధాన సూత్రధారి. కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో ఒకరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, వైజాగ్‌లో 12 మంది డీలర్లు ఈ స్కీమ్‌లో చేరి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఒక్కొక్క డీలర్ నుంచి రూ.10 వేల అడ్వాన్స్, నెలకు రూ.5 వేలు మామూళ్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని 2016 ఏప్రిల్ నుంచి జులై దాకా 'బోగస్' వ్యవహారాన్ని నడిపించారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం(ఎన్ఐసీ)లో పనిచేస్తున్న డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న ఆన్లైన్లో క్లోజింగ్ బ్యాలెన్స్‌ను తగ్గించి చూపించి సరుకు పంపిణీ అయినట్లుగా డేటాను సర్దుబాటు చేసి అందుకు భారీగా మామూళ్లు దండుకుంది. సర్దుబాటు చేసిన సరుకుల్లో 50 శాతం వాటా డబ్బులు ఇచ్చే విధంగా మాట్లాడుకుని డీలర్ మల్లికార్జున ఆపరేటర్ లావణ్య ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపించారు. మొత్తం 18 దుకాణాల్లో ఈ–పాస్ మిషన్లు బైపాస్ చేసి సరుకులను పక్కదారి పట్టించినట్లు విచారణలో వెలుగు చూసింది. బయటపడింది ఇలా.. శ్రీశైలానికి చెందిన డీలర్ మల్లికార్జున ఈ స్కీమ్‌లో చేరిన మిగిలిన డీలర్లతో నెలనెలా వసూలు చేసిన డబ్బులను లావణ్య అకౌంట్‌కు జమ చేశారు. అందులోనుంచి ఎన్ఐసీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ స్వప్న సోదరుని అకౌంట్‌కు ఒకసారి రూ.3 లక్షలు, రెండవసారి రూ.3 లక్షలు నగదు రూపేణ జమ చేసినట్లు బయటపడింది. రెండు నెలల క్రితమే విషయం వెలుగులోకి రావడంతో లావణ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్ఐసీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాండే (ఉత్తరప్రదేశ్ వాసి)తో పరిచయం పెంచుకుని తెర వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపించింది. సంవత్సరానికి అడ్వాన్స్‌గా రూ.9,60,000 పాండే బ్యాంక్ అకౌంట్‌కు 'ఎన్ఈఎఫ్టీ' ద్వారా నగదు పంపినట్లు పోలీసు విచారణలో బయటపడింది. లావణ్య పంపిన డీలర్ల వివరాల మేరకు ఆన్లైన్లో వారి క్లోజింగ్ బ్యాలెన్స్‌ను సర్దుబాటు చేసి సరుకులను మిగిల్చి లాభం చేకూర్చారు. కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 'బోగస్' లావాదేవీల వ్యవహారం పెద్ద ఎత్తున జరిగినట్లు దర్యాప్తులో తేలింది. దర్యాప్తు కొనసాగుతోంది: ఎస్పీ ఈ–పాస్ యంత్రాన్ని బైపాస్ చేసి రేషన్ బియ్యాన్ని స్వాహా చేసిన ముఠా వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. కార్డుదారులకు పంపిణీ చేయగా మిగిలిన సరుకుల(క్లోజింగ్ బ్యాలెన్స్)ను ఆన్లైన్లో సర్దుబాటు చేసి డీలర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు సగంసగం పంచుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ బోగస్ వ్యవహారం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగినట్లు ప్రాథమికంగా సమాచారముంది. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో రూ.20 లక్షలకు పైగా చేతులు మారాయి. ఇందుకు బాధ్యులైన ఆరుగురిపై ఐపీసీ 420, 409, ఐటీ యాక్ట్ 66 కింద కేసులు నమోదు చేసి కటకటాలకు పంపాం. ప్రజల సొమ్మును దోచుకుంటే ఎవరినీ వదిలేది లేదు. డీఎస్పీ స్థాయి అధికారి బోగస్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయం త్వరలో బయటపడుతుంది. కర్నూలు జిల్లాలో సుమారుగా మూడు వందల మందికి పైగా డీలర్లు ఈ స్కామ్‌లో చేరినట్లు ప్రాథమికంగా సమాచారముంది. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఈ స్కీమ్ వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
ఈ–పాసు’ గాలా..!
–రేషన్ బియ్యం పక్కదారి! –అక్రమాలను అరికట్టలేని టెక్నాలజీ –సర్కారు కోతలు వట్టిదే! –పట్టుబడిన 25 టన్నుల బియ్యం lప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఈ–పాస్ విధానం ఆచరణలో విఫలమైంది. దీనివల్ల లబ్ధిదారులకే సరుకులు అందుతాయని, అవకతవకలకు తావే ఉండదని ప్రభుత్వం పలికిన బీరాలు వట్టిదేనని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 25 టన్నుల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అడపదడపా చేపట్టిన దాడుల్లోనే ఇంతపెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే.. వాస్తవంగా జిల్లాలు దాటుతున్న బియ్యం విలువ ఎంత ఉంటుందో అంచనాకూ అంతుబట్టని దుస్థితి నెలకొంది. చింతలపూడి : జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతూంది. మన జిల్లా నుండే కాకుండ సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడ రేషన్ బియ్యం భారీగా దిగుమతి అవుతూంది. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు వస్తున్నాయి. పేదల కడుపు నింపాల్సిన రూపాయి కిలో బియ్యం రైస్ మిల్లులకు చేరి పాలిష్ చేసి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యంగా మారి అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో అధికారులకు పట్టుబడిన రేషన్ బియ్యం సుమారు 25 టన్నులు. పట్టుబడకుండ జిల్లాలు దాటుతున్న బియ్యం ఏస్ధాయిలో ఉందో ఊహకే అంతుపట్టదు. ప్రభుత్వం సబ్సిడీ భరించి రూపాయికే కిలో బియ్యం అందిస్తూంది. జిల్లాలో 12,46,871 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో 10,77,504 తెల్ల రేషన్ కార్డులు కాగ, 1,034 అన్నపూర్ణ కార్డులు, 1,60,033 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ బియ్యానికి బయట మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో అక్రమ రవాణా వ్యాపారంగా మారింది. కొన్నిచోట్ల డీలర్లు, మరికొన్ని చోట్ల లబ్దిదారులే చౌక బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతూంది. అధికారులకు విషయం తెలిసినా ఎవరైనా సమాచారం అందించే వరకు పట్టించుకోరన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని భావించిన ప్రభుత్వం ఈ పాస్ విధానం ప్రవేశపెట్టి బయోమెట్రిక్ విధానం ద్వార లబ్దిదారుల నుండి వ్రేలిముద్రలు సేకరించి మరీ రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంది. బియ్యం లబ్దిదారులకు చేరాక అసలు తతంగం ప్రారంభం అవుతుంది. రేషన్ బియ్యానికి భారీ సబ్సిడీ ఉండటం, భారీగా లాభాలు వస్తుండటంతో లబ్దిదారులను ప్రలోభపెట్టి కిలో 10 నుండి 12 రూపాయలకు దళారులు కొంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని మిల్లులకు సరఫరా చేసి కోట్లు దండుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలం, రాఘవాపురం కేంద్రంగా ఈ అక్రమ దందా యధేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తూంది. ఇటీవల రాఘవాపురం నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు. అంతకుముందు కూడ గణిజర్ల నుండి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెడుతున్నా పరిస్ధితిలో మార్పు రావడం లేదు. మూడు సార్లు ఒకే వ్యక్తి ఈ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం ఇక్కడ విశేషం. భారీ లాభాలు వస్తుండటంతో వ్యాపారులు బరితెగించి ఈ వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు సబ్సిడీ బియ్యం పట్టుబడ్డ సందర్భాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు కూడ నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కేసుల్లో పట్టుబడ్డ వారిపై సాధారణంగా 6(ఏ) కేసులు నమోదు చేస్తారు. వీటిని పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకునే సరికి కాలం గడిచి పోతూంది. ఒకవేళ ఎవరికైనా శిక్ష పడిన దాఖలాలు ఉన్నాయా అంటే అవీ లేవు. దీంతో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా యధేఛ్ఛగా సాగిపోతూంది. తెలంగాణాకు సరిహద్దు మండలం కావడంతో తెలంగాణ రాష్ట్రం నుండి రేషన్ బియ్యం ఇక్కడికి భారీగా దిగుమతి అవుతూంది. ఇక్కడి నుండి లారీల్లో లోడు చేసి మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దష్టి సారించి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఏడాది 6 కేసులు నమోదు ఈ ఏడాది ఇప్పటి వరకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశాం. 25 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిస్తే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. ఎస్ శివశంకర్‌రెడ్డి –డీఎస్ఓ ,ఏలూరు -
అంతా హైదరాబాద్ నుంచే..
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారుల కీలకపాత్ర! – కార్డుకు రూ.200 ముట్టజెబుతున్న డీలర్లు – ఈ–పాస్ విధానం అపహాస్యం ఈ–పాస్ విధానంతో రేషన్ అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..ఇదంతా ఉత్తిదే. అక్రమార్కులు ఏదో ఒకవిధంగా కన్నం వేస్తూనే ఉన్నారు. ఈ–పాస్ విధానాన్ని కూడా అపహాస్యం చేస్తూ బోగస్ కార్డులతో భారీఎత్తున రేషన్ కొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంలో డీలర్లకు స్వయాన పౌరసరఫరాల శాఖ సిబ్బందే దన్నుగా నిలుస్తుండడం గమనార్హం. తాడిపత్రి : తాడిపత్రిలో కలకలం రేపుతున్న బోగస్ రేషన్‌కార్డుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ సిబ్బందే ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లోని వ్యక్తుల ఆధార్ నంబర్లు మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ–పాస్‌లో ఆధార్ నంబర్ మార్చడం ఆషామాషీ కాదు. పౌరసరఫరాల శాఖ సాంకేతిక అధికారులతోనే ఇది సాధ్యం. దీంతో డీలర్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయ సిబ్బందితో లింక్ పెట్టుకున్నారు. ప్రతినెలా ఒక్కో బోగస్ కార్డుపై రూ.200 వరకు ఇస్తూ ఆధార్ నంబర్లు మార్పు చేయిస్తున్నారు. వాటి స్థానంలో తమకు సంబంధించిన వారి నంబర్లు నమోదు చేయిస్తున్నారు. వారి వేలిముద్రల ద్వారా సరుకులు తీసుకున్న తర్వాత ముందున్న నంబర్లను యథావిధిగా ఉంచుతున్నారు. ఉదాహరణకు.. నారాయణమ్మ అనే మహిళ పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది. కానీ ఆమె సరుకులు తీసుకోదు. ఏదైనా అవసరానికి కార్డు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని తీసుకుని ఉంటుంది. ఆమె కార్డుకు సంబంధించిన ఆధార్ నంబర్ల స్థానంలో డీలర్‌కు చెందిన వారివి నమోదు చేస్తారు. వారితో ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయిస్తారు. సరుకులు డ్రా కాగానే మళ్లీ పాతవే ఉంచేస్తారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే తెల్లరేషన్ కార్డులు ఇస్తారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతరత్రా వాటికి కార్డు తప్పనిసరిగా మారింది. దీంతో ఉన్నత స్థాయి, మధ్యతరగతి వారు కూడా తెల్లకార్డులు తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు. వీరంతా రేషన్ షాపులకు ఎప్పుడూ వెళ్లరు. తాడిపత్రిలో ఇలాంటి కార్డులు చాలానే ఉన్నాయి. వీటి ద్వారా డీలర్లు ప్రతినెలా నిత్యావసరాలను స్వాహా చేస్తున్నారు. వాటిని నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే వందల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు తరలుతున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు హడావుడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బందాలతో బోగస్ కార్డులపై విచారణ చేయిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా బోగస్ కార్డులను గుర్తిస్తారా? ఒకవేళ గుర్తించినా ‘అధికార’ ఒత్తిళ్లను అధిగమించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు వేచివుండక తప్పదు. -
బడి బియ్యం అక్రమాలకు చెక్
– ఈ–పాస్ విధానం ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కసరత్తు – సమస్యలు తలెత్తితే విద్యార్థులు పస్తులే చిత్తూరు (ఎడ్యుకేషన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రేషన్ షాపుల్లో అమలవుతున్న ఈ–పాస్ విధానాన్ని మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాలోను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తున్నా రేషన్‌దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందడంలేదనే విమర్శలున్నాయి. అయితే ఇవేవి పట్టించుకోకుండా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని ఈ–పాస్ విధానంతో అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. ఈ– పాస్ విధానంలో భాగంగా మధ్యాహ్న భోజనం బియ్యం తీసుకునేందుకు పాఠశాల హెచ్ఎం పేరు, మొబైల్ నంబర్, ఆధార్ సంఖ్య, వంట నిర్వాహకుల ఆధార్ నంబర్లు ఆన్లైన్లో పొందపరచనున్నారు. ఇందులో భాగంగా వారు మాత్రమే బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా ప్రతి రోజూ మధ్యాహ్నభోజనానికి సంబంధించిన వివరాలను పాఠశాల హెచ్ఎం తప్పనిసరిగా ఉన్నతాధికారులకు ఎస్ఎంఎస్ రూపంలో పంపాలని, అలాగే విద్యాశాఖ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. ఈ విధానంతో మధ్యాహ్నభోజనం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నది రాష్ట్ర విద్యాశాఖ ఉద్దేశం. ఈ విధానంలో నిర్లక్ష్యం వహిస్తే మధ్యాహ్నభోజన నిధులు, బియ్యం సరఫరా నిలిపివేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విధానంపై వారం రోజుల క్రితం జరిగిన సర్వశిక్షా అభియాన్ ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జిల్లా సమావేశంలో శిక్షణ ఇచ్చారు. లోపాల సంగతేంటి? ప్రస్తుతం రేషన్‌షాపుల్లో అమలవుతున్న ఈ–పాస్ విధానంతో కొన్ని నెలలు అంత్యోదయ, అన్నయోజన కార్డుదారులకు బియ్యం సక్రమంగా సరఫరా చేయలేదు. 35 కిలోలు తీసుకునే వారు 5 కిలోలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించినా ఇప్పటికీ సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందువల్ల ఈ–పాస్ విధానంలో సమస్యలొస్తే బియ్యం సరఫరా కాక విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. మంచి పద్ధతే మధ్యాహ్నభోజనం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల పారదర్శకత ఏర్పడుతుంది. ఉన్నతాధికారులకు కూడా దీనిపై సమాచారం పక్కాగా అందుతుంది. ఈ–పాస్ విధానంలో సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది – సహదేవనాయుడు, ఎస్టీయూ -
కళాశాలలు రిజిస్టర్ చేసుకోవాలి
కడప కోటిరెడ్డి సర్కిల్: సాంఘిక సంక్షేమ శాఖలో ఈ పాస్ వెబ్సైట్లో 2016–17 సంవత్సరానికి కళాశాలలు రిజిస్టరు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించామని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 413 ప్రభుత్వ, ప్రయివేటు, డిగ్రీ ఇతర వృత్తి కళాశాలలు ఉన్నాయన్నారు. వాటిలో 299 కళాశాలల వారు రిజిస్టర్ చేసుకొన్నారని, ఇంకా 114 కళాశాలలు రిజిస్టర్ చేసుకోలేదని వీరంతా ఈ నెల 31వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకోవాలని ఆమె కోరారు. రిజిస్టర్ చేసుకున్న హార్డ్ కాపీలను ఆమోదం కోసం ఉప సంచాలకులు సాంఘిక సంక్షేమశాఖ వారికి సమర్పించాలన్నారు. -
ఈ-పాస్‌తో భూముల రికార్డులు తారుమారు
ఒంగోలు టౌన్: పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ లేకుండా 1బి ఆధారంగానే ఈ-పాస్ పుస్తకం ఇవ్వడం వల్ల భూముల రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.వి.ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల భూములను రీ సర్వేచేసి తప్పులు సరిచేసి ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మల్లయ్య లింగం భవనంలో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ-పాస్ పుస్తకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. 1బీ ఆధారంగా ఈ-పాస్ పుస్తకం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతు సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 31 వరకు కడపలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్‌షాపుకు జిల్లా నుంచి 30 మంది రైతులు హాజరు కావాలన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభలు ఆగస్టు చివరి వారంలో మేదరమెట్లలో నిర్వహించాలని కోరారు. సభ్యత్వాలు పూర్తిచేసి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలను పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎరువుల ధరలను వెంటనే అమలుచేసి రాష్ట్రంలోని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు డీ శ్రీనివాస్, వీ హనుమారెడ్డి, నాయకులు వై సింగయ్య, కే వీరారెడ్డి, బి.ప్రసాద్, పి.వి.కొండయ్య, జి.వెంకటేశ్వర్లు, కె.ఎల్.డి.ప్రసాద్, బి.సుబ్బారెడ్డి, బి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రకాశంను కరువు జిల్లాగా ప్రకటించాలని, జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని సమావేశంలో తీర్మానించారు. -
దోచుకోడానికే ఈ పాస్‌బుక్ విధానం
రైతు ఇంటి యాజమాన్య హక్కుగా పిలిచే పట్టాదారు, టైటిల్ డీడ్ పుస్తకాలను రద్దుచేసి ఎలక్ట్రానిక్ పాస్‌బుక్ విధానం ప్రవేశపెట్టడంలో ప్రభుత్వ కుట్ర దాగిఉందని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు. రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ స్వగ్రామం కృష్ణాజిల్లా కలిదిండి మండలం కొండూరు పంచాయతీ కార్యాలయం వద్ద రైతు సంఘాల నిజనిర్ధారణ కమిటీ ఆదివారం రైతులతో ముఖాముఖి చర్చను ఏర్పాటు చేసింది. గ్రామంలో మొత్తం 536 రైతుల పట్టాదారు పుస్తకాలను పరిశీలించగా ఈ-పాస్ బుక్ 1బీలో 125 మంది రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తప్పులు ఉన్నట్లు గుర్తించారు. రైతులు తమకు వెబ్‌ల్యాండ్, ఆన్లైన్ అంటే ఏమిటో కూడా తెలియదని కమిటీ ముందు చెప్పారు. తమ భూములకు శిస్తులు కడుతున్నప్పటికీ ఎవరి పేర్లో ఆన్లైన్లో నమోదైన ట్లు పుస్తకాలు చూపించారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ ఈ-పాస్‌బుక్ విధానం ఎంత గందరగోళంగా ఉందనేదానికి తానే ఓ ఉదాహరణ అన్నారు. తన పేరుతో ఉన్న బుక్‌లో తండ్రి పేరు మరొకరిది ఉందన్నారు. ఈ-పాస్ విధానాన్ని వినియోగించే స్థాయికి రైతు కుటుంబాలు రాలేదన్నారు. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ 42 ఏళ్ల కిందట మరణించినవారి పేర్లు 1బీలో చేర్చారని, రిజిస్ట్రేషన్‌కు వారిని తీసుకురాలేము కదా అని ప్రశ్నించారు. ఏపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ కోట్లు దండుకునే దుర్బుద్ధి ఈ విధానంలో ఉందన్నారు. మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలి.. రైతులు నకిలీ పాసుపుస్తకాలను అరికట్టడమంటే వాటిని నియంత్రించలేక ఈ-పాస్ తీసుకొచ్చిన మంత్రి కృష్ణమూర్తి రాజీనామా చేయాలని డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. భూ వివాదాలపై కోనేరు రంగారావు, జయదేవ్ఘోష్ కమిటీల మాదిరిగా ఎందుకు కమిటీని వేయలేదన్నారు. భారతీయ కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి జె.కుమారస్వామి మాట్లాడుతూ జీవో నంబరు 255ను వెంటనే రద్దుచేయాలన్నారు. లేదంటే కిసాన్ మోర్చా అధ్వర్యంలో జీవో ప్రతులను తగలబెడతామన్నారు. 11న జిల్లా కేంద్రాల్లో నిరసన... పాసుపుస్తకాల రద్దు ఆదేశాలు నిలిపివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 11న రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన చేపడుతున్నట్లు రైతుసంఘ నాయకులు చెప్పారు. పార్టీలకు అతీతంగా రైతులు హాజరుకావాలని కోరారు. కొండూరులో జరిగిన చ ర్చలో వివిధ జిల్లాల రైతు సంఘ నాయకులు రాజమోహన్‌రావు, రామచంద్రరాజు, నాగబాబు, కృష్ణమూర్తి, పాండురంగరాజు, తమ్మినేని నాగేశ్వరరావు, మధుసూదనరావు, వేణు, యలమందారావులు పాల్గొన్నారు. -
ఈ-పాస్‌బుక్ విధానంతో రైతులకు తీవ్రనష్టం
హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకాల రద్దు నిర్ణయం సరైంది కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ-పాస్బుక్లంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారని, ఈ విధానంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాల స్థానంలో ప్రవేశపెడుతున్న ఈ-పాస్‌బుక్ విధానంతో ఎలాంటి ఫలితం ఉండదన్నారు. రైతులకు తెలియకుండా వారి భూములు మరొకరికి బదలాయించే అవకాశం ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు. అవగాహన లేకుండా జీవోలు జారీ చేయటం సరైన పద్ధతి కాదన్నారు. కనుక తక్షణమే ఈ పాస్‌బుక్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. -
తెలంగాణకు ఏపీ అధికారి చక్రధర్‌రావు
శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం జిల్లా సమగ్ర మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఉన్న గుమ్మడి చక్రధర్‌రావును తెలంగాణకు పంపించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజనల్ డెరైక్టర్ నేరుగా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహంను కలసి ఆయనను రిలీవ్ చేయాలని కోరడంతో రాత్రికి రాత్రే రిలీవ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాల ఈ-పాస్ అమలు సక్రమంగా లేదని పదిరోజుల క్రితమే అతన్ని ఏపీ ప్రభుత్వ అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ పూనం మాల కొండయ్య సస్పెండ్ చేశారు. అయితే కలెక్టర్ సూచనతో 24 గంటల వ్యవధిలోనే సస్పెన్షన్ ఉత్తర్వులు నిలుపుదల చేశారు. -
చుక్కలు చూపిస్తున్న ‘చంద్రన్న’ కానుక
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా లబ్ధిదారులకు చంద్రన్న కానుక పేరుతో ఉచితంగా సరుకులు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తోంది. సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల మూడు రోజులుగా ఈ-పాస్ మిషన్లు సరిగా పని చేయడం లేదు. ప్రజలు రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి వేచిచూస్తున్నా రోజుకు 20 నుంచి 30 కార్డులకు మించి సరుకులు అందడం లేదు. పరిస్థితి ఇలానే ఉంటే పండుగ రోజుకు లబ్ధిదారుల్లో సగం మందికి కూడా సరుకులు పంపిణీ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైంది. సంక్రాంతి పండుగకు రూ. 270 విలువ చేసే అరకిలో కందిపప్పు, అరలీటర్ పామాయిల్, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యితో కూడిన సరుకులను తెల్లరేషన్‌కార్డు దారులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రోజు కూలీ రూ. 300 వదిలిపెట్టుకున్నా ఈ ఉచిత సరుకులు అందడం లేదని పేదలు వాపోతున్నారు. శుక్రవారం 7 లక్షల మందికే కానుక మూడు రోజులుగా చంద్రన్న కానుకను సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 28,254 రేషన్ షాపులు ఉంటే వీటిలో సర్వర్ సమస్య కారణంగా శుక్రవారం 8,388, శనివారం 5,175 షాపుల్లో ఒక్క లబ్ధిదారుడికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోయారు. కానుక కోసం 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు. అయితే శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల లబ్దిదారులకు మాత్రమే సరుకులు అందాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచిచూసి సరుకులు తీసుకోకుండానే వెనక్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్రాంతి పండుగలోపు సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ-పాస్‌తో సంబంధం లేకుండా రికార్డుల్లో సంతకం(మాన్యువల్) తీసుకొని సంక్రాంతి సరుకులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్ షాపులకు తాళం వేస్తాం.. గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలా చోట్ల రేషన్ డీలర్లపై లబ్ధిదారులు దాడులు చేశారు. వాటిని దృష్టిలో ఉంచుకొని అలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డీలర్లు వాపోతున్నారు. మున్ముందు సర్వర్ సమస్య ఇలాగే కొనసాగితే డీలర్లందరూ రేషన్ షాపులకు తాళాలు వేసి వాటి తాళం చెవులను జాయింట్ కలెక్టర్లకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని రేషన్ డీలర్ల సంఘం నేతలు పేర్కొంటున్నారు. వెంటనే క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించి ఇటు లబ్ధిదారులకు అటు రేషన్ డీలర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీలర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చుక్కలు చూపిస్తున్న చంద్రన్న కానుక
-
మొరాయించిన ఈ పాస్ మిషన్లు
సంతమాగులూరు: క్రిస్మస్ సందర్భంగా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న వంట సరుకుల పంపిణీకి ఈ-పాస్ మిషన్ల రూపంలో పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో 42 రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో.. పేదలకు ఇవ్వాల్సిన సరుకుల పంపణీ ఆగిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు ఆందోళన చేస్తున్నారు. -
గ్రేటర్లో ‘ఈ-పాస్’కు బ్రేక్
సాక్షి, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చౌకధరల దుకాణాల్లో ‘ఈ-పాస్’ అమలు నిలిచిపోయింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా.. రేషన్ షాపుల్లో అమలు తలపెట్టిన ఈ-పాస్ విధానానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జీహెచ్ఎంసీ పరిధిలోని 1545 రేషన్ షాపుల్లో ఈ-పాస్ ద్వారా సరుకుల పంపిణీ అమలును నిలిపివేయాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్ డాక్టర్ రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిణి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అమలుకు ముందే నిలిపివేత ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ-పాస్ అమలుకు అవాంతరాలు ఏర్పడ్డా.. రేషన్ షాపుల్లో అమలుకు ముందే ఈ-పాస్ ప్రక్రియ ఆగిపోయింది. డీలర్లు ఈ-పాస్‌పై ఆది నుంచి నిరాసక్తత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పౌర సరఫరాల శాఖ గత నెలలో సర్కిల్ వారిగా ఈ-పాస్ యంత్రాలపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే.. పెండింగ్ సమస్యల సాకుతో డీలర్లు శిక్షణను బహిష్కరించారు. తిరిగి ఈనెల రెండో వారంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చినా.. తూతూ మంత్రంగా సాగాయి. సర్కిల్ వారీగా యంత్రాలు అందుబాటులో ఉంచినా వాటిని తీసుకునేందుకు డీలర్లు ముందుకు రాలేదు. సంబంధిత అధికారులు డీలర్లకు బలవంతంగా యంత్రాలను అప్పజెప్పినా..వాటిని వినియోగించకుండా పాత పద్ధతిలోనే సరుకుల పంపిణీ ప్రారంభించారు. మరోవైపు డీలర్ల సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి అధికమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం జోక్యం చేసుకోవడంతో ప్రభుత్వం ఈ-పాస్ అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. మూడున్నరేళ్లుగా అడ్డంకులే.. గ్రేటర్ పరిధిలో గత మూడున్నరేళ్లుగా ఈ-పాస్ అమలుకు అడ్డంకులు తప్పడం లేదు. నగరంలోని సర్కిల్‌కు ఐదు చొప్పున 45 రేషన్ షాపుల్లో ప్రయోగాత్మకంగా బయోమెట్రిక్ (ఈ-పాస్) అమలవుతున్నా విస్తరణ మాత్రం ముందుకు సాగలేదు. అమలవుతున్న షాపుల్లో మాత్రం ప్రతి నెలా సుమారు 34 శాతం సరుకు మిగులుతోంది. అయితే, ఈ-పాస్ ప్రయోగాన్ని అన్ని రేషన్ షాపులకు విస్తరించకుండా డీలర్లు అడ్డుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్వులతో డీలర్లు పైచేయి సాధించారు. గ్రేటర్లో మొత్తం 12 సర్కిళ్లలో సుమారు 1545 రేషన్ షాపులు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారు 13.96 లక్షల కార్డులు ఉండగా, ప్రతి నెలా 29,459 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం కేటాయింపు జరుగుతోంది. ఇందులో కనీసం 30 శాతం సరుకు పక్కదారి పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ-పాస్ అమలుతో పక్కదారి పట్టే బియ్యం మిగులు నిల్వగా మారే అవకాశం ఉంది. -
రెండు రాష్ట్రాలకు ఒకే ఈ-పాస్ సర్వర్‌తో ఇక్కట్లు
♦ రీయింబర్స్మెంట్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌లో సమస్య ♦ నేటితో ముగుస్తున్న గడువు ♦ మరోసారి పొడిగించాలంటున్న కాలేజీలు, విద్యార్థులు సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నమ్ముకుని ఉన్నతవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2014-15, 2015-16కు సంబంధించి రెన్యూవల్, ఫ్రెష్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఈ-పాస్‌లో నమోదు చేసుకోవడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటే ఈ-పాస్ సర్వర్ ద్వారా విద్యార్థులంతా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా దరఖాస్తులు వెల్లువెత్తడంతో ధ్రువపత్రాలన్నింటినీ ఈ-పాస్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల తాము తుది గడువు లోగా రిజిస్టర్ చేసుకోలేకపోయామని, ఈ తేదీని మరోసారి పొడిగించాలని పెద్దసంఖ్యలో కాలేజీలు, విద్యార్థులు కోరడంతో ఇదివరకే ఓ సారి గడువు పొడిగించారు. తాజాగా మళ్లీ ఆదివారంతో 2014-15, 15-16కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు ముగుస్తుండటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఈ-పాస్ వెబ్సైట్ వేగం మందగించిందని, తమ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయలేకపోతున్నామని, కాలేజీల వివరాలు డిస్ప్లే కావడం లేదంటూ పలువురు విద్యార్థులు కొన్నిరోజులుగా సంక్షేమభవన్ చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణ, ఏపీలకు విడివిడిగా 2 సర్వర్లను ఏర్పాటు చేస్తేనే ఈ సమస్య తీరుతుందని వివిధ సంక్షేమశాఖల అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ దరఖాస్తులను నమోదు చేసుకోలేదు. అంతేకాదు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల్ని పొందడంలోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. 14 లక్షల పైచిలుకు విద్యార్థులకు ఇప్పటివరకు 2015-16కు సంబంధించి 8.40 లక్షల విద్యార్థులే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2014-15కు సంబంధించి దాదాపు 50 వేల నుంచి లక్ష మంది వరకు ఇంకా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో గత, ప్రస్తుత సంవత్సరాలకు దరఖాస్తుల తుదిగడువును ఈ నెలాఖరు వరకు లేదా వచ్చేనెల 15 వరకు పొడిగించాలని సంబంధిత శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఒకటి, రెండురోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చునని తెలుస్తోంది. శాచ్యురేషన్ పద్ధతి ఉన్నట్లా లేనట్లా...! ప్రస్తుతం వివిధ సంక్షేమశాఖల ద్వారా అమలు చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అర్హులైన విద్యార్థులందరికీ అందించేలా సంతృప్తస్థాయి (శాచ్యురేషన్)ని పాటిస్తారా లేదా అన్న అనుమానాలు ఆయా వర్గాల విద్యార్థుల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులందరికీ ప్రయోజనం కలిగేలా చూడాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. శాచ్యురేషన్ పద్ధతిని అమలు చేసేట్లయితే అర్హులైన లబ్ధిదారుల వివరాలే ఈ-పాస్‌లో నమోదవుతాయి కాబట్టి, గడువు విధించకుండా, కొంత మినహాయింపునిస్తే తమకు సులువుగా ఉంటుందని కూడా ఆయా వర్గాల విద్యార్థులు కోరుతున్నారు. -
బియ్యం ఇవ్వని యంత్రం
ఈ-పాస్ ఫెయిల్ మొరాయిస్తున్న సర్వర్లు ఏడునెలలైనా వీడని బాలారిష్టాలు సరకుల కోసం రోజూ నరకమే సర్వర్ డౌన్ అయిపోయింది... మిషన్ పనిచేయడం లేదు..ఎప్పుడు పని చేస్తుందో తెలియదు..చెప్పలేం..ఏ రేషన్ షాపునకు వెళ్లినా ఇవే సమాధానాలు. కూలి పనులు మానుకొని చెప్పులరిగేలా తిరుగుతున్నా గంటలు కాదు.. ఏకంగా రోజుల తరబడి షాపుల వద్ద పడిగాపులు పడుతున్నా రేషన్ సరకులు అందక పోవడంతో కార్డుదారులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ-పాస్ అమలులోకి వచ్చి ఏడునెలలైనా బాల రిష్టాలను మాత్రం సర్కార్ అధిగమించలేక పోవడం సామాన్యులకు శాపమవుతోంది. విశాఖపట్నం : జిల్లాలో 2016 రేషన్షాపులుంటే వాటి పరిధిలో 11,22,053 బీపీఎల్ కార్డులున్నా యి. వాటిలో తెల్ల్లకార్డులు సిటీలో 3,61,251 రూరల్‌లో 6,64,199 ఉన్నాయి. ఏఏవై కార్డులు సిటీలో 7,887, రూరల్‌లో 64,866, అన్నపూర్ణ కార్డులు సిటీలో 386, రూరల్‌లో 614కార్డులున్నాయి. గత నెల వరకు నగర పరిధిలోని 412 షాపులతో సహా మొత్తం 1172 షాపుల్లో ఈ-పాస్ అమలు చేసే వారు. ఈ నెల నుంచి మరో 436 షాపులకు విస్తరించారు. ఏజెన్సీ పరిధిలోని 385 షాపులతో పాటు మైదానంలోని మారుమూల ప్రాంతాల్లో 12షాపుల్లో నెట్వర్కింగ్ లేదంటూ పాతపద్ధతిలోనే పంపిణీ చేస్తున్నారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో 1608 షాపుల్లో ఈ-పాస్ అమలవుతోంది. క్రమేపీ ఈపాస్ షాపుల సంఖ్య పెంచుకుంటూ పోవ డం..అదే స్థాయిలో సర్వర్ కెపాసిటీ లేకపోవడంతో సాంకేతిక సమస్యలు ఎక్కువయ్యాయి. ఏ షాపు దగ్గరకు వెళ్లినా సర్వర్ డౌన్ అయింది..ఎప్పుడు పని చేస్తుందో చెప్ప లేం..ఆ తర్వాత మమ్మల్నితిట్టొద్దు అంటూడీలర్లు ముందుగానే కార్డుదారులకు చెబుతూ వారి ఆగ్రహావేశాల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. సర్వర్ కనెక్ట్ అయినా ఈపాస్ మిషన్ మొరాయిస్తుండడం.. వేలిముద్రలు పడక పోవడంతో సామాన్యులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. గంటల తరబడి షాపుల వద్ద వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో చేసేదిలేక సర్కార్‌పై నానాశాపనార్ధాలు పెడుతూ నిరాశతో వెనుదిరుగుతున్నా రు. ఇలా ఒకరోజు..రెండు రోజులు కాదు రోజుల తరబడి తిరుగుతున్నా ఎప్పుడు సరకులందుతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ ఈ నెలలో సరకులు తీసు కోకపోతే వచ్చే నెలలో తమ కార్డులను ఎక్కడ పక్కన పెట్టేస్తారోనన్న ఆందోళనతో పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా ప్రతీనెలా ఒకటవ తేదీ నుంచి ప్రారంభించే సరకుల పంపిణీ 15వ తేదీతో ఆపేస్తారు. ఈ మధ్యలో సెలవులు ఎక్కువగా వచ్చినా లేదా సాంకేతిక సమస్యలు ఎక్కువగా ఉన్నా 18వ తేదీ వరకు మాత్రమే ఇస్తారు. అప్పుడే 13వ తేదీ దాటింది. కానీ జిల్లాలో పంపిణీ 35శాతానికి మించలేదు. కొత్తగా ఈ నెల నుంచి శ్రీకారంచుట్టిన 436 షాపులతో పాటు మెజార్టీ షాపుల్లో అయితే కనీసం పదిశాతం కూడా పంపిణీ జరగలేదు. దీంతో కార్డుదారులు సరకులు కోసం నరకం చూస్తున్నారు. తాను వారం రోజులుగా షాపునకు వెళ్లడం..సర్వర్ డౌన్ అయిందని చెప్పడం..వెనుతిరగడం పరిపాటయిందని ఎస్.రాయవరానికి చెందిన బీ.అప్పారావు సాక్షి వద్ద వాపోయారు. ఇచ్చే రూ.150ల విలువ చేసే సరకులుకోసం రోజుకు రూ.200ల కూలీ పనులు మానుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని జిల్లా పౌరసరఫరాల అధికారి శాంతకుమారి వద్ద ప్రస్తావించగా..ఒకేసారి రాష్ర్ట స్థాయిలో షాపుల సంఖ్య పెరగడంతో ఆ భారం సర్వర్లపై పడిందని..దీంతో తరచూ సర్వర్ డౌన్ అవుతోందని చెప్పుకొచ్చారు. ఒకటి రెండ్రోజుల్లో సమస్యకు పరిష్కార మవుతుందన్నారు. -
ఈ-పాస్ ‘హుష్’
- మంత్రి ఇలాకాలోనే అమలుకాని వైనం అనంతపురం అర్బన్: పేదల బియ్యం నల్లబజారుకు తరలకుండా అడ్డుకట్ట వేసేందుకు ఈ-పాస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిం ది. అయితే ఆ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో ఈ-పాస్ విధానం అమలు అరకొరగా సాగుతోంది. కొం దరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. నియోజవకర్గం పరిధిలో ఈ పాస్ అంతంత మాత్రంగా అమలవుతోంది. అనంతపురం రూరల్ మండలం చెందిన పాపంపేట, విద్యారణ్యనగర్, నందమూరినగర్, తారకరామనగర్, గణేశ్‌నగర్, సుందయ్య కాలనీలతో పాటు నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఈ పాస్ అమలు కావడం లేదు. ఈ పాస్ యంత్రాలు వచ్చినప్పుడు స్థానిక నాయకులు ప్రారంభించారు. ఒక నెల ఈ-పాస్ విధానంలో సరుకులు పంపిణీ చేసిన డీలర్లు అటు తరువాత వాటిని వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని డీలర్ల వద్ద ప్రస్తావిస్తే... అసలు తమకు ఈ పాస్ యంత్రాలు ఇవ్వలేదని, రాబోయే నెలలో ఇస్తామని అధికారులు అన్నారని వారు చెప్పుకొస్తారు. దీన్ని ఆసరాగా చేసుకుని మేమెందుకు ఈ పాస్ ద్వారా ఇవ్వాలంటూ అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొందరు డీలర్లు ఈ పాస్ యంత్రాలను ఆ శాఖకు వెనక్కి ఇచ్చేసినట్లు తెలిసింది. రెండవ విడతలో మునిసిపాలిటీలకు మొదటి విడతలో మంజూరైన 554 ఈ పాస్ యంత్రాలు మంత్రి ఇలాకాలో ఇచ్చినవి కొన్ని వెనక్కి వచ్చాయి. ఇక రెండవ విడతలో జిల్లాకు 690 ఈ పాస్ యంత్రాలు వచ్చాయి. వీటిని మునిసిపాలిటీల పరిధిలోనూ, కొన్ని ఉరవకొండ, కూడేరు మండలాల పరిధిలోని చౌక దుకాణాలకు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయం జిల్లా అధికారుల దృష్టికి వెళ్లలేదనేది కొసమెరుపు. ఈ- పాస్ యంత్రాలు వెనక్కు ఇస్తే చర్యలు జిల్లాలో తొలి విడత మంజూరైన 594 ఈ- పాస్ యంత్రాలను జిల్లాలోని 63 మండలాలకు కేటాయించాం. వీటిని వెనక్కు ఇవ్వడానికి వీలులేదు. ఎవరైనా వెనక్కు ఇస్తే వారిపై పచర్యలు తప్పవు. రెండవ విడత మంజూరైన 690 యంత్రాలను అన్ని మునిసిపాలిటీల పరిధిలోని దుకాణాల్లో ఏర్పాటు చేశాము. ఉరవకొండ, కూడేరు మండలాల్లో కేవలం ఒకటి రెండు చోట్ల ఉండడంతో ఆ ప్రాంతాలకు కొన్ని కేటాయించాము. - బి.లక్ష్మికాంతం, జాయింట్ కలెక్టర్ -
బియ్యం భోక్తలు
మార్కాపురం : పేదలకు దక్కాల్సిన సబ్సిడీ బియ్యం నల్లబజారుకు తరలిపోతున్నాయి. కొందరు డీలర్లకు అక్రమ ఆదాయానికి మార్గంగా మారాయి. కిలో రూపాయి ప్రకారం ఒక వ్యక్తికి నెలకు 5 కిలోల బియ్యాన్ని సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అందిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం బయట సుమారు రూ.22 చెల్లించి కొనుగోలు చేస్తుంది. పట్టణాల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతుండగా..గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుల ద్వారా అందిస్తున్నారు. దీంతో పశ్చిమ ప్రకాశంలో పేదలకు చెందాల్సిన బియ్యం లారీల ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. మార్కాపురం నుంచి నంద్యాల మీదుగా అనంతపురం, యర్రగొండపాలెం నుంచి కోస్తా జిల్లాలకు బియ్యం అక్రమ రవాణా అవుతున్నాయి. మొత్తం మీద నెలకు 800 నుంచి వెయ్యి బస్తాల బియ్యం అక్రమంగా తరలి వెళ్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం,గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెంలలో పౌరసరఫరా శాఖ గోడౌన్లు ఉన్నాయి. మార్కాపురం గోడౌన్ ద్వారా మార్కాపురం పట్టణ, రూరల్, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లోని రేషన్ దుకాణాలకు ప్రతినెలా దాదాపు 980 టన్నుల బియ్యం గిద్దలూరు గోడౌన్ నుంచి గిద్దలూరు, కొమరోలు, రాచర్ల మండలాలకు 700 టన్నుల బియ్యం, కంభం గోడౌన్ నుంచి కంభం, బేస్తవారిపేట, అర్ధవీడు మండలాలకు 530 టన్నులు, యర్రగొండపాలెం గోడౌన్ ద్వారా యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలకు 750 టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి స్టేజ్ 1 కాంట్రాక్టర్లు సివిల్ సప్లయ్ గోడౌన్లకు చేరుస్తారు. అక్కడి నుంచి స్టేజ్ 2 కాంట్రాక్టర్లు ఆయా గ్రామాల్లోని రేషన్‌షాపులకు తరలిస్తారు. పశ్చిమ ప్రకాశంలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, కంభం, అర్ధవీడు, గిద్దలూరు, రాచర్ల, పెద్దారవీడు, పెద్దదోర్నాల, తర్లుపాడు మండలాల్లో కొంత మంది డీలర్లు రేషన్ బియ్యాన్ని దుకాణాలకు చేర్చకుండానే అక్రమంగా బియ్యాన్ని కొనుగోలు చేసే వ్యాపారులకు కిలో రూ.5 నుంచి రూ.7 ప్రకారం అమ్ముతున్నారు. ఈ బియ్యాన్ని రైసు మిల్లుల ద్వారా లెవీ రూపంలో మళ్లీ ప్రభుత్వానికి సుమారు కేజీ రూ.22 ప్రకారం అమ్ముతున్నారు. మరి కొంత మంది వ్యాపారులు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లోని కాంట్రాక్టర్లకు నిత్యాన్నదానానికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. బయటి మార్కెట్లో వంద కిలోల బియ్యం బస్తా రూ.3500 నుంచి రూ.4 వేల మధ్య ఉండటంతో సబ్సిడీ బియ్యానికి డిమాండ్. అక్రమాలు ఇలా... మున్సిపాలిటీల్లో మాత్రమే ఈ-పాస్ విధానం అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో డీలర్లు రేషన్‌కార్డుదారులకు ఇవ్వాలి. కొంత మంది కార్డుదారులు బియ్యం నాణ్యత లేకపోవటంతో తీసుకోకపోగా, మరి కొంత మందికి డీలర్లు ఇవ్వటం లేదు. దీంతో ప్రతి మండలం నుంచి సుమారు 50 బస్తాల బియ్యం ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తోంది. ఈ విషయంపై పలువురు డీలర్లు కూడా తాము అధికారులకు ఇస్తున్న లంచాల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి నెలా తహశీల్దార్‌కు రూ.500, డిప్యూటీ తహశీల్దార్‌కు రూ.500, ఆర్.ఐ.కి రూ.500, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెట్ డీటీకి కలిపి రూ.500, సేల్స్ రిజిష్టర్‌కు రూ.300, అటెండర్‌కు రూ.100, లారీ డ్రైవర్‌కు రూ.100, ఒక బస్తా దించినందుకు కూలి రూ.5 మామూళ్ల రూపంలో చెల్లిస్తున్నామని తెలిపారు. గోడౌన్ నుంచి వచ్చే బియ్యంలో కిలో గోతం, 500 గ్రాముల బియ్యం తరుగుగా వస్తుందని, 100 బస్తాల బియ్యం వస్తే 150 కిలోల తరుగు పోతుందని అంటున్నారు. ఇటీవల త్రిపురాంతకం మండలంలో ఒక రెవెన్యూ అధికారి కారు కొనుగోలు చేసేందుకు ప్రతి డీలర్ వద్ద నుంచి రూ.2,500 అదనంగా వసూలు చేయగా, సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారీ ప్రతి డీలర్‌కు దాదాపు అదనపు ఖర్చు వస్తుందని తెలిపారు. ఇలాంటప్పుడు సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టడంలో ఆశ్చర్యమేమిటని అంటున్నారు. ఎక్కడ నుంచి ఎక్కడకు... మార్కాపురం ప్రాంతంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని మార్కాపురం, తర్లుపాడు, కంభం, గిద్దలూరు రైల్వేస్టేషన్లలో రైళ్ల ద్వారా నంద్యాల, అనంతపురానికి చేరుస్తున్నారు. యర్రగొండపాలెం ప్రాంతంలో సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని కోస్తా జిల్లాలకు చేర్చి అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. గత నెలలో మార్కాపురంలో అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఇటీవల రైల్వేస్టేషన్లో కూడా అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 20 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. ప్రతి నెలా గోడౌన్ నుంచి బియ్యం షాపులకు తరలించే సమయంలో రూట్ ఆఫీసర్ ఉండాలి. పలు మండలాల్లో రూట్ ఆఫీసర్లు లేకపోవటంతో మార్గ మధ్యంలోనే బియ్యం బస్తాలు పక్కదారి పడుతున్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారిపై 6ఏతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. జిల్లాలో ఇటీవలే టంగుటూరు, సంతనూతలపాడు, ఉలవపాడులలో అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశాం. ముగ్గురు ఏఎస్ఓలను నియమించి వారికి సిబ్బందిని కేటాయించి వాహనాలను సమకూర్చాం. నేనే స్వయంగా మార్కాపురం డివిజన్‌పై దృష్టి సారించి సబ్సిడీ బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. సివిల్ సప్లయ్ గోడౌన్లలో బియ్యం తూకం తక్కువ రాకుండా ఉండేం దుకు తూకాల మిషన్లను ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని చోట్ల 10 టన్నుల కాటాను ఏర్పాటు చేశాం. - ఎస్.వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి, ఒంగోలు -
ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ?
- అమలు విధానం వాయిదాకు అవకాశం - కొంత కాలం గడువు ఇవ్వాలని టీడీపీ డీలర్ల ఒత్తిళ్లు - అన్ని దుకాణాలకు అందని ఎలక్ట్రానిక్ కాటాలు వినుకొండ: నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు రేషన్ దుకాణాల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ (ఈ-పాస్)విధానానికి తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన డీలర్లు తెచ్చిన ఒత్తిడి మేరకే ఈ విధానం అమలును కొంతకాలంపాటు వాయిదా వేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోని చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్టు అధికారులు ముందుగానే ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు దాదాపుగా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ కాటాలను సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని షాపులకు ఇంకా రావాల్సివుందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాలు అన్ని షాపులకు అందజేయక పోవడాన్ని సాకుగా చూపి విధానం అమలును తాత్కాలికంగా వాయిదా వేయనున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలోని ఏ ఒక్క షాపు నుంచి కూడా కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. పాతపద్ధతి ప్రకారమే రేషన్ దుకాణాల నుంచి సరుకుల పంపిణీ జరుగుతుందని అంటున్నారు. రేషన్ దుకాణాల డీలర్లకు సరుకుల పంపిణీకి సంబంధించి ఇంకా రెవెన్యూ అధికారులు కీ రిజిస్టర్లు ఇవ్వలేదు. జిల్లాలో 2,713 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 567 దుకాణాల్లో ఈ-పాస్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తెనాలి డివిజన్లో ఇంకా 604 బయోమెట్రిక్ మెషీన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. కిరోసిన్ పంపిణీలో అమలు కాని ఈ-పాస్ విధానం.... కిరోసిన్ హాకర్లు ప్రతి నెల 10 నుంచి 20వ తేదీ వరకు రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేస్తారు. 20 నుంచి 28 వరకు డీలర్లు కార్డుదారులకు కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు వెళ్లి వేలు ముద్ర వేస్తే (ఈ-పాస్ విధానం) బియ్యం, కందిపప్పు, పంచదార, కిరోసిన్ తీసుకున్నట్లు వస్తుంది. కానీ కార్డుదారులకు ఆ సమయంలో కిరోసిన్ పంపిణీ జరగదు. దీంతో ప్రతి నెలా బ్లూకిరోసిన్ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది కిరోసిన్ హాకర్లకు, డీలర్లకు కాసులు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం ... జిల్లాలో ప్రధానంగా నరసరావుపేట, గురజాల డివిజన్ల పరిధిలో బయోమెట్రిక్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాటాలు రాష్ట్రంలోని అన్ని షాపులకు ఒక్కరే సరఫరా చేయాల్సి ఉంది. అందువల్ల కొంత జాప్యం జరుగుతోంది. అంతేతప్ప మరొక కారణం కాదు. త్వరలో ప్రతి చోటా ఈ పాస్ విధానం అమల్లో ఉంటుంది. - చిట్టిబాబు, డీఎస్వో -
మేమే పాస్
- ఈ-పాస్‌లోనూ డీలర్ల అక్రమాలు - కమిషనర్ కార్యాలయంలో వెలుగులోకి.. - వారం రోజులుగా కొనసాగుతున్న విచారణ - రెండు రోజుల్లో జిల్లాకు అక్రమార్కుల జాబితా కర్నూలు: పౌర సరఫరాల శాఖలో కొత్తగా అమల్లోకి వచ్చిన బయెమోట్రిక్ విధానం కూడా డీలర్లకు వరంగా మారింది. వేలిముద్రల ఆధారంగా సరుకులు పంపిణీ చేస్తే బోగస్‌ను అరికట్టవచ్చని ప్రభుత్వం ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే ఈ పద్ధతి కూడా అక్రమార్కులను నిలువరించలేకపోతోంది. సాంకేతిక మిషన్లను సైతం బురిడీ కొట్టించి కొందరు డీలర్లు లాభాలు గడిస్తున్నారు. సరుకుల సరఫరా సందర్భంగా ఒకేసారి రెండు మూడు ఈ-పాస్ మిషన్లను ఓపెన్ చేసి కార్డుదారు వేలిముద్ర సహాయంతో సరుకులను కాజేసిన బాగోతాన్ని హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ విజయలక్ష్మి దృష్టికి తీసుకుపోవడంతో ఆమె విచారణ చేపడుతున్నట్లు సమాచారం. కార్డుదారు వేలిముద్రను ఈ-పాస్ మిషన్‌పై నమోదు చేసిన వెంటనే చిన్న కాగితం ముక్క(బిల్లు) వస్తుంది. అందులోని లెక్కల ప్రకారం ఎలక్ట్రానిక్ కాటాపై కచ్చితమైన తూకంతో కార్డుదారులకు సరుకులను అందించాల్సి ఉంది. ఇక్కడే డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో చేపడుతున్న సంస్కరణలను సైతం డీలర్లు అనుకూలంగా మలచుకున్నట్లు బయటపడింది. రెండు, మూడు మిషన్లను ఒకేసారి ఆన్ చేసి అన్నింటిలోను వేలిముద్రలతో బిల్లింగ్ కొట్టి ఒక మిషన్ ద్వారా వచ్చిన సరుకులను మాత్రం కార్డుదారులకు కట్టబెట్టి, మిగిలిన మిషన్ల ద్వారా వచ్చిన సరుకులను కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించినట్లు గుర్తించారు. పోర్టబిలిటీ విధానంతో డీలర్ల చేతివాటం రేషన్ పోర్టబిలిటీ(ఎక్కడైనా సరుకులు తీసుకునే విధానం) అమలులో ఉన్నందున డీలర్లు కూడబలుక్కుని చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. జీపీఆర్ అనుసంధానంతో ఈ-పాస్ మిషన్లు పనిచేస్తున్నందున కర్నూలు డీలర్ల అక్రమాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో బయటపడ్డాయి. ఒకటికి మించి చౌక డిపోలు నిర్వహిస్తున్న వారు, సొంత చౌక డిపోలతో పాటు ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న డీలర్లు ఇలాంటి తరహా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి శఠగోపం పెట్టినట్లు వెలుగు చూసింది. ఈ- పాస్ విధానం వల్ల రేషన్ బియ్యం భారీగా మిగిలిందని భావిస్తున్న తరుణంలో కొత్త తరహాలో అక్రమాలు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ తరహా మోసానికి ఎవరెవరు పాల్పడ్డారు, ఎంత మొత్తంలో సరుకులు కాజేసి ప్రభుత్వానికి బురిడీ కొట్టించారనే విషయాలపై కమిషనర్ కార్యాలయంలో జాబితా సిద్ధమయిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో జిల్లా అధికారులకు నివేదిక అందే అవకాశముందని పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా తెలిసింది. పెలైట్ ప్రాజెక్టుగా కర్నూలు రాష్ట్రంలోనే కర్నూలును పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలో ఈ-పాస్ అమలు చేస్తున్నారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, గూడూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె మున్సిపల్ పట్టణాల్లోని 457 చౌక డిపోల్లో ఈ-పాస్ యంత్రాలతో సరుకుల పంపిణీ జరుగుతోంది. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మరో 680 చౌక డిపోల్లో ఆగస్టు 1 నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే నాలుగు మాసాలు గడవకముందే కర్నూలు నగరంలో డీలర్లు బయోమెట్రిక్ విధానాన్ని కూడా బురిడీ కొట్టించి అక్రమాలకు పాల్పడటం పౌర సరఫరాల శాఖలో చర్చనీయాంశమైంది. -
రైతులకు ఏం కావాలన్నా ఆధార్ తప్పనిసరి: సీఎం
సాక్షి, రాజమండ్రి: రైతులు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుకోవాలన్నా ఆధార్, ఈ-పాస్‌లతో వారి వివరాలను అనుసంధానించడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన వ్యవసాయరంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు, రుణాలు ఏవి కావాలన్నా ఆధార్ అనుసంధానం చేయాల్సిందేనన్నారు. ఈ మేరకు వచ్చే నెల ఒకటి నుంచి రైతులు, లబ్ధిదారుల సమాచారాన్ని అధికారులు సేకరించాలని ఆదేశించారు. అదేవిధంగా ఎరువుల దుకాణాలను ఈ- పాస్, ఆధార్‌తో అనుసంధానించాలని సూచించారు. దీనిద్వారా ఏ రైతు ఎంత యూరియా వాడుతున్నారు, ఏఏ నేలలకు ఎంత యూరియా వాడవచ్చో తెలుస్తుందన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో వరినాట్ల విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపునకు నిర్ణయం: మంత్రి ప్రత్తిపాటి రాష్ట్రంలో ఉద్యానవన పంటల విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక ఆనం కళాకేంద్రంలోని పుష్కర మీడియా కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారంనాటి సమీక్షలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారని ప్రత్తిపాటి చెప్పారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించామని చెప్పారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పాదకాల పెంపుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు మాట్లాడారు. -
ఆ కార్డులకు రేషన్ కట్
- ఈ నెలలో కూడా తీసుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ లేనట్టే - ఈ-పాస్‌తో ప‘రేషాన్’ - త్వరలో ఫ్యామిలీ కార్డులు జారీ సరుకులు కేటాయింపులు ఆపేసినప్పటికీ ఆ కార్డులను మాత్రం రద్దు చేసే అవకాశాలు లేవని జేసీ నివాస్ చెబుతున్నారు. కనీసం రెండు నెలల పాటు వరుసగా సరుకులు తీసుకోలేని కార్డుదారులను గుర్తించి వారికి కేటాయింపులు ఆపేస్తామన్నారు. మాకు సరుకులు అవసరం లేదు.కార్డు ఉంటేచాలు అని కోరే వారందరికి రేషన్ కార్డుల స్థానే స్మార్ట్ కార్డు తరహాలో ఫ్యామలీ కార్డులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. సాక్షి, విశాఖపట్నం: ‘ఈ-పాస్’ సాకుతో ‘సర్కార్’ నిరుపేదలకు ‘రేషన్’ దూరం చేస్తోంది. గత నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేశామని చెబుతున్న సర్కార్ సరుకులు తీసుకోలేని వారికి ఈ నెలలో మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలలో కూడా సరుకులు తీసుకోకుంటే వచ్చేనెల నుంచి పూర్తిగా ఆపేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఆ మేరకు కేటాయింపులుతగ్గించేస్తామని తెలిపారు. జీవీఎంసీలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీలతో పాటు మరో పదిమండలాలపరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈపాస్ అమలు చేస్తున్నారు. మిషన్లు మొరాయించడం, నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో తొలి నెలలో 26 శాతం మందికి మాత్రమే ఈపాస్ ద్వారా పంపిణీ జరిగింది. మిగిలిన వారికి మాన్యువల్‌గానే పంపిణీ చేశారు. మేలో నూరు శాతం ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించగా, జీవీఎంసీలోని 2,50,888 కార్డుదారులకు, , ఇతర మన్సిపాల్టీలు, ఎంపిక చేసిన మండలాల్లో 3,55,556 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. అర్బన్‌లో 72 శాతం, రూరల్‌లో 89శాతం మాత్రమే పంపిణీ చేశారు. జీవీఎంసీలో 28 శాతం, రూరల్‌లో 11 శాతం చొప్పున 2,56,245 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. సెలవులు..డీలర్ల ఆందోళన: వేసవి సెలవులు కావడంతో చాలా మంది పుణ్యస్థలాలు, పర్యాటక ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల సరుకులు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఈ పాస్ మిషన్ల పనిచేస్తున్నప్పటికీ చాలా మంది డీలర్లు కావాలనే ఒకటికి పదిసార్లు తిప్పించుకోవడంతో చాలామంది కార్డుదారులు తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. మరి కొంత మంది బయోమెట్రిక్ పనిచేయకపోవడంవంటిసాంకేతిక కారణాలతో కూడా సరుకులు తీసుకెళ్లలేకపోయారని తెలుస్తోంది.కమిషన్ పెంచాలంటూ డీలర్లు ఆందోళన బాటపట్టడం కూడా సరుకుల పంపిణీపై ప్రభావం చూపిందంటున్నారు. కానీ అధికారుల వాదన మరోలా ఉంది. గతంలో రేషన్ సరుకుల కోసం కార్డులు తీసుకునే వారు కొంతమందైతే.. వైద్యం,ఇతర అవసరాల కోసం మరి కొంతమంది కార్డులు తీసుకున్నారని, వీరంతా ఏనాడు రేషన్‌సరుకులు తీసుకునే వారు కాదని చెబుతున్నారు. గతనెలలో సరుకులు తీసుకోలేని వారిలో ఎక్కువ మంది ఇదే కోవకు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. -
జూన్‌కి ఈ-గవర్నెన్స్ మాస్టర్ ప్లాన్
‘మీ కోసం’ పోర్టల్ ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు హైదరాబాద్: ఈ-గవర్నెన్స్ మాస్టర్ ప్లాన్‌ను జూన్ నాటికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం పోర్టల్’ను మంగళవారం సీఎం తన నివాసంలో ఆవిష్కరించారు. పారదర్శక, సుపరిపాలనలో ఇది మరో ముందడుగని ఈ సందర్భంగా అన్నారు. ప్రస్తుతం సిద్ధం చేసిన 20 శాఖలతోపాటు మిగిలిన విభాగాలను కూడా రెండో దశ కింద ఈ పోర్టల్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార దినోత్సవం నిర్వహించి వచ్చిన ఫిర్యాదులను అంశాల వారీగా పొందుపరచాలని చెప్పారు. ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం కోర్ డ్యాష్ బోర్డులో పెట్టాలని సూచించారు. ఆిప్టికల్ ఫైబర్ గ్రిడ్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీ అందించేందుకు రిలయన్స్ సంస్థ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుందని చెప్పారు. విద్యుత్తు స్తంభాల ద్వారా ప్రతి ఇంటికీ కనెక్టివిటీని డిసెంబర్ నాటికి ఇవ్వాలని ఆదేశించారు. ఈ-పాస్ పూర్తయితే ఏడాదికి రూ. 1,400 కోట్లు ఆదా చౌకడిపోలకు ఈ-పాస్ అమర్చితే ఏటా సుమారు రూ. 1,400 కోట్లు ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఈ-పాస్ అమర్చడంలో జాప్యమయ్యేకొద్దీ ప్రభుత్వం నష్టపోతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను ఆధార్, మొబైల్ నంబర్లతో ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ సూచించారు. ఫిర్యాదులు ఏ ద శలో ఉన్నాయో ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ టోల్‌ఫ్రీ నంబరు 1100/1800 -4254440కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. -
ఈ పాస్‌తో రేషన్ దూరం
ఈ-పాస్ నిరుపేదల పాలిట శాపంగా తయారైంది. వీరి ఆకలి తీర్చే లక్ష్యంతో ప్రారంభించిన ఆహారభద్రత వారికి లేకుండా చేస్తోంది. గత నెలలో శ్రీకారం చుట్టిన ఈపాస్ ఇక్కట్ల వల్ల 80 శాతం కార్డుదారులకు పాత పద్ధతిలోనే సరకులు అందించారు. ఈ నెలలో పూర్తిగా ఈ పాస్ ద్వారానే అమలు చేయాలన్న జిల్లా యంత్రాంగం పట్టుదల కారణంగా ఈసారి పాత పద్ధతిలో సరుకులివ్వలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా రెండున్నర లక్షల కార్డు హోల్డర్లకు ఈ నెలలో సరకులకు దూరమయ్యాయి. - జిల్లాలో పదిలక్షల మందికి అందని సరకులు - గగ్గోలు పెడుతున్న పేదలు సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జీవీఎంసీ పరిధిలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీ పట్నం మున్సిపాల్టీలతో పాటు పది మండలాల పరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటి తేదీ నుంచి ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ద్వారా సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈపాస్ పుణ్యమాని కేవలం 2,09,982 మందికి మాత్రమే గత నెలలో సరకులు పంపిణీ చేయగలిగారు. 6,26,548 కార్డుదారులకు పాతపద్ధతి (డిజిటల్ కీ రిజిస్ట్రార్) లోనే పంపిణీ చేశారు. ఆ నెలలో 7,389 కార్డుదారులు సరకులు తీసుకెళ్లలేదని గుర్తిం చారు. కాగా ఈ నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే సరకులివ్వాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డీలర్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. డీలర్లే కావాలని మెషీన్లు పనిచేస్తున్నా పనిచేయడంలేదంటూ పక్కన పెట్టేస్తున్నారంటూ ఒకరిద్దరి డీలర్లపై క్రమశిక్షణ చర్యలకు సైతం తీసుకున్నారు. ఇంతలా ఒత్తిడితీసుకొచ్చినా చివరకు అతికష్టంమ్మీద ఈనెలలో 6,06,444 కార్డుదారులకు మాత్ర మే ఈ-పాస్ ద్వారా సరకులివ్వగలిగారు. 2,56,245 కార్డుదారులకు అసలు సరుకులే ఇవ్వలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపుల్లో ఈ-పాస్ అమలుచేస్తున్నారు. ఇక్కడ 3,69,934 కార్డుదారుల్లో ద్వారా 2,50,888 కార్డుదారులకు మాత్రమే సరఫరా చేయగలిగారు. మరో 1,19,046 మందికి సరకులివ్వలేదు. ఇక రెండు మున్సిపాల్టీలు, ఏడు మండలాలపరిధిలో 4,92,755 కార్డులుండగా, ఈ పాస్‌ద్వారా 3,55, 556 కార్డుదారులకు మాత్రమే సరకులు పంపిణీ చేయగలిగారు. మరో 1,37,199 కార్డుదారులకు అసలు సరకులు పంపిణీ చేయలేదు. అంటే మొత్తమ్మీద 2,56,245 కార్డుదారులకు సరకుల పంపిణీజరగలేదు.ఒకోకార్డులనలుగురు చొప్పున లెక్కేసుకున్నా 10,24,980 మందికి మే నెలలో సరకులు అందని పరిస్థితి నెలకొంది. ఆహార భద్రత పేరుతో కార్డులోని ఒక్కొక్కరికి నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలకు పెంచినా ఈ రెండు నెలల్లో ఏ ఒక్కరూ మనశ్శాంతిగా పూర్తిస్థాయిలో సరుకులు తీసుకున్న పాపాన పోలేదు. గత నెల 25వ తేదీ వరకు సరకులు పంపిణీ చేసినప్పటికీ ఈ నెలలో 22వ తేదీతోనే పంపిణీని నిలుపుదల చేశారు. జూన్ నెలలో లిప్టింగ్ కోసం డీలర్ల నుంచి ఇండెంట్లు తీసుకోవడం మొదలు పెట్టారు. అంటే ఈ నెలలో మిగిలిన కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నెలాఖరు వరకు సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
పేదల నోటికి..ఈ షాక్
ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రభుత్వమైనా వారి సంక్షేమాన్ని కాంక్షించాలి. దాని సాధించడంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను అధిగమించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి. అప్పుడే ఆ సర్కార్‌పై ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. చంద్రబాబు సర్కారు తీరు అందుకు భిన్నంగా ఉంది. తాము అనురిస్తున్న విధానం పేదల పొట్ట కొట్టేందుకు దారి తీసినా పట్టించుకోవడం లేదు. వారి నోటికి అన్నం గిన్నె దూరమైనా చలించడం లేదు. సాక్షి ప్రతినిధి, కాకినాడ :బినామీ రేషన్ కార్డుదారులకు చెక్ పెడతామంటూ గత నెల నుంచి జిల్లాలో అమలులోకి తెచ్చిన ఈ-పోస్ క్రియలో పేదల పొట్ట కొట్టే సరికొత్త పథకంగా మారింది. జిల్లావ్యాప్తంగా సుమారు 2,500 రేషన్ దుకాణాల పరిధిలో 15 లక్షల తెలుపు రంగు రేషన్‌కార్డులున్నాయి. వాటిలో ఎంపిక చేసిన 16 మండలాల్లోని 632 రేషన్ దుకాణాల్లో ఈ -పోస్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ -పోస్ ఆ రేషన్‌దుకాణాల్లో కార్డుదారులకు శాపంగా మారి ఈ నెల 72 వేల కుటుంబాలకు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ-పోస్‌లో సాంకేతిక లోపాల కారణంగా రేషన్ పంపిణీకి గడువు తొలుత ఈ నెల 15 వరకు పెంచారు. అప్పటికీ లోపాలతో రేషన్ పంపిణీ పూర్తికాకపోవడంతో ఈనెల 18 వరకు గడువు పెంచారు. సోమవారం ఆఖరి రోజు కావడంతో రాత్రి ఏడున్నర వరకు కార్డుదారులు సరుకుల కోసం పడిగాపులు పడుతూ రేషన్ దుకాణాల వద్ద కనిపించారు. ఈ-పోస్ అమలులో ఉన్న రేషన్‌షాపుల పరిధిలో 3,95,628 మంది కార్డుదారులుండగా, ఇప్పటి వరకు 3,23,417మంది మాత్రమే సరుకులు తీసుకున్నారు. మిగిలిన సుమారు 72 వేల మంది సరుకులకు దూరమైపోయారు. వారంతా దాదాపు సోమవారం రాత్రి వరకు ప్రతీ రోజు రేషన్‌షాపుల చుట్టూ తిరిగినవారే. ఒక్క అమలాపురం మండలంలోనే 5,120మంది కార్డుదారులకు ఈనెల రేషన్ అందకుండా పోయింది. ఈ-పోస్ అంతంతమాత్రంగా పనిచేయడంతో పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేయలేకపోయారు. పడిగాపులు పడినా ప్రయోజనం లేదు.. ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్లకపోవడంతో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల పంపిణీలో తీవ్ర జాప్యం ఫలితంగా వేలాది మంది నిరుపేదలకు ఈ నెల రేషన్‌ను సర్కార్ దూరం చేసింది. ఈ-పోస్ విధానంలో తలెత్తిన సాంకేతిక లోపాలు (సర్వర్ డౌన్ అవడం, నెట్వర్క్ పనిచేయకపోవడం)తో కార్డుదారులు రేషన్ షాపుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడిన విషయం జిల్లా యంత్రాంగానికి తెలియంది కాదు. రేషన్ డీలర్లు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఉదయం సరుకులు ఇవ్వడం మొదలుపెడితే రాత్రికి ఒక దుకాణంలో కనీసం పాతిక మందికి కూడా ఇవ్వలేకపోయారు. ఈ-పోస్ అమలులో సర్కార్ వైఫల్యంతో సరుకులు తీసుకోలేని కార్డుదారులు.. ఇప్పుడు తామందరికీ బినామీ కార్డుదారులనే ముద్రవేసి మొత్తంగా వారి నోట మట్టికొట్టేందుకు ఎత్తులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందని వారికి మళ్లీ పంపిణీ చేస్తారా? ఈ-పోస్ విధానం విజయవంతమైందని చెబుతున్న అధికారులు రేషన్ తీసుకోలేకపోయిన కార్డుదారులకు ఏమని సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోనీ నిలిచిపోయిన సర్వర్‌ను పునరుద్ధరించి రేషన్ తీసుకోలేని వారికి మళ్లీ సరుకులు పంపిణీ చేస్తారా అంటే ఆ ఉద్దేశం వారికి ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఈ నెల ఎంత మందికి కోత వేశాం, ఎంత రేషన్ మిగిలిందనే లెక్కలు తీయడంపైనే వారికి ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టు కనిపిస్తోందని బాధితులు దుయ్యబడుతున్నారు. ఏదేమైనా మానవతా దృక్పథంతో ఆలోచించి అందరికీ రేషన్ ఇప్పించాల్సిన బాధ్యత జిల్లాయంత్రాంగంపై ఉంది. -
మే నుంచి ఆహార భద్రతా కార్డులు
* అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలు: ఈటెల * వంద గ్రాముల బియ్యం తగ్గినా ఉపేక్షించేది లేదు * అక్రమాలుంటే నేరుగా మాకు ఫిర్యాదు చేయండి * సంపన్నులు గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల నుంచి కొత్త ఆహార భద్రతా కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేస్తామని, అక్రమాల నిరోధానికి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గురువారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్ రజత్‌కుమార్‌తో కలిసి ఈటల విలేకరులతో మాట్లాడారు. రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలను ఉపేక్షించబోమని, డీలర్లు వంద గ్రాముల బియ్యం తుక్కువగా ఇచ్చినా నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. అవకతవకలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు కింద కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. అక్రమాల నిరోధానికి ఈ-పాస్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నామని, దీనికి రూ.225 కోట్లు అవసరం కానుండగా కొంతమేర సాయం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి వివరించారు. దీంతో పాటు జీపీఎస్ వ్యవస్థను వినియోగించుకుని అక్రమాలకు కళ్లెం వేస్తామన్నారు. ఆధార్ సీడింగ్ ద్వారా నకిలీల ఏరివేతతో కార్డుల సంఖ్య కొంత త గ్గిందని ఈటల చెప్పారు. మూడేళ్లలోపు పిల్లలకు బియ్యం కోటా రద్దు చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారికి యధావిధిగా బియ్యం సరఫరా చేస్తున్నామని తెలిపారు. కందిపప్పు, చక్కెర టెండర్లలో పారదర్శకత లోపించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఒప్పందాల మేరకు చక్కెర, కందిపప్పు సరఫరా చేయని వారిపై చర్యలు తీసుకున్నామని, రూ.2 కోట్ల వరకు జప్తు చేశామని చెప్పారు. పేదల కడుపు నింపే విషయంలో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని ఏమాత్రం లెక్కచేయబోమని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి అదనంగా బియ్యం కేటాయింపులు జరుగకున్నా, పేదరిక లెక్కల సర్వేతో సంబంధం లేకుండా రూ.2,600 కోట్లతో 2.86 కోట్ల మందికి రేషన్ బియ్యం అందిస్తున్నామన్నారు. కాగా.. తాను గ్యాస్ సబ్సిడీని వదులుకున్నానని, స్థోమత కలిగిన ఉన్నత వర్గాలు సైతం సబ్సిడీని వదులుకునేందుకు ముందుకు రావాలని ఈటెల పిలుపునిచ్చారు. -
ఈ-పాస్‌కు ఆదిలోనే హంసపాదు
పని చేయని సర్వర్ ఇబ్బందులుపడ్డ కార్డుదారులు నెల్లూరు(రెవెన్యూ) : ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు ఆదివారం ఈ-పాస్ ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ విధానంతో డీలర్లు, కార్డుదారులు ఇబ్బందులుపడ్డారు. ఈ-పాస్ సర్వర్ పని చేయకపోవడంతో మిషన్లు ఆన్ కాలేదు. డీలర్లు ఇబ్బందులుపడ్డారు. గంటల సమయం కార్డుదారులు షాపుల వద్ద పడిగాపులుకాశారు. ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగారు. చౌకదుకాణాల డీలర్లు హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. హైల్ప్‌లైన్ సిబ్బంది వచ్చి మిషన్లను పరిశీలించినా ఫలితం లేదు. జిల్లాలో 1874 చౌకదుకాణాలున్నాయి. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని 320 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశారు. కార్డుదారుల వివరాలు అప్లోడ్ చేశారు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించారు. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లోని 90 శాతం చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం పని చేయలేదు. పలు షాపుల్లో మిషన్లు ఆన్కాకాపోవడంతో కార్డుదారులు అవస్థలుపడ్డారు. ఈ-పాస్ మిషన్‌లో కార్డుదారుల వివరాలు నమోదు చేసి కావాల్సిన రేషన్‌కు సంబంధించి వేర్వేరుగా నమోదు చేయాల్సి ఉంది. మిషన్‌లో వివరాలు నమోదు చేస్తేనే రేషన్ విడుదలవుతుంది. మిషన్లు పని చేయకపోవడంతో రేషన్ పంపిణీ కాలేదు. ఈ-పాస్ విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ-పాస్ విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. డీలర్లు సాధారణ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంలేదు. ఏదిఏమైనా నూతన విధానం కార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తుంది. సర్వర్ పనిచేయలేదు : సంధ్యారాణి, డీఎస్ఓ ఈ-పాస్ విధానం ద్వారా ప్రజా పంపిణీ ప్రారంభించాం. సర్వర్ పని చేయకపోవడంతో ఈ-పాస్ మిషన్లు పని చేయలేదు. ఈ విషయం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు తెలియజేశాం. త్వరలో సర్వర్ పని చేసేలా చర్యలు తీసుకుంటాం. -
ఈ-పాస్.. తొలిరోజు ఫెయిల్
ప్రజా పంపిణీ పథకంలో ‘ఈ-పాస్’ అమలు జిల్లాలో తొలిరోజు ఫెయిల్ అయింది. యంత్రాల వినియోగంలో డీలర్లకు అవగాహన లేమి, సాంకేతిక సమస్యలు వెరసి మూడో వంతు షాపుల్లోనూ నిత్యావసరాల పంపిణీ ప్రారంభం కాలేదు. అనుకున్నట్టుగానే ఈ విధానం జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. సిగ్నెల్స్ లేక సెల్ నెట్‌వర్క్‌లు కూడా పనిచేయలేదు. టెక్నీషియన్లకు వందలాది ఫోన్‌కాల్స్ రావడంతో వారు కూడా చేతులెత్తేశారు. పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. విశాఖపట్నం : జిల్లాలో ఈ-పాస్(ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఇక్కట్లు మొదలయ్యాయి. జీవీఎంసీతో పాటు అన్ని మున్సిపాల్టీల్లోనూ ఒకే సారి అమలుతో సమస్యలు తలెత్తాయి. డీలర్లకు కేవలం రెండురోజులు శిక్షణతో సరిపెట్టారు. మెజార్టీ డీలర్లకు వీటి వియోగంపై కనీస అవగాహన లేదు. ఇక షాపుల్లో పనిచేసే ఇతర సిబ్బందికి అసలు ఇవి ఎలా పనిచేస్తాయో కూడా తెలియదు. నెలరోజులుగా సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు విఫలయత్నం చేసినా ఆచరణలో మాత్రం ఫలితం దక్కలేదు. జీవీఎంసీ పరిధిలో 412 షాపులు, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లో 274 షాపుల్లో బుధవారం నుంచి ఒకేసారి ఈ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన కొద్దిసేపటికే మిషన్లను ఏ విధంగా వినియోగించాలో తెలియక డీలర్లు తీవ్రగందరగోళానికి గురయ్యారు. మరొకపక్క ఈపాస్ మిషన్లు మొరాయించడంతో 80 శాతం షాపుల్లో పంపిణీకి శ్రీకారమే చుట్టలేదు. ప్రారంభంలో దాదాపు అన్ని షాపుల్లోనూ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఎక్కడా ఆధార్ సర్వర్‌కు, సివిల్ సప్లయిస్ సర్వర్‌కు కనెక్ట్ కాలేదు. ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్లు కూడా పూర్తిగా స్థాయిలో పనిచేయలేదు. మరోపక్క జీవీఎంసీ పరిధిలోని అన్ని షాపులకు అందజేసిన ఐరిస్ మిషన్లను కనీసం వినియోగంలోకి తీసుకురాలేక పోయారు. ఇదేరోజు ఆహారభద్రత పథకానికి కూడా శ్రీకారం చుట్టడంతో అన్ని షాపుల్లో ఇప్పటి వరకు యూనిట్‌కు ఇస్తున్న బియ్యం కోటా 4కిలోలను 5 కిలోలకు పెంచేందుకు వీలుగా మిషన్‌లో సాప్ట్వేర్ అప్లోడ్ చేయడంతోనే తొలిరోజు గడిచిపోయింది. దీంతో తొలిరోజు వచ్చిన వినియోగదారుల్లో కనీసం 20 శాతం మందికి కూడా నిత్యావసరాలు పంపిణీ చేయలేకపోయారు. మొరాయించిన మిషన్లు... రోడ్డెక్కిన డీలర్లు ఈ విధానం పట్ల కనీస అవగాహన లేని డీలర్లు ఆందోళన బాట పట్టారు. జీవీఎంసీలోని సర్కిల్-2 పరిధిలో వందమందికి పైగా డీలర్లు రేసపువానిపాలెంలోని ఏఎస్వో కార్యాలయం ఎదుట పనిచేయని మిషన్లతో ఆందోళన చేపట్టారు. ఈ సర్కిల్ పరిధిలో 126 షాపులుంటే కనీసం పాతిక షాపుల్లోనూ మిషన్లు పనిచేయని దుస్థితని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఆన్ చేసిన రెండు నిమిషాలకే మొరాయిచాయని, సిగ్నెల్స్ ఉండడం లేదు.. సర్వర్లు డౌన్ అయిపోతున్నాయంటూ మండిపడ్డారు. తమకే కాదు..కనీసం సివిల్ సప్లయిస్ అధికారులు కూడా అవగాహనలేదని అందరూ టెక్నీషియన్స్పైనే ఆధారపడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. 686 మిషన్లకు 20 మంది టెక్నీషియన్లు ఏమూలకుసరిపోతారని ప్రశ్నిస్తున్నారు. వీటి అమలును తాము వ్యతిరేకించడం లేదని...మాకు పూర్తిగా అవగాహన కల్పించి.. సాంకేతిక సమస్యలను పూర్తిగా పరిష్కరించాక దశలవారీగా అమలు చేస్తే బాగుంటుందని జిల్లా రేషన్‌షాపు డీలర్లసంఘం అధ్యక్షుడు చిట్టిబాబు కోరారు. కాగా ఒకటి రెండురోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్ది పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. -
ప‘రేషన్’
దుకాణాలకు చేరని రేషన్ బియ్యం! కర్నూలు: పౌర సరఫరాల శాఖకు ఈ-పాస్ అమలు కుదిపేస్తోంది. రేషన్ కోటా తీసుకెళ్లేది లేదని డీలర్లు మొండికేస్తుండగా.. నోటీసులు జారీ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 10 శాతం సరుకు మాత్రమే చౌకధరల దుకాణాలకు చేరింది. అది కూడా ఈ-పాస్ యంత్రాలు లేని దుకాణాలకు సరుకు చేర్చిన అధికారులు అంతా సవ్యంగానే ఉన్నట్లు చాటుకుంటున్నారు. మరోవైపు భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) గోదాముల నుంచి తూకాలు వేసి నేరుగా చౌక డిపోలకు బియ్యం సరఫరా చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయంతో హమాలీలు ఆందోళన చేపట్టారు. దీంతో మధ్యాహ్నం వరకూ గోదాములకు తాళాలు పడ్డాయి. చివరకు ఆందోళన కొలిక్కి వచ్చినప్పటికీ సరుకు తీసుకునేందుకు డీలర్లు జిల్లాలో లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. చౌక డిపోల్లో ఈ-పాసు యంత్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ చౌక డిపో డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా నుంచి భారీ ఎత్తున డీలర్లు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సోమాజీగూడలోని సివిల్ సప్లయ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఫలితంగా ఏప్రిల్ నెల సరుకులు కాస్తా సకాలంలో వినియోగదారులకు అందే పరిస్థితి కరువైంది. సాంకేతిక ఇబ్బందులు గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరుకుల తరలింపు, అనంతరం కార్డుదారులకు సరఫరా మొత్తం ఈ-పాసు యంత్రాల ద్వారా తూకాలు వేసి పంపిణీ జరగాల్సి ఉంది. అయితే గోదాముల వద్ద ఒక్కో ప్యాకెట్ 50 కిలోల 650 గ్రాములు లెక్కకట్టి ఇవ్వాల్సి ఉండగా కేవలం 48 కిలోలు మాత్రమే ఇస్తుండటంతో డీలర్లు బియ్యం తీసుకుపోవడానికి ముందుకు రాని పరిస్థితి. తమకు సరైన తూకంలో సరుకులు ఇస్తేనే ఈ-పాస్ అమలుకు ఒప్పుకుంటామని డీలర్లు మొండికేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఈ-పాస్ అమలు చేయాలంటే 3జీ సిమ్ అవసరం ఉంది. అయితే, జిల్లాలో అనేకచోట్ల నెట్వర్క్ లేకపోవడంతో త్రీజీ సిమ్ పనిచేసే అవకాశం లేదు. అంతేకాకుండా కర్నూలు పట్టణంలోని ఓల్డ్‌సిటీలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ-పాస్ అమలుకు ఇచ్చిన ఐడియా సిమ్‌లు పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడౌన్ వద్ద హమాలీల ఆందోళన వేయింగ్ మిషన్ ద్వారా బియ్యం లారీని తూకం వేసి ఇవ్వాలని డీలర్లు పట్టుబట్టడంతో ఖాళీ లారీని కాటా వేసి లోడు లారీతో మరోసారి కాటా వేయడానికి ఎక్కువ సమయం పడుతున్నందున ట్రక్కు డ్రైవర్లు అందుకు నిరాకరించారు. దీంతో ఎఫ్‌సీఐ గోడౌన్ వద్దే లోడు చేసిన లారీని వేయింగ్ మిషన్‌లో కాటా వేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ట్రక్కు డ్రైవర్లను ఒప్పించారు. అయితే అందువల్ల తాము ఉపాధి కోల్పోతామంటూ మండల స్టాక్ పాయింట్ వద్ద పనిచేస్తున్న హమాలీలు మంగళవారం ఆందోళనకు దిగారు. బియ్యం లోడుతో సరుకులు బయటకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగడంతో డీఎస్ఓ ప్రభాకర్‌రావు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేష్‌తో పాటు ఇతర అధికారులు గోదాము వద్దకు చేరుకుని హమాలీలతో చర్చలు జరిపారు. గోదాములో ఉన్న నిల్వలన్నీ పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచే సరుకులు రవాణా చేయాలన్న ఒప్పందంతో ఆందోళన విరమించారు. హమాలీల ఆందోళనతో మధ్యాహ్నం వరకు సరుకు రవాణా స్తంభించింది. తర్వాత హమాలీలు ఆందోళన విరిమించినప్పటికీ కోటాను తీసుకునేందుకు డీలర్లు మాత్రం ముందుకు రాలేదు. -
ప్రజాపంపిణీ అయోమయం
నెల్లూరు(రెవెన్యూ): ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకున్న ఈ-పాస్ విధానం అమలులో జాప్యం కారణంగా కార్డుదారులు రేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలో 1వ తేదీ నుంచి ప్రారంభించాల్సిన ప్రజాపంపిణీ ప్రక్రియ 6వ తేదీదాటిన ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ ఇప్పటి వరకు చౌకదుకాణాలకు చేరలేదు. ఈ-పాస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్న చౌకదుకాణాల డీలర్లు రేషన్ దుకాణాల్లోకి అన్లోడ్ చేసుకోవడంలేదు.ఈ-పాస్ విధానానికి వ్యతిరేకిస్తు డీలర్లు కోర్టును ఆశ్రయించారు. జిల్లాలో 1,874 చౌకదుకాణాలు ఉన్నాయి. 8.24 లక్షల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతి నెల జిల్లాలో 18 ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు రేషన్ సరఫరా చేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయాలని రాష్ట్ర అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ముం దస్తుగా పట్టణ ప్రాంతాల్లోని 350 చౌకదుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలు ఏర్పాటు చేసి రేషన్ పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాకు 120 ఈ-పాస్ మిషన్లు రావడంతో అధికారులు ఇబ్బందుల్లోపడ్డారు. జిల్లాలో ఉన్న చౌకదుకాణాల్లో పూర్తిస్థాయిలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈవిషయంపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలతో సిఫార్సులు చేయించారు. అధికారులు సిఫార్సులను పట్టించుకోకపోవడంతో డీలర్లు కోర్టును ఆశ్రయించారు. ఈ-పాస్ మిషన్లలో డేటా అప్లోడ్ చేయడం, సిమ్‌కార్డులు ఇవ్వడంలో జాప్యం జరిగింది. నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30కి పైగా ఈ-పాస్ మిషన్లలో అప్డేట్ చేయలేదు. ఈ-పాస్ విధానం అమలులో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తేనే తాము రేషన్ డౌన్లోడ్ చేసుకుంటామని డీలర్లు ఎదురుతిరిగారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తున్న బియ్యం తూకంలో తేడాలు వస్తున్నయని దాంతో డీలర్లు నష్టపోవాల్సి వస్తుందని ఈ సమస్యకు పరిష్కారం చూపేంతవరకు రేషన్ దింపుకునేదిలేదని డీలర్లు భీష్మించుకుకూర్చున్నారు. అధికారులు, డీలర్ల మధ్య కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం చౌకదుకాణానికి రావడం షాపు తీయకపోవడంతో వెనుతిరుగుతున్నారు. చర్యలు తీసుకుంటాం : -సంధ్యారాణి, డీఎస్ఓ ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసిన చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ జరి గేలా చర్యలు తీసుకుంటాం. డేటా అప్డేట్ చేయడం త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం 120 చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేశాం. వచ్చేనెలలో మిగిలిన చౌకదుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. -
రేషనుకూ అదే ముద్ర
లబ్ధిదారులకు రేషన్ కష్టాలు వేలిముద్ర వేసినోళ్లకే సరకులు వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం అమలు రేషను విడిపించుకోవాలంటే కొత్త చిక్కొచ్చిపడింది. ఇప్పటికే రకరకాల సాకులతో రేషను కార్డులకు కోత విధించిన సర్కారు తాజగా మరో నిబంధన అమలులోకి తేనుంది. రేషనుడీలరు సరకులివ్వాలంటే కార్డుహోల్డరు వేలిముద్ర వేయాల్సిందే. వేలిముద్ర ఏమాత్రం తేడా వచ్చిన రేషనుకు ఎసరే. ఏప్రిల్ నుంచి రాష్ర్ట ప్రభుత్వం ఈ నియమాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. అధికారవర్గాలు దీనిని ధ్రువీకరించాయి. బయోమెట్రిక్ విధానం కింద పించనుకు అగచాట్లు పడుతున్న నేపథ్యంలో రేషనుకూ అదేతరహా విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాకుంటే ఇది ఈ-పాస్ విధానమని అధికారులు సమర్దించుకుంటున్నారు. మహారాణిపేట: బయోమెట్రిక్‌తో పింఛనుదార్లను అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం ఆ బాధను రేషన్ దుకాణాలకూ వర్తింపజేయనుంది. ఈ-పాస్ విధానాన్ని అమలు చేసి ఇకమీదట వేలిముద్రలు వేసిన వారికే రేషన్ ఇవ్వనున్నారు. వచ్చే నెల నుంచి దీనిని అమలుచేయనున్నారు. దీని ప్రకారం నేరుగా కార్డుదారుడే రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి. అదీ డివైస్ ఎలక్ట్రానిక్ మిషన్‌పై వేలిముద్రలు పడితేనే. లేదంటే ఆ కార్డుకు రేషన్ నిలిపివేస్తారు. గతంలో ఒకరి కార్డు ఇంకొకరు తీసుకువెళ్లినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు అది కుదరదు. కచ్చితత్వం కోసం ప్రవేశపెడుతున్న ఈ పద్ధతి చాలామందికి ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ఈ పాస్ విధానం అమలైతే గామాల్లో ఒంటరిగా ఉన్న ముసలివారు పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వారు పెన్షన్ల కోసం నానా యాతన పడుతున్నారు. జియోట్యాపింగ్ మిషన్లపై ముసలివారి వేలిముద్రలు పడకపోవడం, వారు వేసే సమయానికి సిగ్నల్ పనిచేయకపోవడం తదితర సమస్యలతో అర్హులైన వారికి పింఛన్లు నిలిపివేస్తున్నారు. ఇప్పుడు రేషన్ దుకాణాల్లో కూడా కష్టాలు మొదలు కానున్నాయి. జిల్లాలో 2012 చౌకధరల దుకాణాలుండగా మొదటి విడతగా జిల్లాకు 686 ఈ పాస్ మిషన్లు, డీ వైస్ ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చేందుకు ప్రభుత్వం టెర్రాస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థ ద్వారా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 31 మిషన్లు పౌరసరఫరాల అధికారి కార్యాలయానికి చేరాయి. మొదటి విడతలో నగర పరిధిలోని భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలు, పెందుర్తి, రూరల్ పరిధిలోని యలమంచిలి మున్సిపాలిటీ, అ న్ని మండలాల్లో ఈ పద్ధతిని అమలు చేయనున్నారు. డీలర్లకు ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు పౌరసరఫరాాల అధికారులు శిక్షణ నిర్వహిస్తారు. జిల్లా లో 10 లక్షల 76 వేల119 రేషన్ కార్డులున్నాయి. ఇందులో నగర పరిధిలో 3 లక్షల 38 వేల729 కార్డులు కాగా, రూరల్‌లో 7 లక్షల 37 వేల 390 కార్డులు ఉన్నాయి. -
అమ్మో ‘ఈ-పాస్’
ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలపై చౌక డీలర్లలో ఆందోళన అసలు ఎంఎల్సీ గోడౌన్లపైనే నిఘా పెట్టాలని వినతి విజయవాడ : అమ్మో ఈ-పాస్ విధానం అంటూ డీలర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ విధానం ఆచరణలోకి వస్తే తమ పరిస్థితి అగమ్య గోచరమేనని చౌకధరల దుకాణాల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఈ-పాస్ డివైస్ పరికరం ద్వారా ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో రాష్ట్రంలో 6 వేల చౌక ధరల దుకాణాలకు కొత్త విధానాన్ని రూపొందించగా కృష్ణాజిల్లాలో 600 షాపుల్లో ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో విజన్‌టెక్ సంస్థ ద్వారా పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే డీలర్లు కొత్త విధానంపై ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం హైదరాబాద్, విజయవాడల్లో డీలర్ల సంఘాలు అంతర్గత సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్ కార్యచరణపై కసరత్తులు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో జిల్లాలో 2,200 మంది డీలర్లు, 1200 మంది కిరోసిన్ హాకర్లు ఉన్నారు. వీరు ప్రతి నెల బియ్యం, పంచదార, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. బియ్యంపై కిలోకు 25 పైసలు, పంచదారపై 13 పైసలు, కిరోసిన్‌పై 25 పైసలు కమీషన్ ఇస్తున్నారు. ఆ విధంగా నెలవారీ ఒక్కో డీలర్లకు రూ.2,500 లేదా 3,000లు కమీషన్ వస్తుంది. అయితే డీలర్లకు సరుకులు సరఫరా చేసే మండల్ లెవల్ మెయిన్ పాయింట్ల నుంచి వచ్చే సరుకులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతోంది. దాదాపుగా అన్ని పాయింట్లలో 50 కేజీల బియ్యం బస్తాకు 2నుంచి 3 కేజీల బియాన్ని అక్కడి అధికారులు దిగమింగటం బహిరంగ రహస్యమే. అయితే ఆ తూకం నష్టాన్ని డీలర్లు ప్రజలపై రుద్దుతుంటారు. ఈ క్రమంలో కలెక్టర్ బాబు.ఎ రూపొందించిన కొత్త విధానం డీలర్లను ఆర్థికంగా నష్టానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా పౌరసరఫరాల శాఖ ఎంఎల్‌సి పాయింట్లలో భారీ మోసం జరుగుతోందని, ఎంఎల్సీ పాయింట్లలో ఎలక్ట్రానిక్ కాటాలు పెడితే తమకు ఇబ్బంది ఉండదని డీలర్ల అసోసియేషన్ నాయకులు చెపుతున్నారు. వేతనాలు ఇవ్వాలి కాగా డీలర్లకు కమీషన్ విధానం రద్దు చేసి నెలవారి వేతనాలు ఇస్తే ప్రజాపంపిణీ వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని అసోసియేషన్ ప్రతినిధులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పౌరసరఫరాల కమిషనర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించినట్లు వారు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారని జిల్లా ప్రతినిధులు సాక్షికి వివరించారు. -
పంచాయతీల్లో ఈ-పాస్ విధానం
నెల్లూరు(రెవెన్యూ) : చౌకదుకాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. మొదటి విడతగా మున్సిపాలిటీల్లోని చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని నెల్లూరు కార్పొరేషన్, గూడూరు, కావలి, ఆత్మకూరు తదితర మున్సిపాలిటీల్లో ఈ-పాస్ విధానాన్ని ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 8.50 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. 1874 చౌకదుకాణాలున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో 3.50 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటిల్లో 800 చౌకదుకాణాలు ఉన్నాయి. మొదటి విడతగా 800 చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రక్రియకు అవసరమైన బయోమెట్రిక్ కిట్లను సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో రేషన్‌కార్డులు, ఆధార్ నంబర్ల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. బయోమెట్రిక్ యంత్రాలు వచ్చిన అనంతరం కార్డుదారుల వేలిముద్రలతో సహా పూర్తి వివరాలను వాటిలో పొందుపరుస్తారు. వచ్చే నెల నుంచి సంబంధిత కార్డుదారుడు చౌకదుకాణానికి పోయి వేలిముద్రలు వేస్తేనే రేషన్ పంపిణీ చేస్తారు. ఈ-పాస్ విధానంపై డీలర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారానే కిరోసిన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం, 4 వేల కిలోలీటర్ల కిరోసిన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. పేదలకు చేరాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. వందల మెట్రిక్ టన్నుల బియ్యం చౌకదుకాణాలకు చేరకుండానే దొడ్డిదారిన మిల్లులకు చేరుతున్నాయి. ఈ బియ్యాన్ని రీసైకిలింగ్ చేసి అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ పేదల బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. బియ్యం లారీల హద్దులు దాటే విషయంలో అధికారులకు ప్రతి నెలా ముడుపులు అందుతున్నాయి. పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన కిరోసిన్ 50 శాతానికిపైగా చౌకదుకాణాలకే చేరడంలేదు. హోల్‌సేల్ డీలర్లు చౌకదుకాణాలకు సరఫరా చేయాల్సిన కిరోసిన్‌ను పక్కదారిన లారీలు, సిటీ బస్సుల యజమానులకు విక్రయించి రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. డీజిల్ ధర అధికంగా ఉండడంతో లారీలకు కిరోసిన్ వినియోగిస్తున్నారు. నెల్లూరు రూరల్ ప్రాంతాల్లో కిరోసిన్ నిల్వ చేసి విక్రయిస్తున్నారు. ఇటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ-పాస్ విధానాన్ని అమలు చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నారు. పింఛన్ల పంపిణీ కూడా.. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, కల్లుగీత కార్మికుల పింఛన్ లబ్ధిదారులు 2.45 లక్షల వరకు ఉన్నారు. ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వచ్చే నెల నుంచి చౌకదుకాణాల ద్వారా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చౌకదుకాణాలల్లో బయోమెట్రిక్ మిషన్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ మిషన్లు అందుబాటులో ఉండడంతో పింఛన్లు పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ వచ్చే నెల నుంచి చౌకదుకాణాల్లో ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నాం. వచ్చే వారంలో బయోమెట్రిక్ మిషన్లు జిల్లాకు రానున్నాయి. ఈ-పాస్ విధానానికి సంబంధించి రేషన్ కార్డుదారుల పూర్తి వివరాలు మిషన్లలో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మిషన్లను డీలర్లకు అప్పగిస్తాం. ఈ-పాస్ విధానం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు చేపడుతాం. - సంధ్యారాణి, డీఎస్ఓ -
సారీ.. మీకు ‘ఫీజులు’ రావు
జంట నగరాల్లోని ఏపీ విద్యార్థులను తిరస్కరిస్తున్న ‘ఈ పాస్’ * రెన్యువల్ కాని స్కాలర్షిప్లు, ఫీజులు * ఏపీ ప్రభుత్వం మెలికతో ఇబ్బందుల్లో 2 లక్షల మంది విద్యార్థులు * ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్‌ను వేరు చేయకపోవడంతో తిప్పలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు హైదరాబాద్‌లో చదువుకుంటున్న 2 లక్షల మంద్రి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పాలిట శాపం గా మారింది. వారికి ‘ఈ పాస్’లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యువల్ కావడంలేదు. తొలి సంవత్సరం ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులు ఈ పాస్ ద్వారా రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంది. అయితే, జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో చదువుతున్న ఏపీ విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యువల్ చేయడానికి ఆంధ్రా జిల్లాల నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధన విధించింది. మరోపక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్‌ను ఇరు రాష్ట్రాలూ అలాగే కొనసాగిస్తున్నాయి. ఏపీ సర్కారు వేరేగా సర్వర్ ఏర్పాటు చేసుకోలేదు. దీంతో పాత సర్వర్‌లో ఏపీ విద్యార్థులు ఆంధ్రా జిల్లాల నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తెచ్చినా ‘ఈ పాస్’లో రెన్యువల్ కావడంలేదు. జంటనగరాల నుంచి ధృవీకరణ పత్రాలు తెచ్చినప్పటికీ, వారు గత ఏడాది తెలంగాణ జిల్లాల్లో ఉన్నారన్న కారణంతో వారిని తెలంగాణకు చెందిన వారిగా గుర్తిస్తూ కంప్యూటర్ తిరస్కరిస్తోంది. దీంతో జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని 2 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజులు రెన్యువల్ కావడంలేదు. ఆంధ్రప్రదేశ్ విధించిన నిబంధనను సడలించి, రెండు రాష్ట్రాలూ సర్వర్‌ను వేరు చేసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తేనే ఈ విద్యార్థులకు రెన్యువల్ అవుతుందని, లేదంటే వారికి స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించకుండా పోతుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. మరోపక్క.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 8,45,556 మంది ఉన్నారు. వీరిలోనూ 6,83,470 మంది విద్యార్థులవే మంగళవారం వరకు రెన్యువల్ అయ్యాయి. మిగతా వారివి పెండింగ్‌లో ఉన్నాయి. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యువల్‌కు గడువు సోమవారంతో ముగిసింది. ఎక్కువ మందికి రెన్యువల్ కాకపోవడంతో ఈ గడువును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. -
ఉపకారం
ఉపకార వేతనాలు, బోధనా ఫీజుల పథకం భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఆచరణ సాధ్యం కాని సవాలక్ష నిబంధనలు, ఆంక్షలు విధించి పేద విద్యార్థులకు ఫీజు చెల్లించకుండా తప్పుకునేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఈ నెల 10వ తేదీతో బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు పొందేందుకు పునరుద్ధరణ గడువు ముగియనుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. యలమంచిలి : 20014-15 విద్యాసంవత్సరానికి బోధనా రుసుము, ఉపకార వేతనం పొందాలంటే అర్హులైన విద్యార్థులు ఆధార్‌సంఖ్యను నమోదు చేసుకునే వారు. ఇంత వరకు ఎవరికీ ఇబ్బంది లేదు. ఇప్పుడు తల్లిదండ్రులిద్దరి ఆధార్ సంఖ్యలను ఆన్లైన్లో నమోదు చేయాలని తాజా మార్గదర్శకాల్లో మెలికపెట్టారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీఈడీ, డీఈడీ, ఎంఈడీ, బి-ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం కోర్సును బట్టి బోధనా రుసుము చెల్లిస్తోంది. ఇటువంటివారు జిల్లాలో దాదాపు రెన్యువల్ విభాగంలో సుమారు 50వేల మంది, కొత్తవారు 35వేల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. 2013-14లో 70వేల మంది వరకు విద్యార్థులు లబ్ధి పొందారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో క్రమబద్ధీకరణకు ఈ నెల 10వ తేదీ వరకు గడువు ఇచ్చారు. శనివారం నాటికి కేలవం 20 మంది శాతం కూడా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోలేదని తెలిసింది. మరో ఒక్కరోజే గడువు ఉండటంతో దాదాపు 80 శాతం మంది పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. ముగ్గురి ఆధార్ తప్పని సరి... బోధనా ఫీజులు పొందడం కోసం ఆన్లైన్ ఈ-పాస్ వెబ్సైట్లో విద్యార్ధి వివరాలు నమోదు చేయాలి. విద్యార్థి, తల్లి, తండ్రి ముగ్గురి ఆధార్ నంబర్ల నమోదు తప్పని సరి. లేని విద్యార్థుల దరఖాస్తు పునరుద్ధరణ ప్రక్రియ పూర్తికావడం లేదు. విద్యార్థుల్లో కొందరికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోవడం, కొందరికి ఇద్దరూ లేకపోవడం ఉంటోంది. ఇవే కాకుండా తల్లిదండ్రులు విడిపోయిన కేసులు, వేర్వేరుగా ఉంటున్న కేసులకు సంబంధించిన విద్యార్థులకు కొత్త ఉపకార వేతనాల ఆన్లైన్ పునరుద్ధరణ నిబంధనలు ఎలా అధిగమించాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పునరుద్ధరణకు గత ఏడాది మార్కుల జాబితా, ఈ ఏడాది జూన్ 2 తరువాత మీ-సేవా కేంద్రం ద్వారా తహశీల్దార్ జారీ చేసిన ఆదాయ కులధ్రువీకరణ పత్రాలు, పాన్‌కార్డ్ ఉంటే ఆ నంబరు, కారులాంటి నాలుగు చక్రాల వాహనం ఉంటే దాని వివరాలు, సెల్‌ఫోన్ నంబరు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇవే కాక ఆధార్ తీయించుకున్నా రాకపోయిన వారు కూడా దరఖాస్తు పునరుద్ధరణ చేసుకోలేకపోతున్నారు. నిబంధనలు సడలించకపోతే పలువురు పేద విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజులు పొందే అవకాశం కోల్పోనున్నారు. -
రైతులకు ఈ-పాస్ పుస్తకాలు
హైదరాబాద్: ఏపీలో రైతులకు ఈ (ఎలక్ట్రానిక్) పాస్ పుస్తకాలు అందించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాల స్థానంలో ఇవి అందజేస్తారు. వీటిని ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తారు. మంగళవారం అసెంబ్లీలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తోపాటు రెవిన్యూ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎంతమంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, వారి పొలం వివరాలు ఎంతవరకు నమోదు చేసుకున్నారు అనే అంశాలపై చర్చించారు. రైతుల భూముల వివరాలను నమోదు చేయటంతో పాటు ఈ పాస్ పుస్తకాలను రూపొందించి అందించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయేతర భూమి ఎంత అనే వివరాలను సేకరించాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర రాజధానిని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో స్థానికంగా భూమి లభ్యత ఎంత ఉంది అనే అంశంపైనా చర్చించినట్లు సమాచారం. -
అసలే ఆధార్.. ఆపై ఆన్ లైన్ !
పేదోడి స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజుకు ఎన్ని ఆంక్షలో? లక్షల మంది విద్యార్థులకు ఇక్కట్లు ఇకపై ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే చిన్న పొరపాటుతో ఫీజులు గోవిందా! అడుగడుగునా ఆంక్షల చట్రంలో బిగిస్తున్న ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సురేష్ ఆధార్ నంబరు కోసం 2013 జూలైలో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇంతవరకు ఆధార్ నంబరే జనరేట్ కాలేదు. ఇప్పుడు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఆధార్ నంబర్ లేక స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. - విశాఖపట్టణానికి చెందిన అనిల్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు ఫారం సంబంధిత కాలేజీకే వెళ్లలేదు. కానీ వెబ్సైట్లో మాత్రం ఆ విద్యార్థి దరఖాస్తు కాలేజీ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతోంది. కాలేజీ యాజమాన్యం తమ వద్ద పెండింగ్ లేదని చెబుతోంది. ఇలాంటి కారణాలతో ఒక్కరిద్దరు కాదు లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ అందక తిప్పలు పడుతున్నారు. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నా రాని వారు, ఆధార్ దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు, స్కాలర్షిప్ దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్న విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. రాష్ట్రంలో 100 శాతం ఆధార్ నమోదు కాలేదు. 85 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. అందులోనూ 15 శాతం మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ ఆన్లైన్లో చూపిస్తోంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియక , తెలిసినా పొరపాట్లను ఆన్లైన్లో సవరించుకునే అవకాశం లేక లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దూరమవుతున్నారు. యాజమాన్యాల ఒత్తిడితో సొంతంగా ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ఆధార్ కష్టాలు ఇలా ఉంటే.. ఇకపై సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సహా అన్నీ అన్లైన్లోనే జరగాలంటూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆధార్ లింకుతో అనేక మంది విద్యార్థులు స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజులకు దూరం కాగా.. ఈ కొత్త విధానంతో మరింత మంది నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఆన్‘లైన్’లోనే లక్షల దరఖాస్తులు.. గతేడాది డిసెంబరు 31 నాటికే స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజుల కోసం 28. 47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 29 లక్షలకు చేరుతుందని అంచనా. ఇప్పటివరకు 23.54 ల క్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలోనూ లక్షల మంది దరఖాస్తులు ఇంకా ఆన్లైన్ ‘ప్రాసెస్’ పేరుతో పెండింగ్‌లోనే ఉండిపోయాయి. పరీక్షల సమయం వచ్చేసినా.. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చేనెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫీజులు చెల్లించాలంటూ యాజమన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజుల ప్రక్రియ మాత్రం ఇంకా దరఖాస్తుల గడప దాటలేదు. ఈ దరఖాస్తులు ప్రాసెస్ అయ్యేదెప్పుడు? మంజూరు అయ్యేదెప్పుడో ప్రభుత్వానికే తెలియాలి. మొదటి సంవత్సరం చదివే విద్యార్థులైతే కాస్త ఫర్వా లేదు. కానీ ఇంటర్ రెండో సంవత్సరం, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. గత్యంతరం లేక అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులకు తూట్లు: కిషన్‌రెడ్డి ఫీజుల పథకానికి తూట్లు పొడిచేందుకు కిరణ్ సర్కారు ప్రయత్నిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు ఆధార్ లింకు పెట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్యాస్ సిలిండర్ కేటాయింపులకు ఆధార్ అక్కర్లేదని సుప్రీంకోర్టు స్పష్టంచేసినా విద్యార్థులకు ఆధార్ తప్పనిసరి చేయడమేమిటని ప్రశ్నించారు. ఇవీ తిప్పలు.. - విద్యార్థులు వేలి ముద్రలు సేకరించి, ఆధార్ సమయంలో ఇచ్చిన వేలి ముద్రలను సరిపోల్చేందుకుగాను ఈపాస్‌తో అనుసంధానం చేసుకున్న బయోమెట్రిక్ యంత్రాలను కళాశాలలు అమర్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ యంత్రాలు ఎక్కడ లభిస్తాయి? వీటిని అమర్చుకునేందుకు ఎంత ఖర్చవుతుందన్న సమాచారం అటు ప్రభుత్వం వద్దగానీ, ఇటు కాలేజీల వద్దగానీ లేదు. - ఏదైనా స్థాయిలో చిన్న పొరపాటు జరిగితే దాన్ని సవరించుకునే అవకాశాలపై స్పష్టత లేదు. బ్యాంకు అకౌంట్ నెంబర్ మారినా, ఆధార్ నంబర్ పొరపాటుగా నమోదైనా ప్రత్యామ్నాయం ఏంటి? - కళాశాల ప్రిన్సిపల్కూ తప్పనిసరిగా ఆధార్ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఆ నంబర్‌నే పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలంటోంది. ఒకవేళ ప్రిన్సిపల్‌కు ఆధార్ లేకపోతే ఆ కళాశాలలో చదువుకునే విద్యార్థులందరి దరఖాస్తులు ఆగిపోవాల్సిందేనా? - ప్రతి దశ ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తే వాటన్నింటికి సంబంధించి ఐడీలు, పాస్వర్డ్లు ఎలా భద్రపరచాలి? - చాలామంది విద్యార్థుల వద్ద ఆధార్ లేకపోవడంతో వారు తమ తల్లిదో, తండ్రిదో ఆధార్ సంఖ్య ఇచ్చి దరఖాస్తు చేసుకున్నారు. అలాంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థులకు నష్టం: కృష్ణయ్య ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆధార్ కార్డును ముడిపెట్టడంతో లక్షలాది మంది విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే ఆధార్ లింక్ తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పలువురు బీసీ సంఘాల నాయకులతో కలిసి సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. మంత్రి తమ వినతికి సానుకూలంగా స్పందించారని, సమస్య పరిష్కరించకపోతే వేలాది మంది బీసీ విద్యార్థులతో ఈనెల 23న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. -
‘ఈ-పాస్’తో బినామీలకు చెక్..!
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు ఇకపై పారదర్శకం గా జరగనున్నాయి.బినామీలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ-పాస్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టిం ది. ఈ మేరకు పట్టణంలోని ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాల లో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె.అచ్యుతానంద గుప్త గురువారం లాంఛనంగా ఈ విధానాన్ని ప్రారంభించా రు. దీని ద్వారా అనర్హులు, కళాశాలలకు రాని వారిని గు ర్తించడం సులువవుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలం లో అందించాలన్న ఉద్దేశంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇంటర్మీడియెట్, పైస్థాయి విద్యలు అం దిస్తున్న విద్యా సంస్థలు ఈ మిషన్లను కచ్చితంగా కొనాలని సూచించారు. త్వరితగతిన విద్యార్థుల వివరాలను నమోదు చేసి, ఈ బార్కోడ్ స్లిప్‌లను జతచేసి.. సాంఘి క సంక్షేమ శాఖ కార్యాలయానికి హార్డ్ కాపీలను అందజేయాలని కోరారు. ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. లక్ష్మీపతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల డేటా, ఈ-పాస్ బయోమెట్రిక్‌తో అనుసంధానం చేసి, బార్కోడ్ స్లిప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు, కరస్పాం డెంట్ ఎస్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పనితీరు ఇలా.. జిల్లాలో మొత్తం 310 కళాశాలలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి రూ.100 కోట్ల వరకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థులు తాము చదువుకుంటున్న కళాశాలలో ఆన్లైన్ ద్వారా స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ వారిని అర్హులుగా భావించి ఆన్లైన్లోనే ఫార్వర్డ్ చేస్తారు. దానికి ఓ నంబర్‌ను కేటాయిస్తారు. ఈ నంబర్‌ను ఈ-పాస్ బయోమెట్రిక్ మెషీన్లో ఎంటర్ చేసిన వెంటనే విద్యార్థుల వివరాలు వస్తాయి. మెషీన్‌పై విద్యార్థి ఫింగర్‌ను స్కాన్ చెయ్యాలి. ఆ మెషిన్‌పై డిజిటల్‌పాడ్‌స్క్రీన్‌పైన సంబందిత ప్రిన్సిపాల్, విద్యార్ది సంతకం చేయాలి. వెంటనే ఆధార్‌తో లింక్‌అయి..బార్కోడ్ షీట్‌తో విద్యార్థుల వివరాలు వస్తాయి..అన్నీ సక్రమంగా ఉంటే..సక్సెస్ రిపోర్ట్ వస్తుంది. ఒక వేళ తప్పుడు సమాచారం ఇస్తే..ఫెయిల్యూర్ రిపోర్ట్ వస్తుంది. -
ఆన్లైన్లోనే వసతిగృహాల వివరాలు
ఇందూరు, న్యూస్‌లైన్ : ప్రభుత్వ వసతి గృహాలకు సంబంధించిన అన్ని వివరాలు తప్పనిసరిగా ఈ-పాస్ ఆన్లైన్లోనే నమో దు చేయాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమిషనర్ వాణీప్రసాద్ జిల్లా అధికారులకు సూచించా రు. శుక్రవారం వసతి గృహాల నిర్వహణ, ఆన్లైన్ నమోదు, విద్యార్థుల ఆధార్ నంబర్ ఎంట్రీ, ఇతర అంశాలపై జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ నెల నుంచి వసతి గృహాల పూర్తి సమాచారం ఆన్లైన్లో కనిపిం చాలన్నారు. గ్యాస్ సిలిండర్, కూరగాయాలు, కరెంట్ బిల్లు, ఇతర బిల్లులు ఆన్లైన్ నుంచి పొందాల్సి ఉంటుందన్నారు. కాగా విద్యార్థులకు అందజేసిన నోట్‌బుక్స్, బెడ్‌షీట్, యూనిఫాంల వివరాలు, వారి హాజరు శాతాన్ని ఈ-పాస్‌లో నమోదు చేయాలని సూ చించారు. బోగన్ హాజరు శాతాన్ని తొలగించాలని, రోజువారీగా పిల్లల హాజరును జిల్లా అధికారులు వార్డె న్ల నుంచి తెలుసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, చదువుకునేందుకు బుక్కులతో లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు ప్రతి వసతి గృహానికి రూ.2వేల చొప్పున నిధులు మంజురు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా ప్రతి విద్యార్థికి స్పోర్ట్స్ దుస్తులు త్వరలోనే అందజేయనున్నట్లు వెల్లడించారు. ఉపకార వేతనాలు పొందటానికి ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని, నంబరును ఆన్లైన్లో ఫీడింగ్ చే యించడంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని అభినందించారు. అదేవిధంగా కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులులేక సీట్లు ఖాళీగా ఉన్నాయని వా టిని త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, వంద శాతం పిల్లలుండాలని అధికారులను అదేశించా రు. ఈ సందర్భంగా జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి విమలాదేవి మాట్లాడుతూ జిల్లాలోని అందరు వార్డెన్లకు ఈ-పాస్ ఆన్లైన్ వెబ్సైట్లో వసతిగృహాల పూర్తి వివరాల నమోదుపై శిక్షణ ఇస్తున్నట్లు కమిషనర్‌కు తె లిపారు. అలాగే విద్యార్థుల హాజరుశాతాన్ని ఆన్లైన్ లో నమోదు చేశామని, ఆధార్ ఫిడింగ్కు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏబీసీడబ్ల్యూఓ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ సూపరింటెండెంట్ రమేశ్, జూనియర్ అసిస్టెంట్ రేవంత్ పాల్గొన్నారు.