అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్
పౌరసరఫరాల శాఖ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ విధానాన్ని అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. దీనిపై హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు సత్ఫ లితాలు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరా బాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 1,545 రేషన్ దుకాణా ల్లో ఈ–పాస్ విధానంతో గతేడాది మార్చి నుంచి ఇప్పటి దాకా సుమారు రూ.130 కోట్లు ఆదా అయినట్లు శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. దీంతో దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణ యించారు.
ఈ మేరకు ఈ–పాస్ యంత్రాల సరఫరా టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు. గతంలో వినియోగిం చిన ఈ–పాస్ యంత్రాల్లో కేవలం వేలిముద్ర సౌకర్యం మాత్రమే ఉండగా... తాజాగా బహుళ ప్రయోజనకారిగా ఉండేందుకు ఐరిస్, ఈ–వేయింగ్ సౌకర్యం ఉండేలా తయారు చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ–పాస్ విధానంలో ప్రతి రాష్ట్రా నికి కొన్ని లక్ష్యాలు నిర్దే శించిందని.. నగదు రహిత లావాదేవీల కోసం ఈ చర్యలు తీసు కుందని చెబుతున్నారు. దీంతో ఆ దిశగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. నగదురహిత లావాదేవీల వైపు అన్ని శాఖలూ మళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కూడా రేషన్ దుకాణాలపై దృష్టి పెట్టారు.
మినీ ఏటీఎంలుగా రేషన్ షాపులు!
మారుమూల, బ్యాంకులు లేని గ్రామాల్లో సైతం రేషన్ షాపులున్నాయి.దీంతో భవిష్యత్తులో వీటినే మినీ ఏటీఎం లుగా చేయాలన్న ప్రణాళిక ఉందని పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ముందు ముందు రేషన్ డీలర్లను ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా తయారు చేయడం ద్వారా మీ–సేవ కేంద్రాల్లో లభించే సేవలను అందించేలా ఈ–పాస్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.