శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం జిల్లా సమగ్ర మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఉన్న గుమ్మడి చక్రధర్‌రావును తెలంగాణకు పంపించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజనల్ డెరైక్టర్ నేరుగా కలెక్టర్ పి. లక్ష్మీనృసింహంను కలసి ఆయనను రిలీవ్ చేయాలని కోరడంతో రాత్రికి రాత్రే రిలీవ్ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ఈ-పాస్ అమలు సక్రమంగా లేదని పదిరోజుల క్రితమే అతన్ని ఏపీ ప్రభుత్వ అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ పూనం మాల కొండయ్య సస్పెండ్ చేశారు. అయితే కలెక్టర్ సూచనతో 24 గంటల వ్యవధిలోనే సస్పెన్షన్ ఉత్తర్వులు నిలుపుదల చేశారు.