సాక్షి, చెన్నై: తమిళనాడులో విపరీతంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో చెన్నై సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్న ఐదు జిల్లాల్లో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉంది. చెన్నై సిటీ ప్రజలు ఇతర జిల్లాలకు వెళ్లకుండా, ఇతర జిల్లాల ప్రజలు చెన్నై సిటీలో అడుగు పెట్టకుండా తమిళనాడు ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. అత్యవసర సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ పాసులు తీసుకోవాలని నిబంధనలు పెట్టింది. (చదవండి : తదుపరి చిత్రానికి రజనీ రెడీ)
ఈ నేపథ్యంలో ఇటీవల, సూపర్ స్టార్ రజనీకాంత్ లగ్జరీ కారు నడుపుతూ, చెన్నై సమీపంలోని . కీళంబాక్కంలోని లోని తన ఫామ్ హౌస్ రెండో కూతురు, అల్లుడితో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ కాలం గడుపుతున్నారని కొన్ని ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. ఫామ్ హౌస్ లో రజనీకాంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కీళంబక్కం వరకు కారులో వెళ్లిన రజనీకాంత్‌కు ఈ పాస్ ఉందా అని పలువురు నెటిజన్లు ప్రశ్నించారు.
(చదవండి : చంద్రముఖి సీక్వెల్‌పై లారెన్స్ స్పందన)
అయితే రజనీకాంత్ నిబంధనల ప్రకారం ఈ పాస్ తీసుకోనే కారులో ప్రయాణం చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా మళ్లీ ఇప్పుడు రజనీ చేసినట్లు చెబుతున్న మరో ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పాస్ లేకుండా ప్రయాణం చేసినందకు రజనీకాంత్ క్షమాపణలు చెప్పారని ఆ ట్వీట్ సారాంశం. ‘ఈ పాస్ లేకుండా ప్రయాణించాను. మీ బిడ్డగా పరిగణించి నన్ను క్షమించండి’అని రజనీ ట్వీట్ చేశారు. అయితే అది రజనీకాంత్ ట్వీటర్ ఖాతా కాదని, ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. రజనీ అధికారిక ట్వీటర్ ‘@rajinikanth’పేరుతో ఉండగా, నకిలీ ఖాతా‘@RajiniOff’పేరుతో ఉంది. రజనీ ట్వీటర్ ఖాతాను 2013 ఫిబ్రవరిలో తెరచినట్లు ఉండగా, రజనీ క్షమాపణ చెబుతూ చేసిన ట్వీటర్ ఖాతా గత నెలలో తెరచినట్లు ఉంది. దీంతో ఇది నకిలీ ట్వీట్ అని అర్థమవుతంది. ఈ ఫేక్ ట్వీట్‌పై రజనీకాంత్ స్పందించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment