
అనుకోని విధంగా ‘అన్నాత్తే’ టీమ్‌కి కరోనా కష్టం వచ్చింది. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతోంది. త్వరగా సినిమా పూర్తి చేయాలని 70 ఏళ్ల వయసులోనూ రజనీ ఎంతో జోష్‌గా రోజుకి దాదాపు 14 గంటలు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రం యూనిట్ సభ్యుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో షూటింగ్ జోష్‌కి బ్రేక్ పడింది. ‘‘యూనిట్ సభ్యులకు కోవిడ్ టెస్ట్ నిర్వహించిన నేపథ్యంలో నలుగురికి పాజిటివ్ వచ్చింది. రజనీకాంత్, మిగతా అందరికీ నెగటివ్ అని నిర్ధారణ అయింది. భద్రతను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ని వాయిదా వేశాం’’ అని చిత్రనిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment