
అఖిల్
ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడట ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారట. ఆల్రెడీ సగానికి పైగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దాదాపు ఓ నెల షూట్ జరిగితే మూవీకి ప్యాకప్ చెప్పేస్తారట టీమ్. లాక్‌డౌన్ పూర్తయిన వెంటనే చకచకా పనులు పూర్తి చేయడానికి ఇప్పుడే కొన్ని రీ–రికార్డింగ్, ఎడిటింగ్ పనులపై దృష్టిపెట్టింది ఈ చిత్రబృందం.
Comments
Please login to add a commentAdd a comment