టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే తండ్రి మంజునాథ్ ఈ రోజు(శనివారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా పూజా కుటుంబం క్వారంటైన్‌లోనే ఉండటం వల్ల ఇంట్లోనే తండ్రి కోసం ఏదైనా స్పెషల్‌గా తయారుచేసి సర్‌ప్రైజ్ ఇద్దాం అనుకుంది. దీంతో తండ్రి కోసం పూజా మాస్టర్ చెఫ్‌గా మారి చాక్లెట్ కేక్ తయారు చేసింది. ఈ కేక్‌కు సంబంధించిన ఫోటోలను ఈభామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే తండ్రి కేక్ కట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఇక లాక్‌డౌన్ కాలంలో పూజా వంటలు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే గజార్ కాహాల్మా, పిజ్జాను ఆమె తయారు చేసిన విషయం తెలిసిందే. (అమ్మకోసం పిజ్జా తయారు చేసిన పూజా)
లాక్‌డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇంటిని చక్కబెట్టడం, నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంట్లో వంటలు తయారు చేయడంపై కుస్తీ పడుతున్నారు. ఇప్పటి వరకు వంటగది వైపు చూడని వారు సైతం గరిట చేతపట్టుకొని నలభీములుగా మారుతున్నారు. కొత్త కొత్త వంటలపై ప్రయోగాలు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఇటీవల జార్జియాలో ప్రభాస్ 20వ సినిమా ‘ఓడియర్’ షూటింగ్ అనంతరం మార్చిలో ఇండియాకు వచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం హైదరాబాద్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. (ఇటలీ పార్ట్.. హైదరాబాద్‌లోనే!)
Comments
Please login to add a commentAdd a comment