birthday cake
-
మహిళ బర్త్‌డే కేక్ కటింగ్.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు
ఓ మోడల్ తన పుట్టిన రోజు సందర్భంగా బర్త్‌డే కేక్ కట్ చేయడం విమర్శలకు దారి తీసింది.ఎందుకంటారా?ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాలభైరవ దేవాలయం ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా దేవాలయానికి మోడల్ మమతా రాయ్ వచ్చింది. అయితే, దైవదర్శనం అనంతరం తన వెంట తెచ్చుకున్న బర్త్‌డే కేకును కాలభైరవ విగ్రహం ఎదుట కట్ చేసి తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకుంది.శక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలభైరవ ఎదుట మమతా రాయ్ బర్త్‌డే కేక్ కట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవిత్రమైన దేవాయంలో ఆమె కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పుట్టిన రోజు దైవదర్శనం చేసుకోవడం మంచిదే. ఇలా కేక్ కట్ చేయమని ఎవరు? చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, వారణాసిలోని కాశీ విద్వాత్ పరిషత్ అనే సంస్థ దేవాలయంలో జరిగిన ఘటనపై ఆగ్రహం చేసింది. మమతారాయ్ బర్త్‌డే కేక్ కట్ చేస్తున్నా ఆలయ నిర్వహాకులు స్పందించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. चंद पैसों के लिए पंडा-पुजारियों ने हमारे आस्था के केंद्रों को मजाक बना रखा है, आप भी जेब ढीली करिये और गर्भगृह में बर्थडे व एनिवर्सरी सेलिब्रेट कर सकते हैं, काल भैरव मन्दिर में केक काटने का है ये वीडियो #varanasi pic.twitter.com/joznhamSrF— Dr Raghawendra Mishra (@RaghwendraMedia) November 29, 2024 -
చాక్లెట్లో పళ్ల సెట్.. కంగుతిన్న టీచర్
పుట్టిన రోజు సందర్భంగా పిల్లలు ఇచ్చిన చాక్లెట్లు తిన్న ఓ రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు తీపు కబురు కాస్త పీడకలగా మారింది.మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో మాయాదేవి గుప్తా స్కూల్ ప్రినిపాల్‌గా రిటైరయ్యారు. ప్రస్తుతం ఓ ఎన్జీవోలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజు వేడుకలు జరుగుతుంటాయి. ఎప్పటిలాగే ఆ ఎన్జీవోలో పిల్లల పుట్టిన రోజులు ఘనంగా జరిగాయిపుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఓ విద్యార్ధి మాయాదేవికి చాక్లెట్ ఇచ్చాడు. అయితే, ఎంతో ఆనందంతో ఆ చాక్లెట్లు తినేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఏమైందంటే ‘విద్యార్ధి నాకు ఒక పాపులర్ బ్రాండ్‌కి చెందిన కాఫీ ఫ్లేవర్ చాక్లెట్ ఇచ్చాడు. చాక్లెట్ తిన్నాక ఏదో కరకరలాడే చాక్లెట్ ముక్కలా అనిపించింది. మరోసారి నమలడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడలేదు. వెంటనే చాక్లెట్‌ను పరీక్షించగా అందులో నాలుగు దంతాల పళ్ల సెట్ చూసి కంగుతిన్నాను.’అని తెలిపారు.వెంటనే ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్కు మాయాదేవి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పిల్లలు చాక్లెట్లు కొనుగోలు చేసిన దుఖాణం నుంచి అధికారులు చాక్లెట్ నమూనాలను సేకరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్ఎల్ అవాసియా ఈ నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
#HBDYSJagan : భారీ కేక్‌తో జననేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు (ఫొటోలు)
-
ప్రాణాలు తీసే బర్త్ డే కేకులు తింటే పైకి పోవడమే
-
కూకట్‌పల్లిలో దారుణం
సాక్షి, హైదరాబాద్: కూకట్ పల్లిలో దారుణం జరిగింది. స్నేహం ముసుగులో ముగ్గురు మైనర్లు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌కు చెందిన యువతికి బర్త్‌డే కేకులో మత్తు మందు ఇచ్చిన ముగ్గురు మైనర్ బాలురు ఆమెపై లైంగిక దాడికి దిగారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు నిలదీయడంతో యువతి విషయం బయటపెట్టింది. ఘటన సైబరాబాద్ పరిధిలో జరగడంతో జీరో ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి సైబరాబాద్ పోలీసులకు బదిలీ చేశారు. యువతి సికింద్రాబాద్‌లోని కళాశాలలో డిగ్రీ చదువుతోంది. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం ) -
స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్
ప్రపంచంలోని అన్ని బంధాల్లో స్నేహ బంధం గొప్పదంటారు. తల్లదండ్రులకు కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలను కేవలం స్నేహితుల దగ్గరే చెప్పుకుంటాం. స్నేహానికి వయసుతో సంబంధం లేదు. అలాంటి స్నేహితుల పుట్టిన రోజు వస్తే ఖచ్చితంగా ఎదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే.. ఆ బహుమతి విలువ దాని ఖరీదును బట్టి కాకుండా ఇచ్చే స్వచ్చమైన మనుసును బట్టి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన స్నేహితుడికి సరికొత్తగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా.. మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. అవును తన స్నేహితుడు, ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ ఆదివారం తన 90వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్ తన స్నేహితుడి కోసం స్వయంగా కేకును తయారు చేసి వారెన్కు బర్త్‌డే విషెస్ తెలిపారు. (‘2021 మే నాటికి కరోనా అంతం’) కేక్ తయారు చేసిన వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిమిషం నిడివిగల ఈ వీడియోకు ‘90వ పుట్టిన రోజు శుభాకాంక్షలు వారెన్’ అని పేర్కొన్నారు. ఈ వీడియోలో కేకు కోసం పిండిని జల్లెడ పట్టం, చాక్లెట్ కట్ చేయడం నుంచి అన్ని పనులను ఆయనే చేశారు. ఆఖరుగా కేకును బేక్ చేసి దానిపై ఓరియో బిస్కెట్లతో అందంగా తయరు చేశాడు. ఒక పీస్‌ను కట్ చేసి పెట్టాడు. అతను చివరకు తుది ఉత్పత్తితో పోజులిచ్చాడు మరియు కేక్ నుండి ఒక ముక్కను కత్తిరించాడు. అయితే కేకుతోపాటు భావోద్వేగ లేఖను కూడా స్నేహితుడి కోసం రాశారు. ఇందులో వారెన్ వ్యక్తిగత జీవితం, స్నేహం బంధం గురించి వివరించారు. కాగా బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ తొలిసారిగా 1991 జూలై 5న కలుసుకున్నారు. (2020లో వారెన్ బఫెట్ సంపదకు చిల్లు) Happy 90th birthday, Warren! pic.twitter.com/8nH2EulTR4 — Bill Gates (@BillGates) August 30, 2020 -
వూహాన్లో కన్నీళ్లు పెట్టుకున్న డెలివరీ బాయ్
వూహాన్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అడుగు బయటకు పెట్టాలంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలోనూ మనకోసం నిత్యావసర సరుకులు, ఆహారాన్ని అందించడానికి డెలివరీ బాయ్స్ నిరంతరం శ్రమిస్తున్నారు. వీరి కష్టాన్ని గుర్తించిన జనాలు వారిపై తమకు తోచినవిధంగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. అయితే తొలిసారిగా కరోనా బయటపడ్డ వూహాన్ నగరంలో ఓ డెలివరీ బాయ్‌కు మర్చిపోలేని అనుభవం ఎదురైంది. ఎప్పటిలాగే ఏప్రిల్ 15న కూడా తనకు వచ్చిన ఆర్డర్లను చూసుకుని వాటిని డెలివరీ చేస్తున్నాడు. అందులో భాగంగా రాత్రి వచ్చిన కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేకరీకి వెళ్లగా షాపులో పనిచేసే వ్యక్తి అది తనకోసమేనని చెప్పాడు. (ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ) దీంతో అయోమయానికి లోనైన ఆ యువకుడు "పొరపాటుపడుతున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి" అని మరీమరీ చెప్పగా అతను మళ్లీ డెలివరీ బాయ్ పేరే చెప్పాడు. దీంతో ఆశ్చర్యానికి లోనైన డెలివరీ బాయ్‌కు అప్పుడు గుర్తుకు వచ్చింది ఆరోజు తన పుట్టిన రోజని. ఉప్పొంగుకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కేక్ తీసుకుని బేకరీ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కళ్ల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకుంటూ ఆ కేక్‌ను ఆదుర్దాగా తిన్నాడు. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. "ఆ అజ్ఞాత కస్టమర్ ఎవరో కానీ డెలివరీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే కానుకిచ్చార"ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. (డెలివరీ బాయ్ వెంటపడుతున్న నెటిజన్లు) -
శ్రీమతికో కేక్
లాక్డౌన్ వేళ సమంత జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మంగళవారం (ఏప్రిల్ 28) సమంత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భార్య కోసం నాగచైతన్య స్వయంగా ఓ కేక్‌ను తయారు చేశారు. చైతన్య కేక్ బేక్ చేసిన వీడియోను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సమంతకు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. నాగచైతన్య, సమంత -
తండ్రి కోసం చాక్లెట్ కేక్ చేసిన పూజా..
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే తండ్రి మంజునాథ్ ఈ రోజు(శనివారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా పూజా కుటుంబం క్వారంటైన్‌లోనే ఉండటం వల్ల ఇంట్లోనే తండ్రి కోసం ఏదైనా స్పెషల్‌గా తయారుచేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది. దీంతో తండ్రి కోసం పూజా మాస్టర్ చెఫ్‌గా మారి చాక్లెట్ కేక్ తయారు చేసింది. ఈ కేక్‌కు సంబంధించిన ఫోటోలను ఈభామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే తండ్రి కేక్ కట్ చేస్తున్న ఫోటోలు కూడా ఆమె అభిమానులతో పంచుకుంది. ఇక లాక్డౌన్ కాలంలో పూజా వంటలు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే గజార్ కాహాల్మా, పిజ్జాను ఆమె తయారు చేసిన విషయం తెలిసిందే. (అమ్మకోసం పిజ్జా తయారు చేసిన పూజా) లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో ఇంటి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఇంటిని చక్కబెట్టడం, నచ్చిన వ్యాపకాలతో సమయం గడుపుతున్నారు. ఇక నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ప్రస్తుతం ఇంట్లో వంటలు తయారు చేయడంపై కుస్తీ పడుతున్నారు. ఇప్పటి వరకు వంటగది వైపు చూడని వారు సైతం గరిట చేతపట్టుకొని నలభీములుగా మారుతున్నారు. కొత్త కొత్త వంటలపై ప్రయోగాలు చేస్తూ వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. కాగా ఇటీవల జార్జియాలో ప్రభాస్ 20వ సినిమా ‘ఓడియర్’ షూటింగ్ అనంతరం మార్చిలో ఇండియాకు వచ్చిన పూజా హెగ్డే ప్రస్తుతం హైదరాబాద్‌లో తన కుటుంబంతో నివాసం ఉంటోంది. (ఇటలీ పార్ట్.. హైదరాబాద్‌లోనే!) -
’బర్త్‌డే కేక్’ కేసులో వీడిన మిస్టరీ
సాక్షి, సిద్దిపేట: నాలుగు నెలల క్రితం సిద్ధిపేట జిల్లాలో బర్త్‌డే కేక్ తిని ప్రాణాలు కోల్పోయిన తండ్రీకొడుకుల కేసులో మిస్టరీ వీడింది. పాపమంతా కేకు తయారు చేసిన బేకరీ యజమానిదేనని తేలింది. కాలం చెల్లిన రసాయనాలతో కేకు తయారు చేయటం వల్లే తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ పరీక్షలతో తేలింది. ఆస్తి తగాదాల కారణంగా బాబాయే కేకులో విషంపెట్టి చంపాడన్న ఆరోపణలు వాస్తవం కాదని తేలింది. (‘కేక్’ బాధితుల ఇంట మరో విషాదం) ఐనాపూర్ ఘటనతో ఆందోళన.. సిద్దిపేట అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్, అతని కుమారుడు రాంచరణ్ 2019 సెప్టెంబర్ 4వ తేదీన కేక్ తినడం వల్ల అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో కొమురవెల్లి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేక్ నమూనాలను హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించడంతో అందులో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని.. కాలపరిమితి ముగిసిన ఆహార పదార్థాలు, రసాయానాలు వాడి ఎలాంటి శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారుచేసిన కేక్ తినడంతో వారిలో ఫంగస్, ఇన్ఫెక్షన్ సోకి శరీరంలో విష పదార్థంగా మారడంతో వారు చనిపోయారని పోలీసులు తెలిపారు. దీంతో సిద్దిపేటలోని బేకరీ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన జిల్లా వాసులు జిల్లాలోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీల్లో కల్తీ పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని, కాలం చెల్లిన తర్వాత కూడా విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. (కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!) శాంపిల్స్తోనే సరి.. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక హోటల్లో ఇడ్లీలో బొద్దింక వచ్చిందని వినియోగదారుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మున్సిపల్ అధికారులు ఆ హోటల్‌ను సీజ్ చేశారు. కానీ మరుసటి రోజు నామమమాత్రం జరిమానాతో సరిపెట్టడంతో హోటల్ నిర్వాహకులు తిరిగి తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని హోటళ్లలో రాత్రి మిగిలిపోయిన మాంసం, ఇతర తినుబండారాలను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, మరుసటి రోజు మసాలాలు, పుడ్ కలర్స్, ఇతర రసాయానాలను వాడి గుర్తు పట్టలేకుండా ఘుమఘమలాడిస్తూ వినియోగదారులకు వడ్డిస్తున్నారు. వీటిని అడఫా దడఫా ఆహార భద్రతా అధికారి తనిఖీలు చేస్తున్నప్పటికీ శాంపిల్స్ సేకరణతోనే సరిపెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. (కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు) 197 శాంపిల్స్.. 27 కేసులు నమోదు.. జిల్లాలో పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌సెంటర్లు, బిర్యానీసెంటర్లు, పాల విక్రయకేంద్రాలు, సూపర్మార్కెట్లు, రోడ్డు పక్కన ఆహర పదార్థాలను విక్రమయించే బండ్లు, పండ్ల విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 2017 నుంచి 2019 డిసెంబర్ వరకు 179 ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆహార పదార్థాల విషయంలో కల్తీ జరిగిందని ఫలితాలు వచ్చిన రిపోర్టుల ఆధారంగా 27 కేసులు నమోదు చేశారు. ఇందులో 17 కేసుల్లో నిర్వాహకులకు రూ. 3,55,000 జరిమానా విధించారని అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లా ఆహార భద్రతా అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జిల్లాలో సక్రమంగా ఉండకపోవడంతోపాటు, ఎవ్వరో ఫిర్యాదు చేస్తే కానీ తనిఖీలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆహార భద్రతా అధికారులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, తరుచూ తనిఖీలు నిర్వహించేలా ఆదేశించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తే చర్యలు తప్పవు.. జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయించే వారు తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే వారికి జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హోటల్, బేకరీ, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు తమ వ్యాపారాన్ని నిర్వహించాలి. గడువు ముగిసిన, పాడైపోయిన ఆహార పదార్థాలను విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. –రవీందర్రావు, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిద్దిపేట -
బర్త్‌డే పార్టీకి అనుకోని అతిథి
-
వైరల్: బర్త్‌డే కేక్ ఎత్తుకుపోయిన కోతి
పుట్టిన రోజు వేడుకలు అనగానే మొదటగా గుర్తొచ్చేది కేక్. ప్రస్తుత రోజుల్లో కేక్ లేకుండా బర్త్‌డే జరుపుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. అయితే ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకను సాధారణంగా కాకుండా కాస్త భిన్నంగా జరుపాలనుకున్నారు. అనుకున్నట్టుగానే చుట్టూ చెట్లు చేమలు ఉండే ప్రదేశానికి తీసుకువెళ్లారు. బర్త్‌డే బాయ్ ఎదురుగా కేక్‌ను సిద్ధం చేశారు. అయితే అక్కడే ఉన్న ఓ కోతి కేక్‌పై మనసు పారేసుకున్నట్టుంది. కన్నార్పకుండా కేక్వైపే తీక్షణంగా చూస్తోంది. కానీ దీన్ని పెద్దగా పట్టించుకోని అతడి స్నేహితులు, బంధువులు బర్త్‌డే సాంగ్ అందుకున్నారు. బర్త్‌డే బాయ్ కేక్ కట్ చేసి ఆ ముక్కను చేతులోకి తీసుకున్నాడో లేదో కోతి పరుగెత్తుకొచ్చింది. మొత్తం కేక్‌ను తీసుకుని చెట్టుపైకి ఉడాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోతి.. చాన్స్ కోసం ఎదురుచూసి లటుక్కున పట్టుకుపోయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
‘కేక్’ బాధితుల ఇంట మరో విషాదం
సాక్షి, సిద్దిపేట: కుటుంబంలో ఇద్దరు మృతి చెందిన వారం రోజులు గడవక ముందే ఆ ఇంట మరో విషాదం జరిగిన ఘటన కొమురవెల్లి మండల పరిదిలోని అయినాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత బుధవారం రాత్రి పుట్టిన రోజు కేక్ తిని ఇస్తారిగల్ల రవీందర్, కుమారుడు రాంచరణ్‌లు మృతి చెందగా రవీందర్ భార్య నాగలక్ష్మి, కూతురు పూజితలు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే... ఇదిలా ఉండగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న నాగలక్ష్మి నాన్నమ్మ(రాంచరణ్ తాతమ్మ) కర్రొల్ల బాలవ్వ(84) బుధవారం ఉదయం మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో మరో విషాదం నెలకొంది. నాగలక్ష్మి ఆరోగ్య పరిస్ధితుల దృష్ట్యా భర్త, కుమారుడు మృతి చెందినట్లు తెలియని నాగలక్ష్మికి నాన్నమ్మ మృతి విషయం కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. చదవండి: పుట్టినరోజు కేక్‌లో విషం! -
పుట్టినరోజు కేక్‌లో విషం!
సాక్షి, సిద్దిపేట/చేర్యాల: తండ్రి తర్వాత తండ్రి బాబాయి. తండ్రి కన్నా ప్రేమగా చూసుకోవాల్సిన ఆయన పుట్టిన రోజు బహుమతిగా పంపిన కేక్‌లో విషం కలిపాడు. పాత పగకు ప్రతీకారంగా చేసిన కుట్ర ఫలితంగా పుట్టినరోజు సంబురంలో కేక్ కట్‌చేసి, ఆ కేక్ తండ్రి చేతుల మీదుగా తిన్న కుమారుడు, కుమారుడి చేతుల మీదుగా తిన్న తండ్రి చనిపోగా.. అక్క మృత్యువుతో పోరాడుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్ర అస్వస్థతకు గురైన తల్లి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట అంబేడ్కర్‌నగర్‌కు చెందిన ఇస్తారిగల్ల రవీందర్‌కు, ఐనాపూర్ గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(నాగలక్ష్మి)కి 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పూజిత (12), రామ్‌చరణ్ (9) అనే పిల్లలున్నారు. రవీందర్‌కు వరుసకు తమ్ముడు అయ్యే శ్రీనివాస్‌తో తరచూ గొడవలు అవుతుండేవి. దీంతో రవీందర్ తన భార్యబిడ్డలతో కలసి అత్తగారి ఊరైన ఐనాపూర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఐనాపూర్‌లో బంధువు మృతి చెందడంతో అక్కడికి వచ్చిన శ్రీనివాస్ తన అన్న కుమారుడు రామ్‌చరణ్‌ను కలిశాడు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ అదే రోజు తన పుట్టినరోజు అని చెప్పడంతో.. ‘నీ పుట్టిన రోజు సందర్భంగా నేను సిద్దిపేట నుంచి కేక్ పంపిస్తాను. సంబురంగా కేక్ కట్‌చేసుకో’అని శ్రీనివాస్ చెప్పాడు. బాబాయి మాటలు విన్న రామ్‌చరణ్, తల్లిదండ్రులతో పుట్టిన రోజు వేడుకలు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో బేకరీలో కేక్ కొన్న శ్రీనివాస్ ఆ కేక్‌లో విషం కలిపి ఐనాపూర్ బస్సుకు తన అన్న కుమారుడు రామ్‌చరణ్‌కు ఇవ్వాలని చెప్పి పంపించాడు. బాబాయి పంపిన కేక్‌ను తీసుకున్న రామ్‌చరణ్ సంబురంగా రాత్రి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు. ఆ కేక్‌ను తల్లిదండ్రులు రవీందర్, భాగ్యలక్ష్మిలు కుమారుడికి తినిపించారు. అదేవిధంగా అమ్మా, నాన్న, అక్కకు రామ్‌చరణ్ ఆ కేక్‌ను తినిపించాడు. కేక్ తిన్న కొద్ది సేపటి తర్వాత కుడుపులో తిప్పుతోందని రామ్‌చరణ్ తల్లిదండ్రులకు చెప్పడంతో కుమారుడిని తీసుకొని బయటకు వచ్చారు. అప్పటికే రవీందర్‌కు కూడా నోటిమాట రాకపోవడంతోపాటు, కుమార్తె పూజిత, భాగ్యలక్ష్మి కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామస్తులు నలుగురిని హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రామ్‌చరణ్(9), తండ్రి రవీందర్(38) పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స ప్రారంభించారు. చికిత్స పొందుతూ ఈ ఇద్దరు గురువారం తెల్లవారు జామున మృతి చెందారు. కుమార్తె పూజిత పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి పంపించారు. తీవ్ర అస్వస్థతకు గురైన భాగ్యలక్ష్మికి సిద్దిపేట ఆస్పత్రిలో డాక్టర్లు చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసుల అదుపులో నిందితుడు.. కేక్‌లో విషం కలిపి అన్న కుమారుడు, అన్న మృతికి కారకుడైనట్లు భావిస్తున్న శ్రీనివాస్‌ను గురువారం సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న సిద్దిపేట డీసీపీ నర్సింహారెడ్డి, సిద్దిపేట వన్‌టౌన్ సీఐ సైదులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న భాగ్యలక్ష్మిని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సైదులు తెలిపారు. అయితే కేక్ పంపించింది తానే కానీ అందులో ఏమీ కలపలేదని నిందితుడు పోలీసులతో చెబుతున్నట్లు సమాచారం. -
ప్రియుడితో కలిసి కేక్ కట్ చేసిన నటి
బాలీవుడ్ భామ సోనం కపూర్ శుక్రవారం 32వ వసంతంలో అడుగుపెట్టింది. ‘నీర్జా’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న ఈ అమ్మడి పుట్టినరోజు వేడుకను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించారు. సోనం పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే ఆమె ప్రియుడు ఆనంద్ ఆహుజా అనే చెప్పాలి. సోనం పుట్టినరోజు సంబరాలు ఎలా జరుగుతున్నాయో పోస్టులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు ఆహూజా. బ్యాక్‌గ్రౌండ్‌లో సోనం అని విద్యుత్ దీపాలతో రాసి ఉండగా.. సోనం మినీగోల్ఫ్ ఆడుతున్న ఫన్నీ వీడియోను అతను షేర్ చేశాడు. ఇక ఆ తర్వాత సోనం బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్న స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో సోనం సోదరి రెయా కపూర్‌తోపాటు సోనం బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ కూడా పక్కనే ఉన్నాడు. వైట్‌డ్రెస్‌లో చాలా సంతోషంగా కనిపించిన సోనం ప్రియుడు ఆనంద్, కుటుంబసభ్యులతో చాలా సంబరంగా పుట్టినరోజు జరుపుకున్నదని సన్నిహితులు చెప్తున్నారు. -
గిన్నీస్ రికార్డులే లక్ష్యంగా ప్రధాని జన్మదినం
-
గిన్నీస్ రికార్డులే లక్ష్యంగా ప్రధాని జన్మదినం
న్యూఢిల్లీ: రికార్డులే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని ఆపార్టీ నేతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నాల్గు గిన్నీస్ రికార్టులును నెలకొల్పే విధంగా వెయ్యి మంది దివ్యాంగులతో కాగడాల ప్రదర్శన, వీల్ చైర్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్ నవ్సారీలో సెప్టెంబర్ 17 న చేపట్టనున్నారు. శక్తి ఫౌండేఫన్ అనే స్వచ్ఛంధ సంస్థ అతుల్ బేకరీతో కలిసి ఎనిమిది అడుగుల ఎత్తు, 2.5 టన్నుల కేకును తయారు చేసింది. ఇందుకోసం 20 మంది చెఫ్ లు పనిచేశారు. ఇప్పటి వరకు ఆరడుగుల ఎత్తు, 720.8 కేజీలున్న కేకు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉంది. ఈ కేకును గ్రామీణప్రాంతానికి చెందిన అమ్మాయితో కట్ చేయిస్తారని శక్తి ఫౌండేషన్ తెలిపింది. -
బర్త్‌డే కేక్.. రియోకు ముందు... రియో తర్వాత!
రియో ఒలింపిక్స్ లో పతకం కోసం వేచి చూస్తున్న కోట్ల మంది భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన రెజ్లర్ సాక్షి మాలిక్. మన ప్లేయర్స్ పతకంతో ఎప్పుడు, ఎవరు ఖాతా తెరుస్తారా అంటూ యావత్ దేశం ఎంతగానే ఎదురుచూసింది. ప్రతి విభాగంలోనూ మన ఆటగాళ్ల వైఫల్యాలు ఓ వైపు వెంటాడుతున్నా.. తొలి పతకం అందించి సాక్షి మాలిక్ కాస్త ఊరటనిచ్చింది. మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల పుట్టినరోజు(సెప్టెంబర్ 3) జరుపుకున్న రియో పతక విన్నర్ కొన్ని ఆసక్తికర విషయాలను ట్వీట్ చేసింది. రియో ఒలింపిక్స్ కు వెళ్లకముందు, రియో తర్వాత తాను జరుపుకున్న పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కేక్ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రెండు ఫొటోలను పోస్ట్ చేసిన సాక్షి.. టార్గెట్ కంప్లీట్ అంటూ పోస్ట్‌లో పేర్కొంది. అందరూ ఆశించినట్లుగానే పతకంతో తిరిగొచ్చానన్న విజయగర్వం ఆమెలో కనిపించింది. రియో ఒలింపిక్స్ లో పాల్గొనకముందు కేక్ లో ఒలింపిక్స్ లో విన్నర్ గా చూడాలని ఆశిస్తున్నామని రాశారు. రియో నుంచి పతకం సాధించి వచ్చిన తర్వాత జరుపుకున్న తొలి పుట్టినరోజు కేక్ లో వచ్చే ఒలింపిక్స్ కు సాక్షికి ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నట్లు ఉంది. ఈ సంతోషకర విషయాలను రెజ్లర్ సాక్షి మాలిక్ ట్విట్టర్ ద్వారా తన ఫాలోయర్స్, అభిమానులతో పంచుకుంది. -
జైలుకు బర్త్‌డే కేక్ పంపించారు
ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్‌డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్‌పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు. తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది.