వైరల్‌: బర్త్‌డే కేక్‌ ఎత్తుకుపోయిన కోతి | Viral Video: Monkey Steals Birth Day Cake | Sakshi
Sakshi News home page

అదును చూసి లటుక్కున కేక్‌ ఎత్తుకెళ్లిన కోతి

Published Wed, Dec 18 2019 6:32 PM | Last Updated on Wed, Dec 18 2019 7:08 PM

Viral Video: Monkey Steals Birth Day Cake - Sakshi

పుట్టిన రోజు వేడుకలు అనగానే మొదటగా గుర్తొచ్చేది కేక్‌. ప్రస్తుత రోజుల్లో కేక్‌ లేకుండా బర్త్‌డే జరుపుకునేవాళ్లు అరుదుగా ఉంటారు. అయితే ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకను సాధారణంగా కాకుండా కాస్త భిన్నంగా జరుపాలనుకున్నారు. అనుకున్నట్టుగానే చుట్టూ చెట్లు చేమలు ఉండే ప్రదేశానికి తీసుకువెళ్లారు. బర్త్‌డే బాయ్‌ ఎదురుగా కేక్‌ను సిద్ధం చేశారు. 

అయితే అక్కడే ఉన్న ఓ కోతి కేక్‌పై మనసు పారేసుకున్నట్టుంది. కన్నార్పకుండా కేక్‌వైపే తీక్షణంగా చూస్తోంది. కానీ దీన్ని పెద్దగా పట్టించుకోని అతడి స్నేహితులు, బంధువులు బర్త్‌డే సాంగ్‌ అందుకున్నారు. బర్త్‌డే బాయ్‌ కేక్‌ కట్‌ చేసి ఆ ముక్కను చేతులోకి తీసుకున్నాడో లేదో కోతి పరుగెత్తుకొచ్చింది. మొత్తం కేక్‌ను తీసుకుని చెట్టుపైకి ఉడాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోతి.. చాన్స్‌ కోసం ఎదురుచూసి లటుక్కున పట్టుకుపోయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement