ప్రియుడితో కలిసి కేక్ కట్ చేసిన నటి
బాలీవుడ్ భామ సోనం కపూర్ శుక్రవారం 32వ వసంతంలో అడుగుపెట్టింది. ‘నీర్జా’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న ఈ అమ్మడి పుట్టినరోజు వేడుకను కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించారు. సోనం పుట్టినరోజు వేడుకల్లో స్పెషల్ అట్రాక‌్షన్ ఎవరంటే ఆమె ప్రియుడు ఆనంద్ ఆహుజా అనే చెప్పాలి.
సోనం పుట్టినరోజు సంబరాలు ఎలా జరుగుతున్నాయో పోస్టులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు ఆహూజా. బ్యాక్‌గ్రౌండ్‌లో సోనం అని విద్యుత్ దీపాలతో రాసి ఉండగా.. సోనం మినీగోల్ఫ్ ఆడుతున్న ఫన్నీ వీడియోను అతను షేర్ చేశాడు. ఇక ఆ తర్వాత సోనం బర్త్‌డే కేక్‌ను కట్ చేస్తున్న స్పెషల్ వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియోలో సోనం సోదరి రెయా కపూర్‌తోపాటు సోనం బాయ్‌ఫ్రెండ్ ఆనంద్ కూడా పక్కనే ఉన్నాడు. వైట్‌డ్రెస్‌లో చాలా సంతోషంగా కనిపించిన సోనం ప్రియుడు ఆనంద్, కుటుంబసభ్యులతో చాలా సంబరంగా పుట్టినరోజు జరుపుకున్నదని సన్నిహితులు చెప్తున్నారు.