ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.
సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.
భానే అనేది షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్‌కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.
1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.
ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్
కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్‌లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment