టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్.. గూగుల్ కంపెనీలో ఉచిత భోజనం మీద ఎందుకు ఎక్కువ పెట్టుబడి పెడుతున్నారనే విషయాన్ని వెల్లడించారు. 'ది డేవిడ్ రూబెన్‌స్టెయిన్ షో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారు.
సంస్థలో ఉచిత భోజనం అందించడం అనేది కేవలం ప్రోత్సాహకం మాత్రమే కాదు, దీని వెనుక లోతైన గొప్ప ప్రయోజనం ఉందని పిచాయ్ పేర్కొన్నారు. నేను గూగుల్‌లో చేరిన మొదట్లో కేఫ్‌లకు వెళ్ళినప్పుడు.. మరికొందరిని కలుసుకునేవాడిని. ఆలా కలుసుకున్నప్పుడు ఏదో మాట్లాడుతున్న సమయంలో కొత్త విషయాలు తెలుస్తాయి, అద్భుతమైన కొత్త ఆలోచనలు పుడతాయని అన్నారు.
ఉచిత భోజనం అందించడం వల్ల ఉద్యోగులు కలిసే భోజనం తింటారు. అలా ఉద్యోగులు భోజనం తినే సమయంలో ఆవిష్కరణలు పెంపొందించడానికి కావాల్సిన ఆలోచనలు పుట్టుకొస్తాయి. దీని నుంచి వచ్చే ప్రయోజనంతో పోలిస్తే.. ఆహారం కోసం పెట్టే ఖర్చు చాలా తక్కువని పిచాయ్ పేర్కొన్నారు. ఉచిత భోజనం ఆర్థిక భారం కాదని.. సృజనాత్మకతకు, సమాజ నిర్మాణానికి దీర్ఘకాలిక పెట్టుబడి అని అన్నారు. ఉచిత భోజనం మాత్రమే కాకుండా.. కంపెనీ ఉద్యోగుల కోసం స్నేహపూర్వక కార్యకలాపాలను కూడా నిర్వహిస్తుందని ఆయన అన్నారు.
గూగుల్‌లో జాబ్ కోసం..
ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలో 1,82,000 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగులలోని టాలెంట్‌ను గుర్తించి అలాంటి వారికి జాబ్ ఆఫర్స్ అందిస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్ కంపెనీలో జాబ్ కావాలంటే మారుతున్న టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని కావలసిన నైపుణ్యం, అడాప్టబుల్ వంటివి పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు వేగంగా.. టెక్నాలజీకి అనుకూలంగా మారే సూపర్ స్టార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కోసం కంపెనీ ఎప్పుడూ అన్వేషిస్తూ ఉంటుందని అన్నారు.
ఇదీ చదవండి: పండక్కి ముందే ధరల మోత.. ఇలా అయితే బంగారం కొనడం కష్టమే!
క్రియేటివిటీ, ఇనోవేషన్స్ వంటి వాటిని పెంపొందించడంలో గూగుల్ కంపెనీ కీలక పాత్ర పోషిస్తుంది. ఉచిత భోజనాన్ని అందించే కంపెనీ సంప్రదాయాన్ని గురించి పిచాయ్ వివరిస్తూ.. ఇది సమాజాన్ని నిర్మించడంలో, కొత్త ఆలోచనలను రేకెత్తించడంలో సహాయపడుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment