గిన్నీస్ రికార్డులే లక్ష్యంగా ప్రధాని జన్మదినం
న్యూఢిల్లీ: రికార్డులే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని ఆపార్టీ నేతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే నాల్గు గిన్నీస్ రికార్టులును నెలకొల్పే విధంగా వెయ్యి మంది దివ్యాంగులతో కాగడాల ప్రదర్శన, వీల్ చైర్లు, వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని గుజరాత్ నవ్సారీలో సెప్టెంబర్ 17 న చేపట్టనున్నారు.
శక్తి ఫౌండేఫన్ అనే స్వచ్ఛంధ సంస్థ అతుల్ బేకరీతో కలిసి ఎనిమిది అడుగుల ఎత్తు, 2.5 టన్నుల కేకును తయారు చేసింది. ఇందుకోసం 20 మంది చెఫ్ లు పనిచేశారు. ఇప్పటి వరకు ఆరడుగుల ఎత్తు, 720.8 కేజీలున్న కేకు ప్రపంచంలోనే అతిపెద్దదిగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉంది. ఈ కేకును గ్రామీణప్రాంతానికి చెందిన అమ్మాయితో కట్ చేయిస్తారని శక్తి ఫౌండేషన్ తెలిపింది.