కొత్త ఏడాదిలో ప్రపంచ రికార్డు : అదేంటో తెలుసా..! | 4000 People Performed Iconic Surya Namaskar Across 108 Locations In Gujarat, Sets Guinness World Record - Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలో ప్రపంచ రికార్డు : అదేంటో తెలుసా..!

Published Mon, Jan 1 2024 2:30 PM | Last Updated on Mon, Jan 1 2024 3:44 PM

4000 People 108 Locations Gujarat Sets World Record For Surya Namaskar - Sakshi

ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు (SuryaNamaskar)చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి వైనం విశేషంగా నిలిచింది.  ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గుజరాత్‌లో ఈ అ‍ద్భుతం చోటు  చేసుకుంది.  దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఏకంగా నాలుగు వేల మంది  సామూహిక సూర్య నమస్కారాల్ని ఆచరించారు. 108 ప్రాంతాల్లో, 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు.  దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోను, ఫోటోలను ప్రధాని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.  ఈ అరుదైన ఫీట్‌ సాధించడం గర్వంగా ఉందని గుజరాత్ హోం మంత్రి సంఘవి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ప్రపంచ రికార్డ్‌ అని గిన్నిస్‌ ప్రతినిధి తెలిపారు. సూర్య నమస్కారం చేసే అత్యధిక మంది రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్‌ ధృవీకరించారు. ఇంతకుముందు ఎవరూ ఈ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నించ లేదు కాబట్టి ఇది కొత్త  గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ అన్నారు.

2024లో గుజరాత్‌ ఈ ఘనత సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా మన సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనమని ప్రధాని మోదీ  ట్వీట్‌ చేశారు.  కాగా రాష్ట్రంలోని మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన ఈ రికార్డ్‌ బ్రేకింగ్‌ ఈవెంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, హోం మంత్రి హర్ష్‌ సంఘ్వీ హాజరైనారు. పలువురు విద్యార్థులు, వృద్ధులు, యోగా ఔత్సాహికులు  ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement