surya namaskaras
-
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్‌తో పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్‌తో పాటు అమెరికా, లండన్‌లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
పిల్లల్లో ఏకాగ్రతలేదా? ఒక్క చోట నిలవడం లేదా?
పిల్లలకు ఏకాగ్రత ఉండటం లేదు, ఎదుగుదల సరిగా లేదు.. అని పెద్దల నుంచి కంప్లైంట్స్ తరచూ వింటూ ఉంటాం. పిల్లల్లో ఆందోళన, చికాకు తగ్గడానికి యోగాభ్యాసం ఎంతగానో ఉపయోగపడుతుంది. పెద్దలు చేసే విధంగా పిల్లలకు యోగా సాధన కుదరదు. చిన్న చిన్న మార్పులు చేసి, పిల్లలచే సాధన చేయిస్తే వారి ఉన్నతికి యోగా ఒక బలమైన పునాదిగా ఉంటుంది. ముందు ఓ పది నిమిషాలు పిల్లలతో చిన్న చిన్న స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయించాలి. దీనివల్ల వారి శరీరం యోగాభ్యాసానికి సిద్ధం అవుతుంది. ఆ తర్వాత 12 సూర్యనమస్కారాలు చేయించాలి. పిల్లలకు ఏకాగ్రత, ఎదుగుదలకు సహకరించేవి..ఆక్సీజన్ గా..ముందు నిటారుగా నిల్చోవాలి. రెండు కాళ్లలో ఒక కాలిని మోకాళ్ల వద్ద వంచుతూ, ΄ాదాన్ని నిలుచుని ఉన్న కాలు తొడ భాగంలో ఉంచాలి. హృదయం దగ్గర నమస్కార భంగిమ లో చేతులను ఉంచి, రెండు శ్వాసలు తీసుకుని వదిలాక, చేతులు రెండూ పైకి ఎత్తి నిల్చోవాలి. ఈ ఆసనం ద్వారా శరీరాన్ని బ్యాలెన్డ్స్‌గా ఎలా ఉంచాలో తెలుస్తుంది. ఒక చెట్టు ఆక్సిజన్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో అలాంటి భంగిమ కాబట్టి పిల్లల శ్వాసక్రియ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఆసనం ద్వారా వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. – జి. అనూ షారాకేష్యోగ గురు -
కొత్త ఏడాదిలో ప్రపంచ రికార్డు : అదేంటో తెలుసా..!
ఏకకాలంలో అత్యధిక మంది సూర్య నమస్కారాలు (SuryaNamaskar)చేస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి వైనం విశేషంగా నిలిచింది. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా గుజరాత్లో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో ఒకేసారి ఏకంగా నాలుగు వేల మంది సామూహిక సూర్య నమస్కారాల్ని ఆచరించారు. 108 ప్రాంతాల్లో, 51 విభిన్న కేటగిరీల్లో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ ఫీట్‌కు సంబంధించిన వీడియోను, ఫోటోలను ప్రధాని తన ట్విటర్ ఖాతాలో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ అరుదైన ఫీట్ సాధించడం గర్వంగా ఉందని గుజరాత్ హోం మంత్రి సంఘవి తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సూర్య నమస్కారాలు చేయడం ప్రపంచ రికార్డ్ అని గిన్నిస్ ప్రతినిధి తెలిపారు. సూర్య నమస్కారం చేసే అత్యధిక మంది రికార్డు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ ధృవీకరించారు. ఇంతకుముందు ఎవరూ ఈ రికార్డ్‌ను బద్దలు కొట్టడానికి ప్రయత్నించ లేదు కాబట్టి ఇది కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ అన్నారు. 2024లో గుజరాత్ ఈ ఘనత సాధించిందని మోదీ తెలిపారు. ముఖ్యంగా మన సంస్కృతిలో 108 సంఖ్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. యోగా, మన సాంస్కృతిక వారసత్వం పట్ల మనకున్న నిబద్ధతకు ఇది నిజమైన నిదర్శనమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రంలోని మోధెరా సూర్య దేవాలయంలో జరిగిన ఈ రికార్డ్ బ్రేకింగ్ ఈవెంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ సంఘ్వీ హాజరైనారు. పలువురు విద్యార్థులు, వృద్ధులు, యోగా ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. Gujarat welcomed 2024 with a remarkable feat - setting a Guinness World Record for the most people performing Surya Namaskar simultaneously at 108 venues! As we all know, the number 108 holds a special significance in our culture. The venues also include the iconic Modhera Sun… pic.twitter.com/xU8ANLT1aP — Narendra Modi (@narendramodi) January 1, 2024 -
మంచి ముగింపు
వారానికి క్లైమాక్స్ లాంటిది వీకెండ్. క్లైమాక్స్ బావుంటేనే సినిమా బాగా ఆడుతుంది. వీకెండ్ బావుంటేనే కొత్త వారాన్ని ఉత్సాహంతో ప్రారంభించగలుగుతాం. మరి ఈ వీక్‌ను ఏ స్టార్ ఎలా ఎండ్ చేస్తున్నారో చూద్దామా? లాక్డౌన్లో యోగా మీద ధ్యాస పెట్టారు సమంత. కష్టతరమైన ఆసనాలు ప్రాక్టీస్ చేశారు. చాలా వరకూ నేర్చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు సమంత. శనివారం 108 సూర్య నమస్కారాలు చేశారామె. ‘వీకెండ్‌కి మంచి స్టార్ట్’ అన్నారు సమంత. తెలుగు సినిమాకు డబ్బింగ్ చెప్పాలన్నది పాయల్ రాజ్‌పుత్ కోరిక. ఈ వీకెండ్ ఆ పని మీదే ఉన్నారు. తెలుగులో తాను నటిస్తున్న తాజా చిత్రానికి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు. ‘డబ్బింగ్ చెప్పాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను... ఇప్పటికి కుదిరింది. త్వరలోనే నా తెలుగు ఎలా ఉంటుందో మీరూ వింటారు’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. లాక్డౌన్లో ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్ ప్రారంభించారు శ్రుతీహాసన్. బాక్సింగ్ క్లాసుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘శారీరకంగా బలంగా తయారైతేనే మానసికంగానూ బలంగా ఉండగలం’ అన్నారు శ్రుతి. వీకెండ్లోనూ నో హాలీడే. ఫుల్ బాక్సింగ్ ట్రైనింగ్‌లో ఉన్నారామె. వీకెండ్ సందర్భంగా పూజా హెగ్డే ‘షెఫ్ పూజా’ అయ్యారు. పూజా తన తండ్రి కోసం కాక్టేల్ తయారు చేశారు. టేస్టీ కాక్టేల్ ఎలా చేయాలో రెసిపీ కూడా పంచుకున్నారు. ఇలా అందాల తారలు ఈ వారాన్ని తమకు నచ్చినట్లుగా ముగించి, వచ్చే వారాన్ని హ్యాపీ మూడ్‌తో ఆహ్వానించడానికి రెడీ అయ్యారు. -
కోటి మంది యోగా చేస్తారు
న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది. -
నమాజ్, సూర్య నమస్కారాలు ఒకలాంటివే: యోగి
సూర్య నమస్కారాల్లో భాగంగా వేసే ఆసనాలు నమాజ్‌కు చాలా దగ్గరగా ఉంటాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తద్వారా యోగాకు, హిందూ మతానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. 'సూర్య నమస్కారాలలో వేసే అన్ని ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామ క్రియలు.. ఇవన్నీ కూడా మన ముస్లిం మిత్రులు నమాజ్ సమయంలో చేసేటట్లుగానే ఉంటాయి' అని లక్నోలో నిర్వహించిన ఒక యోగా కార్యక్రమంలో ఆయన అన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు భోగాల గురించి చూశారే తప్ప యోగ గురించి చూడలేదని, అందుకే ఈ రెండింటినీ కలిపే ప్రయత్నం కూడా చేయలేదని ఆదిత్యనాథ్ అన్నారు. కులమతాల పేరుతో దేశాన్ని విడగొట్టాలనుకునేవాళ్లు యోగాను ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యోగాను అంతర్జాతీయం చేయడానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 2014 కంటే ముందు ఎవరైనా యోగా గురించి మాట్లాడితే వాళ్లకు మతం రంగు అంటగట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కూడా పాల్గొన్నారు. ఆయన పక్కన కూర్చునే యోగి ఆదిత్యనాథ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.