న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment