న్యూఢిల్లీ: యోగాతో బహుళ ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కారణంగా తలెత్తిన అనేక సవాళ్లకు యోగా పరిష్కారం చూపుతుందన్నారు. ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే, కుటుంబంతో కలిసి జరుపుకోవాలన్నారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ గురువారం ఒక వీడియో సందేశాన్ని వెలువరించారు.‘యోగాతో శరీరం, మనస్సు మధ్య దూరం తొలగుతుంది. ఆ దూరమే చాలా సమస్యలకు మూల కారణం. ఆకాంక్షలకు, వాస్తవాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది’ అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అని.. అందువల్ల అంతా భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్లల్లోనే యోగా సాధన చేయాలని కోరారు. గుంపులుగా సాధన చేయొద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment