address the nation
-
పేదల ప్రగతితో బలమైన భారత్
న్యూఢిల్లీ: పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత సాధిస్తే దేశం శక్తివంతంగా మారుతుందని, బలమైన భారత్ ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కేవలం ప్రభుత్వ యాత్రగానే కాదు, దేశ యాత్రగా మారిందని చెప్పారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలు నిర్లక్ష్యానికి గురయ్యారని, అప్పట్లో ప్రభుత్వ వ్యవసాయ విధానాలు కేవలం ఉత్పత్తి, అమ్మకానికే పరిమితం అయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాతల సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు ఇప్పటిదాకా రూ.30,000 బదిలీ చేశామని తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాలను, వ్యవసాయ ఉత్పత్తి సంస్థలను బలోపేతం చేశామని అన్నారు. గోదాములు నిర్మించామని, పంటల నిల్వ సామర్థ్యాలను పెంచామని, ఆహార శుద్ధి పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘కంది పప్పును ఆన్లైన్ ద్వారా నేరుగా ప్రభుత్వానికి విక్రయించే సదుపాయాన్ని కలి్పంచాం. వారికి మార్కెట్ రేటు కంటే మెరుగైన ధర చెల్లిస్తున్నాం. పప్పుల కొనుగోలు కోసం విదేశాలకు చెల్లించే సొమ్ము మన రైతుల చేతికే అందాలన్నది మా ఉద్దేశం’’ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రతి మూలకూ ‘మోదీ గ్యారంటీ’ అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నదే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదన్నారు. అర్హులకు సక్రమంగా, సంతృప్త స్థాయిలో పథకాలు అందితేనే ‘అభివృద్ధి చెందిన భారత్’ సాధ్యమని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబి్ధదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ యాత్ర ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుందని, దేశమంతటా 11 కోట్ల మంది ప్రజలతో నేరుగా అనుసంధానమైందని హర్షం వ్యక్తం చేశారు. ‘మోదీ కీ గ్యారంటీవాలీ గాడీ’ దేశంలో ప్రతి మూలకూ వెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల కింద లబ్ధి కోసం సుదీర్ఘకాలం ఎదురు చూసే పేదలు ఇప్పుడు ఒక అర్థవంతమైన మార్పును చూస్తున్నారని పేర్కొన్నారు. పథకాలు అర్హుల గడప వద్దకే వెళ్తున్నాయన్నారు. ప్రస్తుత, భావి తరాల యువత గత తరాల కంటే మెరుగైన జీవితం గడపాలని ఆకాంక్షించారు. -
Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని
Updates ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు మరో వెయ్యేళ్లు భారత్ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ ►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం ►2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి ►దేశంలో తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి ►భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది ►ప్రపంచానికి మిత్రుడిగా భారత్ మారింది ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్ కోరుకుంటోంది ►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల శిక్షణ ►దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చాం ►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుంది ►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్ ఉంటుంది ►భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది ►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు ►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం ►జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం ►మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించాం ►భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలం ►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత ►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. ►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం ►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ అభివృద్ధి చెందుతోంది. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తుంది. ►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది. ►స్టార్టప్స్ రంగంలో టాప్-3లో భారత్ ఉంది. ►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది. ►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. ►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా మారింది ►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ►ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది. ►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం ►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది. ►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం. ►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం ►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం ►సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేశాం ►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది ►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. ►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. ►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం ►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది. ►టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడింది. ►డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోంది. ►గత పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. ►శాటిలైట్ రంగంలో మనమే ముందున్నాం. ►రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్తిఉంది. ►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం. ►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది. ►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ ►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం ►ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. ►గత పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ►దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ ►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం. ►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ ► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ ►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు ► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు ముగియనున్నాయి. ►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. సామాన్యులే అతిథులు ►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు ►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు ►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం ►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు ►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని ►రాజ్‌ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ ►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు. ►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది. ►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు. ►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. -
Mann Ki Baat: మన్ కీ బాత్... నా ఆధ్యాత్మిక ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది. కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్‌తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్‌ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా... ‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్‌లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం. ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్‌రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది. దేశ ప్రజలే నాకు సర్వస్వం ‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్‌లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’ ఐరాస, విదేశాల్లోనూ... న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్కు విశేష స్పందన లభించింది. దేశమంతటా... ► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు. ► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు. ► అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్‌లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు. కేరళలోని కొచ్చిన్‌లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు -
Indian Republic Day 2023: చర్చలకు చక్కని వేదిక
న్యూఢిల్లీ: పెరుగుతున్న భూతాపం, పర్యావరణ మార్పు వంటి కీలక అంశాలపై చర్చకు, వాటి పరిష్కారానికి జీ20 సదస్సు సరైన వేదిక అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిప్రాయపడ్డారు. బుధవారం ఢిల్లీ నుంచి ఆమె భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే... ► దశాబ్దాలుగా పలు పథకాల ద్వారా భారత దేశం సాధించిన సర్వతోముఖాభివృద్ధి, పౌరుల సృజనాత్మక ఆవిష్కరణల ఫలితంగా నేడు ప్రపంచం భారత్‌కు సమున్నత గౌరవం ఇస్తోంది. ► పలు దేశాల కూటములు, ప్రపంచ వేదికలపై మన జోక్యం తర్వాత దేశం పట్ల సానుకూలత పెరిగింది. ఫలితంగా దేశానికి అపార అవకాశాలు, నూతన బాధ్యతలు దక్కాయి. ► ఈ ఏడాదికి జీ20 కూటమికి అధ్యక్షత వహించడం ద్వారా మెరుగైన ప్రపంచం, భవ్య భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు భారత్‌కు సువర్ణావకాశం దొరికింది. భారత నాయకత్వంలో ప్రపంచం మరింత సుస్థిరాభివృద్ధి సాధించగలదని గట్టిగా నమ్ముతున్నా. ► ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ20 దేశాల్లోనే ఉంది. ప్రపంచ జీడీపీకి 85 శాతం ఈ దేశాలే సమకూరుస్తున్నాయి. భూతాపం, పర్యావరణ పెను మార్పులుసహా పుడమి ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలకు, పరిష్కారానికి జీ20 చక్కని వేదిక. ► దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడాల్సిన తరుణమొచ్చింది. సౌర, ఎలక్ట్రిక్ విద్యుత్ సంబంధ విధాన నిర్ణయాలు అమలుచేస్తూ ఈ దిశగా వివిధ దేశాలకు భారత్ నాయకత్వ లక్షణాలను కనబరుస్తోంది. ఈ క్రమంలో సాంకేతికత బదిలీ, ఆర్థిక దన్నుతో సంపన్న దేశాలు ఆపన్న హస్తం అందించాలి. ► వివక్షాపూరిత పారిశ్రామికీకరణ విపత్తులను తెస్తుందని గాంధీజీ ఏనాడో చెప్పారు. సాంప్రదాయక జీవన విధానాల్లోని శాస్త్రీయతను అర్థంచేసుకుని పర్యావరణ అనుకూల అభివృద్దిని సాధించాలి. ► రాజ్యాంగ నిర్మాతలు చూపిన మార్గనిర్దేశక పథంలోని మనం బాధ్యతాయుతంగా నడవాలి. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నేతృత్వం వహించిన డాక్టర్ అంబేడ్కర్‌కు మనం సదా రుణపడి ఉండాలి. ఆ కమిటీలో 15 మంది మహిళలుసహా అన్ని మతాలు, వర్గాల వారికీ ప్రాధాన్యత దక్కడం విశేషం. ► దేశంలో నవతరం విడివిడిగా, ఐక్యంగానూ తమ పూర్తి శక్తిసామర్థ్యాలను సంతరించుకునే వాతావరణం ఉండాలి. దీనికి విద్యే అసలైన పునాది. 21వ శతాబ్ది సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) రూపొందించారు. విద్యా బోధనలో సాంకేతికతను లోతుగా, విస్తృతంగా వినియోగించాలని ఎన్ఈపీ స్పష్టంచేస్తోంది. -
పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్‌కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు. మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం. సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు. ‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
15–18 ఏళ్ల వారికీ కోవిడ్ టీకా: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో 15–18 సంవత్సరాల వయసున్నవారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. దీంతోపాటు జనవరి 10 నుంచి హెల్త్‌కేర్ మరియు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ముందుజాగ్రత్త కోసం మరో డోసు(ప్రికాషన్ డోస్– రెండు డోసులు తీసుకున్నవారికి ఇచ్చే మూడో డోసు) ఇస్తామని తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, క్రిస్మస్, వాజ్‌పేయ్ జన్మదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కళాశాలలు, పాఠశాలలకు పిల్లలను పంపే తల్లిదండ్రులకు ఈ నిర్ణయం భరోసానిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, అంతా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. డాక్టర్ల సలహా మేరకు ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్న 60ఏళ్లు పైబడినవారికి కూడా అదనపు డోసు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా ఆయన బూస్టర్ డోస్ అని వ్యాఖ్యానించకుండా ప్రికాషనరీ డోస్ అని మాత్రమే చెప్పారు. వ్యక్తిగత స్థాయిలో సంరక్షణా విధానాలు పాటించడమే కోవిడ్‌పై పోరాటంలో అతిపెద్ద ఆయుధమని, అందువల్ల ప్రజలంతా తప్పక కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అనవసరంగా భయపడాల్సిన పనిలేదని ఆయన భరోసా ఇచ్చారు. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ అత్యంత కీలకంగా ఆయన అభివర్ణించారు. త్వరలో ముక్కు ద్వారా ఇచ్చే టీకా, ప్రపంచ తొలి డీఎన్ఏ ఆధారిత టీకాలు భారత్‌లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. లోతైన అధ్యయనం తర్వాతే.. కరోనాపై పోరులో దేశీయ శాస్త్రవేత్తల కృషిని మోదీ కొనియాడారు. టీకాలు, డోసులపై వీరు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే అదనపు డోసు, పిల్లలకు టీకా వంటి నిర్ణయాలను సూచించారని చెప్పారు. సైంటిస్టులు ఒమిక్రాన్ వేరియంట్ విసిరే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయూ పడకలు సిద్దమని, దేశవ్యాప్తంగా 3వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయని, 4 లక్షల ఆక్సిజన్ సిలెండర్లు దేశమంతా సరఫరా చేశామని తెలిపారు. భారత్‌లో ఇంతవరకు 141 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు మోదీ చెప్పారు. దేశంలో ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. భారత్‌లో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ ఆధారిత పడకలు, 1.4 లక్షల ఐసీయూ పడకలు ఉన్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దాదాపు 90 వేల పడకలు కేటాయించాం. దేశవ్యాప్తంగా 3 వేల ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. దేశమంతా 4 లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాం. – మోదీ -
అందరి కృషితో లక్ష్యాలు అందుకోగలం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రదిన శతాబ్ది వేడుకల సమయానికి భారత్‌ను ఒక ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలని, దీనికి ప్రజలు చేసే కృషి అత్యంత కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాల గురించి ప్రస్తవిస్తూ. ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు మార్గదర్శకాలను సూచిస్తూ, కొత్త అభివృద్ధి పథకాలను ప్రకటిస్తూ మధ్య మధ్యలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి సగర్వంగా చాటుతూ ప్రధాని ప్రసంగం సాగింది. 75వ స్వాతంత్య్ర దిన అమృతోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వేదికగా వరసగా ఎనిమిదోసారి ప్రసంగించిన ప్రధాని మోదీ దేశంలో మౌలిక సదుపాయాల పెంపు, ఉద్యోగాల కల్పన కోసం రూ.100 లక్షల కోట్లతో గతి శక్తి అనే భారీ పథకాన్ని ప్రకటించారు. ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను అత్యంత సాహసోపేతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ దేశ భద్రత అంశంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి వెనుకాడమని చెప్పారు. సంప్రదాయ కుర్తా, నీలం రంగు జాకెట్, కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ప్రధాని దాదాపుగా 90 నిముషాల సేపు ప్రసంగించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న నినాదానికి కొత్తగా సబ్కా ప్రయాస్ (సమష్టి కృషి) అన్న దానిని చేర్చారు. భారత్ నిర్దేశించుకున్న 100శాతం లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రజలందరి కృషి అత్యంత అవసరమని గట్టిగా చెప్పారు. అందుకే రాబోయే 25 ఏళ్లు అమృత కాలంగా ప్రధాని అభివరి్ణంచారు. దేశ స్వాతంత్య్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మహాత్మా గాం«దీ, సుభాష్ చంద్రబోసు, భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బి.ఆర్. అంబేద్కర్ వంటి నేతలందరినీ ప్రధాని పేరు పేరునా స్మరించారు. యువత ఏదైనా చేయగలదు నేటి యువతరంపై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. నేటి తరం ఏదైనా చేయగలదు, ప్రతీ లక్ష్యాన్ని సాధించగలదు అన్నారు. ‘‘నాకు ఈ దేశ యువతపై విశ్వాసం ఉంది. దేశ సోదరీమణులపై నమ్మకం ఉంది. రైతులను, వృత్తి నిపుణులను నేను పూర్తిగా విశ్వసిస్తాను. మన కలలు, ఆశయాలను అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. మనలో ఉన్న ఉత్సాహం, మనలో ఉన్న సోదరభావమే మన బలం’’ అని మోదీ అన్నారు. ‘‘ఇదే సరైన సమయం. దేశానికి అత్యంత కీలకమైన సమయం. అసంఖ్యాకమైన ఆయుధాలు మనదగ్గరున్నాయి. దేశభక్తి ప్రతీ చోటా పొంగిపొరలుతోంది. అందరూ కదిలి రండి. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి. దేశ భవితను సమున్నతంగా రెపరెపలాడించండి’’ అని మోదీ ఒక కవితతో తన ప్రసంగాన్ని ముగించారు. మోదీ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు ► దేశం నలుమూలలకి రైలు కనెక్టివిటీ పెరిగేలా ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా 75 వారాల్లో 75 కొత్త వందేభారత్ రైళ్లు ప్రవేశ పెడతాం. ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ కలిపేలా రైలు కనెక్టివిటీని ఏర్పాటు చేస్తాం. ► వ్యవసాయం రంగంలో 80శాతానికిపైగా ఉన్న చిన్న రైతులే దేశానికి గర్వకారణం. వారికి అండగా ఉండడానికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 10 కోట్ల మంది రైతులకు ఇప్పటివరకు రూ.1.5 లక్షల కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం. ► 2024 నాటికి గ్రామీణ ప్రజలందరి ఇళ్లకి కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రారంభించి జాతీయ జల జీవన్ మిషన్‌లో భాగంగా గత రెండేళ్లలో 4.5 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చాం ► దేశ విభజన గాయాలు ఇంకా వెంటాడుతున్నాయని ఆగస్టు 14న విభజన గాయాల స్మృతి దినంగా పాటిద్దామని పిలుపునిచ్చారు. ► టోక్యో ఒలింపిక్స్‌లో భారత కీర్తి పతాక రెపరెపలాడింది. నేటి యువత మన దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ► ఏడేళ్ల క్రితం భారత్ 800 కోట్ల డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లను దిగుమతి చేసుకునేది. అదే ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన మొబైల్స్‌ను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దిగుమతుల్ని గణనీయంగా తగ్గించింది. ► కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తల కృషి అత్యంత గర్వకారణ. రెండు మేకిన్ ఇండియా వ్యాక్సిన్లు అభివృద్ధి చేయగలిగాం. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ► జమ్మూ కశీ్మర్లో నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయి ► కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం పేదరిక నిర్మూలన కోసమేనని, విద్యాబోధన వారి మాతృభాషలో చేయడానికే ప్రోత్సాహం ► అన్ని అంశాల్లోనూ ప్రభుత్వ అనవసర జోక్యాలు తగ్గించాం. పన్నుల్లో సంస్కరణలు తీసుకువచ్చి వాణిజ్యాన్ని సులభతరం చేశాము. రూ.100 లక్షల కోట్లతో గతిశక్తి భారత్ ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా 100 లక్షల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన గతిశక్తి ప్రాజెక్టును ప్రకటించారు. ‘‘అత్యంత ఆధునిక సదుపాయాల కల్పనలో సంపూర్ణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం త్వరలోనే ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళికను ప్రారంభించబోతున్నాం. రూ.100 లక్షల కోట్లతో ప్రారంభించే ఈ పథకం ద్వారా లక్షలాది మంది యువతికి ఉపాధి అవకాశాలు వస్తాయి’’ అని ప్రధాని వివరించారు. సైనిక స్కూళ్లలో అమ్మాయిలకూ ప్రవేశం దేశవ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లలో అబ్బాయిలకే ప్రవేశం ఉండేది. అయితే అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు కూడా అన్ని సైనిక స్కూళ్లలో ప్రవేశానికి అనుమతిలిస్తున్నాం.. అని ప్రధాని మోదీ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక స్కూళ్లు ఉండగా, రెండున్నరేళ్ల క్రితం మిజోరంలోని సైనిక స్కూలులో ప్రయోగాత్మకంగా అమ్మాయిలకి ప్రవేశం కలి్పంచారు. కాషాయ రంగు తలపాగాతో ప్రధాని గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో రంగురంగుల ఆకర్షణీయమైన తలపాగాలు ధరించే సంప్రదాయా న్ని ప్రధాని మోదీ కొనసాగించారు. ఆదివారం ఆయన ఎర్రటి చారలు కలిగిన కాషాయరంగు తలపాగాతో ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రసంగించారు. సంపద్రాయ కుర్తా, చుడిదార్‌తో పాటు బ్లూ జాకెట్, ఉత్తరీయం వేసుకున్నారు. జాతీయ హైడ్రోజన్ మిషన్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎగుమతుల హబ్‌గా భారత్‌కు మార్చడానికి ప్రధానమంత్రి జాతీయ హైడ్రోజన్ మిషన్‌ను ప్రకటించారు. స్వతంత్ర భారతావని శతాబ్ది ఉత్సవాల సమయానికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధిని సాధిస్తామని చెప్పారు. ఇది సాధించడానికి కృషి చేస్తామని త్రివర్ణ పతాకం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రధాని చెప్పారు. -
ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఒక దేవాలయం. ప్రజల సంక్షేమం కోసం చర్చలు, సంవాదాలు జరిగే, నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వేదిక’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. నిరంతర అంతరాయాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొనడం, పాలక– ప్రతిపక్షాలు పట్టుదలకు పోవడంతో షెడ్యూల్‌కంటే రెండురోజుల ముందే సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రథమపౌరుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్న విశిష్టతపై మాట్లాడటం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కోవింద్ టీవీలో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కోవిడ్–19 రెండో వేవ్ సృష్టించిన విలయం నుంచి దేశం ఇంకా బయటపడలేదని చెప్పారు. మహమ్మారి విషయంలో ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఇంకా ఏం మాట్లాడారంటే.. ► మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం. ► కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ► వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు మన అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తాయి. వారు తమ పంట ఉత్పత్తులకు మరింత మేలైన ధర పొందడానికి ఈ సంస్కరణలు ఉపకరిస్తాయి. ► కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించింది. ► వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్ల కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలిగాం. ► కరోనా ప్రతికూల కాలంలో కూడా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాం. మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యాపారులు, వలస కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ► కరోనా వ్యాప్తి వల్ల నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు తగిన సాయం అందిస్తోంది. ► కోవిడ్–19 నియంత్రణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లే రక్షణ కవచం. కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ వైరస్ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ► భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చాలామంది అనుమానించారు. ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ► పురాతన కాలంలోనే భారత గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయి. ఆధునిక యుగంలోనూ ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నో పశ్చి మ దేశాల కంటే భారత్ ముందంజలో ఉంది. ► సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ► మన పార్లమెంట్ త్వరలో కొత్త భవనంలోకి మారబోతోంది. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ► మీ కుమార్తెలకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కల్పించండి అని తల్లిదండ్రులను కోరుతున్నా. ► ఉన్నత విద్యా సంస్థల నుంచి సైనిక దళాల దాకా.. ప్రయోగశాల నుంచి క్రీడా మైదానాల దాకా ప్రతిచోటా ఆడబిడ్డలు వారిదైన ముద్ర వేస్తున్నారు. ► ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వారికి అభినందనలు. 121 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన దేశం ఈసారి గతంలో కంటే అధికంగా పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం. ► భారత క్రీడాకారిణులు ఎన్నో అవరోధాలను అధిగమించి ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. ► మన ఆడబిడ్డల ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి చెందిన భారత్‌ను ఇప్పుడే దర్శించగలుగుతున్నా. అగ్రస్థానానికి ఎదిగిన ఆడపిల్లల కుటుంబాల నుంచి నేర్చుకోవాలని, వారికి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు నా సూచన. ► జమ్మూకశ్మీర్‌లో కొత్త పొద్దు పొడిచింది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కలలను నిజం చేసుకొనేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో కృషి చేయాలి. ► ఆధునిక పారిశ్రామిక విప్లవం మానవళికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. వాతావరణ మార్పులు పెనుశాపంగా మారుతున్నాయి. ► మంచు కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పారిస్ వాతావణ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంది. అంతేకాదు వాతావరణ పరిరక్షణకు భారత్ చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేస్తోంది. ఈ విషయంలో మిగతా ప్రపంచ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ► ను ఇటీవల బారాముల్లాలో డాగర్ వార్ మెమోరియల్‌ను సందర్శించా. అక్కడ ‘నేను చేసే ప్రతి పని దేశం కోసమే’అని రాసి ఉంది. ఇదే మన నినాదం కావాలి. దేశ ప్రగతి కోసం పూర్తి అంకితభావంతో పని చేయాలి. భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి మనమంతా ఒక్క తాటిపైకి రావాలి. -
Narendra Modi: ఇక టీకా.. ఫ్రీ
న్యూఢిల్లీ: దేశ టీకా విధానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అర్హులైన దేశ ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకా అందిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారందరికి జూన్ 21 నుంచి ఉచితంగా టీకా అందించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీకా డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ప్రసంగించారు. ‘రాష్ట్రాల వాటా అయిన 25% టీకాలను కేంద్రమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు వారాల సమయం పడుతుంది. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు ఉచితంగా టీకాలను పంపించే కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం కింద 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా టీకా లభిస్తుంది’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై పలు రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్రమే తీసుకోవాలని లేఖలు రాసిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు పలుమార్లు కేంద్ర ప్రభుత్వ టీకా విధానంలో లోపాలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రాల వాటా అయిన 25% సహా మొత్తం 75% టీకాలను కేంద్రమే టీకా ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. మిగతా 25% టీకాలను ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ నిర్ధారిత ధరపై ఆసుపత్రులు విధించే సర్వీస్ చార్జ్ ఒక్కో డోసుకు, రూ. 150కి మించకూడదని స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం ఏడు కంపెనీలు కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు టీకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. విదేశాల్లోని ఫార్మా సంస్థల నుంచి టీకాలను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. కరోనా మూడో వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో.. పిల్లల కోసం రెండు వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. ముక్కు ద్వారా స్ప్రే చేసే టీకాను అభివృద్ధి చేసే పరిశోధనలు త్వరితగతిన జరుగుతున్నాయని, ఆ టీకా అందుబాటులోకి వస్తే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని తెలిపారు. టీకాలపై అబద్దాలను ప్రచారం చేసేవారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కారణం ఇదే కేంద్ర ప్రభుత్వ టీకా విధానంపై విమర్శలు చేసిన వారిపై మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీకా విధానంలో తాజా మార్పునకు కారణం వివరిస్తూ.. ‘జనవరి 16 నుంచి ఏప్రిల్ చివరి వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కేంద్రం ఆధ్వర్యంలోనే సజావుగా సాగింది. అర్హులైనవారంతా క్రమశిక్షణతో టీకాలు తీసుకున్నారు. ఇంతలో టీకా కార్యక్రమాన్ని వికేంద్రీకరించాలన్న డిమాండ్స్ వచ్చాయి. కేంద్రమే అన్నీ నిర్ణయిస్తుందా?, ఒక వయస్సు వారికే ప్రాధాన్యత ఎందుకు? అని కొందరు ప్రశ్నించారు. ఇంకా చాలా రకాలైన ఒత్తిళ్లు వచ్చాయి. మీడియాలోని ఒక వర్గం కూడా దీన్నో ప్రచారంలా చేపట్టింది. దాంతో, అందరి అభిప్రాయాలు తీసుకుని రాష్ట్రాల డిమాండ్‌కు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నాం. మే 1వ తేదీ నుంచి 25% టీకాలను రాష్ట్రాలే తీసుకునే వెసులుబాటు కల్పించాం. కానీ, ఆ తరువాత కొన్ని రోజులకే రాష్ట్రాలకు సమస్య అర్థమైంది. ఇంతపెద్ద కార్యక్రమం చేపట్టడంలోని కష్టాలు అర్థమయ్యాయి. తరువాత, రెండు వారాలకే పాత విధానమే మేలు అని కొన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. క్రమంగా దాదాపు అన్ని రాష్ట్రాలు అదే విషయం చెప్పసాగాయి. టీకా విధానంపై పునరాలోచన చేయాలని కోరాయి. దాంతో, దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం సజావుగా సాగాలనే ఉద్దేశంతో.. మే 1 వ తేదీకి ముందున్న విధానాన్నే మళ్లీ అమలు చేయాలని నిర్ణయించాం’ అన్నారు. ఆక్సిజన్ డిమాండ్ ఊహించలేదు రెండో వేవ్ ఉధృతంగా ఉన్న ఏప్రిల్, మే నెలల్లో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ ఊహించనంతగా పెరిగిందని, ఆ స్థాయిలో ఆక్సిజన్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేదని ప్రధాని తెలిపారు. ఆ స్థాయిలో ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందన్నారు. నేవీని, వైమానిక దళాన్ని కూడా రంగంలోకి దింపామని, ప్రత్యేకంగా ఆక్సిజన్ రైళ్లను నడిపామని గుర్తు చేశారు. స్వల్ప వ్యవధిలోనే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచగలిగామన్నారు. నిర్లక్ష్యం వద్దు సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సడలింపులను అవకాశంగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ప్రధాని ప్రజలకు ఉద్బోధించారు. నిబంధనలను పాటించడమే వైరస్‌ను ఎదుర్కొనే శక్తిమంతమైన ఆయుధమన్నారు. ‘ఆంక్షల్లో సడలింపులను ఇస్తున్నారు అంటే అర్థం వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందని కాదు. ఎప్పటికప్పుడు రూపం మారుస్తున్న కరోనాపై ఇప్పటికీ చాలా అప్రమత్తంగా ఉండాలి. మాస్క్, భౌతికదూరం తదితర కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి’ అని సూచించారు. కరోనాపై మనం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. టీకాతోపాటు 6 వేలు ఇవ్వండి ప్రధాని ప్రకటనపై ఎన్డీయే నేతలు హర్షం వ్యక్తం చేయగా, టీకా విధానంలో గందరగోళానికి ఇకనైనా తెరవేయాలని కాంగ్రెస్ కోరింది. ఉచితంగా టీకా ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 6 వేలు జమ చేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు, సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల కారణంగానే ప్రధాని ఈ ప్రకటన చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేశారు. ‘సుప్రీం’ వ్యాఖ్యల వల్లనేనా? కేంద్ర ప్రభుత్వం మళ్లీ కేంద్రీకృత టీకా విధానం వైపు వెళ్లడానికి ఇటీవల సుప్రీంకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలే కారణమన్న వాదన వినిపిస్తోంది. కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు టీకా ధరల్లో వ్యత్యాసం, కోవిన్ యాప్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలనే నిబంధన, వయస్సుల వారీగా టీకాలివ్వాలన్న విధానంలో హేతుకత.. తదితర అంశాలపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. వ్యాక్సిన్ కోసం బడ్జెట్లో కేటాయించిన రూ. 35 వేల కోట్లలో ఎంత మొత్తాన్ని, ఎలా ఖర్చు చేశారో వివరించాలని ఆదేశించింది. టీకా విధానాన్ని పునఃపరిశీలించాలని కోరింది. దేశంలో కోవిడ్ స్థితిగతులపై విచారణను సుమోటోగా సుప్రీం తీసుకుంది. ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్కు, 45 ఏళ్ల వయస్సు పైబడిన వారికి తొలి విడతలో కేంద్రం ఉచితంగా టీకా ఇచ్చింది. ఆ తరువాత వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పిస్తూ సరళీకృత విధానం ప్రారంభించింది. సత్తా చూపాం అత్యంత స్వల్ప వ్యవధిలో దేశీయంగా రెండు టీకాలను అభివృద్ధి చేసి భారత్ తన సత్తా నిరూపించుకుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అర్హులైనవారికి 23 కోట్ల టీకా డోసులు వేశారన్నారు. గతంలో విదేశాల్లో టీకాలు అభివృద్ధి చెంది, అందుబాటులోకి వచ్చిన దశాబ్దాల తరువాత భారతీయులకు అవి లభించేవని ప్రధాని గుర్తు చేశారు. కొన్ని వ్యాధులకు వేరే దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసే సమయానికి, భారత్‌లో ఆ కార్యక్రమం ప్రారంభమయ్యేదన్నారు. గత 5, 6 ఏళ్లలో ఆ పరిస్థితి మారిందన్నారు. ‘అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. కోవిడ్‌ను ఎదుర్కొనే టీకాను సరైన వ్యూహం, ప్రణాళికతో, స్పష్టమైన విధానంతో, పట్టుదలతో ముందుకు వెళ్లి... ఒకటి కాదు, రెండు వ్యాక్సిన్లను స్వల్ప వ్యవధిలోనే దేశీయంగా అభివృద్ధి చేయగలిగాం’ అన్నారు. గత వందేళ్లలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం ఈ మహమ్మారేనన్న ప్రధాని.. దీనిపై భారత్ బహుముఖ పోరు సల్పుతోందన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను, ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశామని, ఐసీయూ బెడ్స్‌ను, ఆక్సిజన్ ఉత్పత్తిని, వెంటిలేటర్ల లభ్యతను పెంచామని తెలిపారు. అత్యవసర ఔషధాల ఉత్పత్తిని భారీగా పెంచామని, కొత్తగా వైద్య వసతులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాంతానికి సాధ్యమే ఈ సంవత్సరాంతానికి 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకా ఇవ్వడం సాధ్యమనని సంబంధిత ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటికి 187.2 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. దేశంలో 18 ఏళ్లు పైబడినవారి సంఖ్య సుమారుగా 94 కోట్లు ఉంటుందన్నారు. జనవరి నుంచి జులై వరకు 53.6 కోట్ల డోసులు, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 133.6 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన్నారు. నవంబర్ వరకు ఉచిత రేషన్ పేదలకు ఉచిత రేషన్ అందించే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని నవంబర్ వరకు పొడగిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు నెలవారీగా, ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున ఆహారధాన్యాలు ఉచితంగా అందజేస్తారు. సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో మే, జూన్ నెలలకు ఈ పథకం కింద ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తామని కేంద్రం ఏప్రిల్‌లో ప్రకటించింది. గత సంవత్సరం ఈ పథకాన్ని ఏప్రిల్ నుంచి 8 నెలల పాటు కొనసాగించామని ప్రధాని గుర్తు చేశారు. ‘ఈ సంవత్సరం కూడా మే, జూన్ నెలల్లో దీన్ని అమలు చేశాం. ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి వరకు పొడగించాలని నిర్ణయించాం. ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం పేదలకు ఒక స్నేహితుడిగా అండగా ఉంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
సాగు చట్టాలపై ఆందోళన తొలగించాలి
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో భారత సాయుధ దళాలు సదా సిద్ధంగా ఉంటాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తక్షణమే స్పందించేందుకు సరైన సమన్వయంతో సాయుధ దళాలు సర్వ సన్నద్ధంగా ఉంటాయని తెలిపారు. గత సంవత్సరం తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా విస్తరణ వాద ప్రయత్నాన్ని భారతీయ జవాన్లు సాహసోపేతంగా తిప్పికొట్టిన విషయాన్ని రాష్ట్రపతి గుర్తు చేశారు. నేటి 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి సోమవారం రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆహారోత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించడానికి కారణమైన రైతులకు దేశవాసులంతా సెల్యూట్ చేస్తారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సాధారణంగా సంస్కరణ మార్గం తొలి దశలో అపార్థాల పాలవుతుందని, అయితే, రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్లో నెలకొన్న, రాజ్యాంగ విలువల్లో భాగమైన సౌభ్రాతృత్వ భావన కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు భారత్ ఔషధాలను సరఫరా చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్’గా ఆయన అభివర్ణించారు. అనూహ్య సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా భారత్ నిరాశను దరి చేరనీకుండా, ఆత్మ విశ్వాసంతో సుదృఢంగా నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కూడా ప్రారంభమైందన్నారు. నిబంధనల ప్రకారం కరోనా టీకాను తీసుకోవాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి సూచించారు.టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ పెరేడ్ చాలా ప్రత్యేకం! భారత్ డెబ్భైరెండో రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించే పెరేడ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో దర్శనమిస్తుండగా, కొన్ని అంశాలు తొలిసారి పెరేడ్లో మిస్సవుతున్నాయి. అండమాన్ నికోబార్ ద్వీపాలకు చెందిన ట్రూప్స్, తొలి మహిళా ఫైటర్ పైలెట్, కొత్తగా ఏర్పడ్డ లడఖ్ శకటం, కొత్తగా కొన్న రఫేల్ జెట్స్ ప్రదర్శన తొలిమారు రిపబ్లిక్‌డే పెరేడ్లో దర్శనం ఇవ్వనున్నాయి. మరోవైపు గణతంత్ర దినోత్సవ పెరేడ్లో చీఫ్ గెస్ట్ లేకపోవడం ఇదే తొలిసారి. అలాగే మిలటరీ వెటరన్స్ ప్రదర్శన, మోటర్‌సైకిల్ డేర్‌డేవిల్స్ ప్రదర్శన కూడా ఈ దఫా లేవు. -
అన్నదాతలే వెన్నెముక
న్యూఢిల్లీ: 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాన మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయం సమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని కొనియాడారు. ఆదివారం మాసాంతపు ‘మన్‌కీ బాత్’లో ప్రధాని మోదీ దేశ ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ సంస్కరణ బిల్లులపై ఒక వర్గం రైతులు ఆందోళనలు కొనసాగిస్తుండగా ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. అదే సమయంలో ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై మండిపడ్డారు. మహాత్మాగాంధీ ఆర్థిక సిద్ధాంతాలను కాంగ్రెస్ పాటించి ఉంటే ఇప్పుడు ‘ఆత్మనిర్భర్ భారత్’ యోజన అవసరం ఉండేదే కాదన్నారు. దేశం ఎప్పుడో స్వయం సమృద్ధం సాధించి ఉండేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైతు సంఘా లతో ముచ్చటించారు. 2014లో చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)చట్టంతో లాభం పొందిన హరియాణా, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల రైతుల అనుభవాలను వివరించారు. ఉత్పత్తులను విక్రయించే సమయంలో వీరికి దళారుల బెడద తప్పిందని, మెరుగైన ధర లభించిం దని పేర్కొన్నారు. ఇప్పుడు వరి, గోధుమ, చెరకు రైతులకు కూడా ఇదే స్వేచ్ఛ లభించనుందని, వారు మంచి ధర పొందనున్నారని అన్నారు. కథలు చెప్పడం మన సంస్కృతిలో భాగమంటూ ఆయన.. సైన్స్‌కు సంబంధిం చిన కథలు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని ‘బెంగళూరు స్టోరీ టెల్లింగ్ సొసైటీ’ సభ్యులతో ముచ్చటించారు. వారితో తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి చెప్పించారు. ప్రజలంతా కూడా పిల్లలకు కథలు చెప్పేందుకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మాలి దేశానికి చెందిన సేదు దెంబేలే గురించి ప్రధాని తెలిపారు. ఆయనకు భారత్‌పై ఉన్న అభిమానాన్ని వివరించారు. ప్రధాని ఇంకా ఏమన్నారంటే.. ► కథలు ప్రజల సృజనాత్మకతను ప్రకటిస్తాయి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు. నా పర్యటనల్లో నేను పిల్లలతో మాట్లాడేవాడిని. వారిని కథలు చెప్పమని అడిగేవాడిని. కానీ వారు జోక్స్ చెబుతామని, మాకు జోక్స్ చెప్పండని అడగేవారు. నేను ఆశర్యపోయేవాడిని. వారికి కథలతో పరిచయం ఉండటం లేదు. గతంలో ఇంట్లో పెద్దలు పిల్లలకు కథలు చెప్పేవారు. ఆ కథల్లో శాస్త్రం, సంప్రదాయం, సంస్కృతి, చరిత్ర ఉండేవి. కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది. కథలు చెప్పే సంప్రదాయం అంతరించిపోకుండా ఇప్పటికీ కొందరు కృషి చేస్తున్నారు. ఐఐఎం(ఏ)లో ఎంబీఏ చేసిన అమర్వ్యాస్ వంటి కొందరు వెబ్‌సైట్స్‌ను ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికత సాయంతో ఆసక్తి ఉన్నవారికి పలు కథారీతులను పరిచయం చేస్తున్నారు. బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి గాంధీజీ కథలను ప్రచారం చేస్తున్నారు. ► ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య వం టి పెద్దలుంటే వారి వద్ద కథలను విని, రికార్డ్ చేసుకోండి. భవిష్యత్తులో ఉపయోగ పడ్తాయి. ► ఆధునిక వ్యవసాయ పద్దతులను ఉపయోగించడం వల్ల వ్యయం తగ్గుతుంది. దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. రైతులు మార్కెట్ అవసరాలకనుగుణంగా పంటలు వేయాలి. ► సెప్టెంబర్ 28 షహీద్ భగత్ సింగ్ జయంతి. బ్రిటిష్ వారిని గడగడలాడించిన సాహస దేశభక్తుడు భగత్ సింగ్. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో అనుబంధం చాలా గొప్పది. ఆయనకు నా వినమ్ర నివాళులు. భగత్‌సింగ్‌లా కావడం ఎలా? హైదరాబాద్ వ్యక్తికి మోదీ సమాధానం నమో యాప్‌లో ఒక ప్రశ్న చూశాను. ఈ తరం యువత భగత్‌సింగ్‌లా కావడం ఎలా? అని హైదరాబాద్‌కు చెందిన అజయ్ ఎస్జీ అడిగారు. మనం భగత్‌సింగ్ కాగలమో, లేదో తెలియదు కానీ, ఆయనకు దేశంపైన ఉన్న ప్రేమను, దేశ సేవ కోసం ఆయన పడే తపనను మనం పెంపొందించుకోవచ్చు. అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాలను చూశాం. అప్పుడు ఆ వీర సైనికుల మనస్సులో ఒకటే ఉంది.. దేశ రక్షణ ఒకటే వారి లక్ష్యం. తమ ప్రాణాలకు వారు ఎలాంటి విలువనివ్వలేదు. పని ముగించుకుని, వారు విజయవంతంగా తిరిగిరావడం మనం చూశాం. దేశ మాత గౌరవాన్ని వారు మరింత పెంచారు. -
గట్టిగా బుద్ధి చెప్పాం
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా, పాకిస్తాన్లకు గట్టి హెచ్చరికలే పంపారు. ఎల్ఓసీ (నియంత్రణ రేఖ) నుంచి ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వరకు దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసిన వారికి సాయుధ బలగాలు గట్టిగా బుద్ధి చెప్పాయన్నారు. లద్దాఖ్‌లో మన సైనికుల శౌర్య పరాక్రమాలు యావత్ ప్రపంచం చూసిందన్నారు. శనివారం ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన దేశ 74వ స్వాతంత్ర దిన వేడుకలకు సంప్రదాయబద్ధంగా కాషాయం, తెలుపు రంగుల్లో ఉన్న కుర్తా, పైజామా తలపాగా ధరించి వచ్చిన ప్రధాని గంటా 26 నిమిషాల సేపు ప్రసంగించారు. కేంద్ర పథకాలైన ఆత్మ నిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్, మేకిన్ ఇండియా టు మేక్ ఫర్ వరల్డ్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక రంగ పురోగతికి చేపట్టిన సంస్కరణల గురించి వివరించారు. కరోనా వ్యాక్సిన్ నుంచి మహిళా సాధికారత వరకు ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ ఆయన ప్రసంగం సాగింది. తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశ కోసం ప్రాణాలర్పించిన వారికి ఎర్రకోట నుంచి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. సరిహద్దుల్లో ఉగ్రవాదమైనా, విస్తరణ వాదమైనా భారత్ వాటిపై యుద్ధం చేస్తుందని స్పష్టం చేశారు. అయితే పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకే తాము ప్రాధాన్యం ఇస్తామన్నారు. గత ఏడాది విదేశీ పెట్టుబడుల్లో రికార్డు స్థాయిలో 18 శాతం వృద్ధి సాధించామని ప్రపంచ దేశాలు భారత్‌పై విశ్వాసం ఉంచాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజను ప్రస్తావిస్తూ శతాబ్దాల సమస్యను శాంతియుతంగా పరిష్కరించమన్నారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్లను ప్రధాని మోదీ అభినందించారు. మోదీ కొత్త మంత్ర మేక్ ఫర్ వరల్డ్ మోదీ తన ప్రసంగంలో ఆత్మనిర్భర్ భారత్‌పై అత్యధికంగా దృష్టి పెట్టారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితులు కూడా దేశ సంకల్ప బలాన్ని అడ్డుకోలేవని ధీమాగా చెప్పారు. ఇంక ఎక్కువ కాలం దిగుమతులు మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే దిగుమతులు తగ్గించుకోవడమే కాదు, మన సామర్థ్యం, సృజనాత్మకత, నైపుణ్యం ప్రపంచం గుర్తించేలా చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక మేకిన్ ఇండియా కాదు, మేక్ ఫర్ వరల్డ్ దిశగా భారత్ ప్రయాణం సాగాలని అన్నారు. ప్రపంచం ఆదరించేలా భారత్‌లో నాణ్యమైన వస్తువుల్ని ఉత్పత్తి చేయాలని మోదీ అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల తయారీలో నాలుగు నెలల్లోనే భారత్ స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ఎగుమతులు కూడా చేస్తోందని అన్నారు. దీంతో యువతకి ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధాని చెప్పారు. మౌలిక సదుపాయాల రంగంలో విప్లవం సృష్టించేలా రూ. 110 లక్షల కోట్లతో వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఏడు వేల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్టుల్ని ప్రారంభించామని అన్నారు. కోవిడ్ విసిరిన ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్‌లో వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని రైతులే పారిశ్రామికవేత్తలుగా మారడానికి వీలుగా లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక నిధిని ప్రారంభించామని చెప్పారు. దీనివల్ల గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వెయ్యిరోజుల్లో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ రాబోయే మూడేళ్ల కాలంలో దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ప్రాజెక్టుని ప్రకటించారు. గత అయిదేళ్లలో 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించామని మరో మూడేళ్లలో ప్రతీ గ్రామానికి నెట్ సదుపాయం ఉంటుందని అన్నారు. ఆన్లైన్ కార్యకలాపాలు అధికమైన నేపథ్యంలో సైబర్ భద్రతపై త్వరలోనే కొత్త విధానాన్ని తీసుకొస్తామన్నారు. తయారీలో మూడు కరోనా వ్యాక్సిన్లు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. భారత్‌లో మూడు వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్ అందేలా ఇప్పటికే మౌలిక సదుపాయాల ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారీలో అహరహం శ్రమిస్తున్న శాస్తవేత్తల్ని ప్రధాని రుషులు, మునులతో పోల్చారు. కరోనాపై విజయం సాధించడానికి వారు ల్యాబొరేటరీల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో వ్యాక్సిన్ దేశ ప్రజలందరికీ చేరేలా చూస్తామన్నారు. భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్లు ఒకటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు అనుమతులు లభించాయి. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా రక్షణ రంగంలో స్వావలంబన దిశగా గట్టి చర్యలు చేపడుతున్నట్లు మోదీ తెలిపారు. వందకు పైగా ఆయుధాలు, రక్షణ పరికరాల దిగుమతిని నిషేధించామన్నారు. క్షిపణుల నుంచి తేలికపాటి సైనిక హెలికాప్టర్లు, రైఫిల్స్, యుద్ధ రవాణా విమానాలను భారత్‌లో తయారుచేస్తామన్నారు. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ఆధునీకరణ జరుగుతోందన్నారు. దేశ రక్షణలో సరిహద్దు, తీరప్రాంత మౌలికసదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో, హిందూ మహాసముద్రంలోని దీవుల మధ్య, లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు రహదారుల నిర్మాణం జరిగిందని, రవాణా సదుపాయాలకు ప్రాధాన్య మిచ్చామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఏడాదిలో 2 కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చామని, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి సురక్షిత మంచినీరు అందించామని తెలిపారు. రూపాయికే శానిటరీ ప్యాడ్ స్వాతంత్య్రదిన ప్రసంగంలో ఈ సారి ప్రధాని ఏనాడూ ఎవరూ మాట్లాడని మహిళల రుతు స్రావం అంశాన్ని లేవనెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళా సాధికారత గురించి వివరిస్తూ నిరుపేద మహిళలకు 6 వేల జన ఔషధి కేంద్రాల ద్వారా రూపాయికే శానిటరీ ప్యాడ్లు అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది మహిళలకు ఈ ప్యాడ్లు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుతమున్న 18 ఏళ్లుగా ఉన్న అమ్మాయిల పెళ్లి వయసును మార్చడానికి సన్నాహాలు చేస్తున్నామని, దీనికోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళా అధికారుల్ని కీలక పదవుల్లో తీసుకున్నామని, ట్రిపుల్ తలాక్‌ని రద్దు చేశామన్నారు. ప్రధాని శానిటరీ ప్యాడ్ల ప్రస్తావనపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. 40 కోట్ల ‘జన్‌ధన్ బ్యాంకు అకౌంట’్లలో 22 కోట్ల అకౌంట్లు మహిళలవేనని, ఈ మహమ్మారి కాలంలో వారి ఖాతాల్లో రూ.30 వేలకోట్ల నిధులను వేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ‘ముద్ర’రుణాల్లో 70 శాతం చెల్లెళ్ళు, తల్లులకే ఇచ్చామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అత్యధిక రిజిస్ట్రేషన్లు మహిళల పేరిటే ఉన్నాయన్నారు. అందరికీ హెల్త్ కార్డులు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ ఆరోగ్య రంగాన్ని డిజిటలైజ్ చేసే పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతీ పౌరుడికి హెల్త్ ఐడీ నంబర్ ఇస్తారు. ఈ హెల్త్ ఐడీ డిజిటల్ రూపంలోనే ఉంటుంది. అందులో వారి ఆరోగ్య సమాచారం, వాడే మందులు, మెడికల్ రిపోర్ట్స్ నిక్షిప్తం చేస్తారు. ఈ ఐడీలన్నింటినీ దేశ వ్యాప్తంగానున్న ఆరోగ్య కేంద్రాలు, రిజిస్టర్డ్ వైద్యులతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల దేశంలో ఎవరైనా అనారోగ్యంతో వైద్యుల్ని సంప్రదిస్తే ఒక్క క్లిక్‌తో వారి సమస్యలన్నీ తెలుసుకోవచ్చు. ఈ్త ఐడీలతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ చెప్పారు. ఎన్సీసీ కేడెట్లకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఎర్రకోట వద్ద 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృశ్యం విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్న రాష్ట్రపతి నివాస ప్రాంతం రైసినా హిల్స్ -
శాంతి మన విధానం
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్‌లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్‌ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వైద్యులకు సెల్యూట్ కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు. 2020 నేర్పిన పాఠం 2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు. ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రామాలయ నిర్మాణం గర్వకారణం అయోధ్యలో ఆగస్ట్ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు. -
దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని అన్నారు. కోవిడ్-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వేగవంతంగా మనం తీసుకున్న చర్యలతో ఎందరో ప్రాణాలు నిలబెట్టామని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. చదవండి : అగ్నిప్రమాదం కలచివేసింది వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.ఇక గల్వాన్‌లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్‌లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని అన్నారు. ప్రపంచమంతా మహమ్మారితో ఐక్యంగా పోరాడుతున్న వేళ పొరుగు దేశం తన విస్తరణ కార్యకలాపాలను చేపట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
నవంబర్ వరకు ఉచిత రేషన్
-
నవంబర్ వరకు ఉచిత రేషన్ : మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ ఆఖరు వరకు ఉచిత రేషన్ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. దేశంలో వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకోస్తున్నట్టు వెల్లడించారు. ఇది వలస కూలీలకు, వారి కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. రేపటి నుంచి అన్‌లాక్ 2.0 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్ 2.0 లోకి ప్రవేశించాం. రానున్న కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. అందువల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. సరైన సమయంలో లాక్డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉంది. లాక్డౌన్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం. కానీ అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల నుంచి మాస్కులు ధరించడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రజలు నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి. దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయి. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాం. గత కొన్ని నెలలుగా రైతులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ. 18 వేల కోట్లు జమ చేశాం. రాబోయేది పండగల సీజన్ కావున ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే దీపావళి వరకు 80 కోట్ల మందికి పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తాం. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు అందజేస్తాం.గరీబ్ కల్యాణ్ యోజన పొడిగింపు కోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పన్ను చెల్లించే ప్రతి భారతీయుడి వల్లే... ఈరోజు ఇంతమంది పేదలకు సాయం చేయగలుగుతున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి’అని తెలిపారు. -
రేపు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆదివారం తనమాసాంతపు ‘మన్‌కీ బాత్’లో లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కరోనాపై యోగాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి జనం ప్రాణాలను బలిగొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా అవసరం గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కరోనా బాధితులు ఆరోగ్యవంతులుగా మారడానికి యోగా దివ్యౌషధంగా పని చేస్తుందని తెలిపారు. ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం దేశ ప్రజలకు సందేశమిచ్చారు. దాదాపు 15 నిమిషాలపాటు ప్రసంగించారు. కరోనా ప్రధానంగా శ్వాస వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ప్రాణాయామంతో శ్వాస వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఐక్యం చేసే చోదకశక్తిగా యోగా రూపాంతరం చెందిందని అభివర్ణించారు. మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని వివరించారు. యోగాకు జాతి, కులం, వర్ణం, లింగభేదం, నమ్మకాలతో సంబంధం లేదన్నారు. ఎవరైనా యోగా సాధన చేయొచ్చన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం యోగాతో సాధ్యమని చెప్పారు. ప్రాణాయామం.. నిత్య జీవితంలో భాగం ‘‘శరీరంలో బలమైన రోగ నిరోధక శక్తి ఉంటే కరోనాను సులువుగా జయించవచ్చు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి. ప్రాణాయామం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రాణాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా మార్చుకోవాలి. ప్రపంచంలో చాలామంది కరోనా బాధితులు యోగాతో ఉపశమనం పొందారు. కరోనాను ఓడించే శక్తి యోగాకు ఉంది’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘‘సరైన ఆహారం తీసుకోవడం, సరైన క్రీడల్లో పాలుపంచుకోవడం, క్రమశిక్షణ కలిగి ఉండడం కూడా యోగా చేయడమే’’ అని పేర్కొన్నారు. ఒక కుటుంబంగా, ఒక సమాజంగా మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఔత్సాహికులు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల ఈసారి చాలా దేశాల్లో డిజిటల్ వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహించారు. అమెరికా, చైనా, యూకే, టర్కీ, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, నేపాల్ తదితర దేశాల్లో జనం యోగాసనాలు వేశారు. చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత రాయబార కార్యాలయ ఉద్యోగులు, భారతీయులు పాలుపంచుకున్నారు. -
కోటి మంది యోగా చేస్తారు
న్యూఢిల్లీ: ఆదివారం జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దాదాపు కోటి మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తాను సూర్య నమస్కారం, పురాణఖిల ఆసనాలు వేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ‘ఇంటి వద్ద యోగా.. కుటుంబంతో కలసి యోగా’ అనే ఇతివృత్తంపై యోగా కార్యక్రమలు చేపట్టనున్నట్లు చెప్పారు. డిజిటల్ రూపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశం ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం భారీస్థాయిలో జనంతో యోగాసనాలతో జరిగే యోగా దినోత్సవం ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా డిజిటల్ రూపంలో జరగనుంది. -
ఇంట్లోనే యోగా చేయండి!
న్యూఢిల్లీ: యోగాతో బహుళ ప్రయోజనాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కారణంగా తలెత్తిన అనేక సవాళ్లకు యోగా పరిష్కారం చూపుతుందన్నారు. ఈ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంట్లోనే, కుటుంబంతో కలిసి జరుపుకోవాలన్నారు. ఆరవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ గురువారం ఒక వీడియో సందేశాన్ని వెలువరించారు.‘యోగాతో శరీరం, మనస్సు మధ్య దూరం తొలగుతుంది. ఆ దూరమే చాలా సమస్యలకు మూల కారణం. ఆకాంక్షలకు, వాస్తవాలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది’ అన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ నినాదం ‘ఇంట్లోనే యోగా.. కుటుంబంతో యోగా’ అని.. అందువల్ల అంతా భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్లల్లోనే యోగా సాధన చేయాలని కోరారు. గుంపులుగా సాధన చేయొద్దని సూచించారు. -
21న జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగాన్ని లద్దాఖ్‌లోని లేహ్ నుంచి చేయాలని మొదట నిర్ణయించారు. కానీ, కోవిడ్ నేపథ్యంలో ఢిల్లీ నుంచే ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యోగా విశిష్టత గురించి ఆయన వివరిస్తారని సమాచారం. అలాగే ప్రధాని చేసే కొన్ని యోగాసనాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 21వ తేదీన ఉదయం 7 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభమవుతుంది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇండియా ప్రతిస్పందనను కూడా మోదీ ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 2014 డిసెంబర్ 11న ఐరాస ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నిర్లక్ష్యం వద్దు.. యుద్ధం ముగియలేదు!
న్యూఢిల్లీ: కరోనా విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దని దేశ ప్రజలను ప్రధాని మోదీ హెచ్చరించారు. అన్ని జాగ్రత్తలతో మరింత అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ కరోనా సంక్షోభం పేదలు, కూలీలు, శ్రామికులపై పెను ప్రభావం చూపిందన్నారు. వారి బాధను వర్ణించేందుకు తనవద్ద మాటలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వలస శ్రామికుల నైపుణ్యాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, కొత్తగా మైగ్రేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని వెల్లడించారు. గతంలో జరిగిన వాటిని సమీక్షించుకుని, తప్పులను సవరించుకుని, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూసుకునేందుకు లభించిన అవకాశం ఈ సంక్షోభం అన్నారు. ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా పునః ప్రారంభమైందన్న ప్రధాని.. కరోనాపై పోరులో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యం ఎంతమాత్రం వద్దని ప్రతి నెల చివరి ఆదివారం ప్రజలకు ఇచ్చే సందేశం ‘మన్ కీ బాత్’లో హితవు పలికారు. దేశీయంగా రైల్వే, విమాన సర్వీసులు పరిమితంగా ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరిన్ని సడలింపులు త్వరలో ఉంటాయని తెలిపారు. కష్టపడి కరోనాను కొంతవరకు కట్టడి చేశామని, పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాల్సి ఉందని సూచించారు. ‘స్వావలంబ భారత్’ ఇప్పుడొక నినాదం కరోనా సంక్షోభంతో అన్ని వర్గాలు ఇబ్బందులు పడినప్పటికీ.. నిరుపేదలపై దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉందన్నారు. ‘మనం గ్రామ స్థాయి నుంచి ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించి ఉంటే.. ఇంత కఠిన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వచ్చేది కాదు’ అని వ్యాఖ్యానించారు. తన పిలుపుతో ‘స్వావలంబ భారత్’ నినాదం ఉద్యమంగా మారిందని, ఇప్పుడంతా స్థానిక ఉత్పత్తులనే కొంటున్నారన్నారు. పేదలకు అంతా చేతనైనంత సాయం అందిస్తున్నారని ప్రధాని ప్రశంసించారు. వలస కూలీలను శ్రామిక్ రైళ్ల ద్వారా సొంతూళ్లకు తరలిస్తూ రైల్వే శాఖ గొప్ప సేవ చేస్తోందన్నారు. వలసలు ఎక్కువగా ఉండే దేశ తూర్పు ప్రాంతం ఈ సంక్షోభం కారణంగా ఎక్కువగా కష్టనష్టాలను ఎదుర్కొందని, దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారగల ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ‘గత ఐదేళ్లుగా ఈ దిశగా కొంత సాధించాం. ఇప్పుడు వలస కూలీల వెతలను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళికలను రచించాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీతో గ్రామీణ ఉపాధి, స్వయం ఉపాధి, చిన్నతరహ పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
లాక్డౌన్4పై మోదీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. లాక్డౌన్ మరింతకొంత కాలం పొడగింపు ఉంటుందని వెల్లడించారు. లాక్డౌన్ 4వ దశ ఉంటుందని, వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందని, తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ పేర్కొన్నారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.(70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య) ‘ఈరోజు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. రూ. 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఇది మన జీడీపీలో 10శాతం. ఈ ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకున్నాము. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు.. ఉద్యోగులు శ్రామికుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే ఈ ప్యాకేజీ. రేపటి నుంచి ఈ ప్యాకేజీకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలను పాటించాలి. కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఆత్మా నిర్భర్ భారత్... మన లక్ష్యం కావాలి. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే. కరోనా ప్రారంభం అయినప్పుడు, దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. నేడు భారత్‌లో ప్రతీ రోజు 2లక్షల పీపీఈ కిట్స్, 2లక్షల ఎన్-95 మాస్క్‌లు తయారవుతున్నాయి. ఆపదను అవకాశంగా మార్చుకున్నాము. స్వయం సంవృద్ధి సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోంది. భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయి. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం’ అని మోదీ అన్నారు. (లాక్డౌన్ కొనసాగుతుంది.. అయితే) సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి.(లాక్డౌన్ పొడగించాల్సిందేనట!) -
నేడు జాతి ముందుకు రానున్న ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ రోజు (మంగళవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. లాక్డౌన్ సడలింపులు, కొనసాగింపు, కరోనా కట్టడిపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. దీంతో నేటి ప్రసంగంలో వాటిపై మాట్లాడే అవకాశం ఉంది. ఇక లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. (దేశంలో 70 వేలు దాటిన పాజిటివ్ కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1411285105.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేడు లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం
-
ఇక ‘స్మార్ట్ లాక్డౌన్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలాన్ని పొడిగించడం ఖాయమేనని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) దేశాన్ని ఉద్దేశించి చేయనున్న ప్రసంగంలో ఏయే అంశాలను ప్రస్తావించనున్నారు? లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండబోతోందా? గత మూడువారాలుగా కొనసాగిన విధంగా కఠినంగానే ఉండబోతోందా? ఆంక్షల సడలింపుపై ఏవైనా నిర్ణయాలుంటాయా? ఉంటే.. ఎలాంటి మినహాయింపులుంటాయి? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. మూడు వారాల లాక్‌డౌన్‌తో ఇప్పటికే కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థ.. మరో రెండు వారాల పాటు నిర్బంధం ఇలాగే కొనసాగితే ఏ స్థాయికి పడిపోతుందోనని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ లాక్డౌన్ కాకుండా.. ఆర్థికాభివృద్ధికి వీలు కల్పించే ‘స్మార్ట్ లాక్డౌన్’ను ప్రధాని ప్రతిపాదించే అవకాశముందని తెలుస్తోంది. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ.. ప్రాణాలు కాపాడటంతో పాటు దేశæ ఆర్థికాభివృద్ధి పైనా(జాన్ భీ.. జహాః భీ) దృష్టి పెట్టాల్సి ఉందని ప్రధాని వ్యాఖ్యానించిన విషయం గమనార్హం. మద్యం అమ్మకాలకు ఒత్తిడి ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చాలామంది ముఖ్యమంత్రులు మద్యం అమ్మకాల విషయం ప్రస్తావించారు. ఖజానాకు అత్యంత కీలకమైన ఆదాయ వనరు అయిన మద్యం అమ్మకాలపై ఆంక్షల సడలింపును వారు కోరారు. బార్లు, రెస్టారెంట్లకు అనుమతివ్వకుండా.. పాక్షికంగా, రోజులో కొన్ని గంటల పాటు అయినా మద్యం అమ్మకాలకు వీలు కల్పించాలన్నారు(దీనిపై కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి). దాంతో, రాష్ట్రాలు కోరితే.. ఆంక్షల సడలింపులో భాగంగా.. మద్యం అమ్మకాలను పాక్షికంగా అనుమతించే అవకాశం ఉంది. ► స్వల్ప స్థాయిలో దేశీయ విమాన, రైల్వే, మెట్రోరైల్ సర్వీసులను అనుమతించే అవకాశం ఉంది. అయితే, 30 శాతం టికెట్లను మాత్రమే విక్రయించేలా ఆంక్షలు పెట్టే అవకాశముంది. ► కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను పలువురు సీఎంలు గట్టిగా వ్యతిరేకించారు. -
లాక్‌డౌన్‌పై ప్రధాని ప్రసంగం నేడు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ ఈ రోజుతో ముగియనున్న విషయం తెలిసిందే. మరో రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తారని, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించేందుకు కొన్ని నిబంధనల సడలింపు ఉంటుందని ఇప్పటికే కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యమేర్పడింది. పలు రాష్ట్రాలు ఏప్రిల్ 14 తరువాత కనీసం రెండు వారాల లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు చూపుతుండగా ప్రభుత్వం మాత్రం కోవిడ్–19ను నిరోధించడం, అదే సమయంలో దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలను మొదలుపెట్టడం అన్న ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతోందని ఓ అధికారి తెలిపారు. భౌతిక దూరం కచ్చితంగా పాటించేందుకు అనువుగా లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ ఆర్థిక కార్యకలాపాలను నడిపించేందుకు వీలుగా కొన్ని మినహాయింపులూ ప్రధాని ప్రకటించవచ్చునని అంచనా. ప్రాణాలతోపాటు, జీవనోపాధులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని గత శనివారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ వ్యాఖ్యానించిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. ‘లాక్డౌన్ ప్రకటిస్తున్నప్పుడు నేను ప్రాణముంటే ప్రపంచం ఉంటుందని చెప్పాను. దేశంలోని అధికులు దీన్ని అర్థం చేసుకున్నారు. ఇళ్లల్లోనే ఉండి తమ బాధ్యతలు నెరవేర్చారు. ఇప్పుడు దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రాణాలతోపాటు జీవనోపాధులపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది’ అని మోదీ ఆ సమావేశంలో వివరించారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ వరకూ పొడిగించిన విషయం తెలిసిందే. కార్యాలయాలకు కేంద్ర మంత్రులు.. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అనువుగా సోమవారం పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీలోని తమ కార్యాలయాల్లో విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. ‘లాక్డౌన్లో ఎక్కువ కాలం ఇంటి నుంచే పనిచేశాను. ఈ రోజు శాస్త్రి భవన్‌లోని కార్యాలయానికి తిరిగి వచ్చా. మోదీ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు సిద్ధమైంది’’అని బొగ్గు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రైల్వే, వాణిజ్య శాఖల మంత్రి పీయూష్ గోయెల్, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ సోమవారం తమ తమ కార్యాలయాలకు వచ్చిన వారిలో ఉన్నారు. జాయింట్ సెక్రటరీలు, అంతకంటే పై స్థాయి అధికారులకు రవాణా సౌకర్యం ఉండటం వల్ల వారు కార్యాలయాలకు రాగా.. రెండు, మూడు, నాలుగో తరగతుల ఉద్యోగులు వంతుల వారీగా వస్తున్న విషయం తెలిసిందే. అవసరమైనంత రక్షణ ఏర్పాట్లతో గుర్తించిన పరిశ్రమలు, సేవలను అందుబాటులోకి తేవాలని దేశీ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక మండలి ఇప్పటికే సూచించింది కూడా. -
లాక్‌డౌన్‌పై రేపు ప్రధానమంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు లాక్‌డౌన్‌పై ఆయన కీలక నిర్ణయం ప్రకటించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్లో వెల్లడించింది. కాగా, శనివారం ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మెజారిటీ రాష్ట్రాలు ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగించాలని కోరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒడిషా, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాల్లో ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రధాని ఈరోజే లాక్‌డౌన్‌పై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని వార్తలు వెలువడ్డాయి. (చదవండి: లాక్‌డౌన్‌తో మెరుగైన గంగా నది నీటి నాణ్యత) Prime Minister @narendramodi will address the nation at 10 AM on 14th April 2020. — PMO India (@PMOIndia) April 13, 2020 దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న తరుణంలో కొన్ని రంగాలకు మినహాయింపు ఇవ్వాలా వద్దా అనే విషయమై కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విమానయాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాలని.. భౌతిక దూరం పాటిస్తూ (సీటు వదిలి సీటు) విమానాలు నడిపే అవకాశం ఉందని వెల్లడించాయి. ఇక సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 9,152 చేరుకోగా.. 308 మరణాలు సంభవించాయి. 856 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 7,987 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మీడియతో చెప్పారు. (చదవండి: లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గు!) -
శతాబ్దానికొక్క అవకాశం!
న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యం, శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే దక్కే అరుదైన అవకాశంగా భావించండి అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఇది పరీక్షా సమయమన్న రాష్ట్రపతి.. ఇప్పుడు వేసే ఓటు ఈ శతాబ్దంలో దేశం గతిని నిర్ణయిస్తుందన్నారు. పేదలకు రిజర్వేషన్ల కల్పన గాంధీ కలల సాకారం దిశగా పడిన అడుగుగా ఆయన అభివర్ణించారు. 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు అంశాలపై ఆధారపడిన భిన్నత్వంలో ఏకత్వ భావనను స్వీకరించనిదే దేశాభివృద్ధి పరిపూర్ణం కాదు. ఈ దేశం మనది, మన అందరిదీ. మన వైవిధ్యం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి ప్రపంచానికి ఆదర్శం. ఇవి విడదీయరానివి. ఈ మూడూ మనకు అత్యవసరం’ అని రాష్ట్రపతి అన్నారు. ఓటర్లకు విన్నపం మరో నాలుగు నెలల్లో జరగనున్న సాధారణ ఎన్నికలను ప్రస్తావిస్తూ ఆయన..‘21వ శతాబ్దంలో పుట్టిన పౌరులు మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లోక్‌సభ ఎన్నికల్లో దక్కనుంది. భారతీయుల ఆకాంక్షలకు, విభిన్నతకు నిదర్శనం ఈ ఎన్నికలు. అర్హులైన ఓటర్లందరికీ నా విన్నపం ఒక్కటే.. పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయండి’ అని ప్రజలకు ముఖ్యంగా యువతకు పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికలు తరానికి ఒక్కసారి వచ్చే ఎన్నికలు మాత్రమే కాదు..ఈ శతాబ్దానికి ఏకైక ఎన్నికలుగా భావించండి. ప్రజాస్వామ్య ఆదర్శాలు, ఆలోచనలను ఆచరణలోకి తెచ్చేవి ఈ ఎన్నికలు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో, దేశ అభివృద్ధిలో ఇవి ఒక మైలురాయి మాత్రమే’ అని అన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు ‘పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఇటీవల చేపట్టిన రాజ్యాంగ సవరణ గాంధీజీ కలలు, భారతీయుల కలల సాకారం వైపునకు పడిన మరో అడుగు’ అని అన్నారు. ప్రతి చిన్నారి, ప్రతి మహిళకు సమాన అవకాశాలు, సమాన పరిస్థితులు కల్పించడమే మన సమాజం లింగ సమానత్వం సాధించిందనేందుకు సరైన సూచిక’ అని తెలిపారు. మన రాజ్యాంగానికి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు గౌరవసూచికగా ఈ ఏడాది దేశం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోనుంది’ అని పేర్కొన్నారు. -
మోదీ.. ఊరట ఏదీ!
-
మోదీ.. ఊరట ఏదీ!
► నోట్ల సమస్యపై మాటల మంత్రం.. ► ఓట్ల కోసం రాయితీల తంత్రం ► పెద్దగా వరాలు ప్రకటించని ప్రధాని ► ఎన్నికల రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి ► రైతులు, గృహ నిర్మాణానికి ‘వడ్డీ’ రాయితీ ► గర్భిణుల అకౌంట్లో రూ. 6 వేలు.. ► రైతులకు నాబార్డు సాయం పెంపు ► అక్రమార్కులకు తిప్పలు తప్పవు ► కష్టాలు ఎదుర్కొని సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు ► జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దుతో భారీగా లాభం జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న భారతీయులను ప్రధాని మోదీ తుస్సుమనిపించారు. నోట్లరద్దు తర్వాత సమస్యలు తగ్గుముఖం పట్టేందుకు కేంద్రం ప్రకటించిన 50 రోజుల గడువు పూర్తవడంతో దేశాన్ని ఉద్దేశించి శనివారం ప్రసంగించిన ప్రధాని మోదీ.. కొన్ని తాయిలాలు ప్రకటించడం మినహా ప్రజలకు భారీగా లబ్ధి చేకూర్చే ప్రకటనలేమీ చేయలేదు. రద్దు గాయంతో బాధపడుతున్న దేశ ప్రజలపై తాయిలాలతో పూత పూసే ప్రయత్నం చేశారు. కొత్త ఏడాదికి తీపికబురు అందుతుందని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. ఉసూరుమనిపించారు. త్వరలో యూపీ సహా ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అక్కడి ఓటర్లను ఆకర్షించేలా పలు పథకాలను ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగాన్ని తలపించిన మోదీ ప్రకటనలో రైతులు, మహిళలు, చిరు వ్యాపారులపై వరాల జల్లు తప్ప.. నోట్లరద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం, విత్‌డ్రాయల్ పరిమితిని ఎప్పుడు ఎత్తేస్తారనే అంశాలపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. న్యూఢిల్లీ: దేశంలో అవినీతిపరులకు మున్ముందు మరిన్ని కష్టాలు ఎదురవనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ప్రకటించిన 50 రోజుల డెడ్‌లైన్ ముగిసిన నేపథ్యంలో శనివారం జాతినుద్దేశించి మోదీ ప్రసంగించారు. అవినీతి పరులకు కష్టాలు తప్పవని హెచ్చరికలు చేస్తూనే.. రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు కష్టాలనెదుర్కొన్నా.. ప్రభుత్వానికి సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం స్నేహహస్తం అందిస్తుందని.. వారి మంచితనానికి సరైన ప్రతిఫలం అందిస్తుందని స్పష్టం చేశారు. పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు నోట్లరద్దును అవకాశంగా వినియోగించుకోవడంపై స్పందిస్తూ.. ‘ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేద’న్నారు. అందరికన్నా మేమే గొప్ప అనే దురభిప్రాయం నుంచి రాజకీయ పార్టీలు బయటకు రావాలన్న మోదీ.. రాజకీయాల ప్రక్షాళనకోసం అందరూ కలసి రావాలని కోరారు. రాజకీయాలను నల్లధనం, అవినీతి నుంచి విముక్తి చేసేందుకు సహకరించాలన్నారు. అవినీతిపై పోరాటంలో ఎంతమాత్రం వెనక్కు తగ్గేది లేదన్నారు. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తామన్నారు. చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!) గ్రామీణ భారతంపైనే దృష్టి బడ్జెట్ ప్రసంగాన్ని తలపించిన ఈ ప్రకటనలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల రుణ పరిమితిని పెంచటం, గ్రామీణ, పట్టణాల్లో గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా వడ్డీ తగ్గింపులు, రైతుల రుణాలపై భారీగా వడ్డీ మాఫీ, వయోవృద్ధుల డిపాజిట్లపై వడ్డీ పెంపు వంటివి ప్రధానంగా ఉన్నాయి. డబ్బులు ఎక్కువగా ఉన్న బ్యాంకులు పేదలు, అణగారిన వర్గాలకు రుణాలివ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా సాధారణస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెడుపై జరిగిన ఈ పోరాటంలో ప్రజలు, ప్రభుత్వం ఒకేవైపు నిలబడటం చారిత్రక పరిణామమన్నారు. ‘ఆర్థిక వ్యవస్థలో డబ్బులు తక్కువగా ఉంటే సమస్యలొస్తాయి. అదే డబ్బులు ఎక్కువైతే పరిస్థితి కఠినంగా మారుతుంది. అందుకే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకే నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నాం’అని మోదీ తెలిపారు. 125 కోట్ల మంది భారతీయుల్లో కేవలం 24 లక్షల మంది మాత్రమే తమ వార్షిక సంపాదన రూ.10 లక్షలకు మించి ఉందని వెల్లడించారన్నారు. ‘ఇది నిజమేనా? మీ చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు, భారీ కార్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే లక్షల మంది ఆదాయం 10 లక్షలకు మించి ఉంటుందనిపించటం లేదా? అందుకే ఈ ఉద్యమం నిజాయితీ పరులకోసం, వ్యవస్థను మరింత బలోపేతం చేయటం కోసం’అని మోదీ తెలిపారు. చెలామణిలో ఉన్న లక్షల కోట్ల ధనం బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావటమే ఈ మిషన్ విజయానికి కారణమన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా 33 శాతం ఇళ్లను పేదలకోసం నిర్మించనున్నట్లు తెలిపారు. ‘స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్నా.. లక్షల మంది పేదలకు ఇళ్లు లేవు. చాలా మంది మధ్యతరగతి వారికీ ఇల్లు కలగానే మిగిలింది. అలాంటి వారికోసమే ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకొస్తోంది’అని ప్రధాని అన్నారు. రైతులు.. మహిళలపై నోట్లరద్దు పథకం విజయవంతం కావటంలో సహకరించిన బ్యాంకు ఉద్యోగులను మోదీ ప్రశంసించారు. కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నోట్లరద్దుతో వ్యవసాయం దారుణంగా నష్టపోయిందన్న విమర్శల్లో వాస్తవం లేదని.. ఈసారి రబీ సాగులో 6 శాతం వృద్ధి కనిపించిందన్నారు. సహకార బ్యాంకులు, సొసైటీలకు రుణాలివ్వటం ద్వారా నాబార్డుకు జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళలకు ప్రసవానికి ముందు, తర్వాత తమ, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వారి అకౌంట్లలో రూ.6వేల రూపాయలను నేరుగా బదిలీ చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. దీని ద్వారా శిశుమరణాలను గరిష్టంగా తగ్గించవచ్చన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 53 జిల్లాల్లో ఈ పథకం అమలవుతోందని అయితే రూ.4వేలను లబ్ధిదారుల అకౌంట్లలో జమచేస్తున్నారని మోదీ వెల్లడించారు. నోట్లరద్దు కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నా.. 125 కోట్ల మంది భారతీయులు ఓపికగా సహకరించారంటూ అభినందించారు. ‘దీపావళి తర్వాత శుద్ధి యజ్ఞంను ప్రారంభించాను. మెజారిటీ భారతీయులు అవినీతి నుంచి విముక్తి అయ్యేందుకే ఈ చారిత్రక ప్రక్షాళన కార్యక్రమానికి అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు’అని మోదీ తెలిపారు. రబీ కోసం రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేసిన 60 రోజుల వడ్డీని నేరుగా వారి అకౌంట్లలోనే జమజేస్తామన్నారు. భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా? మోదీ వరాలు ♦ వయోవృద్ధులు చేసే డిపాజిట్లపై (రూ.7.5 లక్షల వరకు) పదేళ్ల వరకు 8 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ♦ గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతరాళ్ల ఆరోగ్య ఖర్చుల నిమిత్తం నేరుగా వారి అకౌంట్లలోకి రూ.6 వేలు జమచేయనున్నారు. ♦ రబీ పంటకోసం జిల్లా సహకార బ్యాంకులు, సొసైటీల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకు 60 రోజుల వరకు వడ్డీ మాఫీ. ♦ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల్లో రూ.2 లక్షల వరకు 3 శాతం వడ్డీ మాఫీ. ♦ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రెండు పథకాలు ప్రవేశపెట్టిన మోదీ..2017లో గృహ నిర్మాణానికి తీసుకునే 9 లక్షల వరకు రుణానికి 4 శాతం వడ్డీ, 12 లక్షల వరకు రుణానికి 3 శాతం వడ్డీ తగ్గించనున్నట్లు తెలిపారు. ♦ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణసామర్థ్యాన్ని రూ.కోటి నుంచి రెండు కోట్లకు పెంచారు. ♦ మూడు నెలల్లోపు 3 కోట్ల మంది రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్పు. ♦ నాబార్డు మూలనిధి రెట్టింపు (రూ.41వేల కోట్లకు పెంపు). ♦ ముద్ర యోజన లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు (3.5 కోట్ల నుంచి 7 కోట్లకు పెంపు). మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన తరగతులకు ప్రాధాన్యం. -
ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మోదీ
-
అత్యంత బాధ కలిగించే అంశమే: మోదీ
న్యూఢిల్లీ : తమ డబ్బు కోసం ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి ఉండటం అత్యంత బాధ కలిగించే అంశమే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ కేవలం కొంతమంది వద్దే కార్లు, బంగ్లాలు, లక్షలు ఉండటాన్ని ఎవరైనా అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. దేశంలో 24 లక్షల మంది రూ.10లక్షలకు పైగా ఆదాయాన్ని కలిగి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ లెక్కలు ఇవేనని, దీన్ని ఎవరైనా నమ్ముతారా అని అన్నారు. చదవండి... (ఇకనైనా కరెన్సీ కష్టాలు తీరేనా?!) చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నిజాయితీపరులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు ప్రజల హక్కులను రక్షించాలన్నారు. అలాగే నిజాయితీపరులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చట్టాలను ప్రజలు గౌరవించడం, ప్రభుత్వానికి సహకరించడం ఏ దేశానికైనా శుభసూచకమని ప్రధాని పేర్కొన్నారు. అప్పుడే పేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలు చక్కటి కార్యక్రమాలు చేయగలవన్నారు. బ్యాంకులు, ఉద్యోగులకు మోదీ ప్రశంస బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. అయితే నోట్ల రద్దు తర్వాత కొన్ని బ్యాంకుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయన్నారు. నల్ల నోట్ల రద్దును అవకాశంగా తీసుకున్న కొంతమంది అధికారులను క్షమించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇక కొందరు ప్రభుత్వ అధికారులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని తాను కూడా అంగీకరిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం బ్యాంకులు చక్కటి పథకాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. పేదలు, రైతులు, దళితులు, మహిళల సాధికారితకు కట్టుబడి ఉండాలన్నారు. నూతన సంవత్సర వరాలు దేశ ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. చాలామంది పేదలకు, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు లేవన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద రెండు పథకాలు ప్రకటించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్ల నిర్మాణం కోసం రుణాలు ఇస్తామని, రూ.9 లక్షల వరకూ రుణాలపై 4శాతం వడ్డీ రేటు తగ్గింపు, రూ.12 లక్షల వరకూ ఇంటి రుణంపై 3 శాతం వడ్డీ తగ్గిస్తామని చెప్పారు. పది రోజులాగితే ఖాతాలోకి రూ.15 లక్షలు వస్తాయా? ఈ పథకం 2017 నుంచి అమల్లోకి వస్తుందని ప్రధాని వెల్లడించారు. అలాగే రూ.2లక్షల వరకు ఇంటి రుణంపై 2 శాతం రిబేట్, 3కోట్ల రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులు రుపే కార్డులుగా మార్పు, వచ్చే మూడు నెలల్లోగా కిసాన్ కార్డులుగా మారుస్తామన్నారు. ఎంపిక చేసిన పంట రుణాలపై 60 రోజుల వరకూ వడ్డీ మాఫీ చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోటి రూపాయల నుంచి రూ.2కోట్లకు పెంచుతున్నట్లు ప్రధాని తెలిపారు. గర్భవతులకు బ్యాంకు అకౌంట్లోనే డబ్బు గర్భవతులకు ఆరువేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రధాని శుభవార్త తెలిపారు. ఆ నగదును గర్భవతుల బ్యాంకు అకౌంటులోనే జమ చేయనున్నట్లు చెప్పారు. 650 జిల్లాల్లో గర్భవతులకు సరైన ఆహారం, టీకాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ల కోసం మరో పథకాన్ని తెస్తున్నామని, సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లు పదేళ్లపాటు ఉంచితే 8శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రజలంతా భీమ్ యాప్‌ను వినియోగించాలని ప్రధాని కోరారు. అలాగే రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించాలని, పార్టీ నిధుల్లో పారదర్శకత ఉండాలన్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలని, పార్టీలకు వచ్చే నిధుల్లో నల్లధనం రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. -
నల్లధనంపై పోరులో వెనక్కి తగ్గేది లేదు
-
ప్రధాని మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
న్యూఢిల్లీ: భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని, అయితే ఆ నిర్ణయంతో నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయని తాను మరోసారి చెబుతున్నానని ప్రధాని అన్నారు. చదవండి... (ఇక వేలిముద్రే మీ గుర్తింపు!) ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా సాగితేనే దేశ భవిష్యత్తు ఉజ్వలం అవుతుందనడంలో సందేహం లేదని తెలిపారు. దేశంలో అమలవుతోన్న ఆర్థిక విధానంలో ఎన్నో లోపాలున్నాయని,. నగదు ఎక్కువగా చెలమణిలో ఉండటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయాన్నారు. అవినీతి, నల్లధనమూ పెరిగిందని అయితే నగదు రహిత విధానంతో ఈ సమస్యలన్నీ రూపుమాసిపోతాయని ప్రధాని పేర్కొన్నారు. భీమ్ యాప్ అంటే ఏంటో తెలుసా? ప్రధాని ప్రసంగంలోని ముఖ్య అంశాలు... కృత నిశ్చయంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం దీపావళి తర్వాత దేశం కీలక నిర్ణయం తీసుకుంది సమాజంలోని నల్లధనం, బ్లాక్ మార్కెటింగ్ నిజాయితీపరుల్నినిరాశపరిచాయి దేశవ్యాప్తంగా ప్రజలు ధైర్యంతో కష్టాలు ఎదుర్కొంటూ చెడుపై విజయం సాధించేందుకు పోరాడుతున్నారు నల్లధనంపై ఉక్కుపాదంతో దీర్ఘకాలంలో ప్రయోజనాలు స్వచ్ఛత దిశగా దేశం అడుగులు వేస్తోంది సమాజంలోని చెడు జీవితంలో భాగమైపోయిందనుకుంటున్నారు అవినీతిపై పోరాటం చేయడానికి దేశ ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు పెద్దనోట్ల రద్దు స్వచ్ఛ కార్యక్రమం నగదు రద్దుతో నిజాయితీపరులు కూడా కాస్త కష్టపడ్డారు సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైనది దేశప్రజలు సత్యాన్ని, నిజాయితీని నిరూపించుకున్నారు నవంబర్ 8 నుంచి ప్రజలు చెడుపై పోరాడుతున్నారు ప్రజల కష్టాలు దేశ భవిష్యత్ కు ప్రతీక నల్లధనంపై పోరాటంలో త్యాగ స్ఫూర్తిని చాటారు అవినీతి దేశానికి చీడలా పట్టింది బంగారు భవిష్యత్ కోసం ప్రజలు కష్టాలను ఓర్చారు సత్యం కోసం ప్రజలు, ప్రభుత్వాలు ఎలా పోరాడాయో తెలుసుకునేందుకు ఇది చారిత్రక ఉదాహరణ గడిచిన యాభై రోజులు ప్రజలు పడ్డ ఇబ్బందులు, బాధలు నాకు తెలుసు ప్రజల ఆశీస్సులతో బ్యాంకుల వద్ద సాధారణ స్థితికి ప్రయత్నిస్తున్నాం కొత్త సంవత్సరంలో మళ్లీ పూర్వస్థితిని తీసుకొస్తాం మీరు చూపిన ప్రేమ నాకు ఆశీర్వాదం లాంటిది బ్యాంకుల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు దృష్టి పెడుతున్నారు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కరెన్సీ కొరత బాధ కలిగించింది కరెన్సీ లేకపోవడంతో సమస్యలు వస్తాయి అలాగే అధికంగా కరెన్సీ ఉండటం కూడా సమస్యలకు దారితీస్తుంది రామ్ మనోహర్ లోహియ, లాల్ బహుదూర్ శాస్త్రి లాంటి నేతలు చూపిన ధైర్యాన్ని, సాహసాన్ని, సహనాన్ని ప్రజలు చూపించారు -
రాత్రి 7.30 గంటలకు ప్రధాని ప్రసంగం
-
రాత్రి 7.30 గంటలకు ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31 శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ప్రధాని ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. కాగా పెద్దనోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతోపాటు నష్టాలను కూడా వివరిస్తారని సమాచారం. నవంబర్ 8న రూ.500, 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం 2వేలు, 500 నోట్లను చలామణిలోకి తెచ్చింది. దీంతో పాత నగదును మార్చుకోవడానికి, కొత్త కరెన్సీని పొందడానికి సామాన్యులు, నిరుపేదలు నానా కష్టాలు పడ్డారు. నోట్ల మార్పిడి గడువు కూడా శుక్రవారంతో ముగిసిపోయింది. మరోవైపు పెద్దనోట్ల రద్దుతో తాత్కాలికంగానే ప్రజలకు కష్టాలు ఉంటాయని, దీర్ఘకాలంలో సంపన్నులే దీనివల్ల నష్టపోతారని, పేదలు, సామాన్యులు లాభపడతారని మోదీ చెప్తున్న విషయం తెలిసిందే. -
భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం
-
ఆ నోట్లు చిత్తుకాగితాలే.. ప్రజలు ఏం చేయాలంటే?
-
భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఈ నిర్ణయం వెలువరించారు. ప్రధాని మోదీ మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ. 500, రూ. వెయ్యినోట్లు పనిచేయబోవని మోదీ స్పష్టం చేశారు. దేశంలో భారీగా పోగుపడ్డ నల్లధనాన్ని నిరోధించేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజల వద్ద ఉన్న రూ. వెయ్యి, రూ. 500 నోట్లను మార్చుకోవడానికి డిసెంబర్ 30 వరకు సమయం ఇచ్చారు. ఆలోపు బ్యాంకులు, లేదా పోస్టాఫీస్‌లకు వెళ్లి రూ. 500, రూ. వెయ్యి నోట్లను మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్పస్థానం సంపాధించుకుందని మోదీ అన్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడాయని చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. పేదవారు స్వయం సమృద్ధి సాధించేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యం అని, ఈ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మోదీ చెప్పారు. అవినీతి నిర్మూలనకోసం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గత ప్రభుత్వాలు పేదల అవసరాలు పట్టించుకోలేదని, దొంగనోట్లు అభివృద్ధికి అవరోదంగా మారాయని, పొరుగు దేశం దొంగనోట్లను రవాణా చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ నోట్లలో 90శాతం వెయ్యి, రూ.500 నోట్లే ఉంటున్నాయని మోదీ చెప్పారు. అభివృద్ధికి ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు. -
జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ గొప్ప స్థానం సంపాదించుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆయన మంగళవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని కీలక అంశాలు, నిర్ణయాలు ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశం కానున్నారు. కాగా ప్రధాని ఈ రోజు మధ్యాహ్నం త్రివిధ దళాధిపతులతో భేటీ అయిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రైక్స్ అయిన అనంతరం పరిస్థితులపై మోదీ ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.