నేడు జాతి ముందుకు రానున్న ప్రధాని | Prime Minister Narendramodi To Address Nation at 8 pm | Sakshi
Sakshi News home page

జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

Published Tue, May 12 2020 12:49 PM | Last Updated on Tue, May 12 2020 1:12 PM

Prime Minister  Narendramodi  To Address Nation at 8 pm - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ రోజు (మంగళవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. లాక్‌డౌన్ సడలింపులు, కొనసాగింపు, కరోనా కట్టడిపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. దీంతో నేటి ప్రసంగంలో వాటిపై మాట్లాడే అవకాశం ఉంది. ఇక లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి. (దేశంలో 70 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement