ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. డిసెంబర్ 31 శనివారం రాత్రి 7.30 గంటలకు ఆయన నోట్ల రద్దు అంశంపై జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పెద్ద నోట్ల రద్దు, అనంతర పరిణామాలపై ప్రధాని ప్రసంగం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారన్న ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది. కాగా పెద్దనోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి మోదీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతోపాటు నష్టాలను కూడా వివరిస్తారని సమాచారం.