భారతదేశాన్ని నూతన దిశలో నడిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు సహృదయంతో స్వీకరించారని ప్రధనమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన శనివారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దు తర్వాత జనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారని, అయితే ఆ నిర్ణయంతో నల్లధనం, అవినీతి రూపుమాసిపోతాయని తాను మరోసారి చెబుతున్నానని ప్రధాని అన్నారు.