నవంబర్ 8 పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతి నుద్దేశించి ప్రసంగిస్తున్నారు. నగదు కష్టాలపై మాట్లాడిన శనివారం ఆయన ముందుగా కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాన్నారు. నల్లధనంపై ప్రభుత్వం చేపట్టిన పోరాటంలో భుజం భుజం కలిపి కోట్లాదిమంది ప్రజలు మద్దతు అందిస్తున్నారు. దీనికితాను గర్వపడుతున్నానని ప్రధాని హర్ష వ్యక్తం చేశారు. ప్రజలు అందిస్తున్న ఈ ఆపూర్వమద్దుతో నేపథ్యంలో నల్లధనం, నకిలీ కరెన్సీ పై పోరాటంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేసిదిలేదని స్పష్టం చేశారు.