రేపు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ | Prime Minister Narendra Modi Will Address The Nation 4 PM Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

Published Mon, Jun 29 2020 10:34 PM | Last Updated on Tue, Jun 30 2020 5:18 AM

Prime Minister Narendra Modi Will Address The Nation 4 PM Tomorrow - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్‌-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ప్రధాని ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆదివారం తనమాసాంతపు ‘మన్‌కీ బాత్‌’లో లద్దాఖ్‌ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్‌ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement