PM Narendra Modi Last Independence Day Address Before 2024 Polls - Sakshi
Sakshi News home page

Independence Day 2023: మరో వెయ్యేళ్లు భారత్‌ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ

Published Tue, Aug 15 2023 6:33 AM | Last Updated on Tue, Aug 15 2023 9:30 AM

PM Narendra Modi last Independence Day address before 2024 polls - Sakshi

 Updates

ఎర్రకోటలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు

మరో వెయ్యేళ్లు భారత్‌ వెలుగుతూనే ఉంటుంది: ప్రధాని మోదీ

►2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యం
►2047  నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌
►దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయి
►దేశంలో  తీవ్రవాదం, నక్సలిజం తగ్గాయి
►భారత్‌ ఇప్పుడు సురక్షితంగా ఉంది

►ప్రపంచానికి మిత్రుడిగా భారత్‌ మారింది
►140 కోట్ల  భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం
►దేశాభివృద్ధే కాదు.. ప్రపంచాభివృద్ధిని కూడా భారత్‌ కోరుకుంటోంది
►మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్‌ల శిక్షణ

►దేశ  ప్రజలందరికీ ఇంటర్నెట్‌ను అందుబాలోకి తీసుకువచ్చాం
►వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఉంటుంది
►ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత్‌ ఉంటుంది
►భారత్‌ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది

►జన ఔషధితో ప్రజలందరీ చౌకగా మందులు
►జన ఔషధి కేంద్రాల సంఖయ 10 వేల నుంచి 25 వేలకు పెంచాం
►జన్‌ధన్‌ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం
►మారుమూల గ్రామాలకు విద్యుత్‌ సదుపాయం కల్పించాం

►భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ బలం
►ప్రతి నిర్ణయంలో దేశానికి మొదటి ప్రాధాన్యత
►దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది.
►గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకుచవచ్చాం
►అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోంది.

►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది.
►ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ అభివృద్ధి చెందుతోంది.
►రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాసిస్తుంది.    
►క్రీడా రంగంలో యువత సత్తా చాటుతోంది.
►స్టార్టప్స్‌ రంగంలో టాప్‌-3లో భారత్‌ ఉంది.
►జీ-20 నిర్వహించే అరుదైన అవకాశం భారత్‌కు లభించింది.

►కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది.
►కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంగా మారింది
►కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం
►ప్రపంచాన్ని మార్చడంలో భారత్‌ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోంది.

►ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నాం
►దేశ ఆర్థిక వ్యవవస్త బాగుంటే దేశం బాగుంటుంది.
►రూ, 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించాం.
►140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం

►పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.
►పీఎం స్వనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశాం
►సైన్యంలో వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ అమలు చేశాం

►అవినీతి రాక్షసి దేశాన్ని వెనక్కి తీసుకెళ్లింది
►ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
►సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. 
►దేశంలో సుస్థిర ప్రభుత్వం ఉంది, దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.

►డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యం
►గత పదేళ్లలో భారత్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది.
►నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం
►భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉంది.
►టెక్నాలజీ విషయంలో భారత్‌ ఎంతో మెరుగుపడింది.
►డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ దూసుకెళ్తోంది.

►గత పదేళ్లుగా భారత్‌ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది.
►శాటిలైట్‌ రంగంలో మనమే ముందున్నాం.
►రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాస్తిఉంది.
►30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం.
►వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందింది.

►దేశ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
►ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది.
►దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు.
►అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం
►ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయి.
►గత పదేళ్లలో భారత్‌ ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది.

►దేశం మణిపూర్‌ ప్రజలకు అండగా ఉంది: ప్రధాని మోదీ
►మణిపూర్‌లో శాంతిస్థాపనకు కృషి చేస్తున్నాం.
►మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.

► ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ

► గౌరవ వందనం స్వీకరించిన ప్రధాని మోదీ

►పూలవర్షం కురిపించిన హెలికాప్టర్లు

► ఎర్రకోటపై వరుసగా పదోసారి నరేంద్రమోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎర్రకోటపై పదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. 

►ఈ స్వాతంత్ర్య దినోత్సవంతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు ముగియనున్నాయి.

►ఆ తర్వాత జాతినుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

సామాన్యులే అతిథులు
►దేశం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన 1,800 మంది ప్రత్యేక అతిథులు. ప్రత్యేక అతిథులుగా 400 మంది సర్పంచులు

►10 వేల మంది పోలీసులతో నాలుగు అంచెల భద్రత.. భద్రత కోసం 1000 సెక్యూరిటీ కెమెరాలు

►దేశ వ్యాప్తంగా ఘనంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం

►ఢిల్లీలో కన్నుల పండువగా పంద్రాగస్టు వేడుకలు

►కాసేపట్లో ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

►రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులు అర్పించిన ప్రధాని మోదీ

►వరుసగా పదోసారి ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేయనున్నారు.

►2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆయన చివరి ప్రసంగం కానుంది.

►ఈ వార్షిక ప్రసంగంలో ప్రధాని మోదీ తన ప్రభుత్వ ప్రగతి రిపోర్టు, కీలక కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు రానున్న సంవత్సరాల్లో దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నారో కూడా వివరిస్తారు.

►2014 మొదలుకొని వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిని వివరించడంతోపాటు భవిష్యత్‌ కార్యాచరణను ప్రధాని ప్రకటించనున్నారు. రాజకీయ పరమైన అంశాలను కూడా ఆయన స్పృశిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement