![Pm Modi Speech After Bjp Victory In Delhi Assembly Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Narendramodi1.jpg.webp?itok=w0bF41E5)
సాక్షి,న్యూఢిల్లీ:ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా శనివారం(ఫిబ్రవరి 8) సాయంత్రం బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన సంబరాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
‘ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు.
మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్‌కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్‌లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది
అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్‌కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎంతో పోరాడారు. ఆప్ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తున్నారు’అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment