న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో(Delhi Assembly Elections 2025) బీజేపీ భారీ విజయం సాధించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi).. ఢిల్లీ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీ బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఏర్పాటు చేసిన పార్టీ సంబరాల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా, ఒక బీజేపీ కార్యకర్త అనారోగ్యంగా ఉండటాన్ని గమనించారు.
మోదీ ప్రసంగిస్తున్న వేదికకు అతి దగ్గరగా ఉన్న ఆ కార్యకర్త.. కదలికల్ని మోదీ పసిగట్టారు. అతనికి ఆరోగ్యం బాలేదన్న విషయం మోదీకి అర్థమైంది. దాంతో ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన మోదీ.. ఆ కార్యకర్తకు కాస్త నీళ్లు ఇమ్మని బీజేపీ శ్రేణులకు సూచించారు. అంతేకాకుండా అక్కడున్న డాక్టర్లు.. అతన్నిఒకసారి పరీక్షించాలని కూడా మోదీ కోరారు.
‘ఆ బీజేపీ కార్యకర్తకు కళ్లు మూతలు పడుతున్నాయి. చాలా అన్‌ఈజీగా ఉన్నాడు. ముందు అతనికి కాస్త మంచి నీళ్లు ఇవ్వండి. ఇక్కడ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అతని పరీక్షించండి’ అని మోదీ సూచించారు.
Such is his aura ♾
During his victory speech, PM Modi noticed a person feeling unwell and immediately paused to ensure they received medical help!#दिल्ली_के_दिल_में_मोदी#AmitShah #DelhiElections2025 pic.twitter.com/VG16Yv1qw1— PoliticsSolitics (@IamPolSol) February 8, 2025
అటు తర్వాత మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఢిల్లీ ప్రజలకు ఈరోజు పండుగ లాంటిదని,ఆప్ నుంచి వారికి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన మాట్లాడుతూ బీజేపీని గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.‘ ఈ విజయంతో ఢిల్లీలో చరిత్ర సృష్టించాం. హర్యానా,మహారాష్ట్రలో గెలిచి రికార్డు సృష్టించాం. ఢిల్లీని ఇక అభివృద్ధి బాటలో నడిపిస్తాం.మీ ప్రేమను అభివృద్ధిలో చూపిస్తాం.ఢిల్లీ ప్రజల అభివృద్ధికి మోదీ గ్యారెంటీ. ఢిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు వారికి తిరిగి ఇస్తాం. ఢిల్లీ ఎన్నికల్లో ప్రజలే విజేతలుగా నిలిచారు.
మీ విశ్వాసాన్ని అభివృద్ధిలో తీసుకొస్తాం.ఢిల్లీ అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఢిల్లీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. షాట్‌కట్ రాజకీయాలకు ప్రజలు షాకిచ్చారు. నేను పూర్వాంచల్ నుంచి ఎంపీగా ఉన్నందుకు గర్వపడుతున్నా. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం చూపిస్తున్నారు. చాలా స్టేట్‌లలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది
అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆమ్‌ఆద్మీపార్టీ నేతలు అవినీతిలో మునిగిపోయారు. కాంగ్రెస్ పార్టీ అయితే వరుసగా మూడోసారి సున్నా సాధించింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులు కూడా గమనించింది. యమునా నదిని కాలుష్య కోరల నుంచి రక్షిస్తాం. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే కాగ్ రిపోర్టు బయటపెడతాం. కాంగ్రెస్‌కు ఓటములలో మెడల్ ఇవ్వొచ్చు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఇండియా కూటమి పార్టీలకు అర్థమైంది’అని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment